సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 716వ భాగం....



ఈ భాగంలో అనుభవాలు:
  1. భక్తి, ప్రేమలే ముఖ్యమని తెలియజేసిన బాబా
  2. బాధ నుండి ఉపశమనం ప్రసాదించిన బాబా ఊదీ

భక్తి, ప్రేమలే ముఖ్యమని తెలియజేసిన బాబా


విజయవాడ నుండి సాయి భక్తుడు పార్థసారథి తనకి బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:


సాయిబంధువులకు నా నమస్కారం. నా పేరు పార్థసారథి. మేము విజయవాడలో నివసిస్తున్నాము. నేను ప్రప్రథమంగా 1987, జూన్ లేదా జూలై మాసంలో మచిలీపట్నం శ్రీ శిరిడీ సాయిబాబా ధ్యాన మందిరం నిర్వాహకులు శ్రీ అబ్దుల్ రహీం గారితో కలిసి సుమారు 40 మంది శిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకున్నాము. అదే సమయంలో, సందర్భమేమిటో నాకు తెలియదుగానీ, ఎక్కిరాల భరద్వాజగారు(ఒంగోలు), మిరియాల కృష్ణమూర్తిగారు(ఖమ్మం), ఇంకా ఎంతోమంది సాయిభక్తులు బృందాలతో శిరిడీ వచ్చారు. ఇప్పుడు ఈ అనుభవాన్ని వ్రాస్తున్నప్పుడు నాకు అనిపిస్తోంది, బహుశః అది గురుపూర్ణిమ అయివుండచ్చునేమో అని. ఆ రోజుల్లో బాబాకు కాకడ ఆరతి, అభిషేకం అయిన తరువాత బాబా పంచలోహ విగ్రహాన్ని మహాసమాధి వద్ద ఉంచి అభిషేకం, పూజ చేశాక, అందరం పైకి ఎక్కి ఆ చిన్న విగ్రహం వద్ద పూజచేసిన పూజాద్రవ్యాలను బాబా పాదాల వద్ద సమర్పించి, పూలదండను బాబా మెడలో స్వయంగా అలంకరించే అవకాశం ఉండేది. ఈ సేవకు రుసుము 0.25 నయాపైసలు. ఆరోజు మేము కూడా అభిషేకం తరువాత పైకి ఎక్కి బాబా పాదాల వద్ద పూజాద్రవ్యాలను సమర్పించాము. ఆ తరువాత సమాధిమందిరంలోనే కూర్చుని బాబాను చూస్తూ ఉన్నాము. అక్కడి భక్తుల చేతుల్లో బాబా మెడలో అలంకరించేందుకు తెచ్చిన పూలమాలలు ఉన్నాయి. వాటిలో కొన్ని చిన్నవీ, కొన్ని పెద్దవీ ఉన్నాయి. వారు ఆ పూలమాలలను పూజారుల చేతికి ఇస్తున్నారు. పూజారులు ఆ పూలమాలలను బాబా మెడలో వేస్తున్నారు, మరుక్షణం వాటిని తీసివేసి ప్రక్కనే ఉన్న బుట్టలో వేస్తూ ఉన్నారు. చూచేందుకు అంతా కన్నుల పండుగగా ఉంది. ఆ సమయంలో, నేను కూడా బాబాకు ఒక పూలదండ సమర్పించాలనే కోరిక నా మదిలో కలిగింది.


మరునాడు ఉదయం ఒక షాపులోకి వెళ్ళి ఒక పూలదండ కావాలని అడిగాను. అతను, “పూరా థాలీ లేలో, సిర్ఫ్ మాలా నహీ దేతే” (“పూజాద్రవ్యాలన్నీ కలిపివున్న బుట్ట మొత్తం కొనుక్కోవాలి, పూలదండ విడిగా ఇవ్వము”) అని అన్నాడు. నాకు అప్పట్లో ఆ భాష అర్థమయ్యేది కాదు. దాంతో చేసేది లేక పూలదండ కొనకుండానే వచ్చేశాను. బాబాకు పూలదండ సమర్పించలేకపోతున్నానే అని చాలా బాధపడ్డాను. తిరుగుప్రయాణమైనప్పుడు బాబా వద్ద అనుమతి కోరుకుంటూ, “బాబా! ఈసారి వచ్చినప్పుడు ఎంత ఖరీదైనాసరే నీకు పూలదండ సమర్పిస్తాను” అని చెప్పుకుని, వీడ్కోలు నమస్కారం చేసుకుని విజయవాడ తిరిగి వచ్చాము.


ఆ తరువాత, 1988 అక్టోబరు/నవంబరు నెలలో మా ప్రథమ సంతానానికి (బాబుకి) పుట్టువెంట్రుకలు తీయించడానికి రెండవసారి శిరిడీ ప్రయాణమయ్యాము. “పుట్టువెంట్రుకలు తిరుమలలో ఇవ్వాలి, ఇలా శిరిడీలో ఇవ్వడం తప్పు” అని మా అమ్మగారు నన్ను బాగా కోప్పడ్డారు. కానీ, ‘నాకు బాబానే వెంకటేశ్వరస్వామి, వెంకటేశ్వరస్వామియే బాబా’ అని అనుకోవటం వలన శిరిడీలోనే బాబుకి పుట్టువెంట్రుకలు తీయించాలనుకున్నాను. అనుకున్న ప్రకారమే శిరిడీ చేరుకున్నాక ఆరోజు ఉదయం బాబుకి పుట్టువెంట్రుకలు తీయించాము. ఆరోజు సాయంత్రం ఆరతి సమయానికి సమాధిమందిరానికి చేరుకుని హాలులో కూర్చుని ఉన్నాం. సాయంకాల ఆరతికి ఇంకా సమయం ఉంది. అకస్మాత్తుగా పూలదండ విషయం గుర్తుకు వచ్చి ద్వారకామాయి వైపు ఉన్న సందులోకి వెళ్ళాను. ఎదురుగా ఉన్న దుకాణంలో అక్కడక్కడా గులాబీపూలతో అందమైన పెద్ద లిల్లీపూలదండలు వ్రేలాడుతూ కనిపించాయి. వాటి ధర ఎంత అని అడిగాను. ‘కేవలం ఐదు రూపాయలు’ అన్నాడు ఆ దుకాణదారు. ఎంత ఖరీదైనా ఫరవాలేదు అనుకున్నప్పటికీ, ‘అంత ఖరీదు వద్దులేరా’ అని తక్కువ ధరకే పూలదండ దొరికేలా చేశారు బాబా. వెంటనే ఒక పూలదండ కొని తీసుకొచ్చి సమాధి వద్దనున్న పూజారికి ఇవ్వగా ఆయన దానిని బాబా ఆశీనులైన సింహాసనానికి తగిలించాడు. నేను ‘బాబాకు సమర్పించాలనుకున్నాను, సమర్పించేశాను’ అనుకుని ఆనందంగా ఉన్నాను.


అసలు కథ ఇప్పుడే మొదలైంది. బాబాకు సాయంకాల ఆరతి పూర్తయింది. ఇంతలో నా మరదలు గబగబా నా దగ్గరకు వచ్చి, “బావగారూ! మీరు ఎంతో అదృష్టవంతులు. మీరు బాబాకు సమర్పించిన పూలదండను ఆరతి సమయంలో బాబా మెడలో అలంకరించారు. సుమారు 45 నిమిషాల పైనే ఆ పూలదండ బాబా మెడలో ఉన్నది” అని చెప్పింది. నేను ఆ విషయం గమనించలేదు. అయినా ఆ మాటలు వినగానే ఎంత ఆనందించానో మాటల్లో చెప్పలేను. కానీ అంతలోనే నా మదిలో ఒక పనికిమాలిన ఆలోచన – పూలదండ పెద్దది, పైగా చాలా అందంగా ఉంది. అందుకే ముందు అలా ప్రక్కన పెట్టి ఆరతి సమయానికి బాబా మెడలో అలంకరించి ఉండవచ్చు అని. 


మరునాడు సాయంకాలం బయటకు వెళ్ళినప్పుడు ఈసారి రెండు పూలదండలు కొని ఒకటి నా శ్రీమతి చేతికి ఇచ్చి, మరొకటి నేను బాబాకు సమర్పించాను. తను ఇచ్చిన పూలదండను ఏం చేశారో మేము గమనించలేదు. నేను ఇచ్చిన పూలదండను మాత్రం ఆ పూజారి ప్రక్కనున్న బుట్టలోకి విసిరేశాడు. అది చూడగానే నాకైతే బాబా నా చెంప పగలగొట్టినట్లయింది. “ఏరా? నిన్న ప్రేమతో ఇచ్చావు, అందుకే స్వీకరించాను. కానీ ఈరోజు నీ పనికిమాలిన తెలివితేటలు నాకు తెలియవా?” అని బాబా అంటున్నట్లు అనిపించి అపరాధభావంతో చెంపలేసుకున్నాను. అయితే, భక్తితో సమర్పించినది ఎంత చిన్నదైనా బాబా స్వీకరిస్తారని నిరూపణ కావాలి కదా! ఆరోజు ఆరతి సమయంలో బాబా మెడలో ఎవరో భక్తులు ప్రేమతో సమర్పించిన అతి చిన్న బంతిపూలదండ అలంకరించబడి ఉంది. ఈ లీల ద్వారా తనకు భక్తి, ప్రేమలే ముఖ్యమని బాబా నాకు తెలియచేశారు.


బాధ నుండి ఉపశమనం ప్రసాదించిన బాబా ఊదీ


ఒక అజ్ఞాత సాయి భక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:


సాయిభక్తులందరికీ ఓం సాయిరామ్! నేను గత 15 సంవత్సరాలుగా సాయి భక్తురాలిని. రెండు సంవత్సరాల క్రితం నేనొక శస్త్రచికిత్స చేయించుకున్నాను. అప్పుడు కొన్ని కుట్లు వేశారు. ఇటీవల ఒక ఆదివారంనాడు నేను కాస్త కఠినమైన వ్యాయామాలు చేస్తున్న సమయంలో ఆ కుట్లు వేసిన చోట చీలిక ఏర్పడి నొప్పి, తీవ్రమైన బాధ కలిగాయి. ఎటువంటి అనారోగ్యానికైనా అద్భుత మహిమ గల ఊదీ ఉపయోగించడం అలవాటున్న నేను వెంటనే గాయమైన చోట ఊదీ రాసి, "గురువారం నాటికల్లా నయం చేయమ"ని బాబాను ప్రార్థించాను. దయామయులైన బాబా గురువారం నాటికి నాకు స్వస్థత చేకూర్చి నన్ను ఆశీర్వదించారు. "బాబా లవ్ యు బాబా. అందిరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. ధన్యవాదాలు బాబా". ప్రస్తుతం నేను ఒక ప్రత్యేకమైన కోరిక కోసం నవ గురువార వ్రతం చేస్తున్నాను. దీనికి సంబంధించి క్వశ్చన్&ఆన్సర్ సైట్ లో బాబాను ఒక ప్రశ్న అడిగాను. ఆయన సానుకూలమైన సమాధానంతో నా కోరిక నెరవేరుతుందని హామీ ఇచ్చారు. నేను రాబోయే ఆ సంతోషకరమైన రోజుకు ఎదురు చూస్తున్నాను. నా వ్రతం పూర్తి అయేరోజు అది అనుగ్రహింపబడుతుంది.


Source:http://www.shirdisaibabaexperiences.org/2020/05/shirdi-sai-baba-miracles-part-2732.html#experience5



11 comments:

  1. Om sai ram 2 sai leelas are very nice. 1st sai leela is very good. We think before Lord that is not nice to sai he teaches us lesson. Om sai maa please cure fever of my Sheryas. He is suffering from 3 days. With ometings(vantulu) please cure him. Bleess my grand sons be with them and give long life and education to them. Om sai baba🙏🙏🙏❤ 🌹🌹

    ReplyDelete
  2. Why my comments are not posting what is the problem. I am typing with love to baba. You are not posting I feel pain. What is wrong I did om sai ram

    ReplyDelete
  3. Sorry I can't see my comment for some time. Om sai ram🙏🙏🙏

    ReplyDelete
  4. Now I am happy sai ram🙏🙏🙏 ❤🌹

    ReplyDelete
  5. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  6. 673 days aiypoindi sairam
    i lost my son

    ReplyDelete
  7. Om sai ram baba rakshinchu thandri

    ReplyDelete
  8. 🙏🙏🙏Om srisairam Om srisairam Om srisairam thank you sister.

    ReplyDelete
  9. Om sai sri sai jaya jaya sai 🙏🙏🙏pilisthe palike sakshath swarupam sri sai nadhudu ni divya rupam

    ReplyDelete
  10. OM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH..Om Sai Ram

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo