సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1944వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా ఉనికికి, వారి సహాయానికి స్పష్టమైన సంకేతం
2. ఉద్యోగం ప్రసాదించిన బాబా


ఉద్యోగం ప్రసాదించిన బాబా

ఓం శ్రీ శిరిడీ సాయినాథా! సాయి బంధువులకు నమస్కారాలు. నా పేరు తిలోత్తమ. శ్రీ సాయినాథుని దివ్య పాదాలకు శిరస్సువంచి నమస్కరిస్తూ ఆయన మాపై చూపిన ప్రేమను పంచుకుంటున్నాను. కరోనా సమయంలో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న మా తమ్ముడిని ఉద్యోగం నుండి తొలగించారు. అప్పటినుంచి మా తమ్ముడు ఏవేవో కోర్సులు నేర్చుకొని వైజాగ్‌లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేసాడు. కానీ తనకి ఏ ఉద్యోగ అవకాశము రాలేదు. రెండు రౌండ్లు పూర్తయ్యాక ఫోన్ చేస్తానని చెప్పేవాళ్ళు కానీ, ఏ ఫోనూ వచ్చేది కాదు. మా తమ్ముడు చాలా దుఃఖానికి గురైయ్యాడు. నేను బాబాని, "బాబా! మా తమ్ముడికి స్థిరమైన ఉద్యోగాన్ని ప్రసాదించండి" అని చెప్పుకున్నాను. కొన్నిరోజులకి హైదరాబాదులో ఉన్న మా పెద్దమ్మవాళ్ళ అల్లుడు ఒక జాబ్ ఇంటర్వ్యూకి తమ్ముడ్ని తీసుకెళ్లారు. తమ్ముడు రెండు రౌండ్లు విజయవంతంగా పూర్తిచేసాక వాళ్ళు, 'హెచ్ఆర్ ఫోన్ చేస్తార'ని చెప్పారు. కానీ వారం రోజులైనా ఫోన్ రాలేదు. దాంతో మా తమ్ముడు వాళ్ళు ఇంకా కాల్ చేయరని నిరాశ చెందాడు. నేను, "బాబా! దయతో తమ్ముడికి ఫోన్ వచ్చేలా చేయండి" అని బాబాను ప్రార్థించాను. తర్వాత ఒక ఆదివారం రాత్రి హెచ్ఆర్ ఫోన్ చేసి, "సోమవారం ఆఫీసుకు రమ్మ"ని చెప్పారు. అంతే, మా ఆనందానికి అవధుల్లేవు. బాబా దయతో మా తమ్ముడు ఆ ఉద్యోగంలో చేరి అక్కడ అంతా చాలా బాగుందని చెప్పాడు. ఇలా మంచి ఉద్యోగం కోసమే ఆలస్యమైందనుకున్నాము మేము. ఇప్పుడు మా తమ్ముడు చాలా సంతోషంగా ఉన్నాడు. "ధన్యవాదాలు బాబా".

సర్వం శ్రీసాయినాథార్పణమస్తు.

9 comments:

  1. ఓం సాయిరామ్

    ReplyDelete
  2. ఓం సాయి రామ్

    ReplyDelete
  3. ఓం సాయి రామ్

    ReplyDelete
  4. Om sai ram, amma nannalani kshamam ga chusukondi baba vaalla purti badyata meede tandri vaallaki manchi arogyanni alage ayushni prasadinchandi baba, naaku manchi arogyanni prasadinchandi, me daya tho andaru bagunde la chayandi baba, ofce lo problems anni poyi nenu anukunnattu prashantam ga unde la chudandi baba pls.

    ReplyDelete
  5. Baba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu vadini bless cheyandi house construction complete cheyandi pl manchivarini rent ki pampandi naku unna e problem solve cheyandi pl

    ReplyDelete
  6. సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

    ReplyDelete
  7. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  8. Sri Sachchidananda sadguru Sai nath Maharaj ki jai 🙏🙏🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo