- బాబాకి చెప్పుకుంటే ఏ సమస్యా లేకుండా అనుగ్రహిస్తారు
- సాయి ఆశీస్సులతో మంజూరైన సెలవులు
బాబాకి చెప్పుకుంటే ఏ సమస్యా లేకుండా అనుగ్రహిస్తారు
పేరు వెల్లడించని ఒక సాయి భక్తురాలు బాబా తనకి ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు:
సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారం. నాకు బాబా అంటే చిన్నప్పటినుండి చాలా ఇష్టం. ఇంతకుముందు బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరొక అనుభవాన్ని పంచుకోవాలనుకుంటున్నాను.
మాకు ఒకటిన్నర సంవత్సరాల వయసున్న బాబు ఉన్నాడు. తన పేరు సాయి. చిన్నపిల్లలకు సాధారణంగా వేయించాల్సిన బేబీ వ్యాక్సిన్ వేయించడం కోసం ఒకరోజు తనను హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాము. బాబుని పరీక్షించిన డాక్టర్, “బాబు గుండెచప్పుడు క్రమబద్ధంగా ఉన్నట్టు లేదు, ఒకసారి బాబుని కార్డియాలజిస్ట్ దగ్గరకు తీసుకువెళ్ళండి” అన్నారు. ఆ మాట వినగానే నాకు చాలా భయమేసి బాబాకు నమస్కరించుకుని, “బాబా! బాబుకి గుండెకి సంబంధించిన సమస్యలేమీ లేకుండా, ఆరోగ్యంగా ఉండేలా అనుగ్రహించండి. బాబుని కార్డియాలజిస్ట్ వద్దకు తీసుకెళ్తున్నాము. మీ దయవల్ల బాబుకి ఎలాంటి గుండె సమస్యా లేదని ఆ డాక్టర్ నిర్ధారిస్తే నా అనుభవాన్ని సాయిమహారాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అని మ్రొక్కుకున్నాను. ఆ తరువాత బాబుని కార్డియాలజిస్ట్ దగ్గరకు తీసుకెళ్ళాము. డాక్టర్ బాబుని పరీశీలించి, “గుండెకు సంబంధించిన సమస్యేమీ లేదు, అంతా నార్మల్‌గానే ఉంది” అని చెప్పింది. ఆ మాట వింటూనే మాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇదంతా కేవలం బాబా ఆశీస్సుల వల్లనే జరిగింది. “థాంక్యూ సో మచ్ బాబా! మేము మీకు ఎల్లప్పుడూ ఋణపడివుంటాము బాబా!”
మా బాబుని చూసినవాళ్ళు, ‘బాబుకి రెండు కాళ్ళూ సమానంగా లేవు. రెండిటికీ పొడవులో ఒక సెంటీమీటర్ వ్యత్యాసం కనిపిస్తోంది’ అన్నారు. ఆ విషయమై బాబుని డాక్టర్ వద్దకు తీసుకుని వెళదామనుకున్నాము. కానీ ఇప్పుడు కరోనా ఎక్కువగా వ్యాపించివున్న సమయం కదా, అందుకే హాస్పిటల్‌కి వెళ్ళాలంటే భయమేసింది. అందువల్ల నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! బాబుకి ఎలాంటి సమస్యా లేకుండా ఉండేలా అనుగ్రహించండి. మీ దయతో అంతా మంచిగా జరిగితే నా అనుభవాన్ని సాయి మహారాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అని మ్రొక్కుకున్నాను. తరువాత కాళ్ళకు సంబంధించిన నిపుణుడైన డాక్టర్ (legs specialist) దగ్గరకు బాబుని తీసుకువెళ్ళాము. బాబుని పరీశీలించిన డాక్టర్, “అదేమీ సమస్య కాదు, అంతా బాగానే ఉంది” అన్నారు. అంతా బాబా అనుగ్రహం. “థాంక్యూ వెరీ మచ్ బాబా!”
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.
సాయి ఆశీస్సులతో మంజూరైన సెలవులు
సాయిభక్తురాలు శ్రీమతి అనూష తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:
ప్రియమైన సాయి స్నేహితులందరికీ హాయ్! బాబా ఆశీర్వాదం వలన నేను గర్భవతినయ్యాను. ప్రస్తుతం నేను 8 నెలల గర్భవతిని. నేను బ్యాంకు ఉద్యోగిని. కరోనా కారణంగా అక్టోబరు నెలలో గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక సెలవులు ప్రకటించారు. నేను నవంబరు నెలలో సెలవులకోసం దరఖాస్తు చేసుకుంటే, మా మేనేజరు నాతో, "నేను మీ దరఖాస్తును రీజనల్ ఆఫీసుకి పంపిస్తాను. అక్కడనుంచి అనుమతి వచ్చాక మీకు ప్రత్యేక సెలవులు మంజూరు చేస్తాను" అని చెప్పారు. తరువాత ఎంతగా ప్రయత్నించినా దాని గురించి ఏమీ తెలియలేదు. దాంతో నేను, "బాబా! నాకు సెలవులు మంజూరు అయ్యేటట్టు చూడండి. సెలవులు మంజూరైతే నా అనుభవాన్ని మీ సాయి మహారాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. బాబా ఆశీస్సులతో 2021, ఫిబ్రవరిలో నాకు సెలవులు మంజూరు అయ్యాయి. "థాంక్యూ సో మచ్ బాబా. మీ ఆశీస్సులతో, సాయి ఫ్రెండ్స్ బ్లెస్సింగ్స్‌తో నాకు నార్మల్ డెలివరీ అవ్వాలని కోరుకుంటున్నాను".
🙏🙏🙏Om srisairam Om srisairam Om srisairam thank you sister.
ReplyDeleteOm sai ram baba nenne namukunanu thandri pleaseeee baba amma problem tondarga cure cheyi thandri pleaseeee
ReplyDeleteఓంసాయి శ్రీసాయి జయజయసాయి
ReplyDelete