ఈ భాగంలో అనుభవం:
- కోరుకున్నట్లే ఆడబిడ్డని ప్రసాదించిన బాబా
నేను ఒక సాయి భక్తుడిని. నేను ఇప్పుడు మేము ఎంతకాలంగా ఎదురుచూస్తున్న అద్భుత అనుభవం చెప్తాను. బాబా దయవల్ల మాకు ఇదివరకు ఒక బాబు ఉన్నాడు. గత ఏడాది మేము శిరిడీ వెళ్లి, బాబా దర్శనం చేసుకుని ఇంటికి వచ్చాక మళ్లీ నా భార్య గర్భవతి అయింది.
ఆ సాయితండ్రి
మొదట నుండి ఎటువంటి సమస్యలు రాకుండా కంటికి రెప్పలా చూసుకున్నారు. నా భార్య మా బాబు పుట్టినప్పటి నుంచి ఈసారి ఆడపిల్ల పుడితే బాగుంటుందని అనుకోసాగింది. నా విషయానికి వస్తే, నేను ఇంటర్ చదువుతున్నప్పుడు క్యాన్సర్‌తో చనిపోయిన మా అమ్మ నా కూతురిగా మళ్ళీ పుడితే బాగుంటుందని, అదే జరిగితే పది మందికి అన్నదానం చేసి, 1000 రూపాయలు బాబా మందిరంలోని హుండీలో సమర్పించుకుంటానని ఆ తండ్రి సాయినాథుని ప్రార్థిస్తూ ఉండేవాడిని. అలా బాబాకి చెప్పుకున్నాక నేను పాపే పుడుతుందన్న నిర్ధారణకు వచ్చేసాను. అయితే కొంతమంది 'బాబు' అని, మరికొంతమంది 'పాప' పుడుతుందని అంటుండేవారు. అది విని నా భార్యకి కాస్త టెన్షన్ మొదలైంది. నేను మాత్రం మొదట్లో పాపే పుడుతుందని విశ్వాసంతో ఉన్నప్పటికీ చివరికొచ్చేసరికి నాకు కూడా కాస్త టెన్షన్ మొదలయింది. కానీ బాబాకి చెప్పుకుంటే జరగనిది ఏమైనా ఉంటుందా!
2024, డిసెంబర్ 16కి 4-5 రోజుల ముందు నుండి నా వీపు ఎడమ భాగంలో నొప్పి వస్తుండేది. మొదట తెలిసిన రైల్వే ఫార్మసిస్ట్‌తో విషయం చెప్తే, "కిడ్నీలో రాళ్ళు ఉంటే అలా నొప్పి వస్తుంది. తొందరగా సోనోగ్రఫీ చేయించుకోండి" అని అన్నారు. అది విని నేను చాలా భయపడ్డాను. తరువాత డాక్టర్ని సంప్రదిస్తే, "శీతాకాలం కదా! కండరాలలో సమస్య అయుండొచ్చు" అని మందులు వ్రాసిచ్చారు. అవి వాడాక రెండు రోజులు కాస్త బాగానే ఉన్నట్లు అనిపించినప్పటికీ 3, 4 రోజుల తర్వాత మళ్ళీ నొప్పి మొదలయ్యింది. దాంతో నేను మరల హాస్పిటల్‌కి వెళ్తే, ఆ డాక్టర్ లేరు. ఫోన్ చేసి మాట్లాడితే, వేరే డాక్టర్ని కలవమన్నారు. సరేనని వేరే డాక్టర్ని కలిస్తే, బ్లడ్ టెస్టులు, సోనోగ్రఫీ చేయించమని సూచించారు. అలాగేనని నేను ల్యాబ్‌కి వెళ్తే, ఆ సమయంలో ల్యాబ్ క్లోజ్ చేసుంది. అక్కడున్నవాళ్ళు మర్నాడు రమ్మన్నారు. అప్పుడు నేను, "బాబా! టెస్టులు చేయించుకోకుండా నొప్పి తగ్గేలా చేయండి. ఒకవేళ టెస్టులు తప్పనిసరిగా చేయించుకోవాలంటే, రిపోర్ట్ నార్మల్ వచ్చేలా చూడండి. కిడ్నీలో ఎటువంటి సమస్యలు లేకుండా కరుణించండి. ముగ్గురికి అన్నదానం చేస్తాను" అని బాబాను ప్రార్థించాను. ఇక బాబా చూపిన కరుణ చూడండి. అదేరోజు సాయంత్రం(2024, డిసెంబర్ 16) హైదరాబాద్‌లో ఉన్న నా భార్య చెకప్‌కని హాస్పిటల్‌కి వెళ్తే డెలివరీ ప్రాసెస్ మొదలుపెట్టి నొప్పులొస్తే రండని, ఒకవేళ రాకపోయినా డిసెంబర్ 18న వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయిపోండని అన్నారు. ఇక నేను అర్జెంట్‌గా హైదరాబాద్ వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. దాంతో నేను ఈ సమస్య గురించి తర్వాత చూద్దాంలే అని వెంటనే సొలాపూర్ నుండి హైదరాబాద్ వెళ్లేందుకు బయలుదేరాను. నేను మధ్యదారిలో ఉండగా 16వ తేదీ రాత్రి నా భార్యకు నొప్పులు రావడంతో తను హాస్పిటల్లో అడ్మిట్ అయింది. నేను మర్నాడు ఉదయం హైదరాబాద్ చేరుకున్నాను. ఆ సమయంలో నా భార్యకి కాస్త నార్మల్‌గా ఉందనడంలో వేరే హాస్పిటల్లో ఉన్న మా అన్నయ్యని(తనకి డిసెంబర్ 16న ఆక్సిడెంట్ అయి, కాలు, చేయి ఫ్రాక్చర్ అవడంతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు) కలిసి ఉదయం 10:30 సమయంలో ఆ హాస్పిటల్ నుండి మా ఆవిడ ఉన్న హాస్పిటల్‌కి బయల్దేరాను. మధ్యలో ఒక బాబా మందిరం కనిపిస్తే, సుమారు 11:00 గంటల సమయంలో బాబా దర్శనం చేసుకొని, "బాబా! ఆరోగ్యకరమైన పండంటి బిడ్డను ప్రసాదించండి. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండేలా చూడండి" అని వేడుకున్నాను. తర్వాత బాబా మందిరం బయట ఉన్న శివలింగంకి కూడా నమస్కరించుకున్నాను. తర్వాత అక్కడినుండి నా భార్య ఉన్న హాస్పిటల్‌కి చేరే సమయానికి సరిగ్గా 11:49కి నా భార్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అది కూడా నార్మల్ డెలివరీ అయింది. నేను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. పాప పుట్టిన తరువాత నా వీపు నొప్పి పోయింది.
అంతా బాబా చేసిన అద్భుతం.
ఇకపోతే, పాప పుట్టిన తర్వాత 11వ రోజు అనగా డిసెంబర్ 27న నా భార్య, తన అక్క, అమ్మ హైదరాబాద్ నుండి వాళ్ళ సొంతూరు విజయనగరం వెళ్లాలని అనుకున్నారు. అయితే అది క్రిస్మస్ సమయమైనందున ట్రైన్లలో సీట్లు ఖాళీ లేవు. ముంబయి నుండి విశాఖపట్నం వెళ్లే LTT-VSKP ఎక్ష్ప్రెస్స్‌లో వెయిటింగ్ లిస్టు 4 ఉంటే ముగ్గురికి ముంబయి నుండి విశాఖపట్నంకి బోర్డింగ్ పాయింట్ లింగంపల్లి(హైదరాబాద్) పెట్టి టికెట్ బుక్ చేశాను. తర్వాత ఎందుకైనా మంచిదని ముగ్గురికి చెప్పి ముంబయిలో ఎమర్జెన్సీ కోటాలో సీట్ కన్ఫర్మేషన్ కోసం వేరువేరుగా దరఖాస్తు చేశాను. అయితే ప్రయాణమయ్యే రోజు రాత్రి 7 గంటలకి చార్ట్ తయారుచేసేవరకు టిక్కెట్ ఆర్ఏసిలోనే ఉంది. ఒకవేళ కన్ఫర్మ్ అవ్వకపోతే ముగ్గురు ఆడవాళ్లు, ముగ్గురు పిల్లల్తో అంత దూరం ప్రయాణించడం చాలా కష్టం. అందువలన నేను బాబాని తలుచుకొని, "బాబా! చిన్న పిల్లల్తో అంతదూర ప్రయాణం చాలా కష్టం. దయచేసి ఎలాగైనా టికెట్ కన్ఫర్మ్ అయ్యేలా చూడండి. ముగ్గురికి అన్నదానం చేస్తాను" అని ప్రార్థించాను. బాబా కరుణ చూపారు. అరగంటలో అనుకుంట! టికెట్లు కన్ఫర్మ్ అయ్యాయని నాకు మెసేజ్ వచ్చింది. బాబాకి ఇచ్చిన మాట ప్రకారం ముగ్గురికి అన్నదానం చేశాను. "మీకు ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే బాబా. మీరు నాకు తోడుగా ఉన్నంతవరకు నాకు ఎటువంటి సమస్య ఉండదు తండ్రి".
Om sai ram 🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm sai ram 🙏🙏🙏🙏🙏
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house construction complete chaindi manchi varini rent ki pampandi naku unna e problem solve cheyandi pl
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family members forever 🙏🙏💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai.. Amma Nanna ni kapadu Sai.. Saranu saranu🙏
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteSairam Raksha Raksha…kapadu tandri
ReplyDeleteSri Sachchidananda sadguru Sai nath Maharaj ki jai 🙏🙏🙏🙏🙏
ReplyDeleteఓం శ్రీ సాయి రామ్
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteOm Sri Sai Aarogyakshemadhaaya Namaha 🙏🙏🙏
ReplyDeleteOm Sri Sai Raksha 🙏🙏🙏