ఈ భాగంలో అనుభవాలు:
1. కలలో బాబా ఇచ్చిన నిజ దర్శనం
2. సాయి మంత్రంలో ఎంతో మహిమ ఉందో!
కలలో బాబా ఇచ్చిన నిజ దర్శనం
నా పేరు లక్ష్మి. నేను వైజాగ్‌లో ఉంటాను. తోటి భక్తుల అనుభవాలు చదువుతుంటే, 'చిన్న వాటికి అందరూ ఎంతలా అనుభూతి చెందుతున్నారు. నేను బాబా నాకు చేసిన మేలు పంచుకోకపొతే నాకు కృతజ్ఞత లేనట్లే' అనిపిచింది. అందుకే నేను ఇప్పుడు కలలో బాబా నాకిచ్చిన నిజ దర్శనం గురించి పంచుకుంటాను. 2015లో మేము ఒక ఇల్లు కొందామని బిల్డర్‌తో బేరం మాట్లాడుకున్నాం. ఒక వారం తరువాత నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో మా ఇంట్లో ఉన్న ఉయ్యాలలో బాబా కనిపించారు. ఆయన ఉత్తరం వైపు కూర్చొని తమ తలను తూర్పు వైపు తిప్పుతూ ఇద్దరు వ్యక్తుల చేతులు కవర్లు మార్చుకుంటుంటే చూస్తున్నారు. బాబా ఒరిజినల్ ఫొటోలో ఎలా ఉంటారో అచ్చం అలానే ఉన్నారు. నేను ఉదయం నిద్రలేచిన వెంటనే ఆ కల గుర్తు చేసుకొని కలలో బాబా దర్శనమిచ్చారని చాలా అంటే చాలా ఆనందించాను. వెంటనే మావారికి ఆ కల గురించి చెప్పాను. అది వింటూనే మావారు "సరే! ఆయన చూస్తున్నారన్న మాట" అన్నారు. నేను, "నాకు అర్ధం కాలేదు" అని అన్నాను. అప్పుడు మావారు, "బిల్డర్ 36 లక్షల రూపాయలు నెట్ క్యాష్ ఇస్తే, కొంత తగ్గిస్తానన్నాడు. అందుకని ఈరోజు డబ్బులు తీసుకొని వెళ్లి అతనికి ఇస్తాను" అని చెప్పారు. 'అవునా? అందుకే కాబోలు! బాబా దగ్గరుండి చూస్తున్నారు' అని అనుకున్నాను. ఆ డబ్బుల వ్యవహారం పక్కన పెడితే బాబా మా ఇంట్లోని ఉయ్యాలలో నిజరూప దర్శనమిచ్చినందుకు నాకు చాలా సంతోషమేసింది. ఇకపోతే, డబ్బు తీసుకున్నా బిల్డర్ వెంటనే మా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలి కదా! చేయకుండా రెండు నెలలు గడిచినా రిజిస్ట్రేషన్ చేయడానికి ముందుకు రాలేదు. మేము ఫోన్ చేస్తే తీసేవాడు కాదు. మాకు విపరీతంగా భయమేసి వాళ్ళ ఇంటికి వెళ్లి గొడవ చేసాం. తర్వాత ఇంకా అగ్రిమెంట్ గడువు ముగియడానికి పదిహేను రోజులు మాత్రమే ఉందని నేను, నా భర్త బాబాకి దణ్ణం పెట్టుకుంటూ, "స్వామీ! మేము కష్టపడి సంపాదించిన దాని గురించి మీకు తెలియనిది కాదు. ఇలా అన్యాయం జరిగితే మా పరిస్థితి ఏమిటి?" అని వేడుకుంటూ ఉండేవాళ్ళము. బాబా ఏం చేసారో తెలియదుకాని, ఆ బిల్డర్ మనసు మార్చుకొని మాకు ఫోన్ చేసి "మీరు కావాల్సినవన్నీ తీసుకొని రిజిస్టర్ ఆఫీసుకి రండి" అని చెప్పి గడువు ముగియడానికి ఒక వారం ఉందనగా మా పేరున రిజిస్ట్రేషన్ చేసాడు. అది బాబా లీల. ఆయన ముందే నేను చూస్తున్నాని సందేశమిచ్చారు. అయినా ఇల్లు మాట ఏమో గాని, బాబా తమ నిజరూప దర్శనం ఇచ్చారు. నాకు మహా భాగ్యం దక్కింది. నేను ధన్యురాలిని. ఒక్కోసారి బాబాని కోరిక కోరితే, కోరింది ఇస్తారేమోగాని, మనం ఆయన తోడు ఉండాలని చెప్పుకుని పని చేసుకుంటూ పొతే అన్నీ ఆయనే చూస్తారు, చేస్తారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
సాయి మంత్రంలో ఎంతో మహిమ ఉందో!
సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు మిథున్. నా జీవితంలో సాయిబాబా నాకు ఎన్నోసార్లు సహాయం చేసారు. అందుకు ఎన్ని జన్మలెత్తినా నేను బాబాకి ఋణపడి ఉంటాను. నేనిప్పుడు పంచుకునే అనుభవం చాలా ముఖ్యమైనది. సాయి మంత్రంలో ఎంతో మహిమ ఉందో నాకు తెలియజేసింది. నేను నా భార్య, పిల్లలతో యుఎస్ఏలో ఉంటున్నాను. ఒకసారి మా అమ్మానాన్న యుఎస్ఏ వచ్చి మా పిల్లలతో సరదాగా గడిపారు. అందరం చాలా ఆనందంగా ఉన్న సమయంలో హఠాత్తుగా ఒకరోజు మా నాన్నకి మూత్రంలో రక్తం వచ్చింది. మనసులో ఎన్నో ఆలోచనలతో మా నాన్న భయపడ్డారు. నేను కూడా నాన్నకేమవుతుందోనని చాలా భయపడ్డాను. యుఎస్ఏలో డాక్టరు అపాయింట్మెంట్ దొరకడం కష్టం. అందువల్ల అమ్మానాన్న ఇండియాకి తిరిగి ప్రయాణమయ్యారు. నేను వాళ్ళు వెళ్లి అక్కడ డాక్టర్ని సంప్రదించి టెస్టులు చేయించుకొనేదాకా సాయి నామం జపిస్తూ ఉన్నాను. ఆ సమయంలో ఒకరోజు సాయి భక్తుల అనుభవాలు చదువుతూ ఒక భక్తుడు పంచుకున్న, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదయ నమః' అనే మంత్రం జపించడం వల్ల రిపోర్టులు నార్మల్ వచ్చాయి, నాన్న ఆరోగ్యం బాగుందని చదివాను. ఆ క్షణం నుంచి నేను ఆ మంత్రాన్ని జపించాను. చివరికి బాబా దయవల్ల మా నాన్న రిపోర్టులన్నీ నార్మల్ వచ్చాయి. నా ఆనందానికి హద్దులు లేవు. "ధన్యవాదాలు బాబా. ఎల్లప్పుడూ ఇలాగే మా కుటుంబంపై మీ కృపను చూపించండి. కష్ట సమయంలో అండగా ఉండండి బాబా".
baba naa kurupuni tagginchandi. nenu kuda sri sai arogyaskemadaya namaha ani chaduvu taanu. madava bharam antha meede baba.
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family members forever 🙏🙏💐💐
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteOm sri sai nathaya namaha
ReplyDeleteOm sri sai nathaya namaha
Om sri sai nathaya namaha
Om sri sai nathaya namaha
Om sri sai nathaya namaha
Sri Sachchidananda sadguru Sai nath Maharaj ki jai 🙏
ReplyDeleteOm Sri Sai Aarogyakshemadhaaya Namaha🙏🙏🙏
ReplyDeleteOm Sri Sai Raksha 🙏🙏🙏