సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2109వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శిరిడీలో పాండురంగ విఠలుని దర్శనం
2. కోరిన కోరికలన్నీ తీర్చే సాయినాథుడు
3. బాబాని భక్తితో కొలిస్తే నెరవేరని కోరిక ఏదీ లేదు!!

శిరిడీలో పాండురంగ విఠలుని దర్శనం

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన నా సాయితండ్రికి సహస్ర వందనాలు. సాయి బంధువులందరికీ నమస్కారాలు. నా పేరు జ్యోతి. కానీ, సాయిబిడ్డ అనడంలోనే నాకు సంతోషం. ఆనాడు కాకాసాహెబ్ దీక్షిత్‌‌కి ఒకరోజు ఉదయం ధ్యానంలో పాండురంగని విఠలుని దివ్య దర్శనం అవుతుంది, తర్వాత అతను మసీదుకు వెళ్లి సాయిబాబాను దర్శించుకోగా ఆయన, "విఠల్ పాటిల్ వచ్చాడా? జాగ్రత్తగా పట్టుకో, లేదంటే పారిపోతాడు" అని అంటారు. ఆ భక్తుడు బాబాలో ఐక్యమై(1926లో) నేటికీ(2026కి) 100 సంవత్సరాలు. నాడు ఆ భక్తుడికి బాబా ఏదైతే అనుభవాన్ని ఇచ్చారో, అదే అనుభవాన్ని నాకు ఇచ్చారు. అదెలాగంటే, ఈ మధ్య నాకు, నా కూతురికి బాబా చాలాసార్లు స్వప్న దర్శనమిస్తుంటే, మేము దాన్ని బాబా పిలుపుగా భావించి 2026, మే 13వ తేదీన శిరిడీకి బయలుదేరాం. మాకు బాబా దర్శనం చాలా బాగా జరిగింది. మేము కాకడ ఆరతికి వెళ్ళాము. ఆ ఆరతిలో బాబా పాండురంగ విఠలుడే అని అభంగాలు ఉన్నాయి. అందువల్ల నేను బాబాను చూస్తూ, "బాబా! మీరు పాండురంగ విఠలుడే" అని మనస్సులో పాండురంగని రూపాన్ని తలుచుకున్నాను. అదేరోజు సాయంత్రం బాబా పాండురంగ విఠలుని దర్శనాన్ని మాకు అనుగ్రహించి అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చారు. ఆరోజు మధ్యాహ్నం 3 గంటలకి మా తిరుగు ప్రయాణానికి బస్సు ఉంది. కానీ మేము మా రూముకు వెళ్ళినప్పుడు, బస్సు 5 గంటలకని మెసేజ్ వచ్చింది. అప్పుడు నా కూతురు సమయం ఉంది కాబట్టి, ఖండోబా గుడికి వెళ్ళొద్దామంటే ఆటోలో వెళ్ళాం. అక్కడ దర్శనమయ్యాక రూమ్ దగ్గరే కదా! నడుచుకొని వెళ్దామని నడుస్తుంటే, ఒక చోట పొరపాటున వేరే సందులోకి వెళ్ళాం. ఆ సందులో చుట్టుపక్కల షాపులు చూస్తూ నడుస్తుంటే, ఒక చోట హఠాత్తుగా ఒక ఇల్లు కనిపించింది. ఆ ఇల్లు చూస్తూనే ఆ ఇంట్లోకి వెళ్లాలనిపించి వెళ్ళాము. ఆ ఇల్లు ఆనాటి భక్తుడు లక్ష్మణ్ మామది. ఆ ఇంట్లో ఎదురుగా పాండురంగ విఠలుని చూడగానే నాకు అత్యంత అద్భుతం అనిపించింది. అదే ఇంట్లో దాసుగణు కూర్చొని 'సాయి రెహమ్ నజర్ కరనా' అనే ఆరతి గీతం వ్రాశారని అక్కడున్న వాళ్ళు చెప్తే, మరింత ఆశ్చర్యమేసింది. బాబా ఇప్పటికీ జీవించే ఉన్నారననడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది?

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.


బాబాని భక్తితో కొలిస్తే నెరవేరని కోరిక ఏదీ లేదు!!

సాయి భక్తులందరికీ నమస్కారములు. నా పేరు సంధ్యారాణి. నేను ఎన్నో సంవత్సరాల  నుండి బాబాని ఆరాధిస్తున్నాను. ఆయన నా కోరికలెన్నో తీర్చి ఎంతో ఆనందాన్ని, శాంతిని ఇచ్చారు. నేను గవర్నమెంట్ టీచరుని. నేను ఉద్యోగంలో చేరి 22 సంవత్సరాలు అయిపోయింది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ అందరూ టెట్ పరీక్ష పాసవ్వాలని రూల్ పెట్టింది. ఓసీ కాండిడేట్‌ని అయినా నేను ఆ పరీక్ష పాసవ్వాలంటే నాకు 90% మార్కులు రావాలి. అందుకని నేను బాబాని, "బాబా! నేను ఈ పరీక్ష తప్పకుండ పాసయ్యేలా అనుగ్రహించండి" అని వేడుకొని కష్టపడి ప్రిపేర్ అయ్యాను. కానీ పేపర్  చాలా కష్టంగా వచ్చింది. అయినా బాబా మీద భారమేసి నాకు చేతనైనంత వరకు సమాధానాలు వ్రాసాను. బాబా ఉండగా చింత ఎందుకు? ఆయన దయవల్ల నేను అందరి కంటే ఎక్కువ మార్కులతో క్వాలిఫై అయ్యాను. ఇంకో విషయం, మా చెల్లెలువాళ్ళు ఇళ్లు మారుదామని చాలా ప్రయత్నించారు. కానీ చాలా రోజులు ఎంత వెతికినా మంచి ఇల్లు దొరకలేదు. చివరికి బాబాని, "మంచి ఇల్లు దొరికేలా అనుగ్రహించమ"ని ప్రార్థించాము. ఆ తరువాత బాబా దయవల్ల మంచి ఇల్లు దొరికింది. బాబాని భక్తితో కొలిస్తే నెరవేరని కోరిక ఏదీ లేదు. ఇది నా విషయంలో యెన్నోసార్లు  ఋజువైంది  "థాంక్యూ బాబా". 

2 comments:

  1. ఓం శ్రీ సాయిరాం

    ReplyDelete
  2. ఓం శ్రీ సాయిరాం అనుభావాలు చాలా బాగుంది. నీకు శతకోటి దండాలు సామీ.

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo