ఈ భాగంలో అనుభవాలు:
1. శిరిడీలో పొందిన అనుభూతి
2. కష్టపడి కొనుక్కున్న సైకిల్ దొరికేలా అనుగ్రహించిన బాబా
3. నెలల తరబడి పరిష్కారమవ్వని సమస్యను పరిష్కరించిన బాబా
శిరిడీలో పొందిన అనుభూతి
నా పేరు వింధ్య. ముందుగా సాయినాథునికి శిరసువంచి నమస్కరిస్తున్నాను. బాబా నాకు గురువు మాత్రమే కాదు, నాకన్నీ ఆ తండ్రే. 2024లో చాలా ఒడిదుడుకుల మధ్య నా జీవితం సాగింది. కష్టాలు, బాధలు ఎక్కువగా ఉన్నప్పటికీ నేను బాబాపై నమ్మకంతో, ఆయన మీద భారమేసి ముందుకు సాగుతున్నాను. ఎందుకంటే, బాబా ఎన్నటికీ నా చేయి విడిచిపెట్టారని నాకు తెలుసు. ఇక నా అనుభవానికి వస్తే.. 2024లో మేము శిరిడీ వెళ్లడం నాకు లభించిన గొప్ప వరం. కారణం మేము శిరిడీ చేరుకున్న మొదటిరోజున మా బాబు మొదటి పుట్టినరోజు. మేము 3 రోజులకు ప్రణాళిక చేసుకొని శిరిడీకి ప్రయాణమయ్యాము. మేము మొదటిరోజు మధ్యాహ్న ఆరతికి టిక్కెట్లు చేసుకున్నాము. కానీ మేము వెళ్తున్న ట్రైన్ ఆలస్యమవ్వసాగడంతో ఆరతి సమయానికి శిరిడీ చేరుకోలేమని చాలా టెన్షన్ పడ్డాము. నేను నా మనసులో, "బాబా! ఎలాగైనా మేము ఆరతి చూడాల"ని బాబాను చాలా వేడుకున్నాను. బాబా దయ చూపారు. మేము ఆరతి సమయానికి శిరిడీ చేరుకొని, ఆరతి దర్శనం చేసుకున్నాము. కానీ సమయం లేకపోవడం వల్ల కేవలం ముఖ ప్రక్షాళన చేసుకొని ఆరతికి వెళ్ళమని నాకు ఒకటే బాధ, నా మనసులో ఏదో తెలియని చిన్న వెలితి. బాబా సర్వాంతర్యామి కదా! ఆయన ఆ వెలితిని తీసేసారు. ఎలాగంటే, 3వ రోజు ఉదయం 9 గంటలికి మేము బాబా దర్శనానికి వెళితే, ఆ రోజు గురువారమైన కారణంగా మమ్మల్ని చాలాసేపు క్యూలైన్లో ఉంచేసి, సరిగ్గా మధ్యాహ్న ఆరతి సమయానికి సమాధి మందిరంలోకి పంపారు. బాబా నా మనసులో ఉన్న చిన్న దిగులుని తెలుసుకుని మళ్ళీ మధ్యాహ్న ఆరతి చూసే అవకాశాన్ని, అది కూడా గురువారం నాడు ఇచ్చారని నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆరోజు బాబా ఆరతి చాలా బాగా జరిగింది. మొదటిరోజు కన్నా చాలా బాగా అనిపించింది. ఆరతి జరుగుతున్నంతసేపూ నాకు ఒక రకమైన అనుభూతి కలిగింది. అది మాటల్లో వర్ణించలేను. అంతటి అనుభూతిని ప్రసాదించిన సాయి తండ్రికి నేను ఎప్పటికీ ఋణపడి ఉంటాను. నా కొడుకు మొదటి పుట్టినరోజు శిరిడీలో జరగడం నాకు దొరికిన పెద్ద సంతోషం. నా జీవితంలో నేను మరిచిపోలేని అనుభూతి. "ధన్యవాదాలు సాయినాన్నా. నాకు మంచి ఉద్యోగం ప్రసాదించు తండ్రీ".
కష్టపడి కొనుక్కున్న సైకిల్ దొరికేలా అనుగ్రహించిన బాబా
నా పేరు సురేష్. 2020, డిసెంబర్ 1తో కార్తీకమాసం పూర్తైంది. ఆరోజు ఉదయం నిద్రలేచి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఇంటిముందు చూస్తే, మేము కష్టపడి కొనుక్కున్న సైకిల్ కనపడలేదు. అన్నిచోట్లా వెతికినా దొరకలేదు. చివరికి ఎవరో దొంగలెత్తుకుపోయారని విపరీతమైన ఆందోళనకు గురయ్యాము. పోలీసు కంప్లైంట్ ఇద్ధామనుకున్నాం. బాబాని తలుచుకొని "ఓ సాయీ! మా సైకిల్ మాకు దక్కేలా అనుగ్రహించండి" అని ప్రార్థించాను. మధ్యాహ్నానికి బాధతో మనశ్శాంతి కోల్పోయాం. కానీ కొంత సమయం తర్వాత ఓ చోట సైకిల్ దొరికింది(ఎవరో దొంగ దాన్ని అక్కడ దాచేసాడు). ఇదంతా ఆ బాబా దయ. "ధన్యవాదాలు బాబా".
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.
నెలల తరబడి పరిష్కారమవ్వని సమస్యను పరిష్కరించిన బాబా
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. సాయి బంధువులకు నమస్కారాలు. నా పేరు ప్రీతి. నేను ఒక ప్రముఖ ఫ్రాంచైజ్ ప్రీస్కూల్లో పని చేస్తున్నాను. నేను నా విధుల్లో భాగంగా కస్టమర్ల కోసం గూగుల్ మ్యాపింగ్ చేయాలి. ఒకసారి ఒక పాత కస్టమర్ తన కొత్త ఫోన్ నంబర్‌ను అప్డేట్ చేయమని అడిగితే, మేము గూగుల్ మ్యాప్స్‌లో అప్డేట్ చేసే ప్రయత్నం చేసాము. కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా అది అప్డేట్ కాలేదు. అలా నెలలు గడిచాయి. ఆలస్యానికి కస్టమర్ నుండి మేము సమస్యలు ఎదుర్కోవలసి వచ్చింది. ఇక అప్పుడు నేను, "బాబా! దయచేసి ఈ సమస్యను పరిష్కరించండి" అని బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల కొన్నిరోజులకి ఫోన్ నెంబర్ గూగుల్ మ్యాప్స్‌లో అప్డేట్ అయి సమస్య పరిష్కరమైంది. "చాలా ధన్యవాదాలు బాబా. దయచేసి ఎల్లప్పుడూ మీ భక్తులతో ఉండండి".
Om sai ram, 🙏🙏🙏🙏
ReplyDeleteOm sairam
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house construction complete chaindi manchi varini rent ki pampandi naku unna e problem solve cheyandi pl
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family members forever 🙏🙏💐💐
ReplyDeleteOm sai ram, na jeevitam lo unna samasyalu daaniki na manasu pade badha, avedana anni meeke telusu baba, meeke teliyali enduku na jeevitam lo ilanti situation echaru ani, meere daari chupali Evariki cheppukolenu meeku tappa meere manashanti ni evvandi, amma nannalani nannu andarni kshamam ga arogyam ga ashtaishwaryalatho chusukondi baba.
ReplyDeleteSai Ram .. Tammudi Peru Meeda vere vallu loan tiskoni teerchaledu.. tammudu valla nu nammi irukkunnadu.. loan ichina vallu pressure chestunnaru,bediristunnaru.Pedda problem lo unnadu.. daddy digulu padi poyaru.. kapadu tandri.. loan problem nundi tammudini bayata padela chey.. Amma nanna ni, tammudini, tana bharya biddalani kapadu tandri please Sai ram.. please baba🙏🥲
ReplyDeletePlease baba.. Meena ki Pelli kudirinchi, Manchinga Pelli jarigela chey.. ma badhyata memu neraverchela mammalni asirvadinchu baba🙏.. na family ni bless chesi, protect chestu undu Sai… kapadu baba
ReplyDeleteఓంసాయి శ్రీసాయి జయజయసాయి
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Ram.
ReplyDeleteKapadu Sai Deva🙏
ReplyDelete