సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 703వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. 'నేనున్నాను - నీడలా వెంట ఉండి కాపాడుతున్నాను' అని నిదర్శనమిస్తున్న బాబా
  2. క్షేమంగా యు.ఎస్.ఏ చేర్చిన బాబా

'నేనున్నాను - నీడలా వెంట ఉండి కాపాడుతున్నాను' అని నిదర్శనమిస్తున్న బాబా

సాయి మహారాజ్ సన్నిధి బ్లాగును నిర్వహిస్తున్న సాయి సత్సంగ మిత్రులకు, సాయిబంధువులకు నా నమస్కారం. ఒకసారి నేనొక పని అనుకుని ‘బాబా అన్నదానానికి 500 రూపాయలు ఇస్తాను’ అనుకోగానే పోయిన డబ్బులు దొరికాయి. అయితే కొన్ని బాధ్యతల వల్ల నేను శిరిడీకి మనియార్డర్ చేయలేకపోయాను. మావారు శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర చదివి కురుమగడ్డలో అన్నదానానికి కొంత డబ్బిచ్చారు. దాంతో మనసుకి కొంత సాంత్వన చేకూరినా నా మ్రొక్కు అలాగే ఉండిపోయిందనే దిగులు నన్ను వెంటాడుతుంది. నా కథా సంకలనానికి కూడా కొంత డబ్బు ఎలాంటి గొడవలు లేకుండా బాబా దయవలన సమకూరింది. నేను అనుకున్న ప్రకారం కొంత దక్షిణగా వేశాను కానీ శిరిడీకి పంపటం మాత్రం కుదరటం లేదు. ఎన్నిసార్లు సప్తాహపారాయణ, మ్రొక్కులు అనుకున్నా ఇంట్లో పనులు వల్ల, అంటే అత్తమామల కార్యక్రమాలు, నెలసరి సమస్యల వల్ల కుదరటం లేదు. ఇంట్లో ఏదో అలజడి. ఇన్నింటి మధ్య కూడా 'నేనున్నాను' అని బాబా నిదర్శనమిస్తున్నారు, 'నీడలా వెంట ఉండి కాపాడుతున్నామ'నే నమ్మకం ఇస్తున్నారు. ఎలా అంటే 2021, జనవరి 31, ఆదివారంనాడు మా మామగారి ఆబ్దికం ఇంట్లోనే పెట్టుకున్నాము. సాధారణంగా నేను ఇంట్లో ఏ ఫంక్షన్ చేసుకున్నా, అది పుట్టినరోజుకి సంబంధించిన చిన్న వేడుకైనాసరే బాబాకు నమస్కారం చేసుకుని, వారిని రమ్మని ఆహ్వానిస్తాను. అలా ఆహ్వానించిన ప్రతిసారీ బాబా పటం రూపంలోనో లేదా దేవుడి ప్రసాదం రూపంలోనో లేదా అనుకోని అతిథి రూపంలోనో వచ్చి బాబా ఆశీర్వదిస్తుంటారు. అలాగే మా మామగారి ఆబ్దికానికి కూడా బాబా రావాలని అనుకున్నాను. అనుకున్నదే తడవుగా సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకి బాబా దక్షిణ రథం వచ్చింది. అయితే పితృకార్యాలు జరిగే రోజున భిక్ష ఇవ్వొద్దని మా బంధువుల్లో ఒక పెద్దావిడ అభ్యంతరం చెప్పడంతో నేను భిక్ష ఇవ్వలేకపోయాను. అందుకు ఎంతో బాధపడుతుండగా బ్రాహ్మణుని భోజనం అయిన వెంటనే ఆబ్దికానికి రారనుకున్న మా బావగారి అమ్మాయి, అల్లుడు భోజనానికి వచ్చారు. అలా నా బాధ తీర్చారు బాబా. నిజంగా ఆరోజు నేను చాలా ఆనందం పొందాను. 

ప్రతి అమ్మాయికి సంసారంలో ఒడిదుడుకులుంటాయి. నా పెళ్ళైన నాలుగు నెలలకే మా నాన్నగారు చనిపోయారు. తెలిసీతెలియనితనంతో నా మూర్ఖత్వం వల్ల చాలా సమస్యలు నేనే తెచ్చుకున్నాను. పనుల్లో, వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎంత మామూలు అనుకున్నా నేను ఒక అడుగు ముందుకు వేస్తే, పది అడుగులు వెనక్కి అవుతోంది. ఎంత మంచి వ్యక్తిలో అయినా లోపాలుంటాయి. సాధారణంగా మంచి వ్యక్తే అయిన నా భర్త కొందరి చెప్పుడు మాటల వల్ల చాలాసార్లు నాపై చెయ్యిచేసుకుంటుంటారు, మళ్లీ కొంతసేపటికి బాధపడుతుంటారు. ఒకరోజు కూడా అదే పరిస్థితి అయింది. అప్పుడు నేను, " 'భక్తుల బాధలు నేను భరిస్తాను' అన్నారు కదా బాబా, నేను తిన్న దెబ్బలని చూస్తూ భరిస్తున్నారా? లేక నవ్వుతున్నారా?" అని బాబాను తిట్టుకున్నాను. తరువాత ఉదయం పదిగంటలకి మా పెద్దమ్మాయి పూజగదిలో అగరువత్తులు వెలిగించి పెట్టింది. నేను కోపంగా అటు చూస్తే ద్వారకామాయిలో కూర్చున్నట్టు ఉండే ఆ బాబా విగ్రహం ముఖంలో బాధ కనిపించింది. నేను బాధపడుతుంటే ఆయనా బాధపడుతున్నారు అని తెలుస్తుంది. బాబా నా కర్మ తీసేస్తున్నారు, త్వరలో నాకు మంచి రోజులు వస్తాయి అని నమ్మకంతో ఉన్నాను. బాబా దయవల్ల నా జీవితం ఒక దారికి వస్తే, తప్పకుండా ఆ అనుభవాన్ని మీతో పంచుకుంటాను.

క్షేమంగా యు.ఎస్.ఏ చేర్చిన బాబా


సాయిభక్తురాలు శ్రీమతి అనూష తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:


2020, అక్టోబరులో నా వివాహమైంది. నా భర్త యు.ఎస్.ఏ.లో ఉంటున్నారు. ముందుగా తెలియజేయడమే కాకుండా సంక్రాంతి రోజున బాబా నాకు వీసా ఎలా అనుగ్రహించారో ఇదివరకటి అనుభవంలో నేను మీతో పంచుకున్నాను. బాబా దయతో నేను ఇటీవల క్షేమంగా యు.ఎస్.ఏ చేరుకున్న అనుభవాన్ని ఇప్పుడు పంచుకుంటాను. 


2021, ఫిబ్రవరి మొదటివారంలో నేను బాబా ఆశీస్సులతోపాటు నా అత్తమామల, అమ్మానాన్నల ఆశీర్వాదాలు తీసుకుని యు.ఎస్.ఏ.కి బయలుదేరాను. ఉద్యోగరీత్యా నా భర్త ముందే యు.ఎస్.ఏ.లో ఉంటున్నందున ఎవరి తోడూ లేకుండా ఒంటరిగా నేను దేశం దాటి ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఎవరూ లేకపోతే ఏమిటి, నా బాబా నాకు తోడుగా ఉన్నారు. అందుకే, ఏ ఇబ్బందీ కలగకుండా నేను నా భర్త దగ్గరకు చేరుకుంటే నా అనుభవాన్ని సాయి మహారాజ్ సన్నిధిలో పంచుకుంటానని బాబాకు చెప్పుకున్నాను.


ముందుగా విమానాశ్రయంలో ఒకవైపు నా విమానానికి సమయం అయిపోతుంటే మరోవైపు నా లగేజీ తనిఖీ చేయడం ఇంకా పెండింగులో ఉంది. తనిఖీ చేసే అధికారి 'ఉండాల్సిన దానికంటే లగేజీ ఎక్కువ ఉంద'ని నన్ను కాస్త ఇబ్బందిపెట్టారు. నేను వెంటనే మన బాబాను తలచుకున్నాను. తక్షణమే బాబా నాకు అండగా నిలిచి సమస్యను పరిష్కరించి నన్ను విమానం ఎక్కించారు. తరువాత కూడా అడుగడుగునా నాకు తోడుండి అన్ని ఆటంకాలనూ తొలగిస్తూ, నా ఆరోగ్యం పాడవకుండా చూసుకుంటూ, మూడు విమానాలలో సురక్షితంగా ప్రయాణం సాగింపజేసి జాగ్రత్తగా నన్ను నా భర్త దగ్గరకు చేర్చారు. "బాబా! మీ అనుగ్రహాన్ని ఎలా చెప్పాలో తెలియక మనసుకు తోచినట్లు చెప్పేశాను. నన్ను క్షమించు బాబా. నన్ను, నా భర్తను, ఇంకా ప్రతి ఒక్కరినీ ఆశీర్వదించండి".



7 comments:

  1. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  2. Kothakonda SrinivasMarch 4, 2021 at 3:41 PM

    జై సాయిరాం! జై గురుదత్త!

    ReplyDelete
  3. Om sai ram in 2nd experience her husband is hitting her this is very sad. She is suffering very much. Sai please change her husband. My husband is very good person. I am lucky. He loves me very much. Om sai baba������

    ReplyDelete
  4. Baba amma arogyam bagundela chudu sai thandri

    ReplyDelete
  5. OM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH.
    Om Sai Ram

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo