1. సమస్య చిన్నదైనా, పెద్దదైనా పరిష్కరించే సాయి
2. సాయి కృప
3. నమ్ముకున్నవారిని తప్పక కాపాడతారు బాబా
సమస్య చిన్నదైనా, పెద్దదైనా పరిష్కరించే సాయి
సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు మణి. ఎప్పుడూ రెండు రోజుల్లో వచ్చేసే గ్యాస్ 2024, జనవరి నెలలో బుక్ చేసి పది రోజులైనా రాలేదు. మేమేమో ఈసారి గ్యాస్ బండ ఎప్పుడు పెట్టామో సరిగ్గా లెక్క చూసుకోలేదు. సంక్రాంతి పండక్కి మా అమ్మాయి, అల్లుడు, మనవరాలు వచ్చేనాటికి గ్యాస్ వస్తే బాగుండు, గ్యాస్ అయిపోకుండా ఉంటే బాగుండు అనుకుంటూ నాకు ఆందోళన ఎక్కువైపోయింది. నేను భయపడినట్లే సంక్రాంతి రోజు తెల్లవారుజామున లేచి పనులు చేసుకుంటుంటే గ్యాస్ అయిపోయింది. సమయానికి మా బాబు తన అత్తగారి ఊరు వెళ్ళాడు. పండగపూట ఇరుగుపొరుగువారిని అడిగి వాళ్ళని ఇబ్బందిపెట్టలేను. కానీ గ్యాస్ లేకుండా ఏ పని అవ్వదు. పిల్లలు నిద్రలేచేసరికి గ్యాస్ అందుబాటులో ఉండాలి. కానీ నాకు ఏం చేయాలో తోచలేదు. ఇక ఉన్నారుగా నా తల్లి, తండ్రి, గురువు, దైవం, బిడ్డ అన్నీ అయిన నా సాయి. "సాయీ! ఎందుకు ఈ సమయంలో నన్ను టెన్షన్ పడుతున్నావు? మీవాడి అలసత్వానికి బాగా జరిగిందని చూస్తున్నావా సాయి? గ్యాస్ చూసుకోకపోవడం నా తప్పే. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, ఒక గంటలో నా సమస్య తీరాలి. సమస్య తీరే మార్గం చూపించు సాయి" అని బాబాతో అనుకున్నాను. మాములుగా 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులోని భక్తుల అనుభవాలు చదివి చిన్న చిన్న విషయాలకే భక్తులు బాబా అనుగ్రహం పొందుతున్నారని అనుకునే నేను, "నా సమస్య తీరితే మీ అనుగ్రహం తోటి భక్తులతో పంచుకుంటాను బాబా" అని సాయికి చెప్పుకొని, వారిని తలుచుకుంటూ మావాడి ఫ్రెండ్ సిద్ధుకి కాల్ చేశాను. ఆ సమయంలో తన ఏమనుకుంటాడోనని కూడా నాకు తెలియలేదు. పాపం సిద్దు ఫోన్ ఎత్తి, "ఏమైంది ఆంటీ?" అని అడిగాడు. తనకి విషయం చెప్తే, "ఈ నెలలో గ్యాస్ షార్టేజ్ ఉందట. మీరేం టెన్షన్ పడకండి. నేను చూస్తాను. ఒక పావుగంటలో ఫోన్ చేస్తాను" అని అన్నాడు. నేను సరేనని ఫోన్ పెట్టేసి సాయిని తలుచుకుంటూ ఉన్నాను. సరిగ్గా అర్థగంటలో సిద్ధు ఆంటీ అంటూ చిన్న స్టవ్ ఉన్న సిలిండర్ తెచ్చిచ్చి, "ఇది ఇంట్లో ఉంది. మీ అవసరానికి సరిపోతుంది" అని చెప్పాడు. అప్పుడు నేను 'సాయిని అడిగితే సమస్య చిన్నదైనా, పెద్దదైనా ఆయన దాన్ని పరిష్కరిస్తారు' అని అనుకున్నాను. ఆయనపట్ల మనకు నమ్మకం బలంగా ఉండాలి అంతే. ఆయన్ని నమ్ముకుంటే అమ్మలా, నాన్నలా, బిడ్డలా, స్నేహితునిలా, శ్రేయోభిలాషిలా ఎప్పటికీ మనతోనే ఉంటారు. పిల్లలు సంక్రాంతి చాలా బాగా జరుపుకొని సంతోషంగా తిరిగి వెళ్లారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!
సాయి కృప
ముందుగా సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. నా పేరు సాయిశివాని. 2024, జనవరి 1, కొత్త సంవత్సరంనాడు నేను, నా భర్త మొదట సాయిబాబా దర్శనం చేసుకొని పశ్చిమ గోదావరిలో ఉన్న ద్వారకా తిరుమల వెళ్ళాము. అక్కడ దర్శనం అయ్యాక మధ్యాహ్నం 3 గంటలప్పుడు ఎవరో అన్నదానం చేస్తున్నారని చెప్తే, ఎంతో ఆశగా చాలా దూరం నడుచుకుంటూ అక్కడికి వెళ్ళాము. కానీ అక్కడ అన్నదానం పూర్తైందని అందరినీ తిరిగి పంపేస్తున్నారు. మాకేమో చాలా ఆకలిగా ఉంది. నేను, "ఏంటి బాబా ఇంత దూరం వస్తే అన్నం పెట్టకుండా వెనక్కి పంపేస్తున్నారు" అని బాధపడి, "ఇప్పుడు ఇక్కడ అన్నదానం చేస్తే, మీ అనుగ్రహాన్ని నేను బ్లాగు ద్వారా తోటి సాయిభక్తులతో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకున్నాను. కానీ అన్నం లేదని వెళ్ళిపోమన్నారు. సరే, అన్నం తినలేకపోయినా అన్నదానానికి విరాళం ఇద్దామని కౌంటరుకి వెళ్లి విరాళం ఇచ్చాము. తర్వాత మరోసారి అడుగుదామని వెళితే అక్కడున్న సెక్యూరిటీ రండి అని అన్నం పెట్టించాడు. అలా ఎంతోమంది అన్నం లేక వెళ్లిపోయినా బాబా మాకు అన్నం పెట్టించారు. "ఎంతో ఆకలితో ఉన్న నా ఆకలిని తీర్చినందుకు చాలా థాంక్స్ బాబా".
హఠాత్తుగా ఒకరోజు మా అక్క కళ్ళు తిరిగి ఇంట్లో పడిపోయింది. తనని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే, టెస్టులు చేస్తూ మాకు ఏం చెప్పలేదు. నాకు చాలా భయమేసి, "బాబా! మా అక్క రేపు ఈ సమయానికల్లా కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోతే, మీ అనుగ్రహం బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాన"ని బాబాకి మొక్కుకున్నాను. బాబా దయవల్ల అక్క హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చింది. "చాలా థాంక్స్ బాబా".
నమ్ముకున్నవారిని తప్పక కాపాడతారు బాబా
సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు మాధవి. బాబా తమ భక్తులను తామే ఎన్నుకుంటారని మనం బాబా చరిత్రలో తెలుసుకున్నాం. నన్ను కూడా బాబా అలానే తన భక్తురాలిగా ఎన్నుకున్నారు. నాకు సాయి అంటే ఎనలేని ప్రేమ, భక్తి, విశ్వాసం. నాకు అంతా బాబానే. నా బాధ, ఆనందం అన్ని బాబాతోనే పంచుకుంటాను. నేను బాధ పడితే వేంటనే నా సాయితండ్రి తగిన సందేశాలను నా కంటపడేటట్టు చేస్తారు. అంత కరుణామయుడు మన సాయి. ఇక నా అనుభవంలోకి వస్తే.. ఒకరోజు ఉదయం 6.30కి మావారు వాష్ రూమ్‌కి వెళ్లి, లోపల స్పృహ తప్పి పడిపోయారు. లోపల నుండి గడియ పెట్టడం వల్ల ఆ విషయం మాకు తెలియలేదు. కొన్ని సెకన్ల తర్వాత ఆయనకి మెలుకువ వచ్చి బయటకి వచ్చారు. కానీ బయటకు వస్తూనే మళ్లీ స్పృహ తప్పి కింద పడిపోయారు. ఆ క్రమంలో పెద్దగా చప్పుడు అయింది. ఆ చప్పుడు పూజ గదిలో ఉన్న మా అమ్మ విని నన్ను పిలిచింది. నిద్రలో వున్న నేను అమ్మ పిలుపు విని ఏమైందోనని వెంటనే వెళ్లాను. అలా వెళ్లిన నేను వాష్ రూమ్ తలుపు దగ్గర స్పృహ కోల్పోయి పడి వున్న మావారిని చూసి చాలా భయపడుతూ పెద్దగా 'సాయి సాయి' అంటూ మావారిని పిలిచాను(నాకు ఏ కష్టం వచ్చిన నా నోటి వెంట వచ్చేది సాయి నామమే). మావారు పలకలేదు. ఇంకా నేను నా సాయిని గట్టిగా పిలుస్తూ మావారి ముఖం మీద నీళ్ళు చల్లాను. కొన్ని నిమిషాలకి మావారికి స్పృహ వచ్చింది. అది నా సాయితండ్రి కృప వల్లనేనని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. ఆయన మావారిని కాపాడి నాకు జీవితం ఇచ్చారు. ఈవిధంగా మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్న మా సాయికి కోటికోటి ప్రణామాలు. సాయి తమని నమ్ముకున్నవారిని తప్పక కాపాడతారు, ఏ కష్టం దరి చేరనివ్వరు.
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!
Om Sairam🙏
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu vadini bless cheyandi
ReplyDelete🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺
ReplyDeleteOm sai ram anta bagunde la chayandi tandri
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 🙏🙏
ReplyDeleteBaba, take care of my son 💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 💐💐💐💐
ReplyDeleteBaba, bless Aishwarya 🙏🙏
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings forever 🙏🙏💐💐
ReplyDeleteOm Sairam!!
ReplyDeleteOmsaisri Jai Jai Sai kapadu Tandri 🙏🙏🙏🙏🙏 Raksha Raksha Sai Baba Tandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
saibaba maa bangaru tandri saimadava bharam antha meede baba. maa attagariki naa meeda kopam povali baba. sriram annayya ki battalu pettalani andaru cheppali baba
ReplyDeleteMa pillalu bagundali thandri please baba
ReplyDeleteఓం శ్రీ సాయి రామ్
ReplyDeleteMaakedi mancho adichesi kapadu thandri🙏
ReplyDeleteNinne nammukunnamu kanikarinchu baba🙏🙏
SAI karuninchu
ReplyDeleteOm Sri Sainathaya Namah
ReplyDeleteOm sai ram
ReplyDeleteSainadha thandari mere maa dikku ,daya vunchi mere mammalni munduki thesuku vellandi ....ee kastam nundi mammalni bayataki vachela anugrahinchandi baba....maa valla migatha vallu emaipotharo ani chala tension gaa anipisthundi 😭😭😭😭😭..... Please kapadandi baba
ReplyDeleteనేను బాధ పడితే వేంటనే నా సాయితండ్రి తగిన సందేశాలను నా కంటపడేటట్టు చేస్తారు.
ReplyDelete