ఈ భాగంలో అనుభవం:
- తలుచుకున్న ప్రతిసారీ తామున్నామని వెంటనే సహాయం అందించే బాబా
నేను ఒక బాబా భక్తురాలిని. కొన్నిరోజులుగా నేను హెవీ బ్లీడింగ్ సమస్యతో బాధపడుతూ చెక్ చేయించుకోవడానికి డాక్టర్ దగ్గరకి వెళ్ళాను. డాక్టర్ ఏవేవో టెస్టులు చేసి, "గర్భాశయంలో ఫైబ్రాయిడ్(కణితి) ఉంది. అది కూడా క్రిటికల్ పొజిషన్లో ఉంది. అర్జెంటుగా దాన్ని తొలగించాలి. లేకపోతే ఇలాగే బ్లీడింగ్ అవుతుంది" అని అన్నారు. ఇంకా, "లాప్రోస్కోపీ సాధ్యం అవ్వదు, చాలావరకు ఓపెన్ సర్జరీ చేయాల"ని ఏదేదో చెప్పి భయపెట్టారు. నాకు ఏం అర్దం కాలేదు, చాలా భయమేసింది. మా ఇంట్లో ఈ సమస్య గురించి ఎలా చెప్పాలో తెలియలేదు. ఎందుకంటే, ఇంకా పెళ్లికాని నాకు గర్భాశయ సర్జరీ అంటే ఇంట్లోవాళ్ళు ఎంత బాధపడతారో, ఎలా ఫీల్ అవుతారోనన్న భయం. బాబా మీద భారమేసి సెకండ్ ఒపీనియన్ కోసం, అలాగే లాప్రోస్కోపీ సాధ్యమవుతుందేమో కనుక్కుందామని చాలామంది ఇతర డాక్టర్ల దగ్గరకి వెళ్ళాను. అయితే ఎంతమంది డాక్టర్లను సంప్రదించినా అందరూ భయపెట్టేవాళ్లే కానీ, ఎవరి దగ్గర సర్జరీ చేయించుకోవాలన్న నమ్మకం నాకు రాలేదు. ఇక అప్పుడు, "ఇంట్లోవాళ్ళకి చెప్తాను బాబా. వాళ్ళు బాధపడకుండా ధైర్యంగా ఉండేలా చేయమ"ని బాబాని ప్రార్థించి విషయం ఇంట్లో చెప్పాను. వాళ్ళు మొదట భయపడినా తర్వాత బాబా దయవల్ల ధైర్యం తెచ్చుకొని 'ఏం కాదు, అంతా మంచే జరుగుతుందని' అనుకున్నారు. నేను బాబాని తలుచుకుంటూ డాక్టర్ల చుట్టూ తిరుగుతూ తిరిగి తిరిగి చివరికి ఒక డాక్టర్ లాప్రోస్కోపీ సాధ్యమవుతుందనడంతో ఆయన దగ్గర సర్జరీ చేయించుకోవడానికి నిశ్చయించుకున్నాను. కానీ ఆ డాక్టర్ కూడా నాకు 100% నచ్చలేదు. ఎందుకంటే, ఆయన లాప్రోస్కోపిక్ సర్జనేగానీ గైనిక్కి సంబంధించినవారు కాదు. అదీకాక ఏదైనా అడిగితే, ఆయన చాలా కఠినంగా మాట్లాడేవారు. అయినప్పటికీ ఆయనకున్న అనుభవం దృష్ట్యా ఆయన దగ్గరే సర్జరీ చేయించుకోవాలని నిశ్చయించుకొని, "బాబా! అంతా మంచిగా అయ్యేలా చూడండి" అని బాబాకి ప్రార్థన చేస్తూ ఉండగా చివరి నిముషంలో మా తమ్ముడు, "ఇంకో డాక్టర్ దగ్గరికి వెళదాం, ఆవిడకి చాలా అనుభవం వుంది, పైగా గైనకాలజిస్ట్ కూడా" అని చెప్పాడు. నేను కూడా ఆవిడ మంచి డాక్టర్ అని విన్నాను. అయినప్పటికీ ఈ డాక్టర్ కూడా అందరిలానే ఉంటారు, ఊరికే వెళ్ళొద్దామనుకొని వెళ్లాను. కానీ ఆ హాస్పిటల్‌కి వెళ్ళగానే ఎందుకో అంత పాజిటివ్‌గా అనిపించింది. డాక్టర్, "ఓపెన్ సర్జరీ చేసే అవకాశం లేదు. మేము ఖచ్చితంగా లాప్రోస్కోపీ చేస్తామ"ని గ్యారంటీ ఇచ్చారు. అంతేకాక ఆవిడ ఇలాంటి క్రిటికల్ సర్జరీలు చేయటంలో ఎక్స్పర్ట్ అని తెలిసింది. ఆ మాటలు విన్నాక నాకు చాలా ధైర్యంగా, సంతోషంగా అనిపించింది. బాబా ఏం చేసినా, ఎలా చేసినా చివరికి మంచి దారి చూపిస్తారని అనుకున్నాను. తమను నమ్ముకున్న వాళ్ళని తామెప్పుడూ పతనం కానివ్వమన్న ఆయన మాట కూడా గుర్తుకు వచ్చింది. మొత్తానికి చివరి నిముషంలో మంచి డాక్టర్ని చూపించి పెద్ద మిరకిల్ చేసారు బాబా.
ఇకపోతే, సర్జరీకి చాలా ఖర్చు అవుతుందని చెప్పారు డాక్టర్. నాకు ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ హాస్పిటల్‌వాళ్ళు "డబ్బులు కట్టకుండా సర్జరీ చేయలేము. కాబట్టి మీరు బిల్ కట్టేసి తర్వాత క్లెయిమ్ చేసుకోండి" అన్నారు. దాని గురించి మా ఆఫీసులో, అలాగే ఇన్సూరెన్స్వాళ్ళని అడిగితే, ఒకరు క్లెయిమ్ చేసుకోవచ్చని, ఒకరు కుదరదని చెప్పి టెన్షన్ పెట్టారు. అప్పుడు నేను, "క్లెయిమ్ అయ్యేలా చూడమ"ని బాబాని ప్రార్థించాను. తరువాత బాబా దయవల్ల క్లెయిమ్ అవుతుందన్న నిర్ధారణ కూడా లభించింది. అలాగే ఇన్సూరెన్సు క్లెయిమ్ అయింది.
నేను సర్జరీకి వెళ్ళేముందు 'నాకు ఒక నెల రోజులు సెలవు కావాలని' నా మేనేజర్‌కి మెయిల్ పెట్టాను. నేను నాకు ఆరోగ్య సమస్య మొదలైనప్పటినుంచి దానికి సంబంధించిన ప్రతిదీ ఏ రోజుకారోజు నా మేనేజర్‌కి తెలియపరచి ఉన్నప్పటికీ ఆమె, "లాప్రోస్కోపీ అయితే ఒక వారం చాలు" అన్నారు. అది చూసి నేను షాక్ అయ్యాను. సర్జరీ చేసుకొని ఒక వారంలో ఎలా పని చేయగలనని నాకు చాలా కోపమొచ్చింది. ఆమెకి మళ్ళీ, "నా పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. నాకు ఒక నెల నుండి 6 వారాల వరకు సెలవు కావాలి" అని మెసేజ్ పెట్టి, "ఎలాగైనా సెలవు మంజూరు చేయించమ"ని బాబాని వేడుకున్నాను. అప్పుడు బాబా దయవల్ల ఆమె ఏమీ అనలేదు, మా హెచ్ఆర్ టీమ్‌తో మాట్లాడి నేను అడిగినన్ని రోజులు సెలువు మంజూరు చేశారు. "చాలా చాలా థాంక్స్ బాబా".
చివరికి నేను సర్జరీ కోసం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. కానీ ఇంకో గంటలో సర్జరీ ఉండగా నాకు చాలా చాలా భయమేసింది. ఎంత భయపడ్డానో మాటల్లో చెప్పలేను. సర్జరీ చేయించుకోకుండా ఎటైనా వెళ్లిపోవాలనిపించింది. మొదటిసారి సర్జరీకోసం హాస్పిటల్లో ఉన్నందుకు నాకు చాలా ఏడుపు వచ్చింది. అస్సలు తట్టుకోలేక బాబాని తలుచుకుంటూ, శిరిడీ ప్రత్యక్షప్రసారంలో బాబాని చూస్తూ, "మీరే ధైర్యాన్ని ఇవ్వాలి తండ్రీ. నాకు ఏ సమస్య లేకుండా సర్జరీ అయి నాకున్న అన్ని సమస్యలు సమసిపోయేలా చేయమ"ని చాలా చాలా ప్రార్థిస్తూ ఆయన స్మరణలోనే గడిపాను. కొంతసేపటికి నన్ను సర్జరీ కోసంగా ప్రీఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్లి అక్కడ ఒకటి లేదా రెండు గంటలు వెయిట్ చేయించారు. ఆ సమయంలో నాకు భయం పోయి కొంచెం ధైర్యం వచ్చింది. తర్వాత బాబా దయవల్ల సర్జరీ పూర్తైంది. నాకు స్పృహ వచ్చేసరికి భరించలేనంత నొప్పి అనిపించింది. "బాబా! ఎలాగైనా ఈ నొప్పి తగ్గించండి" అని బాబుతో చెప్పుకున్నాక కొంచెం నొప్పి తగ్గింది. సర్జరీ అయిన తర్వాత 6 గంటలకి మూత్ర విసర్జన చేయమన్నారు డాక్టర్. కానీ నేను ఎంత ప్రయతించినా మూత్రవిసర్జన చేయలేకపోయాను. డాక్టరు మూత్ర విసర్జన చేయకపోతే యూరిన్ పైప్ వేయాలన్నారు. అది విని నాకు చాలా భయమేసి, "ప్లీజ్ బాబా, ప్లీజ్ బాబా.. మూత్ర విసర్జన అయ్యేలా చూడండి" అని బాబాని ప్రార్థించాను. మా అమ్మ కూడా బాబాని ప్రార్థించినట్లు తర్వాత చెప్పింది. అలా బాబాని ప్రార్థించినంతనే నేను మూత్ర విసర్జన చేయగలిగాను. ఆ సమస్య నుండి బయటపడ్డాను. మరుసటిరోజు నన్ను డిశ్చార్జ్ చేసారు. ఇదంతా బాబానే చేసారని, ఈ క్రమంలో నేను చేసిన పాపపు కర్మలని బాబా తొలగించారని నేను నమ్ముతున్నాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఇంతకు మించి మీకు ఏం చెప్పగలను తండ్రీ".
సర్జరీ అయినా 3 వారాలకి మా ఆఫీసు హెచ్ఆర్ నుండి నాకు కాల్ వచ్చింది. నేను తర్వాత మాట్లాడదామని లిఫ్ట్ చేయలేదు. వెంటనే మరో హెచ్ఆర్ నుండి కాల్ వచ్చింది. సాధారణంగా అయితే కాల్ లిఫ్ట్ చేయకపోతే, కొంత సమయం ఇస్తారు. అలాంటిది వెంటనే కాల్ వచ్చేసరికి 'ఏమైందో, ఏంటో, సెలవు బ్రేక్ చేసి పని చేయమంటారేమోన'ని నాకు భయమేసి, "బాబా! ఏ సమస్య రాకుండా చూడండి" అని బాబాకి చెప్పుకున్నాను. తర్వాత వాళ్ళకి కాల్ చేస్తే, కేవలం నా ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కోవడానికని ఒకరు, ఇంకొకరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసానో, లేదో తెలుసుకోవడానికి కాల్ చేసారని చెప్పారు. తర్వాత వాళ్ళు ఎన్ని రోజులు సెలవు కావాలని అడిగితే, నేను పూర్తిగా కోలుకోవడానికి ఇంకా కొన్ని రోజులు కావాలని చెప్పాను. వాళ్ళు ఏం అనకుండా సరేనని, విశ్రాంతి తీసుకొని తగ్గాక పని చేయమన్నారు. బాబా దయవల్ల నేను టెన్షన్ పడినట్లు ఏ సమస్య కాలేదు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
సర్జరీ అనంతరం ఎన్నోసార్లు అర్ధరాత్రి గ్యాస్ ప్రాబ్లమ్ వచ్చి పడుకోలేకపోయాను. అప్పుడు ఊదీ పెట్టుకొని, "బాబా! నాకు ఈ బాధ తగ్గేలా చేయండి" అని ప్రార్థించాను. దయతో బాబా నాకు ఉపశమనం కలిగించారు. ఇప్పుడు ఆయన కృపవల్ల ఆ సమస్యలన్నీ తగ్గుతున్నాయి. ఇకపోతే, సర్జరీ తర్వాత మొదటిసారి నెలసరి వచ్చినప్పుడు చాలా నొప్పులు ఉండేవి. ఒకరోజు ఆ నొప్పి భరించలేక హాస్పిటల్‌కి కాల్ చేస్తే, ఎవరూ లిఫ్ట్ చేయలేదు. అప్పుడు, "బాబా! ఎలాగైనా ఏదో ఒక దారి చూపి ఈ నొప్పి తగ్గేలా చేయండి" అని బాబాను చాలా ప్రార్థించాను. అప్పుడు మా సిస్టర్ గుర్తొచ్చింది. తను కూడా డాక్టర్. నేను తనకి కాల్ చేసి సమస్యే, టాబ్లెట్లు ఇచ్చింది. అలాగే హాస్పిటల్ వాళ్ళు నన్ను సంప్రదించి, "సమస్యేమీ లేదు. అలాగే వస్తుంది. ట్యాబ్లెట్లు వేసుకో" అని చెప్పారు. బాబా దయవల్ల ఆ నొప్పి కూడా తగ్గింది. ఇలా ఈ నెల రోజుల్లో బాబాని ఎన్నోసార్లు తలుచుకుంటూ ఉన్నాను. నేను తలుచుకున్న ప్రతిసారీ బాబా వెంటనే తామున్నామని నాకు సహాయం చేసారు. "వాటి అన్నిటికీ చాలా కృతజ్ఞతలు బాబా. మీరు చేసిన సహాయానికి, మీరు చూపిన దయకి నేను ఎప్పటికీ మీకు ఋణపడి ఉంటాను. త్వరగా నేను పూర్తిగా కోలుకునేలా చేసి నాకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి తండ్రీ. అలాగే ఆఫీసులో ఏ సమస్య లేకుండా చూడండి బాబా. ఇంకా ఇన్సూరెన్స్ ఏ సమస్య లేకుండా గరిష్ట మొత్తం క్లెయిమ్ అయ్యేలా చూడండి బాబా".
Me leelalu, me daya apaaram thandri . Me biddalani ellappidu ilage ashirvadinchandi thandri. Om Sairam!!!!
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house construction complete chaindi manchi varini rent ki pampandi naku unna e problem solve cheyandi pl
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteSai nannu na barthani kapandi baba , om sairam
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu🙏🙏
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family members forever 🙏🙏💐💐
ReplyDeleteSairam
ReplyDeleteMaaku chala kavalsina vallu chala kastalalo unnaru sai
Variki edina sahayam cheyi tandri