సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1942వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శ్రీసాయినాథుని దయ
2. బాబాని శరణుజొచ్చినంతనే తీరిన ఆరోగ్య సమస్యలు 

శ్రీసాయినాథుని దయ

సాయి బంధువులకు నమస్కారం. నా పేరు ఛత్రపతి. ఒకసారి నా కడుపులో మంట మొదలై ఎంతకూ తగ్గలేదు, చాలా ఇబ్బందిపెట్టింది. బాబాను తలిస్తే సమస్య తీరిపోతుందని తెలిసినప్పటికీ ఆ సమయంలో నాకు ఆయన జ్ఞాపకం రాలేదు. అదే మాయ అంటే. అది మనల్ని ఆవహిస్తుంది. బాబాను మనకి దూరం చేస్తుంది, సమయం వృధా అయ్యేలా చేస్తుంది, మన బాధ తీరకుండా అడ్డు పడుతుంది. ఇక అసలు విషయానికి వస్తే, కొంతసేపటి తర్వాత బాబా ఊదీ నా దగ్గర ఉండటం జ్ఞాపకమొచ్చి, దాన్ని నీళ్ళలో కలుపుకొని త్రాగి బాబా నామస్మరణ చేసుకుంటూ నిద్రపోయాను. బాబా దయవల్ల హాయిగా నిద్రపట్టి, పొదున్నకి కడుపులో మంట పూర్తిగా తగ్గిపోయింది. "ధన్యవాదాలు బాబా".

నేను ఉద్యోగంలో చేరి ఒక సంవత్సరం అవుతుండగా జీతం పెంపు విషయంగా చర్చించే రోజు వచ్చింది. 'బాబా ఉన్నారు, ఆయన నాకు మంచి జరిగేలా చూసుకుంటార'ని నాకు తెలుసు. అయినా ఎటువంటి ఆశ పెట్టుకోకుండా మా మేనేజర్ గదికి వెళ్ళాను. నేను అయితే మా మేనేజర్ నా జీతం అస్సలు పెంచరనుకున్నాను. కానీ 5% పెంచారు. అది తక్కువా, ఎక్కువా అన్నది నాకు తెలియదుగానీ, ఎటువంటి ఆశ లేని నాకు ఎంతో కొంత పెరగటం అనేది ఆనందాన్నిచ్చింది. ఈసారి బాబా ఇంకా బాగా అనుగ్రహిస్తారని, అంటే నాకు అర్హత ఉన్నంత అని నేను నమ్ముతున్నాను. "ధన్యవాదాలు బాబా".

2024, అక్టోబర్ నెలలో పెద్ద తుఫాను అని, చెన్నైలో భారీ వర్షాలని టీవీలో వార్తలు వస్తున్న రోజుల్లో మా అమ్మానాన్న మునపటి సంవత్సరంలా నాకు ఏమవుతుందోనని చాలా భయపడ్డారు. నేను మాత్రం బాబా మీద భారమేసి ధైర్యంగానే ఉంటూ బాబాను, "ఇంటికి వెళ్ళటానికి అనుమతిచ్చేలా చూడమ"ని ప్రార్థిస్తూ ఉన్నాను. అనుకోకుండా బాబా కరుణించారు. మా మేనేజర్ ఇంటికి వెళ్ళమని చెప్పారు. దాంతో నేను హఠాత్తుగా ఇంటికి వెళ్ళడానికి సిద్ధమయ్యాను. నిజానికి నాకప్పుడు ఏదైనా ట్రైన్ అందుబాటులో ఉందా, లేదా అన్నది తెలియదు. మరుసటిరోజు ఉదయం త్వరగా తయారై రిజర్వేషన్ యాప్ చూస్తే, అద్భుతం! బాబా దయవల్ల ఒక ట్రైన్‌కి టికెట్ ఉండటంతో దాన్ని బుక్ చేసుకున్నాను. ఇప్పుడు సమస్య ఏంటంటే, ఆ ట్రైన్ అందుకోవాలంటే నేను గంట లోపల స్టేషన్‌కి చేరుకోవాలి. కానీ నేను ఉన్న చోటు నుండి రైల్వేస్టేషన్‌కి అంత తొందరగా వెళ్ళటం కుదిరేపని కాదు. అయినా బాబాని ప్రార్థిస్తూ రాపిడో యాప్‌లో వాహనం బుక్ చేసుకొని బయలుదేరాను. ఏదో అద్భుతం జరిగినట్లు నేను రెండు నిమిషాలు తేడాలో ట్రైన్ అందుకొని సురక్షితంగా మా ఇంటికి చేరుకున్నాను. ఆపై తూఫాన్ చెన్నైలో పెద్దగా ప్రభావం చూపలేదని తెలుసుకొని చాలా ఆనందపడ్డాను. అంతా బాబా దయ. "ధన్యవాదాలు బాబా".


9 comments:

  1. Om Sairam!! Noothana samvatsara shubhakankshalu baba!! E samvastaramantha bagundela chudu thandri. Nannu na kutumbanni meere chusukovali baba!! Ma arthika samasyalu teerela anugrahinchandi sainatha!!

    ReplyDelete
  2. baba ee kotha samvastanramlo antha bagubdali, madava bharam antha meede baba

    ReplyDelete
  3. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Ram.

    ReplyDelete
  4. Baba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu vadini bless cheyandi house construction complete cheyandi pl manchivarini rent ki pampandi naku unna e problem solve cheyandi pl

    ReplyDelete
  5. Om Sai Ram. Happy New Year. Na korikani teerchandi Baba. Sarvejano Sukhinobhavanthu

    ReplyDelete
  6. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  7. Om sai ram, baba me challani daya yeppudu ma kutumbam paina unchandi tandri, andariki manchi arogyanni ayushni prasadinchandi baba andari badyata meede, anta prashantam ga unde la chayandi baba pls, ofce lo situations anni bagunde la chayandi baba.

    ReplyDelete
  8. Sri Sachchidananda samardha sadguru Sai nath Maharaj ki jai 🙏🙏🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo