సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2116వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఏదైనా సరిచేసే బాబా
2. సదా మొర అలకిస్తామని మరోసారి ఋజువిచ్చిన బాబా


సదా మొర అలకిస్తామని మరోసారి ఋజువిచ్చిన బాబా

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!! సాయిబంధువులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. బాబా నన్ను ప్రతిక్షణం కనిపెట్టుకొని ఉంటారని, రాబోయే సమస్యలు నుండి నేను తేలిగ్గా బయటపడేటట్టు చేస్తారని నా ప్రగాఢ నమ్మకం. మా ఆయన ఉద్యోగరీత్యా వేరే ఊరిలో ఉంటుండగా నేను 8  మా బాబుతో అత్తమామలు దగ్గర ఉంటున్నాను. కొద్దిరోజులు ముందు నాకు గొంతునొప్పి, జలుబులతోపాటు ఒంట్లో జ్వరం వచ్చినట్లు 2 రోజులు ఉండింది. మామూలుగా మా బాబు పనులన్నీ నేనే చూసుకుంటాను. ఒంట్లో  బాగాలేకున్న ఆ రెండు రోజులు కూడా పిల్లాడిని చూసుకుంటూ, వాడి పనులన్నీ ఎవరి సహాయం లేకుండా చేసుకోవడం నాకు చాలా కష్టంగా అనిపించింది. కానీ బాబా దయవల్ల 3వ రోజు నుంచి తగ్గుముఖం పట్టి నెమ్మదిగా జలుబు, గొంతునొప్పి అన్ని తగ్గిపోయాయి. మామూలుగా ఒంట్లో బాగా లేనప్పుడు కావలసినంత రెస్ట్ తీసుకోవచ్చు.కానీ, ప్రస్తుతం పిల్లాడితో రెస్ట్ కాదు కదా, ఏ పనైనా పక్క వాళ్ళు సహకరిస్తేనే అవుతుండటం వల్ల ఇక నుంచి నా ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉంటూ జలుబు, గొంతునొప్పి లాంటివి తెచ్చుకోకూడదని అనుకున్నాను. కానీ కొద్దిరోజులు తర్వాత ఇంట్లో ఒక డబ్బాలో ఏదో బిస్కెట్ ఉంటే ఆలోచించకుండా తిన్నాను. ఇంకా అప్పటినుండి గొంతులో కిచకిచ మొదలై గొంతునొప్పి వచ్చే సూచన కనపడింది. దాంతో మళ్ళీ ఇదివరకటిలా ఇబ్బందిపడాలా అని చాలా భయమేసింది. ఈసారి నా దగ్గర మందులు కూడా లేవు. అందువల్ల ఇంకేం చేయలేక, "బాబా! నాకు మళ్ళీ గొంతునొప్పి రాకుండా ఉండేలా అనుగ్రహించండి" అని బాబాని వేడుకొని ఆయన మీద భారమేసాను. ఆ రాత్రి గొంతుకు బామ్ రాసుకొని పడుకున్నాను. అంతే! బాబా దయవల్ల పొద్దున్న లేచేసరికి గొంతు బాగుంది. ఏ కిచకిచ, నస లేవు. హాయిగా ఉంది. ఈ అనుభవం ద్వారా బాబా నా మొర సదా అలకిస్తారని మరోసారి ఋజువు అయింది. "ధన్యవాదాలు బాబా".

సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

2 comments:

  1. Baba me daya valana Kalyan ki marriage ipoindi variddarini kalipi unchu swamy house kosam kattina money vapasu ippinchu thandri 🙏

    ReplyDelete
  2. Om Sai Ram 🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo