సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 715వ భాగం....



ఈ భాగంలో అనుభవాలు:
  1. కృపకు నిలయం శ్రీసాయి
  2. బాబా అనుగ్రహం

కృపకు నిలయం శ్రీసాయి


పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు  తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో ఇలా పంచుకుంటున్నారు:


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై! 


సాయిభక్తులందరికీ నమస్కారం. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న వారందరికీ నా ధన్యవాదాలు. ఇదివరకు మా అద్దె ఇంటి గురించిన అనుభవాన్ని మీ అందరితో పంచుకున్నాను. బాబా దయవల్ల ప్రస్తుతం మేము మా సొంతింటికి వచ్చేశాము. ఇప్పుడు, 2020 మే నెలలో కరోనా విజృంభించి ఉన్న సమయంలో సాయి తమ కృపను మాపై ఎలా చూపారో మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఆ సమయంలో మా అమ్మ జ్వరంతోనూ, జలుబుతోనూ చాలారోజులు బాధపడ్డారు. తన వయస్సు 65 సంవత్సరాలు. తనకు కరోనా సోకిందేమోనని మేము చాలా కంగారుపడ్డాము. దాంతో నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! అమ్మకు వచ్చింది కరోనా కాకూడదు. అది సాధారణ జ్వరం, జలుబే అయ్యేలా చూడండి. తన జలుబు, జ్వరం త్వరగా తగ్గేలా అనుగ్రహించండి. అమ్మకు జలుబు, జ్వరం తగ్గిన వెంటనే నా అనుభవాన్ని సాయి మహారాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అని మ్రొక్కుకున్నాను. తరువాత బాబా ఊదీని అమ్మ నుదుటన పెట్టి, కొద్దిగా ఊదీని తన నోటిలో వేశాను. బాబా దయవల్ల మరుసటిరోజు సాయంత్రానికి అమ్మ జ్వరం తగ్గి శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చేసింది. ఎంతో సంతోషంగా బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల బ్లాగులో పంచుకోవటం ఆలస్యం చేశాను. “బాబా! నన్ను క్షమించి మమ్మల్ని ఎప్పుడూ కంటికి రెప్పలా కాపాడండి. సాయిభక్తులందరిపై మీ కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను”.


రెండవ అనుభవం: 


కరోనా సమయంలోనే ఒకరోజు ఉన్నట్టుండి మావారికి కాళ్లు, చేతులు వంకర్లు తిరిగిపోయాయి. అంతేకాదు, మమ్మల్ని గుర్తించలేకపోయారు కూడా. దాంతో మేమంతా చాలా కంగారుపడ్డాము. హాస్పిటల్‌కి తీసుకెళదామంటే కరోనా వల్ల ఎక్కడా హాస్పిటల్స్ ఓపెన్ చేసి లేవు. పైగా మేముండేది చిన్న టౌనులో. మావారికి ఇలా జరిగిందని తెలిసినవారు వెంటనే తనను సిటీకి తీసుకుని వెళ్ళమని చెప్పారు. దాంతో వెంటనే మావారిని తీసుకుని దగ్గరలో ఉన్న సిటీలోని ఒక పెద్ద హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళాము. అక్కడ తనకు ముందుగా కరోనా టెస్ట్ చేసి వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నారు. బాబా దయవల్ల డాక్టర్లు వెంటనే మావారికి వైద్యం చేయడం ప్రారంభించారు. నేను బాబాను స్మరించుకుంటూ, “అంతా సవ్యంగా ఉండేటట్లు చేయండి బాబా. మీ అనుగ్రహంతో మావారు ఆరోగ్యంగా ఉంటే నా అనుభవాన్ని సాయి మహారాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అని మ్రొక్కుకున్నాను. బాబా అనుగ్రహంతో కొద్దిసేపటికి మావారు మామూలు స్థితికి వచ్చేశారు. ఎంతో ఆనందంతో బాబాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. “కొన్ని కారణాల వల్ల చాలా ఆలస్యంగా ఈ అనుభవాన్ని కూడా పంచుకుంటున్నందుకు నన్ను క్షమించండి బాబా. మీ కృపాకటాక్షాలు మాపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మీ బిడ్డలమైన మమ్మల్నందరినీ కంటికి రెప్పలా కాపాడతారని ఆశిస్తున్నాను”.


మూడవ అనుభవం:


క్రొత్తింటిలోకి వెళ్లేముందు ఒకరోజు ఎలక్ట్రీషియన్‌ను పిలిపించి లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు అమర్చే ఏర్పాటు చేస్తున్నాము. క్రొత్త ఇల్లు కావడం వల్ల వైరింగులో ఏమైనా తేడా ఉందేమో తెలియదుగానీ, ఏసీ ఆన్ చేయగానే రన్ అవుతూ అవుతూ ఉన్నట్టుండి ఆగిపోయింది. దాంతో ఎలక్ట్రీషియన్, “హై వోల్టేజ్ వచ్చింది, దానివల్ల ఏసీలు కాలిపోయివుంటాయి” అని చెప్పారు. ఆ మాట వినగానే ఒక్కసారి గుండె ఆగినంత పనైంది. ఏసీలన్నీ పాడైపోతే ఎంత ఖర్చు! వెంటనే నేను బాబాను స్మరించుకుని, “సాయీ! నీవే రక్షించు. మళ్లీ ఏసీలు కొనాలంటే ఎంత ఖర్చవుతుందో మీకు తెలుసు. ప్రస్తుతం మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. నీదే భారం తండ్రీ!” అని ప్రార్థించి, సాయినామాన్ని జపిస్తూ ఉన్నాను. కాసేపటి తరువాత ఎలక్ట్రీషియన్ మళ్ళీ ఏసీలను ఆన్ చేశారు. వైరింగ్ అంతా పరీక్షించి, ‘ఏమీ కాలేద’ని చెప్పి, “మామూలుగా అయితే అంత హై వోల్టేజీ వల్ల ఏసీలు కాలిపోతాయి. కానీ ఇక్కడ ఏసీలకు ఏమీ కాకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది” అన్నారు. ఆ మాట వినగానే మేము చాలా సంతోషించాము. అంతటి కృప మన సాయిది. ఆయన కరుణాకటాక్షాలు మాపై ఎల్లప్పుడూ ఉండాలని క్రొత్తింటిలోకి వచ్చిన తర్వాత బాబా భజన ఏర్పటు చేసుకున్నాము. అంతా కలిసి బాబా భజన చాలా బాగా చేశారు. మాకు చాలా సంతోషంగా అనిపించింది. మాకు చాలా సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా బాబా పరిష్కరించి మమ్మల్ని రక్షిస్తారని ఆశిస్తున్నాను. మనందరినీ ఎప్పటికీ కంటికి రెప్పలా కాపాడమని బాబాను మనసారా కోరుకుంటున్నాను.


బాబా అనుగ్రహం


పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:


శ్రీసాయినాథ చరణం శరణం. 


బాబా పాదపద్మములకు శతకోటి వందనాలు. నేను బాబా బిడ్డను. చాలా విషయాలలో బాబా నాకు రక్షణనిచ్చారు. నాకు ఒక్కతే కూతురు. తను గర్భవతిగా ఉన్నప్పుడు నేను, "నాకు మనవడిని ప్రసాదించమ"ని బాబాను వేడుకున్నాను. ప్రేమతో బాబా నా కోరిక తీర్చారు.


ఇకపోతే, బాబా ఊదీ మహిమ అనంతం, వర్ణించనలవికానిది. ఒకసారి నా చేతికి దద్దుర్లు వచ్చాయి. బాబాను మనస్ఫూర్తిగా ప్రార్థించి దద్దుర్లు ఉన్న ప్రదేశంలో ఊదీ రాశాను. అలా మూడు రోజులు చేసేసరికి దద్దుర్లు పూర్తిగా తగ్గిపోయాయి. అంతేకాదు, బాబా ఊదీ వలన నాకు ఎన్నో బాధల నుండి విముక్తి లభించింది. ఎటువంటి సమస్య అయినా బాబా ఊదీతో మనకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. "మీరు మాపై చూపిస్తున్న అనుగ్రహానికి శతకోటి పాదాభివందనాలు బాబా".


సాయినాథ్ మహరాజ్ కీ జై!



10 comments:

  1. Om Sai ram 🙏🏽🙏🏽❤️🌹

    ReplyDelete
  2. Om Sai ram please bless all.2nd Sai Leela is very good.I am also suffering with eching I suffered very much.my son is doctor he cured me.But really I suffer.I take tablet.please baba cure.🌹❤️🙏🏽🙏🏽🙏🏽

    ReplyDelete
  3. అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  4. శ్రీసాయినాథ చరణం శరణం

    ReplyDelete
  5. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  6. Om sairam sai pls give me good health. Pls sai

    ReplyDelete
  7. 🙏🌺🙏ఓం సాయిరాం🙏🌺🙏

    ReplyDelete
  8. OM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH..Om Sai Ram

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo