సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1952వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. పుట్టినరోజున బాబా ఆశీస్సులు
2. అంతా ప్రశాంతంగా జరిపించిన బాబా


అంతా ప్రశాంతంగా జరిపించిన బాబా

సాయి బంధువులందరికీ నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. 2024, దసరా సమయంలో మా అన్నయ్య అయ్యప్పస్వామి మాల వేసుకున్నాడు. శబరిమల వెళ్ళడానికి 11 రోజుల ముందు తన 5 సంవత్సరాల కూతురికి మాల వేసి తనని కూడా శబరిమలకి తీసుకొని వెళ్లాలని అనుకున్నాడు. అయితే చిన్న పిల్ల కదా! మాల ధరించి ఉండగలదా, లేదా అని భయపడ్డాడు. అయినా తనకి, తన కూతురికి ట్రైన్ టికెట్లు ముందుగా బుక్ చేసాడు. తర్వాత ముందుగా అనుకున్నట్లు శబరిమల వెళ్ళడానికి 11 రోజుల ముందు అనుమానపడుతూనే మరేం పర్వాలేదని పాపకి మాల వేసాడు. అప్పటివరకు బాగానే ఉంది. కానీ ఒక ఐదు రోజులయ్యాక పాపకి జ్వరమొచ్చి చర్మంపై నీటి పొక్కులు వచ్చాయి. అన్నయ్య నాకు ఫోన్ చేసి, "చెల్లీ! ఇలా పొక్కులు వచ్చాయి, పర్వాలేదా?" అని చాలా కంగారుపడుతూ చెప్పాడు. అది విని మేమద్దరమూ, 'అమ్మవారేమో!' అని చాలా భయపడ్డాం. అన్నయ్య పాపని మరుసటిరోజు ఉదయం హాస్పిటల్కి తీసుకెళ్తానని చెప్పాడు. నాకు ఏం చేయాలో అర్థంకాక, "ఒక వారంలో ప్రయాణం సాయి. ఇప్పుడేమిటి మాకు ఈ పరీక్ష? డాక్టర్ అమ్మవారు కాదని చెప్పాలి. నువ్వే మమ్మల్ని రక్షించాలి. పాపకి ఏవిధమైన బాధ లేకుండా సంతోషంగా కొండకు వెళ్లి, రావాలి. మీరు సదా తనకి తోడుగా ఉండి తను ఏడవకుండా చూడాలి సాయి" అని సాయిని వేడుకున్నాను. మరుసటిరోజు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ పాపని చూసి, " 'HMFD' వైరల్ ఇన్ఫెక్షన్. మరేం పర్వాలేదు. కంగారుపడకండి" అని చెప్పి జ్వరంకి టాబ్లెట్లు ఇచ్చారు. బాబా దయవల్ల పాపకి వారం రోజుల్లో పూర్తిగా నయమైంది. ఇరుముడి కార్యక్రమమయ్యాక శబరిమల వెళ్ళడానికి బయలుదేరుతారనగా పాప బాగా ఏడ్చింది. కానీ బయలుదేరుతూనే ఏడుపు ఆపేసింది. తిరిగి వచ్చేవరకు మళ్ళీ అస్సలు ఏడవలేదు. అన్నయ్య చాలా భయపడినప్పటికీ బాబా దయవల్ల పాప ప్రయాణంలో ఎక్కడా ఇబ్బంది పెద్దలేదు. అంతేకాదు, ఎప్పుడూ 5 నిముషాలు నడవగానే ఎత్తుకోమనే తను శబరిమల కొండ అంతా నడుచుకుంటూ ఎక్కేసింది. అంత చిన్న వయసులో కొండ ఎక్కడం, దిగడం కేవలం బాబా దయవల్లనే సాధ్యమయ్యింది.  ఇంకో విషయం అన్నయ్య మా డాడీని కూడా శబరిమలకు తీసుకెళ్లాడు. నేను డాడీతో, "ఏమి పర్వాలేదు. నువ్వు ఏం భయపడకు. దేవుడి దయవల్ల ఏం ఇబ్బంది కలగదు. బాబా ఉన్నారు" అని ధైర్యం చెప్పాను. బాబా దయవల్ల డాడీ కూడా ఏం ఇబ్బందిపడకుండా బాగానే కొండ ఎక్కారు. అంతా చాలా ప్రశాంతంగా జరిగింది. "ధన్యవాదాలు బాబా. మీరు మాకు తోడుగా ఉండగా మాకు ఏ భయం అవసరం లేదు సాయీ".

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo