సాయి వచనం:-
'నావాణ్ణి ఎన్నటికీ నా నుండి దూరం కానివ్వను!'

'ప్రేమ రగుల్కొన్న మరుక్షణమే ధ్యానం మొదలవుతుంది. ప్రేమను అనుభవించడం, వ్యక్తీకరించడమే నిజమైన ధ్యానం' - శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1946వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా దయతో ఆరోగ్యం
2. సాయినాథుని కృప


సాయినాథుని కృప

సాయినాథుని చరణాలకు పాదాభివందనం. అందరికీ నమస్కారం. నా పేరు రేవతి. నేను 2024, అక్టోబర్ నుండి రెండు నెలలపాటు జలుబు వల్ల గొంతులో సమస్యతో బాధపడ్డాను. హాస్పిటల్‌కి వెళదామంటే ఏదో ఒక ఆటంకమొచ్చి వెళ్లడం అయ్యేది కాదు. చివరికి నవంబర్ 14, గురువారం డాక్టర్ వద్దకు వెళితే, టెస్ట్ చేసి, "గొంతులో చిన్న పుండు అయి వాపు వచ్చింది" అని చెప్పి వారం రోజులకు మందులిచ్చి, "తగ్గకపోతే వేరే టెస్ట్ చేసి తదుపరి చికిత్స చేద్దామ"ని అన్నారు. అంటే పరోక్షంగా తగ్గకపోతే ఆపరేషన్ చేయాల్సి రావొచ్చన్నట్లు మాట్లాడారు. అదీకాక ఎంతో అవసరమైతే తప్ప మాట్లాడకూడదన్నారు. కానీ, ఉపాధ్యాయురాలినైన నేను మాట్లాడకపోతే ఎలా? అసలు నాకు ఆపరేషన్ అంటేనే భయమేసింది. విషయం తెలిసి నాకంటే ఎక్కువగా నా కుటుంబసభ్యులు, నా స్నేహితురాలు బాబాని ఎక్కువగా ప్రార్థించారు. బాబా కూడా వాళ్ళకి తగ్గిపోతుందని సందేశాలిచ్చారు. అలాగే బాబా దయవల్ల మందులు వాడిన రెండోరోజు నుండే గొంతులో మెరుగుదల వచ్చి వారం రోజులకి పూర్తిగా తగ్గిపోయింది. నేను మళ్ళీ గురువారం(నవంబర్ 21) డాక్టర్ వద్దకు వెళితే, "పూర్తిగా తగ్గింది. మీరు ఇక చెకప్‌కి రావాల్సిన అవసరం లేదు" అన్నారు. నేను ఆ సమస్యతో బాధపడుతున్న సమయంలో మా పాప జలుబు, దగ్గుతో బాధపడింది. బాబాని ప్రార్ధిస్తే రెండు రోజుల్లో తగ్గిపోయింది. ఒకరోజు మా అత్తయ్యవాళ్ళు మా ఇంటికి వచ్చి చీకటి పడుతుండగా తిరిగి వెళ్లారు. మా అత్తయ్య పెద్దావిడ. చలి ఎక్కువగా ఉన్న కారణంగా నేను, "వాళ్ళంతా క్షేమంగా ఇంటికి చేరుకొని, మా అత్తయ్యకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాల"ని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల వాళ్ళు క్షేమంగా ఇంటికి చేరుకున్నారు, మా అత్తయ్య కూడా బాగానే ఉన్నారు.

మా ఇల్లు కట్టి ఏడు సంవత్సరాలవుతుంది. అందుకని పండగ సెలవుల్లో పెయింటింగ్ వేయించాలని అనుకున్నాం. కానీ తర్వాత పండగ సెలవుల్లో అయితే మరీ పండగ దగ్గరకొచ్చేస్తుంది, పని పూర్తవ్వని, పండగ సెలవులకు ముందు సెలవులు పెట్టాల్సి వస్తుందని క్రిస్మస్ సందర్భంగా వచ్చే రెండు రోజుల సెలవులతోపాటు మరో రెండు రోజులు సెలవు పెడితే సరిపోతుందనుకొని క్రిస్మస్ రోజు పెయింటింగ్ మొదలుపెట్టాం. అయితే ఆరోజు భోరున వర్షం పడింది. "ఏమి చేయాలి బాబా?" అని బాబాని తలుచుకొని ఆ రోజుకి ఇంటి లోపల పెయింటింగ్స్ వేయించాము. బాబా దయవల్ల మరుసటిరోజుకి వర్షం తగ్గడంతో బయట పెయింటింగ్ చేయించాము. పని చాలా బాగా జరిగింది. ఇలా బాబా నన్ను ఎన్నో విధాలుగా కాపాడుతున్నారు. "ధన్యవాదాలు తండ్రీ. నన్ను మీ కుటుంబంలో చేర్చుకొని నన్ను, నా కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు సాయినాథా! మీ చల్లని దృష్టి నా మీద, నా కుటుంబం మీద, ప్రజలందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను బాబా".

14 comments:

  1. Om sai ram, naaku manchi arogyanni prasadinchandi baba, amma nannalani kshamam ga chusukondi vaallaki manchi arogyanni ayushni prasadinchandi baba vaalla purti badyata meede tandri, andaru anni vidala bagunde la chayandi tandri, ofce lo situations inka merugu pade la chudandi tandri pls ippatiki konchem baane unnai daani batti meeku chala thanks tandri.

    ReplyDelete
  2. ఓం సాయిరామ్

    ReplyDelete
  3. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  4. Baba, provide peace and wellness to my parents 💐💐💐💐

    ReplyDelete
  5. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏

    ReplyDelete
  6. I am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family members forever 🙏🙏💐💐

    ReplyDelete
  7. baba madava lo maarpu vachhindi . chaduvu kuda baaga ravali baba

    ReplyDelete
  8. Om Sairam
    Sai always be with me 💐💐💐💐💐💐

    ReplyDelete
  9. Baba Kalyan ki marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house construction complete chaindi manchi varini rent ki pampandi naku unna e problem solve cheyandi pl

    ReplyDelete
  10. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Ram.

    ReplyDelete
  11. Sri Sachchidananda sadguru Sai nath Maharaj ki jai 🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  12. Baba akka ni babu ni problems nunchi bayata padeyandi please

    ReplyDelete
  13. Om Sri Sai Raksha 🙏🙏🙏
    Om Sri Sai Aarogyakshemadhaaya Namaha 🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo