ఈ భాగంలో అనుభవాలు:
1. శిరిడీ ప్రయాణ అనుభవం
2. డాక్టరు దగ్గరకి వెళ్లకుండానే బాగు చేసిన బాబా
శిరిడీ ప్రయాణ అనుభవం
నా పేరు చైతన్య. మేము 2024, సెప్టెంబర్‌లో మా బాబుకి పరీక్షలు అయిపోయాక మూడు రోజులు సెలవులు ఉంటాయని, ఆ వారాంతంలో శిరిడీ వెళ్ళడానికి ప్లాన్ చేసి, టికెట్లు బుక్ చేసాము. అయితే పరీక్షలు జరుగుతున్నప్పుడు వర్షాల కారణంగా ఒకరోజు పరీక్ష వాయిదా వేశారు. 'ఏంటిది బాబా?' అని మేము చాలా టెన్షన్ పడ్డాం. ఎందుకంటే, వాయిదా వేసిన పరీక్ష శనివారంగాని, సోమవారంగాని పెడతారు. మేమేమో శుక్రవారం చివరి పరీక్ష అవుతూనే అదేరోజు రాత్రి శిరిడీ వెళ్ళడానికి టికెట్లు బుక్ చేసుకుని, మంగళవారం తిరుగు ప్రయాణానికి బుక్ చేసుకున్నాము. అందువల్ల మేము ఇంకా శిరిడీ వెళ్లలేమేమోనని మాకు చాలా బాధేసింది. బాబాను, "ఎలాగైనా శుక్రవారంలోపే పరీక్ష పెట్టేలా చూడండి" అని ప్రార్థించాం. బాబా అద్భుతం చేశారు. అద్భుతమని ఎందుకన్నానంటే, మామూలుగా పరీక్ష వాయిదా వేస్తే, పరీక్షలన్నీ అయిపోయాక ఆ పరీక్ష పెడతారు. కానీ బాబా దయవల్ల ఆ పరీక్ష పరీక్షల మధ్యలోనే పెట్టారు. మేము సంతోషించాం. మేము అలా సంతోషంగా ఉండగా మరో ఉపద్రవం వచ్చింది. మా అత్తయ్య కాలు కొంచం ఫ్రాక్చర్ అయింది. హాస్పిటల్‌కి వెళితే ఎక్ష్ రే తీసి, నడవకుండా విశ్రాంతి తీసుకుంటే కాలు సర్దుకుంటుంది, లేదంటే కాలుకి పిండి కట్టు వేయాలి, ఆపై విశ్రాంతి తీసుకోవాలి అని చెప్పారు. దాంతో మేము ఆవిడను చూసుకోవడానికి మేమే ఉండాల్సి వస్తుందని చాలా టెన్షన్ పడ్డాం. కానీ బాబా దయవల్ల మా అత్తయ్య చెల్లెలు ఆవిడ దగ్గరుండి 15 రోజులు చూసుకున్నారు. మామూలుగా అయితే చిన్న దెబ్బకి కాలు ఫ్రాక్చర్ అవుతుందా? కానీ బాబా పెద్ద ప్రమాదాన్ని చిన్న దెబ్బతో తీసేసారనిపిస్తుంది. ఇకపోతే, మరో రెండు, మూడు రోజుల్లో మా శిరిడీ ప్రయాణం ఉందనగా వర్షాల కారణంగా కొన్ని రైళ్లు రద్దు చేశారు. అప్పుడు, "ఏంటి బాబా, మేము శిరిడీ రావటానికి ఇన్ని ఆటంకాలు వస్తున్నాయి? ఏ ఆటంకాలూ లేకుండా మా ప్రయాణం సజావుగా సాగేలా చూడండి" అని అనుకున్నాను. బాబా దయవల్ల ఏ ఆటంకాలు లేకుండా మా ప్రయాణం బాగా జరిగింది. బాబా అనుమతి ఉంటేనే మేము శిరిడీ ప్రయాణమవ్వగలం. బాబా అనుమతి ఉంది కాబట్టే ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆయన వాటిని పరిష్కరించి మాకు వారి దర్శన భాగ్యం ప్రసాదించారు." మీకు వేల కోటి ప్రణామాలు సాయినాథా":
మేము శిరిడీకి ప్రయాణమయ్యేటప్పుడు నేను బాబాని, "బాబా! నేను శిరిడీ వస్తున్నాను కదా, ఏదో ఒక రూపంలో మాకు మీ దర్శన భాగ్యం, ఆశీర్వాదం ఇవ్వండి" అని అనుకుంటూ ఉండగా నేను సాధారణంగా అనుసరించే ఒక గ్రూపులో 'నువ్వు శిరిడీ వచ్చినప్పుడు నేను ఏదో ఒక రూపంలో(ప్రసాదం, ఫోటో) నీ దగ్గరికి వస్తాను' అని, ఇంకా 'నువ్వు ఆరతికి వచ్చినప్పుడు నేను పసుపు రంగు వస్త్రాల్లో దర్శనమిచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను' అని బాబా సందేశాలు వచ్చాయి. శిరిడీ వెళ్ళాక ఒకరోజు బాబా ఆరతికి వెళ్ళినప్పుడు బాబా పసుపు రంగు వస్త్రంలో మాకు దర్శనమిచ్చారు. ఆరతి పూర్తైన తర్వాత బాబా తీర్థప్రసాదాలు మాకు లభించాయి. ఇంకోసారి ముఖ దర్శనానికి వెళ్ళినప్పుడు బాబా పంచలోహ విగ్రహం నాకు దర్శనమిచ్చింది. ఇదంతా బాబా అనుగ్రహం.
మాతోపాటు శిరిడీ వచ్చిన మా అమ్మ తిరిగి ఇంటికి వెళ్ళాక జ్వరం, జలుబు, దగ్గు వచ్చి చాలా ఇబ్బందిపడింది. అప్పుడు నేను, "బాబా! మామూలు జ్వరమే అయి త్వరగా తగ్గేలా చూడండి" అని బాబాని వేడుకున్నాను. బాబా దయవల్ల తనకి జ్వరం తగ్గింది. తర్వాత మా బాబుకి కూడా జ్వరం, జలుబు, దగ్గు వచ్చాయి. తను మాకు దూరంగా హాస్టల్లో ఉంటాడు. ఆ సమయంలో తనకి పరీక్షలు కూడా జరుగుతున్నాయి. తను అక్కడ చాలా బాధపడుతుంటే మాకు చాలా బాధేసింది. అప్పుడు నేను బాబా ఊదీ తీసుకొని, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని జపించి "బాబుకి జ్వరం తగ్గిపోవాలి" అని నా నుదుటన పెట్టుకున్నాను. బాబా దయవల్ల బాబుకి జ్వరం తగ్గింది. "చాలా ధన్యవాదాలు బాబా. ఇలాగే మీ కృపాదృష్టి మీ బిడ్డలందరి మీద ఉండేలా చూడండి. అందరికీ మంచి బుద్ధిని, జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించండి".
డాక్టరు దగ్గరకి వెళ్లకుండానే బాగు చేసిన బాబా
సాయి భక్తులందరికీ నా నమస్కారం. నా పేరు శివాని. నాకు ఏ ఇబ్బంది వచ్చినా బాబాతో చెప్పుకుంటాను. 2024, అక్టోబర్లో నా భర్తకి నిద్రలో నడుము పట్టేసింది. మావారు నొప్పితో చాలా ఇబ్బందిపడ్డారు. బైక్ మీద ఆఫీసుకి వెళ్లాలంటే అతనికి చాలా కష్టంగా అనిపించింది. అదే సమయంలో నా ఒక వైపు చెంప బాగా వాచిపోయి, తీవ్రమైన తలనొప్పి వచ్చి చాలా ఇబ్బందిపడ్డాను. బాబా ఊదీ తీసుకొని మావారి నడుముకి రాసి, కొంచం నా నోట్లో వేసుకొని 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదయ నమః' అని జపించాను. కానీ తగ్గలేదు. అప్పుడు, "మా ఇద్దరికీ ఈ నొప్పులు తగ్గేలా అనుగ్రహించండి" అని బాబాకి చెప్పుకున్నాను. బాబా డాక్టరు దగ్గరకి వెళ్లకుండానే మా ఇద్దరికీ బాగు చేసారు. "చాలా థాంక్స్ బాబా".
Anta bagunde la chusukondi baba pls.
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
baba naa kurupu taggelafa chudandi. madava ki chaduv meeda concentration chesetattu chudandi
ReplyDeleteUdi water tiskondi...taggutundi
DeleteOm Sai Ram
ReplyDeleteOmsai ram..nakoka health problem ochinapdu nenu baba tho chala godava padda naku nduku ila chesav drs andaru surgery ne antunaru last oka Dr daggarki velli Inka surgery ki veldamani ankunam..last ga ah Dr daggarki opinion kosam velle mundu baba ni vedukuna naku surgery elagina tappinchi medicines tho cure ayelaga chudamani.final ga dr reports chusi chances unai medicines tho try cheddam annaru..idoka pedda miracle na life lo baba..baba ni nammukunte elagaina entha pedda problem ni takkuva chestetadani oka miracle idi...om sai ram
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu vadini bless cheyandi house construction complete cheyandi pl manchivarini rent ki pampandi
ReplyDeleteBaba nenu e problem nunchi purthi ga kolukune la chayandi tandri manchi arogyanni evvandi baba pls, intlo situations chakka pade la chayandi baba pls manashanti ni evvandi baba pls.
ReplyDeleteSri Sachchidananda sadguru Sai nath Maharaj ki jai 🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm Sri Sai Raksha 🙏🙏🙏
ReplyDelete