సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1762వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • ‘నేను నీ దగ్గరే ఉన్నాన’ని చాలా మంచి అనుభూతినిచ్చిన బాబా

సాయి బంధువులందరికీ నమస్కారాలు. నా పేరు హరిత. 2023, మే-జూన్ ప్రాంతంలో మేము ఇల్లు మారాలనుకొని ఇల్లు వెతకడం మొదలుపెట్టాము. అంతలో మా డాడీతో పనిచేసే ఒక అంకుల్ బదిలీ మీద మా ఊరు వచ్చారు. అతను ఒక ఆరు నెలల్లో తన కుటుంబాన్ని మావూరు తీసుకొని వద్దామని అనుకున్నారు. దాంతో మా డాడీ, ఆ అంకుల్ ఇద్దరూ కలిసి ఇల్లులు వెతకసాగారు. ఆ క్రమంలో  ఇద్దరికీ ఒకే ఇళ్లు నచ్చింది. మేము తీసుకుంటామనే లోపు వాళ్ళు, “మేము తీసుకుంటాం” అని అనేసారు. ఇంకా మాకు ఏం చేయాలో అర్థంకాక చాలా బాధపడ్డాము. ఆ ఇల్లు మాకు ఇక కుదరదని తెలిసినా మేము, ‘వాళ్ళు వద్దంటే బాగుండున’ని ఏదో తెలియని టెన్షన్ పడుతూ ఉండేవాళ్ళము. బాబాకి దణ్ణం పెట్టుకొని, "సాయీ! ఎలాగైనా వాళ్ళు ఆ ఇల్లు మాకు వద్దు అనేలా చేయండి" అని 'క్వశ్చన్ అండ్ ఆన్సర్' సైట్లో చూస్తే, 'ఒకరు తీసుకున్న వాటి గురించి మనం ఆశపడకూడదు' అని వచ్చింది. దాంతో మేము కొంత శాంతించాము. అయినా మరుసటిరోజు వాళ్ళని అడిగితే, "సరే, మీరు తీసుకోండి. మేము ఇంకో ఇల్లు చూస్తాం" అన్నారు. కానీ మళ్ళీ అంతలోనే అలా తీసుకోవటం తప్పనిపించి, "వద్దులే. మీరే తీసుకోండి" అని చెప్పేసాము. ఒక వారం తర్వాత ఆ ఇంటికి దగ్గరలో మాకు ఇంకో ఇల్లు బాగా నచ్చింది. కానీ వాళ్ళు అద్దె చాలా ఎక్కువ చెప్పారు. అందువల్ల వేరే ఇల్లు చూస్తున్నప్పటికీ వాళ్ళు అద్దె తగ్గిస్తే బాగుంటుందని అనుకుంటూ ఉండేవాళ్ళము. ఆ క్రమంలో ఒక గురువారం ఫేస్బుక్ లేదా ఇంస్టాలో షార్ట్స్ చూస్తుంటే, 'ఒక 5 గంటలలో నీకు ఒక మంచి వార్త అందుతుంది' అని కనపడింది. నేను దాన్ని అమ్మకు చూపించి, "శుభవార్త అని వచ్చింది. ఏంటో చూద్దాం" అని అన్నాను. సాయంత్రం డాడీ వచ్చి, “ఇంకోవారం చూద్దాం. వాళ్ళు ఇస్తారనుకుంటున్నాను" అని అన్నారు. నేను మా అమ్మతో, “వచ్చే గురువారంకి ఆ ఇల్లు మనకి ఓకే అయిపోతుంది. బాబా ఓకే చెప్పిస్తారు" అని అన్నాను. అయితే ఆ వారంలో డాడీతో పనిచేసే అంకుల్‌కి మళ్ళీ బదిలీ అయిందని కాల్ వచ్చింది. రెండు రోజుల్లో ఈ ఊరుకి మారుతారనుకున్న సమయంలో అలా జరగడంతో చాలా బాధపడ్డాం. ‘ఏంటో పాపం, అడ్వాన్స్ ఇచ్చేసాక కూడా ఆ ఇంట్లోకి రాలేకపోయారు’ అని అనుకున్నాము. వాళ్ళు ఆ ఇంట్లో దిగకపోయినా మేము ఆ ఇంటికి మారలేదు. మేము వేరే ఇల్లు తీసుకున్నాము. బాబా మనకేది మంచిదో అదే చేస్తారు. మేము ఇప్పుడు తీసుకున్న ఇల్లు పెద్దది. ఆ రోజు మేము కోరుకున్న ఆ ఇళ్లు ఇవ్వకపోయినా అంతకంటే మంచిది ఇచ్చారు.


2023, మార్చిలో నా బంగారు గాజులు కనిపించలేదు. వాటిని ఎక్కడైనా పెట్టేసేనా లేక ఎవరైనా తీసేసారా అని అనుకోడానికి కూడా లేకుండా వాటిని చివరిగా నేను ఎప్పుడు వేసుకున్నానో కూడా నాకు గుర్తు రాలేదు. అయినా ఇంట్లోనే ఉంటాయిలే అని కొన్నిరోజులు వాటి గురించి వెతకలేదు. హఠాత్తుగా ఒకరోజు వెతికితే దొరకలేదు. నేను చాలా ఏడ్చి బాబాని ఎంతగానో ప్రార్థించాను. తర్వాత కూడా ఎంతలా వెతికినా ఆ గాజులు కనిపించలేదు. నేను వరుసగా హైదరాబాద్, అంతర్వేది, పెళ్లికి ఇలా పలుచోట్లకి వెళ్ళొచ్చాను. ఆయా ప్రదేశాలలో ఎక్కడైనా ఆ గాజులు పోయాయేమోనని ఎంత ఆలోచించినా నాకు అసలు ఏమీ గుర్తు రాలేదు. పోనీ ఫోటోలలో చూద్దామని చూస్తే, ఆ గాజులు ఏ ఫోటోలోనూ కనిపించలేదు. దాంతో నేను, మా మమ్మీ చాలా బెంగపెట్టుకొని బాబాని ప్రార్థిస్తూ ఉండేవాళ్ళము. అంతలో ఉగాది వచ్చింది. ఆరోజు మేము బాధగా ఉండటం చూసి మా డాడీ, "ఇక బాధపడకండి. పోయినవి బాధపడితే మాత్రం వస్తాయా? ముందే జాగ్రత్తగా ఉండాలి. అయినా అవి మనవి అయితే ఇంట్లోనే ఎప్పటికైనా దొరుకుతాయి. లేకపోతే లేదు" అని తిట్టారు. నేను, మమ్మీ చేసేదేమీ లేక లోలోపల బాధపడుతూ బాబాని ప్రార్థిస్తూ ఉండేవాళ్ళము. అలా 8 నెలలు గడిచిపోయాయి. కానీ ఆ గాజులు దొరకలేదు. డిసెంబర్లో మేము ఇల్లు మారడానికి ఇంకో పది రోజులు ఉందనగా నేను, "బాబా! ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. మేము ఇల్లు మారే లోపు నా గాజులు దొరకాలి. లేకుంటే అవి పోయినట్లే సాయి" అని రోజూ దణ్ణం పెట్టుకుంటూ ఉండేదాన్ని. ఇలా ఉండగా మరో రెండు రోజుల్లో మేము ఇల్లు మారతామనగా గురువారంనాడు మా అన్నయ్యవాళ్ళు తమ సామాను తీసుకొని వెళ్లారు(అన్నయ్య కరోనా సమయంలో వర్క్ ఫ్రం హోమ్ చేస్తూ మా ఇంట్లోనే ఉన్నాడు. అందువల్ల వాళ్ల సామాన్లు మా ఇంట్లో ఉన్నాయి). తర్వాత రోజు శుక్రవారం నేను బాబా ముందు కూర్చుని బాధపడుతూ, "సాయీ! ఇంకా రెండు రోజులే ఉన్నాయి. అన్నయ్యవాళ్ళు తమ సామాను తీసుకొని వెళ్లారు. అయినా నా గాజులు దొరకలేదు. ఈ రెండు రోజుల్లో దొరికితే మీ అనుగ్రహం గురించి బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను. వెయ్యి రూపాయల అన్నదానానికి ఇస్తాను. ఇదే నాకున్న ఆఖరి అవకాశం" అని దణ్ణం పెట్టుకుంటూ ఉన్నాను. అంతలోనే మా అన్నయ్య వీడియో కాల్ చేసాడు. సరే, పూజ అయిపోయిందని నేను ఆ కాల్ లిఫ్ట్ చేశాను. అన్నయ్య వీడియోలో నా గాజులు చూపించడం చూసి నేను ఆనందాశ్చర్యాలకు లోనయ్యాను. నాకు ఎలా అనిపించిందంటే, బాబాతో ముఖాముఖి మాట్లాడినట్లుగా. ఆయనతో చెప్పుకొని అక్కడినుండి పైకి లేవను కూడా లేవలేదు. అంతలోనే నా ఎదురుగా ఉన్నట్లు నా బాధ తీర్చేసారు బాబా. అలా ఎంత వెతికినా దొరకని వాటిని బాబానే నాకు అందజేశారు. ఈ రెండు అనుభవాల ద్వారా ‘నేను నీ దగ్గరే ఉన్నాన’ని తెలియజేసి చాలా మంచి అనుభూతిని ఇచ్చారు బాబా. "ధన్యవాదాలు బాబా. ఎంతో పుణ్యం చేసుకోబట్టే మీ లీలలను అనుభూతి చెందగలుగుతున్నాను తండ్రీ".


23 comments:

  1. ఓం సాయిరామ్

    ReplyDelete
  2. Baba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu

    ReplyDelete
  3. Om sai ram, e roju ofce lo ye problem lekunda unde la chudu tandri

    ReplyDelete
  4. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  5. Baba, provide peace and wellness to my parents 🙏🙏

    ReplyDelete
  6. Baba, take care of my son 💐💐💐💐

    ReplyDelete
  7. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏

    ReplyDelete
  8. Baba, take care of Aishwarya 💐💐

    ReplyDelete
  9. I am totally surrendered at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings forever 🙏🙏💐💐

    ReplyDelete
  10. Om Sri Sai Raksha 🙏🙏🙏

    ReplyDelete
  11. Omsaisri Sai Jai Sai kapadu Tandri 🙏🙏🙏🙏🙏 Sai Tandri Raksha Raksha Jai Sai Ram

    ReplyDelete
  12. Sainaadha kaapadu thadri🙏🙏

    ReplyDelete
  13. sai baba, madava eeroju hindi, science exams meeru daggaravundi rainchandi baba. maa attagariki naameeda kopam povali.tammudiki tondaraga udyogam ravali baba

    ReplyDelete
  14. ఓం శ్రీ సాయి రామ్

    ReplyDelete
  15. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  16. 🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺

    ReplyDelete
  17. Baba maa valla entha mandi badhapatam em baledu .... please ee vishayam evariki ebbandi lekunda close cheyandi 😔....mee padale maku dikku

    ReplyDelete
  18. Omsaisri Jai Jai Sai 🙏🙏🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo