ఈ భాగంలో అనుభవం:
- సాయితండ్రి దయ
ఓం శ్రీసాయినాథాయ నమః. సాయి బంధువులందరికీ నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, సకల దేవతలు, ఇంకా సర్వమూ బాబాయే. మాకు ఒక బాబు, పాప. పిల్లలిద్దరూ వేరే ఊర్లో ఉండి చదువుకుంటున్నారు. వినాయకచవితి తర్వాత బాబుకి జ్వరం, ఒళ్ళునొప్పులు వచ్చాయి. బాబు నాకు ఫోన్ చేసి, "మెడికల్ షాపులో టాబ్లెట్లు కొని వేసుకుంటున్నా తగ్గట్లేదు" అని చెప్పాడు. అలా రెండు రోజులైనా బాబుకి తగ్గకపోయేసరికి నాకు చాలా ఆందోళనగా అనిపించి, "అలా కాదు, ముందు బ్లడ్ టెస్ట్ చేయించుకో" అని బాబుతో చెప్పి సాయితండ్రికి దణ్ణం పెట్టుకున్నాను. మరుసటిరోజు బాబు టెస్టులు చేయిస్తే, టైఫాయిడ్ ప్రారంభంలో ఉందని రిపోర్టులో తెలిసింది. బాబు ఆ విషయం నాకు ఫోన్ చేసి చెప్తే, "ఏం పర్వాలేదు. మనకు సాయితండ్రి ఉన్నాడు. తేలిగ్గా తగ్గించేస్తాడు. ఏమీ భయపడక్కర్లేదు. నువ్వు వెంటనే బయలుదేరి వచ్చేయమ్మా. ఇంటి దగ్గరైతే ట్రీట్మెంట్ బాగుంటుంది" అని అన్నాను. బాబు సరేనని అదేరోజు బయలుదేరి రాత్రికి ఇంటికి వచ్చాడు. నేను, "బాబా! వాడికి చిన్నప్పటినుండి ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యమే! ఇప్పటికే వాడికి రెండుసార్లు టైఫాయిడ్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు. నాకు సర్వం నువ్వే తండ్రి. రేపు ఉదయానికి బాబుకి జ్వరం తగ్గి మామూలు చేయ తండ్రి" అని బాబాకి హృదయపూర్వకంగా దణ్ణం పెట్టుకున్నాను. బాబా దయవల్ల మరుసటిరోజు ఉదయం జ్వరం చూస్తే, నార్మల్ ఉంది. అయినా బాబుని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే, ఐదు రోజులకు మందులు రాసిచ్చారు. బాబుకి జ్వరమైతే మళ్లీ రాలేదు, రోజూ నార్మల్ ఉండేది. కానీ బాగా నీరసంగా ఉండేవాడు. అది కూడా బాబాను ప్రార్థిస్తే, ఆయన దయవల్ల వారం రోజులకు చాలావరకు తగ్గి బాబు కోలుకున్నాడు. ఇక బాబు, 'పరీక్షలు దగ్గరలో ఉన్నాయని, ఇంటి దగ్గర ప్రిపేర్ అవడానికి ఇబ్బందిగా ఉందని, హాస్టల్ అయితే ఇబ్బంది ఉండద"ని వెళ్ళిపోయాడు.
తర్వాత వేరే ఊరిలో ఉన్న మా పాపకి కూడా జ్వరమొచ్చి ఒళ్ళునొప్పులతో బాధపడితే, తనని కూడా టెస్టులు చేయించుకోమన్నాను. అప్పుడు తనకి కూడా టైఫాయిడ్ అని తెలిసింది. ఇంటి దగ్గరైతేనే సరైన వైద్యం అందుతుందని తనని కూడా ఇంటికి వచ్చేయమన్నాను. ఒకరి తర్వాత ఒకరికి ఇలా వస్తుందేమిటని నాకు చాలా బాధేసి, "తండ్రీ! పాపకు తేలిగ్గా తగ్గేటట్లు చేయండి" అని సాయిబాబానే వేడుకున్నాను. టైఫాయిడ్‌తో బాధపడుతున్నప్పుడు పాపకి బాగా నీరసం, గ్యాస్ నొప్పి ఉంటుండేవి. వాటితో తను బాగా ఇబ్బందిపడుతుంటే నేను బాబాను ప్రార్ధించాను. బాబా దయవల్ల అవి తగ్గి పాప కోలుకుంది. ఇప్పుడు బాగానే ఉంది.
బాబుకి జ్వరం తగ్గిన కొన్నిరోజులకి తన చంకలలో సెగ్గడ్డలు వచ్చి, బాగా నొప్పిగా ఉందని చాలా బాధపడ్డాడు. అదే సమయంలో వేరే ఊరిలో ఉన్న మా పాప కూడా సెగ్గడ్డలు వచ్చి, కూర్చోలేకపోతున్నానని చెప్పి బాధపడింది. నేను మన సాయినాథుని, "ఇద్దరికీ సెగ్గడ్డలు తగ్గించమ"ని వేడుకున్నాను. సాయితండ్రి దయవలన ఇద్దరికీ తగ్గాయి. "సాయితండ్రీ! నాకు సర్వం నువ్వే. పిల్లలిద్దరూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండేటట్లు చూడు తండ్రి".
తర్వాత వేరే ఊరిలో ఉన్న మా పాపకి కూడా జ్వరమొచ్చి ఒళ్ళునొప్పులతో బాధపడితే, తనని కూడా టెస్టులు చేయించుకోమన్నాను. అప్పుడు తనకి కూడా టైఫాయిడ్ అని తెలిసింది. ఇంటి దగ్గరైతేనే సరైన వైద్యం అందుతుందని తనని కూడా ఇంటికి వచ్చేయమన్నాను. ఒకరి తర్వాత ఒకరికి ఇలా వస్తుందేమిటని నాకు చాలా బాధేసి, "తండ్రీ! పాపకు తేలిగ్గా తగ్గేటట్లు చేయండి" అని సాయిబాబానే వేడుకున్నాను. టైఫాయిడ్‌తో బాధపడుతున్నప్పుడు పాపకి బాగా నీరసం, గ్యాస్ నొప్పి ఉంటుండేవి. వాటితో తను బాగా ఇబ్బందిపడుతుంటే నేను బాబాను ప్రార్ధించాను. బాబా దయవల్ల అవి తగ్గి పాప కోలుకుంది. ఇప్పుడు బాగానే ఉంది.
బాబుకి జ్వరం తగ్గిన కొన్నిరోజులకి తన చంకలలో సెగ్గడ్డలు వచ్చి, బాగా నొప్పిగా ఉందని చాలా బాధపడ్డాడు. అదే సమయంలో వేరే ఊరిలో ఉన్న మా పాప కూడా సెగ్గడ్డలు వచ్చి, కూర్చోలేకపోతున్నానని చెప్పి బాధపడింది. నేను మన సాయినాథుని, "ఇద్దరికీ సెగ్గడ్డలు తగ్గించమ"ని వేడుకున్నాను. సాయితండ్రి దయవలన ఇద్దరికీ తగ్గాయి. "సాయితండ్రీ! నాకు సర్వం నువ్వే. పిల్లలిద్దరూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండేటట్లు చూడు తండ్రి".
ఈమధ్య నా నడుము చుట్టూ, ఛాతి కింద దురదలుగా ఉంటుంటే ఆయింట్మెంట్ రాసినా, కేండీడ్ పౌడర్ రాసినా, వేపాకు పేస్టు, కొబ్బరి నూనె రాయడం ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా తగ్గినట్లు ఉండి మళ్లీ దురద అనిపిస్తుండేది. అప్పుడు బాబా దగ్గర చీటీలు వేసి అడిగితే, "హాస్పిటల్‌లో చూపించుకోమ"ని బాబా సూచించారు. నేను, "తండ్రీ! తక్కువ డబ్బులతో త్వరగా తగ్గేటట్లు చేయండి" అని బాబాకి చెప్పుకొని హాస్పిటల్‌కి వెళ్ళాను. బాబా దయవల్ల నేను కోరుకున్నట్లే మందులకు తక్కువ డబ్బులయ్యాయి. దురద కూడా త్వరగానే తగ్గుముఖం పట్టింది. "ధన్యవాదాలు బాబా. ఇంకా కొంచెం దురద ఉంటుంది. దాన్ని కూడా తగ్గించు తండ్రీ".
సాయి తమని నమ్మిన వాళ్లందరికీ 'మీ వెంటే ఉన్నాన'ని ఏదో ఒక అనుభవం ద్వారా, 'నేనుండగా భయమెందుకు?', 'నేను నీతోనే ఉన్నాను' అని సందేశాల రూపంలో తెలియజేస్తూ ఉంటారు. ఒకసారి నా ఆరోగ్యం, మనసు బాగోక చాలా బాధపడి ఏడుస్తూ పడుకున్నాను. ఇంకా నిద్రపోలేదు, మెలకువగానే ఉన్నాను. అప్పుడు బాబా దర్శనమైతే అవ్వలేదుగాని, "నేను నీతోనే ఉన్నాను బేటా!" అని ఆయన మాటలు చాలా స్పష్టంగా వినిపించాయి. నేనెంత సంతోషించానో, నాకు ఎంతో ధైర్యం వచ్చిందో సాయి భక్తులకు వేరే చెప్పక్కర్లేదు. ఇంకోసారి నేను సమస్యతో చాలా బాధపడుతూ తట్టుకోలేక, "చిన్నప్పటినుండి నాకు సంతోషకరమైన జీవితం చాలా తక్కువ. అది నీకూ తెలుసు తండ్రీ! నేను ఎందుకింత దురదృష్టవంతురాలిని తండ్రీ? ఇలాంటి జీవితం ఎవరికీ వద్దు తండ్రీ" అని బాబాను అడిగి క్వశ్చన్&ఆన్సర్ సైట్‌లో చూస్తే, 'నువ్వు దురదృష్టవంతురాలివేంటి? సాయి అనుగ్రహం పొందిన నువ్వు అదృష్టవంతురాలివి' అని వచ్చింది. అది చూసి నాకు చాలా చాలా సంతోషమేసింది. అప్పటినుండి 'నేనూ అదృష్టవంతురాలినే. నా బాబా, నా సాయితండ్రి చెప్పారుగా' అని తృప్తిగా ఫీలవుతున్నాను. "ధన్యవాదాలు బాబా. మమ్మల్ని దూరం పెట్టక అక్కున చేర్చుకో తండ్రీ".
ఓం సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహారాజ్ కీ జై!.
Om Sai ram Baba's blessings are there for every person.we are lucky to have Baba as our God
ReplyDeleteOm sai ram, amma nannalani kshamam ga chusukondi vaallaki manchi arogyanni alage ayushni prasadinchandi baba, vaalla purti badyata meede baba, e roju anta anni vishayallo prashantam ga gadiche la chayandi baba pls. Andaru bagunde la chayandi.
ReplyDeleteBaba Kalyan ki marriage
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu vadini bless cheyandi house construction complete cheyandi pl manchivarini rent ki pampandi naku unna e problem solve cheyandi pl
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏💐💐
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family members forever 🙏🙏
ReplyDeletebaba naa pundu poorthiga taggali swamy, madava bharam antha meede baba
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteఓం సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహారాజ్ కీ జై!.
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha