సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 704వ భాగం....



ఈ భాగంలో అనుభవాలు:

  1. బాబా కృపతో పనిచేసిన మొబైల్ & కంప్యూటర్
  2. శ్రీసాయి దయ కాకపోతే మరేమిటి?

బాబా కృపతో పనిచేసిన మొబైల్ & కంప్యూటర్


సాయిభక్తుడు రవి తన అనుభవాలను ఇలా పంచుకుంటున్నారు:


ముందుగా ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారములు. నా పేరు రవి. బాబా నాకు ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. వాటిలో నుండి ఈమధ్య జరిగిన రెండు అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. 


ఒకరోజు అకస్మాత్తుగా నా మొబైల్ పనిచేయడం మానేసింది. ఆర్థికపరంగా ఎన్నో సమస్యలున్న సమయంలో మొబైల్ కోసం డబ్బులు ఖర్చు పెట్టడం అంటే నాకు చాలా ఇబ్బంది అవుతుంది. అందువల్ల, "బాబా! నేను ఇప్పుడు అంత డబ్బులు పెట్టలేను. దయచేసి నా ఫోన్ పనిచేసేలా చేయండి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవలన తక్కువ డబ్బులతో నా మొబైల్ బాగైంది


రెండవ అనుభవం:


ఒకరోజు నా కంప్యూటర్ ఉన్నట్టుండి ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీనిని బాగుచేయించాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుందని ఆలోచిస్తూ ఈ బ్లాగ్ ఓపెన్ చేసి ఒక భక్తుని అనుభవం చదివాను. ఆ భక్తుడు తన ల్యాప్‌టాప్ బాబా మహిమతో బాగైందని ఆ అనుభవంలో పేర్కొన్నారు. దాంతో మరుసటిరోజు నేను కూడా బాబాను తలచుకొని కంప్యూటర్ ఆన్ చేశాను. ఆశ్చర్యం! అంతకుముందు ఎంత ప్రయత్నం చేసినా ఆన్ కాని కంప్యూటర్ బాబాను తలచుకోగానే ఆన్ అయింది. "థాంక్యూ బాబా! నాకున్న ఆరోగ్య సమస్యలను, ఆర్థిక సమస్యలను తగ్గేలా చేయండి బాబా". మరొక అనుభవంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.


శ్రీసాయి దయ కాకపోతే మరేమిటి?

యు.ఎస్.ఏ నుండి ఒక అజ్ఞాత సాయి భక్తుడు ఇలా వ్రాస్తున్నారు:

నేను సాయిబాబా భక్తుడిని. బాబా కృప గురించి మా నాన్నగారు వ్రాసిన తన అనుభవాన్ని మీముందు ఉంచుతున్నాను. అతని మాటల్లోనే చదివి ఆనందించండి.

అది 2004వ సంవత్సరం. మా అల్లుడు వేరే స్టేట్ లో ఉద్యోగం చేస్తున్నందువల్ల మా అమ్మాయికి, మనవరాలికి అండగా నేను, నా భార్య వాళ్లతో కలిసి సికింద్రాబాద్‌లో నివసిస్తూండేవాళ్ళం.  డిసెంబర్ 23, గురువారంనాటి మధ్యాహ్నం 3:00 గంటల సమయంలో నేను నిద్రిస్తుండగా జీవితంలో ఎప్పుడూ అనుభవించనటువంటి వింతైన అనుభూతిని అనుభవించాను. నాకు తెలియకుండానే నా శరీరం ఉన్నంట్టుండి వింత వింత భంగిమలలో కదలసాగింది. పక్కనే ఉన్న నా భార్య, “మీరు ఎందుకు ఇలా నిద్రపోతున్నారు? తిన్నగా నిద్రపోలేరా?" అని అడిగింది. నా నుండి ఎటువంటి స్పందన లేకపోయేసరికి నేను అపస్మారక స్థితిలో ఉన్నానని, ఇంద్రియాలపై స్పృహ లేనట్టుందని గుర్తించింది. అయితే, ఆ స్థితిలో కూడా నేను, "భయపడవద్దు, నా ప్రియమైన సాయిబాబా ఎప్పుడూ అండగా ఉన్నారు" అని పదేపదే గొణుగుతూ ఉన్నాను.

నా భార్య భయపడి వెంటనే ప్రక్క గదిలో చదువుతున్న నా మనవరాలిని పిలిచింది. తను పనిలో ఉన్న తన తల్లిని పిలుచుకొచ్చింది. నా పరిస్థితి గమనించిన మా అమ్మాయి ఏమి చేయాలో తెలియక కాళ్లుచేతులు ఆడక స్తబ్దంగా నిలబడిపోయింది. డాక్టర్ని సంప్రదిద్దామంటే సమయానికి తనకి ఏ డాక్టర్ గుర్తు రాలేదు. అసలు తనకి సమీపంలో ఉన్న మంచి ఆసుపత్రి గురించి కూడా తెలియదు. అదృష్టం కొద్దీ పక్క ఇంటిలో ఉన్న ఒకామె డాక్టర్. ఆమె, "వెంటనే నన్ను కిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లమ"ని సూచించింది. ఆ సమయమంతా నేను, "సాయినాథ్ నన్ను రక్షిస్తారు" అని గొణుగుతూ ఉన్నాను. రెండు ఆటో రిక్షాలను తీసుకొచ్చారు. సెక్యూరిటీ గార్డు, వడ్రంగి పని చేస్తున్న ఒక వ్యక్తి నన్ను ఎత్తుకొని తీసుకొని వెళ్లి ఆటోలో కూర్చోబెట్టారు.

మేము కిమ్స్ హాస్పిటల్ కాంపౌండ్ కి చేరుకున్నాము. ప్రధాన భవనం నుండి కొంచెం దూరంలో ఉన్న పార్కింగ్ స్థలంలో మా ఆటోలు ఆగాయి. అకస్మాత్తుగా, నలుగురు వ్యక్తులు స్ట్రెచర్‌తో వచ్చి నన్ను నేరుగా ఐసియు వార్డుకు తీసుకెళ్లారు. ఆటో వాళ్ళకి డబ్బులు ఇవ్వడంలో బిజీగా ఉన్న నా భార్య, మా అమ్మాయి, మనవరాలు తరువాత నాకోసం చూసి నేను కనపడకపోవడంతో అంతటా వెతకడం మొదలుపెట్టారు. చివరకి నన్ను ఐసియుకి తీసుకెళ్లారని వాళ్ళకి తెలిసి అక్కడికి చేరుకున్నారు.

శ్రీసాయినాథుని చేతలు మన ఉహకు అందనివి. కేవలం కిలోమీటరు దూరంలో ఉన్న కిమ్స్ హాస్పిటల్ గురించి మా అమ్మాయి అంతకు ముందెన్నడూ వినలేదు. అలాంటి తనని తన స్నేహితురాలి ద్వారా ఆ హాస్పిటల్ కి తీసుకెళ్లమని బాబా మార్గనిర్దేశం చేశారు. ఇక అసలు అద్భుతం ఏమిటంటే, ఎవరూ ఫోన్ చేయకుండానే నా రాక గురించి హాస్పిటల్ సిబ్బందికి ఎలా తెలిసింది? సాధారణంగా అయితే, రిసెప్షన్ కౌంటర్ లో ముందుగా సంప్రదించాల్సి ఉంటుంది. వాళ్ళు డాక్టరుకి సమాచారం అందిస్తారు. కానీ అవేమీ లేకుండా నన్ను నేరుగా ఐ.సి.యు కి ఎలా తరలించారు?

ఐ.సి.యులో ఉన్న నన్ను చూడటానికి మావాళ్లు వచ్చేసరికి నేను తిరిగి స్పృహలోకి వచ్చాను. అప్పటికే చికిత్స ప్రారంభించిన డాక్టర్ నా భార్యతో, "ఆలస్యం చేస్తే కోమాలోకి వెళ్ళే అవకాశం ఉన్నందున, మేము వెంటనే రోగిని ఐసియుకు తరలించామ"ని చెప్పారు. ఆ రాత్రి నేను ఐ.సి.యులో ఉన్నాను. మరుసటిరోజు ఉదయం నన్ను ప్రత్యేక వార్డుకు తరలించారు. తేదీ. 25.12.2004న ఉదయం 11:42 గంటలకు నేను డిశ్చార్జ్ అయ్యాను. ఇంటికి వచ్చాక టీవీలో సునామీ వినాశనాన్ని చూశాను. నాకు జరిగిన ఈ అనుభవం కూడా ఒక మినీ సునామి వంటింది. తరువాత ఇన్ని సంవత్సరాల్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురు కాలేదు. నా జీవితం సజావుగా సాగిపోతుంది. ప్రియమైన సాయి బంధువులారా, ఇదంతా శ్రీసాయి దయ కాకపోతే మరేమిటి?



9 comments:

  1. Om sai baba 2nd sai leela is very nice. Sai saves everyone. He likes his devotees very much. That is sai power. Please bless my family. Be with us

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. Kothakonda SrinivasMarch 5, 2021 at 12:41 PM

    జై సాయిరాం! జై గురుదత్త!

    ReplyDelete
  4. Sai saves his devotees. No worry in any diseases. He is doctor he can cure anything, that is power of sai. Om sai ram������

    ReplyDelete
  5. Baba na manasulo korika todaraga neraverchu sai inthaga nannu enduku parikshstunnaru baba

    ReplyDelete
  6. Baba ma amma ki sampurna arogyani prasadinchu thandri

    ReplyDelete
  7. 🙏🙏🙏Om srisairam Om srisairam Om srisairam thank you sister.

    ReplyDelete
  8. 🌺🌼🌺Om Sri Sairam 🌺🌼🌺🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo