- శిరిడీలో బాబా ప్రసాదించిన అద్భుత అనుభవం
నా పేరు శిల్పారెడ్డి. నేను హైదరాబాద్‌లో ఉంటాను. సాయిని నమ్మినప్పటినుంచి నా జీవితంలో అన్ని అద్భుతాలే. అందులో నుండి ఒక మూడు అనుభవాలను ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. 2023, ఫిబ్రవరిలో మహాశివరాత్రి రోజున నేను, మా పాప శిరిడీ వెళ్లాము. ఆ సమయంలో మా ఆరోగ్యం అంతగా బాగాలేదు. నాకు జ్వరమొచ్చి తగ్గింది కానీ, పాపకు ఇంకా కొద్దిగా జ్వరం ఉంది. శిరిడీ ఇంకో పది కిలోమీటర్ల దూరంలో ఉందనగా ఓ చోట బస్సు ఆపితే, మేము టాయిలెట్‌కి వెళ్ళాము. హఠాత్తుగా అక్కడ నాకు చాలా ఆరోగ్య సమస్య వచ్చి నేను నడవలేకపోయాను, అసలు కూర్చున్న చోట నుంచి లేవలేకపోయాను. చాలా కష్టపడుతూ ఇదే నా ఆఖరిరోజేమో! నేను ఇంకా బ్రతుకుతానో, లేదో? బాబాను చూస్తానో, లేదో? అని అనుకున్నాను. కానీ ఏదో ఒకలా శక్తిని కూడదీసుకొని నెమ్మదిగా వెళ్లి ట్రావెల్స్ బస్సెక్కి శిరిడీ చేరుకున్నాను. రూమ్‌లోకి వెళ్లిన తర్వాత నాకు, పాపకి ఆరోగ్యం అస్సలు సహకరించక అలాగే మంచం మీద వాలిపోయాము. పాప, "నాకు బాగా కళ్ళు తిరుగుతున్నాయి అమ్మ. నాకు ఏమీ బాగాలేదు" అంది. మావారికి ఫోన్ చేసి విషయం చెప్పాము. ఆయన, "నేను రావాలా? మీరు వచ్చేస్తారా?" అని అన్నారు. మేము కూడా అదే ఆలోచనలో పడ్డాము. సరే, ఎలాగో శక్తి కూడదీసుకొని డాక్టర్ గురించి ఆరా తీసి అతని దగ్గరికి వెళ్లి ఇద్దరం చూపించుకున్నాము. అతను ఇచ్చిన మందులు తీసుకొని గదికి వెళ్లి, స్నానం చేసి, మళ్ళీ శక్తి కూడగట్టుకొని కిందికి వెళ్లి కొంచెం అల్పాహారం చేసాము. ఆ తర్వాత పాప తనకి అస్సలు బాగాలేదంటే తిరిగి గదికి వెళ్లి పడుకున్నాము. సరిగ్గా అప్పుడే ఒక వాట్సప్ గ్రూపులో 'నువ్వు ఇక్కడ ఉండొద్దు. వెంటనే ద్వారకామాయికి రా' అని సాయి మెసేజ్ వచ్చింది. అది చూసిన నేను పాపను డోర్ లాక్ చేసుకొని, పడుకోమని చెప్పేసి ఒక్కదాన్నే బాబా దర్శనానికి వెళ్లాను. ఆరోజు ఉదయం దర్శనానికి మా దగ్గర టికెట్లు ఉన్నాయి. వాటిని చూపిస్తే, సమయం దాటిపోయినప్పటికీ దర్శనానికి అనుమతించారు. సమాధి మందిరంలోకి వెళ్లి బాబాని చూడగానే, వైకుంఠానికో, కైలాసానికి వెళ్ళిన అనుభూతి కలిగి బాగా ఏడ్చాను. ఆ కన్నీళ్లు బాధతో వచ్చినవి కావు, ఆనందబాష్పాలు. నన్ను నేను మర్చిపోయాను. దర్శనానంతరం బయటకు వెళ్లి మొక్కు డబ్బులు కడదామని డొనేషన్ కౌంటరుకి వెళ్ళాను. అక్కడ ఉన్న ఒక అతను నన్ను చూసి, "నాకు మిమ్మల్ని చూస్తుంటే, మా చెల్లెల్ని చూసినట్టుగా అనిపిస్తుంది" అని, "నేను మీకు ఆరతి దర్శనానికి పాస్ ఇస్తాను" అని అన్నారు. నేను అతనితో, "నేను గదికి వెళ్లి మా పాపని తీసుకొని రావాలండి. తను ఒక్కతే ఉంది. ఈరోజు శివరాత్రి కదా! సాయంత్రం ఆరతి తను కూడా చూస్తుంది" అని చెప్పాను. అతను, "సరే, తీసుకొని రండి. మిమ్మల్ని గేట్ దగ్గర ఎవరైనా ఆపితే నా పేరు చెప్పండి" అని అతని పేరు(శివునికి సంబంధించిన పేరు. సదాశివ అనుకుంటా. నాకు సరిగా గుర్తు రావట్లేదు) చెప్పి, తన ఫోన్ నెంబర్ కూడా నా చేయి మీద వ్రాసిచ్చాడు. నేను తొందరగా ఆటోలో మా గదికి వెళ్లి పాపని తీసుకొని అతను చెప్పిన గేట్ దగ్గరకు వెళ్ళాను. సెక్యూరిటీవాళ్లు కనీసం ఒక్క మాటైనా అనలేదు, ఎవరూ మమ్మల్ని ఆపలేదు. మేము లోపలికి వెళ్ళిపోయాము. అలా ఎలా రాగలిగామా అని నాకైతే చాలా ఆశ్చర్యమేసింది, చాలా చిత్రంగా అనిపించింది. తర్వాత ఆరతి సమయానికి మా ఇద్దరినీ సమాధి మందిరంలోకి పంపించారు. నేను, పాప బాబా ముందర నిల్చున్నాము. ఆరతి అయినంతసేపు అక్కడే నిలబడి ఆరతి అయిపోయాక బాబా పాదాలు తాకి, వారి దర్శనం చేసుకొని ఆనందంగా బయటకు వచ్చాము. నాకు కైలాసంలో శివపార్వతులను చూసిన అనుభూతి కలిగింది. అసలు నేను ఆ అనుభూతిని నా మాటల్లో చెప్పలేకపోతున్నాను. డొనేషన్ కౌంటరులో అతను మళ్ళీ తన దగ్గరకి పిలిచి బాబా తలకు కట్టే ఆరంజ్ కలర్ వస్త్రంలో చాలా ఊదీ ప్యాకెట్లు పెట్టి, మూట కట్టి, దాన్ని మాకిచ్చి, "ఇది తీసుకొని వెళ్ళండి అమ్మ" అని అన్నాడు. ఆ క్షణాన మా ఇద్దరి ఆరోగ్యం చాలా బాగా అయింది. 'వీళ్లకేనా పొద్దున్న ఆరోగ్యం బాగాలేనిదని' అనుకునేంతగా చాలా ఆరోగ్యంగా అయిపోయాము. పాప పూర్తిగా కోలుకుంది. నేను కూడా చాలా మటుకు కోలుకున్నాను. కనీసం నా ఆరోగ్యం బాగాలేదన్న ఆలోచన కూడా లేదు. ఆనాటి నా అనుభవాన్ని నేను మీకు మాటల్లో వర్ణించలేకపోతున్నాను. అది చాలా గొప్ప అనుభూతి. ఒక అద్భుతమైన లీల.
ఇకపోతే, తర్వాత మేము బయాజీమా వాళ్ళింటికి వెళ్ళాము. అక్కడ బయజీమా మనవడి కోడలు, మనవడి మనవడి కోడలు ఉన్నారు. వాళ్ళు నాకు అదివరకే పరిచయం. వాళ్ళు మమ్మల్ని కూర్చోబెట్టి ఆరోజు ఉదయం మా ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని, "అయ్యో.. జ్వరమొస్తే మాకు ఎందుకు చెప్పలేదు. మేము వచ్చేవాళ్ళం కదా!" అని చాలా ఆప్యాయంగా మాట్లాడి బాబాకోసం సంస్థాన్‌కి పంపిన నైవేద్యం నుంచి మాకు కొంచం ప్రసాదం పెట్టారు. అలా ఆ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేనంత అద్భుతంగా జరిగింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను డాక్టర్ దగ్గరకి వెళ్ళి కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకున్నాను. బాబా దయవల్ల అంతా మంచిగా అయిపోయింది. "ధన్యవాదాలు బాబా".
రేపటి భాగంలో మరికొన్ని అనుభవాలు పంచుకుంటాను..
Om Sairam 🙏
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu urgent ga chai thandri vadini bless cheyandi
ReplyDeleteమీరు ధన్యులు
ReplyDeleteThanku sairam 🙏
DeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 🙏🙏
ReplyDeleteBaba, take care of my son 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏
ReplyDeleteBaba, I am experiencing your omnipresence. You are providing each and every requirement of us without any difficulty. I am totally surrendered at your lotus feet. Continue your blessings forever 🙏🙏💐💐
ReplyDeleteOm sai ram
ReplyDelete🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺
ReplyDeleteOmsaisri Jai Jai Sai 🙏🙏🙏🙏🙏 kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
sai baba maa sai madava eeroju computer exam baaga rayali baba. madava bharam antha meede baba. tammudiki kuda manchi udyogam ravali baba. maa attagariki naa meeda kopam povali baba.
ReplyDeleteThanku so mach Sairam 🙏
ReplyDeleteBaba ,naku em ardam kavatam ledu mee meda nammakam tho opika pattukuni vundataniki try chesthunna.. Please baba edina thappu chesthe inthatitho danini thappinchi nannu anugrahinchandi please
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteBaba papa ki fever rakunda chudu baba please
ReplyDeleteMa vadi guraka problem nunchi bayataku thechav baba thank you
ReplyDeleteOm Sri Sai Raksha 🙏🙏🙏
ReplyDelete