ఈ భాగంలో అనుభవాలు:
1. అడిగినంతనే సహాయం చేసే బాబా
2. సాయినాథుని ఊదీ మహిమ
అడిగినంతనే సహాయం చేసే బాబా
నా పేరు హాసిని. నేను 3 సంవత్సరాల క్రితం నా మెడికల్ ఫైల్ ఓ చోట పెట్టి మర్చిపోయాను. అస్సలు గుర్తు లేదు. వెతికితే, కనిపించలేదు. ఇక అప్పుడు, "బాబా! ఫైల్ దొరికేలా చేయండి" అని బాబా సహాయాన్ని కోరాను. బాబా దయవల్ల ఆ ఫైల్ ఎక్కడ పెట్టానో గుర్తొచ్చి చూస్తే, ఆ ఫైల్ అక్కడే వుంది.
మూడేళ్ళలో ఒక్కసారి కూడా చూడని ఫైల్ని సాయిని సహాయం అడగ్గానే అదెక్కడుందో గుర్తు చేశారు బాబా. "ధన్యవాదాలు బాబా".
2024, దసరా సమయంలో ఫ్లిప్కార్ట్లో దసరా ఆఫర్లు పెట్టినప్పుడు నేను ఒక వస్తువు కొనాలనుకున్నాను. HDFC క్రెడిట్ కార్డు ఉంటే, ఆ వస్తువుపై 1000 రూపాయలు డిస్కౌంట్ ఉంటుందని ;తెలిసి నాకు తెలిసినవాళ్ళని ఆ కార్డు ఉందా అని అడిగాను. అందరూ కూడా ఆ బ్యాంకులో అకౌంట్ లేదన్నారు. అలా 2 రోజులు పోయాక బాబాని, "ఆ కార్డు దొరికేలా అనుగ్రహించమ"ని సహాయం అడిగాను. మరునిమషంలో నాకు ఒక వ్యక్తి గుర్తొచ్చి అతన్ని అడిగితే, "నా దగ్గరుండి. నేను మీకు ఇస్తాను" అని అన్నారు. నా ఫోన్లో ఎన్నో కాంటాక్ట్ నంబర్లు ఉంటే, ఎవరిని అడిగినా దొరకనిది బాబా సహాయం అడగగానే దొరికింది. బాబా దయవల్ల 1000 రూపాయలు డిస్కౌంట్ లభించింది. వస్తువు ఆర్డర్ పెట్టాక, "ఎలాంటి లోపం లేకుండా మంచి వస్తువు వచ్చేలా చేయండి బాబా" అని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయవల్ల మంచి వస్తువు వచ్చింది. బాబా లీలలు అనంతం.
ఒకసారి హఠాత్తుగా నా ఫ్రెండ్ నాతో మాట్లాడటం మానేసారు. నాకు ఏమైందో అర్థం కాలేదు. ఎంత అడిగినా అతని నుంచి బదులు లేదు. నాకు చాలా ఏడుపొచ్చి, "బాబా! నా ఫ్రెండ్ నాతో మాట్లాడేలా చేయండి. మీకు పంచదార నివేదిస్తాను" అని బాబా సహాయం అడిగాను. తర్వాత 2 రోజులకి నా ఫ్రెండ్ నుండి నాకు మెసేజ్ వచ్చింది. బాబాకి మాటిచ్చిన ప్రకారం పంచదార నివేదించి ధన్యవాదాలు తెలుపుకున్నాను.
ప్రతి సంవత్సరం దసరాకి మా ఇంటి దగ్గరున్న గుడిలో బాబా పుణ్యతిథి జరుపుతారు. ఆ సమయంలో అక్కడ భక్తుల చేత 100 దీపాలు వెలిగిస్తారు. అయితే నేను, మా పక్కింటి అక్క గుడికి వెళ్లేసరికి అక్కడ చాలామంది ఉన్నారు. అంతమందిని చూసాక నాకు దీపం వెలిగించే అవకాశం దొరకదనుకున్నాను. అందువల్ల నేను, "బాబా! మాకు దీపం వెలిగించే అవకాశమివ్వండి" అని బాబాని వేడుకున్నాను. బాబా దయవల్ల దీపం నాకు వెలిగించే అవకాశం లభించింది. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇంకో విషయం, నేను బాబాని, "నవరాత్రి అయ్యేంతవరకు నాకు నెలసరి రాకుండా వుండాలి బాబా" అని అడిగి రోజూ బాబా ఊదీ నీళ్ళల్లో కలుపుకొని తీసుకున్నాను. బాబా దయవల్ల నవరాత్రి దాటిపోయినా నాకు నెలసరి రాలేదు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
సాయినాథుని ఊదీ మహిమ
పిలిస్తే పలికే దైవం, ఆశ్రిత జన మందారా, ఆపద్బాంధవుడు అయిన సాయినాథునకు నా నమస్కారములు. నా పేరు శ్వేత. 2024, నవంబర్ 13వ తేదీ మధ్యాహ్నం నా శరీరమంతా వణుకుతున్నట్లు అనిపించింది. శరీరం లోపల అలా అనిపిస్తున్నప్పటికీ పైకి ఏం కనిపించలేదు. కాసేపటికి నా కుడి మోచేయి కింది భాగమంతా తీవ్రంగా ఝుమ్ అనిపించింది. ఇదేమైనా పక్షపాతమేమోనని నాకు భయమేసింది. వెంటనే సాయినాథుని తలుచుకుంటూ మోచేతికి ఊదీ రాసుకున్నాను. రెండు గంటల తరువాత క్రమంగా తగ్గుతూ వచ్చి పూర్తిగా తగ్గిపోయి నా చేయి మామూలుగా అయిపోయింది. ఇదంతా మన సాయినాథుని దివ్య ఔషధ(ఊదీ) మహిమ. తలచిన వెంటనే ప్రతి ఒక్కరి బాధను వింటూ, సహాయాన్ని అందిస్తున్న బాబాకి ఎన్ని వేల కృతజ్ఞతలు తెలిపినా తక్కువే. "ధన్యవాదాలు బాబా. అనుక్షణం మా వెంటుండి కష్టాలలో నేనున్నానంటూ అభయాన్నిస్తావని ఆశిస్తున్నాము తండ్రీ".
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.
Om Sairam!!
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family forever 🙏🙏💐💐
ReplyDeleteBaba amma nannalani kshamam ga arogyam ga chusukondi, vaallaki nindu Nurella ayush ni prasadinchandi vaalla purti badyata meede tandri, naaku na life lo anni vishayallo manashanti ni evvandi alage andaru bagunde la chayandi tandri pls.
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sai Ram
ReplyDeletebaba eeroju madava biology notes raasetattu chudandi . madava enti nundi vellakunda chudandi. madava ni naaku dooram cheyavaddu baba. maa madava baba prasadam .
ReplyDelete