సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1763వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అవాంతరాలను దాటించి సర్జరీ పూర్తి చేయించిన బాబా 
2. బాబా దయతో తగ్గిన నొప్పి - పట్టిన నిద్ర

అవాంతరాలను దాటించి సర్జరీ పూర్తి చేయించిన బాబా 


సాయిబంధువులందరికీ నమస్కారాలు. నా పేరు కీర్తన. మాది కర్నూలు. సాయి మా మీద చూపిస్తున్న ప్రేమను నేను మాటల్లో చెప్పలేను. బాబా నా భర్తను కరోనా నుండి, ఇంకోసారి పాంక్రియాటైటిస్ నుంచి క్షేమంగా కాపాడారు. ఇకపోతే నా భర్తకి కిడ్నీ సమస్య ఉంది. ఆ సమస్యకు పరిష్కారం చూపమని నేను బాబాను చాలా వేడుకున్నాను. దయగల సాయి సమస్యకి పరిష్కారం చూపారు. డాక్టర్లు కిడ్నీ మార్పిడి చేయాలన్నారు. మా ఆడబిడ్డ(మావారి అక్క) తన కిడ్నీ ఇవ్వడానికి ఒప్పుకుంది. ఇలా అంతా బాగా నడుస్తుందనుకున్న సమయంలో మా ఆడబిడ్డ భర్త(అన్నయ్య)కి క్యాన్సర్ అని తెలిసింది. ఆయనకి కీమోతెరఫీ కూడా మొదలుపెట్టారు. ఆ సమయంలో ఏం చేయాలో, ఎలా ఆలోచించాలి మాకు తెలియలేదు. మా పరిస్థితి పగవాడికి కూడా రాకూడదని నేను ఏడవని రోజంటూ లేదు. మా ఆడబిడ్డ భర్తకి రాకూడని జబ్బు వచ్చి కష్టంలో వుంటే నేను తనని నా భర్తకు కిడ్నీ ఇవ్వమని ఎలా అడిగేది? బాబా మా సమస్యను తీర్చినట్టే తీర్చి ఎందుకు ఇలా చేశాడని చాలా బాధపడ్డాను. ఏదేమైనా భారం ఆయన మీదే వేసాను. ఇలా ఉండగా డాక్టర్లు మావారికి  కిడ్నీ మార్పిడి తొందరగా చేయాలని అనసాగారు. మరోపక్క మా ఆడబిడ్డ భర్త కీమో వల్ల చాలా నీరసించిపోయారు. డాక్టర్లు, "బతికినన్ని రోజులు బాగా చూసుకోండి" అని అన్నారు. కానీ అన్నయ్య సరిగా ఆహారం తీసుకోకపోవడం వల్ల చాలా సీరియస్ అయింది. దాంతో ఆయన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. ఆయన నిజంగా దేవుడు. తనకు అంత బాగాలేకున్నా తన భార్యను టెస్టుల కోసం పంపించారు. మావారికి, మా ఆడబిడ్డకు అన్ని మ్యాచ్ అయి 2023, మే 5న సర్జరీ చేయడానికి నిర్ణయించారు. అయితే అన్నయ్య ఆహారం తినకపోవడం వల్ల చాలా నీరసంగా అయిపోయారు. భర్తని ఆ స్థితిలో వదిలి రాలేక మా ఆడబిడ్డ, తనతోపాటు మేము నరకం అనుభవించాము. డాక్టర్లు ఏమో నా భర్తకు ఎక్కువ రోజులు డయాలసిస్ వద్దని, వెంటనే కిడ్నీ మార్పిడి చేయాలని అన్నారు. మాకు ఏం చేయాలో అర్థం కాలేదు కానీ, బాబా అద్భుతం చేసారు. అన్నయ్య ఆహారం తీసుకోవడం మొదలుపెట్టారు. రోజురోజుకి ఆయన రికవర్ అవుతూ, "నాకు బాగుంది. నువ్వు హైదరాబాద్ వెళ్ళు" అని మా ఆడబిడ్డని పంపించారు. సర్జరీ అయ్యేవరకు మేమందరం చాలా టెన్షన్ పడ్డాం. కానీ బాబా దయవల్ల సర్జరీ సక్సెస్ అయి ఇద్దరూ త్వరగా కోలుకున్నారు. కానీ సర్జరీ అయిన 20 రోజులకి అన్నయ్యకు చాలా సీరియస్ అయి మే 26న చనిపోయారు. అంతా బాగా అయ్యిందన్న సమయంలో ఆవిధంగా జరిగేసరికి మా కుటుంబంలో అందరికీ చాలా బాధ కలిగింది. మా ఆడబిడ్డ బాధ అయితే వర్ణనాతీతం. బాబా ఎందుకిలా చేశారని నాకు చాలా కోపం వచ్చింది. కానీ కర్మఫలం అనుభవించక తప్పదుగా. ఇకపోతే మావారికి సర్జరీ అయి ఇప్పటికి 8 నెలలు అయింది, క్రియేటిన్ కాస్త పెరుగుతూ, తగ్గుతూ ఉంది. "బాబా! నాకు మీరు తప్ప ఎవరూ లేరు. ఒకవేళ నేను నా అనుభవం పంచుకోవడం ఆలస్యం చేసినందుకు మమ్మల్ని పరీక్షిస్తున్నావేమో అని ఇంకా ఆలస్యం చేయకుండా నా అనుభవాన్ని తోటి సాయిభక్తులతో పంచుకున్నాను. ఇంకా బాధలు, భరించే ఓపిక నాకు లేదు. మీ ఇష్టం బాబా, మీ మీదే భారమేసాను. మా జీవితాలను ఏం చేస్తావో మీదే భారం తండ్రి". నా ఈ అనుభవం చదివాక అంతా బాగా అవ్వాలని మీరంతా కూడా బాబాను ప్రార్థిస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు.


ఓం శ్రీసాయినాథాయ నమః!!!


బాబా దయతో తగ్గిన నొప్పి - పట్టిన నిద్ర


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!! నా పేరు లలిత. మాది రాజాం. సాయి నాకు ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. ఈమధ్య ఒకరోజు రాత్రి మా ఆయనకి చేయి నొప్పి చాలా ఎక్కువగా వచ్చింది. దాంతోపాటు కాలు నొప్పి కూడా ఉందని అన్నారు. ఆ నొప్పి కారణంగా ఆయన అస్సలు నిద్రపోలేకపోయారు. నేను ఆయింట్మెంట్ రాసి, దానితోపాటు బాబా ఊదీ మావారి చేతికి రాసి, "బాబా! మావారికి నొప్పి తగ్గి నిద్రపోయేలా చేయి తండ్రీ" అని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. అలాగే మావారికి ఏ ఇబ్బంది లేకుండా ఉంటే, నా అనుభవం తోటి భక్తులతో పంచుకుంటానని అనుకున్నాను. బాబా దయవలన మావారి నొప్పి కొంచెం తగ్గి, నిద్ర కూడా బాగా పట్టింది. మరుసటిరోజు మావారు ఉదయం డాక్టర్ దగ్గరకి వెళితే, డాక్టరు చూసి, "చాలా నీరసంగా ఉండటం వలన ఇలా అయ్యింది" అని మందులు వ్రాసి, "ఏ ఇబ్బంది లేదు" అని అన్నారు. "ధన్యవాదాలు సాయి. ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోవాలి తండ్రీ. మీ పాదాలందు స్థిరమైన నమ్మకం, భక్తి కలిగే ఉండేలా అనుగ్రహించు తండ్రీ".


బోలో సచ్చిదానంద సద్గురు సాయినాథ్ రాజ్ కి జై!!!


25 comments:

  1. Om Sri Sai Raksha🙏🙏🙏

    ReplyDelete
  2. Sri Sachidananda samardha sadguru Sainath Maharaj ki Jai!!!

    ReplyDelete
  3. ఓం సాయిరామ్

    ReplyDelete
  4. Baba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu vadini bless cheyandi

    ReplyDelete
  5. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  6. Baba, provide peace and wellness to my parents 🙏🙏

    ReplyDelete
  7. Baba, take care of my son 💐💐💐💐

    ReplyDelete
  8. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏

    ReplyDelete
  9. Baba, bless Aishwarya 💐💐

    ReplyDelete
  10. I am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue to bless forever 🙏🙏💐💐

    ReplyDelete
  11. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  12. Omsaisri Sai Jai Jai Sai kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Sai

    ReplyDelete
  13. saibaba maa sai madava haram antha meede baba. eeroju exams social and english meeru daggaravundi rainchandi baba

    ReplyDelete
  14. Om Sai Ram please cure my stomach 🙏🙏 pain Baba.

    ReplyDelete
  15. Kaapaduthandri neeku theliyandiyediledu baaba🙏🙏

    ReplyDelete
  16. ఓం శ్రీ సాయి రామ్

    ReplyDelete
  17. Baba papa fever thaggindi baba thank you baba

    ReplyDelete
  18. Baba tondaraga ma samasyaku pariskara margam cheyyandi baba 🙏🙏🙏🙏🙏🍎🍎

    ReplyDelete
  19. Baba,naa valla evaru ebbandi padakunda evarini bhada pettakunda chudandi please baba 🙏🥺

    ReplyDelete
  20. Please baba ma sisters memu kalisi vundela chudu tandri 🙏🌺🙏

    ReplyDelete
  21. 🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  22. Baba ninnu adigina na korika nerverchavu neku satakoti pranamalu

    ReplyDelete
  23. నాకు లవ్ marriage problem నా కష్టం తీరిపోతే బాబా బ్లాగ్ పంచుకుంటాను అందరితో సాయి బాబా నీ దీవెనలు నాకు కావాలి 🙏🙏🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo