ఈ భాగంలో అనుభవాలు:
1. మేలు జరిగేలా సహాయం చేసిన బాబా
2. ప్రతి విషయం బాగా చూసుకున్న బాబా
మేలు జరిగేలా సహాయం చేసిన బాబా
సాయి బంధువులకు నమస్కారం. నా పేరు శ్రీనివాసరావు. మాది పల్నాడు జిల్లా. నేను నరసరావుపేటలోని ఒక వెంచర్లో ఫ్లాట్ తీసుకోదలచి ఐదు లక్షల రూపాయలు డబ్బులు కట్టి మిగతా డబ్బులు కట్టడానికి ఒక సంవత్సరం సమయం అడిగాను. వాళ్ళు సమ్మతించి నేను అడిగిన సమయం ఇచ్చారు. తర్వాత నేను ఐదు లక్షల రూపాయలు పర్సనల్ లోన్ తీసుకుని, ఆ డబ్బు వడ్డీకిస్తే సంవత్సరంలో కొంత డబ్బు వస్తుందన్న ఉద్దేశంతో నా స్నేహితుడు, నమ్మకస్తుడు అయినా వ్యక్తి యొక్క అన్నకు ఆ డబ్బులు ఇచ్చాను. నేను అతనితో ఆరునెలలకు నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వాలని చెప్పాను. అందుకు ఆ వ్యక్తి సరేనన్నాడు. కానీ సంవత్సరమవుతున్నా అతను నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వలేదు. అప్పటికే మిగతా డబ్బులు కట్టి ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవలసిన సమయం దగ్గర పడటంతో నేను ఆ వ్యక్తిని డబ్బులు అడగడం మొదలుపెట్టాను. అతను 'రేపు ఇస్తాను', 'పదిరోజులు గడువివ్వు' అని సుమారు 5 నెలలపాటు కాలయాపన చేసుకుంటూ పోయాడు. దాంతో నేను నాచేత అతనికి డబ్బులు ఇప్పించిన నా స్నేహితుడిపై కూడా ఒత్తిడి పెంచాను. సుమారు 46 సార్లు అడిగినప్పటికీ సదరు వ్యక్తి 'ఇస్తాను, ఇస్తాను' అనడమే తప్ప డబ్బు ఇవ్వలేదు. ఇక అప్పుడు నేను సాయిబాబా ముందు కూర్చుని, "బాబా! మిమ్మల్ని అడక్కుండా డబ్బులు అతనికి ఇచ్చినందుకు నన్ను క్షమించండి. నేను పెద్ద తప్పు చేశాను. ఇకపై ఎవరికీ వడ్డీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వను" అని ఒట్టు పెట్టుకొని, "బాబాని సహాయం చేయమ"ని గట్టిగా ఒక వారం రోజులు ప్రార్థించి సాయి క్వశ్చన్&ఆన్సర్స్ వెబ్సైట్లో అడిగితే, "తప్పకుండా పని జరుగుతుంది" అని సమాధానం వచ్చింది. దాంతో నేను స్థిమితంగా ఉంటూ అతనిపై ఒత్తిడి పెంచగా బాబా చెప్పినట్లుగానే నాకు రావలసిన 5 లక్షల రూపాయలు ఒక రోజు ఇచ్చాడు. నేను ఆ డబ్బులు తీసుకొని ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయించుకుందామని వెళితే, "మీరు ఆలస్యంగా వచ్చారు. ఆ ప్లాట్ బ్యాంకు తాకట్టులో ఉంది. వేరే ఫ్లాట్ తీసుకోండి" అని చెప్పారు. అది విని ఏం చేయాలో అర్థంకాని గందరగోళంలో పడిపోయిన నేను, "ఇదేంది బాబా? ఈ సమస్య నుండి నన్ను గట్టెక్కించు" అని బాబాని వేడుకున్నాను. తర్వాత ఆ ఫ్లాట్వాళ్లతో కూర్చుని మాట్లాడాను. వాళ్ళు, "వేరే ఫ్లాట్ ఇస్తాము. అందుకుగానూ కొంత డబ్బు కూడా తగ్గించుకుంటాము" అని ఒప్పందానికి వచ్చారు. దాంతో నేను వేరే ఫ్లాట్ తీసుకున్నాను. ఆ తరువాత విచారిస్తే నేను ముందు తీసుకుంటాననుకున్న ఫ్లాట్‌కి నాకంటే ముందు అడ్వాన్స్ ఇచ్చిన వ్యక్తి కొన్ని కోర్టు కేసుల్లో ఇరుక్కున్నాడని తెలిసింది. అప్పుడు సాయిబాబా నా యందు దయవుంచి ఆ ప్లాట్ నాకు దక్కకుండా చేసి వేరే ఫ్లాట్ ఇప్పించడమే కాకుండా కొంత డబ్బులు కూడా తగ్గేలా సహాయం చేసారని ఆనందించాను. "ధన్యవాదాలు బాబా".
ప్రతి విషయం బాగా చూసుకున్న బాబా
ప్రతి ఒక్కరికి నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. నేను బాబాను నా తల్లి, తండ్రి, స్నేహితుడు, ఇంకా సర్వంగా భావిస్తాను. 2024, సెప్టెంబర్ నెలలో నేను రెండు సంవత్సరాల నా కవల పిల్లలతో నా కజిన్ పెళ్లికోసం వేరే వూరు వెళ్లి అక్కడ నెల రోజులు ఉండాలనుకున్నాను. అయితే అక్కడ నా పిల్లల్ని ఎలా చూసుకోవాలో, వాళ్ళు అక్కడ ఎలా ఉంటారో, ఇంకా బంగారం, ఇతర ఖరీదైన వస్తువులు మరియు సామాను తీసుకొని అక్కడికి ఎలా ప్రయాణించాలో అని నాకు భయమేసింది. ముఖ్యంగా నా ఆరోగ్యం గురించి భీతిల్లాను. ఎందుకంటే, వేరే ఊరిలో ఉంటున్నప్పుడు అనారోగ్యానికి గురైతే మరింత గందరగోళంగా ఉంటుందనుకున్నాను. ఇలా చాలా ఆలోచనలు, భయాలతో నేను బాబాను, "అక్కడ అంతా సవ్యంగా జరిగేలా చూసుకోండి బాబా. దయచేసి మేము అక్కడ ఉంటున్నప్పుడు నన్ను, నా పిల్లల్ని రక్షించండి. అనారోగ్యం వల్ల మాకు ఎలాంటి హాని కలగనివ్వకండి" అని ప్రార్థించాను. బాబా దయవల్ల ప్రతి విషయం బాగానే జరిగింది. నేను నా కుటుంబం మరియు బంధువులతో చాలా విలువైన సమయాన్ని గడిపాను. పెళ్లి పనులలో నేను నా కజిన్స్‌కి చాలా సహాయం చేసాను. ఇది అందరికీ చిన్న విషయంగా కనిపించొచ్చు గానీ ఇద్దరు చిన్నపిల్లలకు తల్లినైనా నాకు చాలా పెద్ద విషయం. "మీరు నా కోసం చేసిన ప్రతిదానికీ ధన్యవాదాలు బాబా. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉండి నన్ను జాగ్రత్తగా చూసుకున్నందుకు ధన్యవాదాలు".
Om sai ram 🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm sai ram, amma nannalani nannu ma kutumbanni ayur arogyalatho ashta aishwaryalatho kapadandi tandri pls, amma nannala purti badyata meede tandri. intlo, ofce lo situations anni bagunde la chayandi pls, ofce lo anukunnadi jarige la chudandi tandri meere naaku unnadi.
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family members forever 🙏🙏💐💐
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house construction complete chaindi manchi varini rent ki pampandi naku unna e problem solve cheyandi pl
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Sai AMMAKI SAHAYAM CHEYI
ReplyDeletePlease sairam
Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Ram.
ReplyDelete