- బాబా సందేశం ఎప్పటికీ సత్యం - శ్రద్ధ, సబూరీలు అవసరం
- 'మీరు ఎక్కడ ఉన్నా నేను మీ వెంటే ఉంటాను!'
బాబా సందేశం ఎప్పటికీ సత్యం - శ్రద్ధ, సబూరీలు అవసరం
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మస్వరూప శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. ఇప్పుడు నేను చెప్పబోయే అనుభవంలో, బాబా మా తమ్ముడి వైవాహిక జీవితాన్ని ఎలా నిలబెట్టారో తెలియజేయాలనుకుంటున్నాను. మా అమ్మావాళ్ళకు ఆర్థికంగా సమస్యలేమీ లేవు. బాబా దయవల్ల వాళ్ళు బాగానే ఉన్నారు. మా తమ్ముడు ఎక్కువగా చదువుకోకపోవడం వల్ల తనకు సంబంధాలు చూడటం కష్టమయ్యింది. ఆస్తి ఉన్నా పెద్దగా చదువుకోకపోవడం వలన మా నాన్నగారి స్నేహితుడి బంధువుల అమ్మాయిని కట్నకానుకలేమీ తీసుకోకుండా మా తమ్ముడికిచ్చి పెళ్ళిచేశారు. మా అమ్మానాన్నలు ఆ అమ్మాయిని కూతురికంటే మిన్నగా చూసుకుంటారు. కానీ, పెళ్ళయినప్పటినుంచి మా తమ్ముడు, మరదలి మధ్య ఎప్పుడూ గొడవలే. ఆ అమ్మాయిది సర్దుకుపోయే మనస్తత్వం కాదు. మా తమ్ముడి పరిస్థితీ అదే. దాంతో ఇద్దరూ ప్రతిరోజూ గొడవపడేవారు. గొడవ తీవ్రమైనప్పుడల్లా ఆ అమ్మాయి తన పుట్టింటికి వెళ్ళి ‘ఇంక అత్తగారింటికి తిరిగి వెళ్ళను’ అని గొడవచేస్తుండటం, మా అమ్మావాళ్ళు తనకు సర్దిచెప్పి మా ఇంటికి తీసుకురావడం పరిపాటి అయింది. 2021, సంక్రాంతి పండుగ తరువాత వాళ్ళ ఊరిలో సంబరానికని వెళ్ళి ‘మళ్ళీ తిరిగి రాన’ని గొడవచేసింది మా మరదలు. వాళ్ళకు 9 నెలల వయసున్న బాబు ఉన్నాడు. బాబును వదిలి ఉండలేక మా అమ్మావాళ్ళు బాబు మీద బెంగతో మానసికంగా కృంగిపోయారు. వాళ్ళను చూసి నాకు చాలా బాధగా ఉండేది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి నాది. మా నాన్నగారు ఇంటికి రమ్మని ఎన్నిసార్లు నచ్చజెప్పినా మా మరదలి నుండి ‘నేను రాను’ అనే సమాధానమే వస్తూ ఉండేది. విషయం తెలిసిన మా బంధువులంతా, “ఆ అమ్మాయిని అక్కడే వదిలిపెట్టండి. మీరు ఫోన్ చేయకండి. అప్పుడే ఆ అమ్మాయికి తన తప్పు అర్థమవుతుంది” అన్నారు. కానీ మా అమ్మ ఆరోగ్యం సరిగా ఉండదు. బాబు మీద బెంగతో తను బాధపడుతుంటే చూడలేక నేను క్వశ్చన్&ఆన్సర్ వెబ్‌సైట్‌లో బాబాను అడిగితే, “దక్షిణ దిశగా ఉన్న స్నేహితుడి ద్వారా సమస్య పరిష్కారమవుతుంది” అని వచ్చింది. ఈ విషయం నేను మా నాన్నగారికి చెప్పి, తన స్నేహితుడే మధ్యవర్తిగా ఉండటం వల్ల ఆయన్ని తీసుకుని వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడమని చెప్పాను. కానీ ఆ అంకుల్ మాట కూడా మా మరదలు వినలేదు. బాబుకి 9వ నెలలో ద్వారకాతిరుమలలో పుట్టువెంట్రుకలు తీయించాలని 2021, మార్చి 11వ తారీఖున ద్వారకాతిరుమల వెళ్ళటానికి రిజర్వేషన్ చేయించుకున్నాము. పుట్టింటికి వెళ్ళి నెలరోజులు గడిచినా మా మరదలిలో మార్పురాలేదు. ద్వారకాతిరుమలకి వెళ్ళాల్సిన సమయం దగ్గరపడింది. బాబుకి 9వ నెల కూడా పూర్తికావస్తోంది. ఏమి చేయాలో తెలియని పరిస్థితి. దాంతో బాబాను మళ్ళీ క్వశ్చన్&ఆన్సర్ వెబ్‌సైట్‌లో అడిగితే, “పరీక్షలో ఉత్తీర్ణుడవుతాడు, పుణ్యస్థలాలను దర్శిస్తాడు” అని సమాధానం వచ్చింది. ఈసారి నాకు చాలా ధైర్యం వచ్చింది. అమ్మకి ఫోన్ చేసి, “నువ్వు కంగారుపడకు. బాబా మాట ఎప్పుడూ సత్యమే అవుతుంది” అని చెప్పాను. కానీ ద్వారకాతిరుమలకి వెళ్ళాల్సినరోజు దగ్గరకు వచ్చినా ఆ అమ్మాయిలో మార్పు రాలేదు. ఈసారి మళ్ళీ బాబాను అడిగితే, “బాబాకు సర్వస్యశరణాగతి చేయి, నీ సమస్య పరిష్కారమవుతుంది” అని సమాధానం వచ్చింది. నేను మా తమ్ముడికి ఫోన్ చేసి, “నువ్వు బాబాను నమ్మకంతో వేడుకోలేదు కదా?” అని అడిగాను. మా తమ్ముడు శివభక్తుడు. అందుకే, “అవును, నేను బాబాను నమ్మలేదు” అని అన్నాడు. అప్పుడు నేను తనతో, “సరే, ఈసారి నువ్వు బాబాను పూర్తిగా నమ్మి, బాబాను శరణు వేడుకుని, 2 రూపాయలు దక్షిణ సమర్పించి రా!” అని చెప్పాను. దాంతో మా తమ్ముడు ఈసారి ఎలాంటి అనుమానాలకు తావులేకుండా మనస్ఫూర్తిగా బాబాను శరణు వేడుకున్నాడు. నేను కూడా బాబాకు నమస్కరించుకుని, “బాబా! నాకు రేపు ఉదయంలోగా ఈ సమస్యకు పరిష్కారం చూపించు తండ్రీ!” అని వేడుకుని పడుకున్నాను. ఉదయం లేవగానే నాకొక ఆలోచన వచ్చింది. నా ఆలోచనను మావారితో చెప్తే ‘అలాచేస్తే బాగానే ఉంటుంది’ అన్నారు. నేను మా నాన్నగారికి ఫోన్ చేసి, “మీ అమ్మాయి రాను అంటోంది కదా, అందువల్ల మా మనవడిని మేము ద్వారకాతిరుమల తీసుకెళ్ళి మ్రొక్కు తీర్చుకుంటాము. మరి మాకు వెంకన్నబాబు మ్రొక్కు తీర్చుకోవడం చాలా ముఖ్యం కదా” అని మా మరదలి తల్లిదండ్రులతో చెప్పమన్నాను. దాంతో మా నాన్నగారు వాళ్ళకు ఫోన్ చేసి నేను చెప్పినట్టే చెప్పి, “మీ అమ్మాయిని అన్ని విషయాలూ మర్చిపోమని చెప్పండి. మేము కూడా జరిగిన గొడవలు మర్చిపోతాము. మీ అమ్మాయి వస్తే మీ అమ్మాయిని కూడా తీసుకువెళతాం. మీరంతా మాట్లాడుకుని నిర్ణయించుకోండి. మేమే మళ్ళీ ఫోన్ చేస్తాము, మీ నిర్ణయమేమిటో చెప్పండి” అన్నారు. బాబా ఏ అద్భుతం చేశారో తెలియదుగానీ కాసేపటి తరువాత వాళ్ళే ఫోన్ చేసి, “మా అమ్మాయి మీతో వస్తానంటోంది, మేము పంపిస్తాము” అని చెప్పారు. వెంటనే మా నాన్నగారు నాతో, “అమ్మా, నువ్వు చెప్పింది నిజమే. బాబా మాట ఎప్పుడూ అసత్యం కాదు. ఆ అమ్మాయి మాతో రావటానికి అంగీకరించింది. ఇదంతా బాబా అనుగ్రహమే. ఇకనుండి నేను కూడా ప్రతి గురువారం బాబా మందిరానికి వెళతాను. అలాగే, గురువారంరోజున మాంసాహారం తినడం కూడా మానేస్తాను” అని చెప్పారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మా అమ్మావాళ్ళందరూ శివభక్తులే. వాళ్ళు నేను చెబితేనే బాబా దగ్గరకు వెళతారు. కానీ ఇప్పుడు బాబా మా తమ్ముడికి, నాన్నగారికి కూడా తన మహత్యాన్ని చూపించి తన దగ్గరకు చేర్చుకున్నారు. నేను ఆ రెండు నెలల కాలమంతా శ్రద్ధ, సబూరి అనే రెండు బాబా ఆదేశాలను పాటిస్తూ, సమస్యను తీర్చమని బాబానే మనసారా వేడుకున్నాను. బాబా మా తమ్ముడి సమస్యను తీర్చడమే కాకుండా వాళ్ళను కూడా తన భక్తులుగా చేసుకున్నారు. బాబా మనకు ఇచ్చిన సందేశం ఎప్పటికీ సత్యమే అవుతుంది. కానీ మనం శ్రద్ధ, సబూరీలతో వేచిచూడాలి.
Om sai baba today sai baba éxperiences are very good.i dont know about sai baba serial. I watch it today. Any big problem baba can slove it.he is our father and mother he takes care of us. That is sai's power. Om sai Sankara����❤❤����������
ReplyDeleteOm sairam 🙏🙏🙏
ReplyDeleteఅఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మస్వరూప శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
685 days
ReplyDeletesairam
ఓం సాయిరాం!
ReplyDeleteఓం సాయిరాం🙏🌺🙏
ReplyDeleteOm sai ram baba amma ki problem tondarga cure cheyi thandri sainatha please
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATHAYA NAMAH..Om sai ram
ReplyDelete