ఈ భాగంలో అనుభవాలు:
1. బాబా చాలా దయగలవారు - జాగ్రత్త వహిస్తారు
2. ఆటంకం లేకుండా శిరిడీకి రప్పించుకున్న బాబా
బాబా చాలా దయగలవారు - జాగ్రత్త వహిస్తారు
నేను ఒక సాయి భక్తురాలిని. మేము వేరే దేశంలో నివాసముంటున్నాము. ఒకరోజు తెల్లవారుజామున అకస్మాత్తుగా నా కడుపులో నొప్పి మొదలైంది. అది కూడా కుడి వైపున. నాకు ఉన్నట్టుండి ఎందుకలా నొప్పి వస్తుందో అర్థం కాలేదు. నేను ఆ నొప్పి వల్ల నిలబడలేక, కూర్చోలేక చాలా ఇబ్బందిపడ్డాను. ఒకనొక సమయంలో నేను నొప్పిని అస్సలు భరించలేకపోయాను. అప్పుడింకా, "బాబా! మీరే నా పరమాత్మ. దయచేసి నన్ను రక్షించండి" అని బాబాను ప్రార్థిస్తూ అలాగే కొంతసేపు పడుకున్నాను. ఆ తర్వాత కూడా నేను నిలబడలేకపోయాను. అప్పుడు ఎందుకిలా నొప్పి వస్తుందో తెలుసుకోవడానికి గూగుల్‌లో వెతికితే, అది అపెండిసైటిస్ కావచ్చని చూపించింది. నాకు ఆరేళ్ళ బాబు ఉన్నాడు. తనికి నేనంటే చాలా ఇష్టం. నేను తన గురించి ఆందోళన చెంది భయపడ్డాను. అదే సమయంలో మా అమ్మ ఫోన్ చేసింది. తనకి నేను నా సమస్య గురించి చెప్తే, అది గ్యాస్ నొప్పి అని, కొన్ని వ్యాయామాలు చేయమని చెప్పింది అమ్మ. అది విని నాకు కాస్త ఉపశమనం అనిపించింది. మొదటిసారి అలాంటి నొప్పిని అనుభవించడం వల్ల, గ్యాస్ నొప్పి ఎలా ఉంటుందో తెలియనందున భయంతో ఏదేదో ఊహించుకున్నాను. అమ్మ చెప్పినట్లు కొన్ని వ్యాయామాలు చేయడంతో నొప్పి నుండి చాలా ఉపశమనం పొందాను. "థాంక్యూ సో మచ్ బాబా. మీరే మా అమ్మ ద్వారా సహాయం చేసారు తండ్రి. నేను ప్రతిదీ మీ పాదకమలాల వద్ద నివేదించుకుంటున్నాను. వేరే దేశంలో ఉంటున్న మమ్మల్ని ఆరోగ్య సమస్యల నుండి జాగ్రత్తగా చూసుకోండి బాబా".
ఒకరోజు నా కొడుకు మలద్వారం వద్ద నొప్పిగా ఉందని చెప్పాడు. ఆ కారణంగా తను రెండు రోజులు మలవిసర్జనకు వెళ్ళలేదు. నేను తనని నీళ్లు ఎక్కువగా తాగమని చెప్పాను. కానీ తను చాలా తక్కువ నీళ్లు తాగి బాధపడసాగాడు. నేను తనని అలా చూడలేక అన్ని ప్రయత్నాలు చేశాను కానీ, తనకి మలవిసర్జన కాలేదు. ఇంకా నేను ఆందోళన చెంది బాబాను ప్రార్థించాను. తరువాత నేను ఒక బాబా సందేశాన్ని చూశాను, "నేను చాలా దయగలవాడిని. నేను జాగ్రత్త వహిస్తాను" అని. అది చూసాక నా మనసు కుదుటపడింది కానీ, ఒక తల్లిగా నేను నా కొడుకు బాధపడుతుంటే చూడలేకపోయాను. మూడోరోజు తను స్కూలుకి వెళ్ళాడు. నేను స్కూల్లో తనకి నొప్పి వస్తుందేమోనని చింతిస్తూ బాబా నామం జపిస్తూ గడిపాను. తను స్కూల్ నుండి వచ్చాక హఠాత్తుగా వాష్‌రూమ్‌కి వెళ్లి మలవిసర్జన చేసాడు. ఒకవేళ తనకి ఆ(మూడో)రోజు కూడా మలవిసర్జన కాకపోయుంటే చాలా కష్టమయ్యేది. కానీ బాబా దయవల్ల సమస్య తప్పింది. "చాలా చాలా కృతజ్ఞతలు బాబా. దయచేసి తననెప్పుడూ ఇలాగే ఆశీర్వదించండి. కృపతో తనని మీ భక్తుడిగా చేసుకోండి. అప్పుడు నేను తన గురించి చింతించాల్సిన పనుండదు. కారణం, ఈ కలియుగంలో మీరు చేసుకున్నట్టు ఎవ్వరూ చూసుకోరు. మీరే నా తల్లి, తండ్రి, గురువు, సర్వమూ. దయచేసి నేనెప్పుడూ మీ నామస్మరణ చేసేలా చేయండి బాబా. మీ ఉనికిని నేను అనుభవించగలిగితే చాలు, అప్పుడు నేను దేనినైనా ఎదుర్కోగలను. ఇంకొక విన్నపం బాబా, 'నేను నా తల్లిదండ్రుల దగ్గర లేను. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి, వాళ్ళకి మంచి ఆరోగ్యం ప్రసాదించండి బాబా. అలాగే కృపతో ప్రతి ఒక్కరికీ చక్కటి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి బాబా".
సాయి స్మరణం సంకట హరణం
బాబా శరణం భవభయ హరణం.
ఆటంకం లేకుండా శిరిడీకి రప్పించుకున్న బాబా
నా పేరు సంధ్య. బాబా లీలలు, ఆయన తన భక్తులకు అందించే సహకారం నిజంగా అద్భుతమైనవి. బాబా దర్శనానికి శిరిడీ వెళ్లాలని మనం ఎంత ప్రణాళికలు వేసినా, ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు. అది బాబా మనల్ని అక్కడికి రమ్మని పిలిచినప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని నేను గట్టిగా నమ్ముతాను. ఒకసారి మేము శిరిడీ వెళ్లాలని ప్లాన్ చేసుకొని ఒక నెల ముందు టిక్కెట్లు బుక్ చేసుకున్నాము. తర్వాత హార్మోన్ల సమస్య వల్ల నా నెలసరి ఆలస్యమైంది. దాంతో నేను 'శిరిడీ వెళ్లాలా, వద్దా' అని ఎటూ తేల్చుకోలేక చాలా కలత చెందాను. శిరిడీ ప్రయాణానికి ఒక వారం ముందు నేను నా సందిగ్ధావస్థను నా భర్తతో చర్చిస్తే ఆయన, "ఎలాంటి అడ్డంకులు లేకుండా అంతా సజావుగా జరిగేలా అనుగ్రహించమని బాబాని ప్రార్థించమ"ని సూచించారు. నేను ఆయన చెప్పినట్లే బాబాను ప్రార్థించాను. బాబా దయతో అంతా సవ్యంగా జరిగి మేము శిరిడీ వెళ్లి, ఆయన దర్శనం చేసుకొని సంతోషంగా తిరిగి వచ్చాము. బాబా కృపకు నేను కృతజ్ఞురాలిని. బాబా తమ భక్తులందరినీ ఇలాగే ఆశీర్వదిస్తూ ఉండాలి. "ధన్యవాదాలు బాబా".
Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Ram.
ReplyDeleteOm Sairam!!
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm sai ram, tandri amma nannalani kshamam ga chusukondi vaallaki manchi arogyanni ayushni prasadinchandi baba pls vaalla purti badyata meede, naaku manchi arogyanni prasadinchandi baba, andaru ayuru arogyalatho kshamam ga unde la chudandi baba pls, andari badyata meede, ofce lo situations prashantam ga unde la chudandi baba pls.
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family forever 🙏🙏💐💐
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu vadini bless cheyandi house construction complete cheyandi pl manchivarini rent ki pampandi naku unna e problem solve cheyandi pl
ReplyDeletemadavalo chala maarpu vachhindi . enka chaduvulo mundu vundali baba
ReplyDeleteThandri andarani rakshistunnav nannu enduku vadikestunnav ne mede asalu pettukunna Naku anyam chyaku thandri govt job prasadhinchu thandri
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Sri Sachchidananda sadguru Sai nath Maharaj ki jai 🙏🙏🙏🙏🙏
ReplyDelete