1. బాబా చూపించిన ప్రేమ, కరుణ, మార్గదర్శకత్వానికి ప్రత్యక్ష సాక్ష్యం
2. సాయి సచ్చరిత్ర చదవడం వల్ల పొందిన బాబా అనుగ్రహం
బాబా చూపించిన ప్రేమ, కరుణ, మార్గదర్శకత్వానికి ప్రత్యక్ష సాక్ష్యం
ఓం శ్రీసాయినాథాయ నమః. సాయి భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు ఛత్రపతి. నా జీవితంలో ప్రతి అడుగు బాబా అనుగ్రహంతోనే పడుతుందని నేను గట్టిగా నమ్ముతాను. ఏ పని ప్రారంభించినా, ఎక్కడికి ప్రయాణం చేసినా ముందుగా బాబాను మనసారా ప్రార్థించి, ఆయన ఆశీస్సులు తీసుకోవడం నాకు అలవాటు. ఈ మధ్య నా తిరుమల యాత్ర కూడా అలాగే ప్రారంభమైంది. నిజానికి నేను ఈ యాత్రను నా స్నేహితురాలికోసం ప్లాన్ చేసి ఇద్దరికీ టికెట్లు బుక్ చేశాను. ఎందుకంటే, తను ఇంతవరకు తిరుమల దర్శనం చేసుకోలేదు. కానీ విధి విచిత్రమైనది. చివరి క్షణంలో అనివార్య కారణాల వల్ల తను రాలేని పరిస్థితి వచ్చింది. ఒక్క క్షణం, 'నేను కూడా ప్రయాణం వాయిదా వేసుకుందామా?' అన్న ఆలోచన నాకు వచ్చింది. కానీ, 'ఎవరికోసం ఈ యాత్రను ప్లాన్ చేశానో తను రాలేకపోయింది. అయినా శ్రీవేంకటేశ్వరస్వామి నన్ను తమ సన్నిధికి పిలుస్తున్నారేమో! ఆ పిలుపు వెనుక బాబా దివ్య సంకల్పమే ఉందేమో! అని నా మనసుకి బలంగా అనిపించింది. బహుశా ఈ యాత్రను నేను ఒంటరిగా చేయాలని, ఆ అనుభూతిని పూర్తిగా ఆస్వాదించాలని బాబా ముందుగానే నిర్ణయించి ఉండవచ్చు. అందులకాని నేను ఒక్కడినే తిరుమల వెళ్లి, వద్దామని అనుకున్నాను. అయితే, తిరుమలలో విపరీతమైన రద్దీ ఉందని, దర్శనానికి గంటల సమయం పడుతుందని అందరూ అన్నారు. తర్వాత నేను నా ప్రయాణం మొదలుపెట్టేముందు బాబాను ఒక్కటే కోరుకున్నాను, "బాబా! మీ దయతో శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనం తొందరగా, ప్రశాంతంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగేలా అనుగ్రహించండి తండ్రీ" అని. బాబా కరుణ ఎంత అద్భుతమో! ఎవరి ఊహకి అందనంత త్వరగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎంతో ప్రశాంతమైన స్వామివారి దివ్య దర్శనం నాకు లభించింది. ఆ క్షణం నా మనసంతా బాబాపట్ల కృతజ్ఞతతో నిండిపోయింది. దర్శనానికి క్యూలో వెళ్తున్నప్పుడు ప్రతి అడుగు బాబా నా చేయి పట్టుకుని నడిపిస్తున్నట్లు నాకు అనిపించింది. నాకు ఒక గొప్ప సత్యం అర్థమైంది, 'మనం ప్రణాళికలు వేసుకుంటాం కానీ, అవి ఎప్పుడు, ఎలా, ఎవరి ద్వారా నెరవేరాలో నిర్ణయించేది మాత్రం దైవ సంకల్పమే. కొన్నిసార్లు మనం అనుకున్నది జరగకపోవచ్చు. కానీ ఆ జరగకపోవడం వెనక కూడా భగవంతుని దయ దాగి ఉంటుంది. జరిగేది మన ఊహలకు మించిన అనుభవమవుతుంది' అని. చివరిగా నా ఈ తిరుమల యాత్ర నాకు కేవలం ఒక దర్శనం కాదు, బాబా చూపించిన ప్రేమ, కరుణ, మార్గదర్శకత్వానికి ప్రత్యక్ష సాక్ష్యం. నన్ను తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధికి చేర్చి, ఎలాంటి ఆటంకం లేకుండా దివ్య దర్శనం ప్రసాదించి, తిరిగి క్షేమంగా ఇంటికి తిరిగి చేర్చిన నా సద్గురు శ్రీ శిరిడీ సాయిబాబాకు నా హృదయపూర్వక శతకోటి ప్రణామాలు.

Om Sairam
ReplyDeleteSai always be with me
సాయిరాం. ఈ లీల చదివాక నాకు ఒక విషయం అర్థం అయింది. నేను కూడా first time హైదరాబాద్ నుండి విజయనగరం లోని కందివలస వెళ్లాల్సి వుంది అమ్ముల సాంబశివరావు గురుగారిచ్చే సాయి సేవక్ దీక్ష కి ముందు హాజరు కావాల్సిన క్లాస్సేస్ కోసం.తెలంగాణ వాసి అయిన నేను నా ఆక్సిడెంట్ తరువాత , అంత దూరం ఒక్కదాన్నే ఎలా వెళ్ళాలి అనుకొని చాలా కంగారు పడుతున్నాను, మా batch వాళ్ళు హైదరాబాద్ నుండి వెళ్ళేవాళ్ళకి క్లాస్మ రో తేదీల్లో వుంది, నాకు leaves లేనందువల్ల నేను మరో batch క్లాస్సేస్ కి హైదరాబాద్ నుండి ఒక్కదాన్నే train లో వెళ్ళాలి ఇక.. "ఒంటరిగా ఉన్నవారి పై సాయి దృష్టి, బాధ్యత, ప్రేమ ఇంకా ఎక్కువగా ఉంటుంది "అంటారు.. ఆ సాయి రక్షణ, ప్రేమ ని పూర్తిగా పొందుతూ, సాయి భావాత్మకం గా నా ప్రయాణం సాగించడానికి ఇలా ఒంటరిగా పంపుతున్నారేమో అని లీల చదివాక అనిపిస్తోంది.
ReplyDeleteOmsairam
ReplyDelete