సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 963వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. విజయదశమినాడు శిరిడీ దర్శనాన్ని అనుగ్రహించిన బాబా
2. ఆరోగ్యసమస్యల నుండి కాపాడే బాబా
3. ఊదీతో మంట, బొబ్బలు లేకుండా అనుగ్రహించిన బాబా

విజయదశమినాడు శిరిడీ దర్శనాన్ని అనుగ్రహించిన బాబా

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. ముందుగా సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగ్ నిర్వాహకులకు ధన్యవాదాలు. నా పేరు పి.సి.శేఖర్. నేను గత ఏడు సంవత్సరాలుగా సాయిబాబా భక్తుడిని. నేను ఇదివరకు కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో సాయి మహిమను పంచుకుంటున్నాను. 2021, సెప్టెంబరు నెల చివరిలో ఒకరోజు నాకు '2021, అక్టోబరు 7 నుండి శిరిడీలో భక్తులను బాబా దర్శనానికి అనుమతిస్తున్నార'ని ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూస్తూనే నాకు చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే, 'ఎప్పుడు శిరిడీ వెళతానా?' అని నేను చాలా ఆతురతతో ఉన్నాను. నేను మా కుటుంబంతో కలిసి శిరిడీ వెళ్ళాలని అనుకున్నాను. కానీ, ఏదో సమస్య వల్ల వాళ్ళు రాలేమన్నారు. దాంతో నేను నా స్నేహితులకు ఫోన్ చేసి, "శిరిడీ వెళ్ళాలనుకుంటున్నాను, మీలో ఎవరైనా వస్తారా?" అని అడిగాను. వాళ్ళలో ఒకతను నాతో వస్తానని అన్నాడు. అతను శిరిడీకి రావడం ఇదే మొదటిసారి. ఈ సంవత్సరం విజయదశమి 1918లో బాబా సమాధి చెందినప్పుడు ఏ తేదీనైతే వచ్చిందో అదే తేదీన వచ్చింది. అందుచేత ఎలాగైనా విజయదశమికి మేము శిరిడీ వెళ్లితీరాలనుకుని అక్టోబరు 14న బయలుదేరి 17కి తిరిగి వచ్చేలా 2021, అక్టోబర్ 2న టికెట్లు బుక్ చేసుకున్నాము. కానీ నా మనసులో 'ఖచ్చితంగా బాబా దర్శనానికి భక్తులను అనుమతిస్తారా?' అని అనుమానం ఉండి, ఒకవేళ దర్శనానికి అనుమతినివ్వకపోతే ఏదో ఒక హోటల్లో ఉండైనా శిరిడీలో గడిపి వద్దామని అనుకున్నాను. అయితే ఒకరోజు ఎందుకో 'అనవసరంగా నేను శిరిడీకి టిక్కెట్లు బుక్ చేశానా?' అని అనుకున్నాను. అలా అనుకోగానే కరెంటు పోయి కాసేపట్లో వచ్చింది. కాసేపు అది, ఇది ఆలోచించినా చివరికి శిరిడీ వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అయితే ఇక్కడినుండి నాకు సమస్యలు మొదలయ్యాయి. 

మొదట 2021, అక్టోబరు 8న నాకు జలుబు చేసింది. తరువాత మా అమ్మకి నరాల బలహీనత అధికంగా ఉండటంతో ఆమెను గుంటూరు హాస్పిటల్లో చేర్చాము. అమ్మకి హాస్పిటల్లో రూమ్ నెంబర్ 203 ఇచ్చారు. 23 నా లక్కీ నెంబర్ అయినందున బాబా ఆవిధంగా ఆశీర్వదించారు అనుకున్నాను. నాకు హాలిడేస్ ఇవ్వడంతో గుంటూరులో ఉండే నా సిస్టర్ నాతో "సెలవుల అన్నాళ్లు అమ్మ దగ్గరే ఉండాల"ని చెప్పింది. అమ్మవాళ్ళు కూడా, "నన్ను విడిచి ఎక్కడికీ వెళ్ళకు" అన్నారు. ఎందుకంటే, నాకు చిన్నప్పటినుండి అమ్మతో అటాచ్మెంట్ ఎక్కువ. కానీ నా మనసులో మాత్రం శిరిడీ వెళ్లి సాయిబాబాను చూసి రావాలని చాలా బలంగా ఉంది. అందుచేత 'అమ్మని చూసుకుంటూ అక్కడే ఉండాలో లేక శిరిడీ వెళ్ళాలో' నాకేమీ అర్థం కాలేదు. చివరికి 'సాయిబాబా ఉన్నారు. అంతా ఆయన చూసుకుంటారు' అని అక్టోబర్ 12 సాయంత్రం గుంటూరు నుండి మా ఊరు వెళ్లాలని బయలుదేరాను. గుంటూరు నుండి మాచర్ల వేగంగా వెళ్తున్న బస్సుకు యాక్సిడెంట్ జరగకుండా కాపాడి నన్ను క్షేమంగా ఇంటికి చేర్చారు బాబా. మరుసటిరోజుకల్లా బాబా కృపతో నాకున్న జలుబు సమస్య పోయింది. 2021, అక్టోబర్ 14న నేను నా శిరిడీ ప్రయాణానికి బయలుదేరుతుండగా ఎవరో తుమ్మారు. దాంతో కాసేపు కూర్చున్న నాకు మొబైల్ ఛార్జర్ పెట్టుకోలేదని గుర్తొచ్చింది. లేదు సమయానికి బాబానే ఆవిధంగా గుర్తుచేశారు. తరువాత దారిలో రెండు కార్ల మీద బాబా దర్శనమిచ్చారు. అదేరోజు కో-వ్యాక్సిన్ రెండో డోస్ వేసుకున్న సర్టిఫికేట్ వచ్చింది. మరుసటిరోజు అక్టోబర్ 15, విజయదశమినాడు మేము శిరిడీ చేరుకున్నాము. ఆరోజు ఈ దిగువ మెసేజ్ వచ్చింది.
ఆ మెసేజ్ చూడగానే నాకు అమితమైన ఆనందాశ్చర్యాలు కలిగాయి. 'సాయిబాబా ఉండగా భయమేల?' అని అప్పటివరకు నా మనసులో ఉన్న టెన్షన్ అంతా పోయింది. ఆరోజు మధ్యాహ్నం బాబా దర్శనం చేసుకున్నాము. బాబా దర్శనంతో నాకు ఎంతో ప్రశాంతంగా అనిపించింది. సాయంత్రం మరో దర్శనం చేసుకున్నాం. మరునాడు ఉదయం మూడోసారి దర్శనం చేసుకుని బాబా ఆశీస్సులతో తిరుగు ప్రయాణమై అక్టోబర్ 17న క్షేమంగా ఇంటికి చేరుకున్నాము. ఈవిధంగా బాబా నాకు శిరిడీ దర్శన భాగ్యాన్ని అనుగ్రహించి సంతోషపరిచారు. "ధన్యవాదాలు బాబా. ఎల్లప్పుడూ మమ్మల్ని రక్షించండి తండ్రీ. నా జీవితమంతా సదా మీ సేవలో, స్మరణలో ఉండాలని కోరుకుంటున్నాను బాబా". చివరిగా అందరూ 'శ్రీసాయి సచ్చరిత్ర' పారాయణ చేసి బాబా అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా సాయిబాబాను ప్రార్థిస్తున్నాను. ఇంకా ఈ అవకాశమిచ్చిన సాయిబాబాకి, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వాహకులకు చాలా ధన్యవాదాలు.

ఆరోగ్యసమస్యల నుండి కాపాడే బాబా


ఓం శ్రీసాయినాథాయ నమః. ముందుగా సాయిబాబాకు నా ప్రణామాలు. సాయిభక్తులకు మరియు ఈ బ్లాగు నిర్వాహకులకు నమస్కారాలు. నా పేరు శ్రీవాణి. తాము ప్రసాదించిన అనుభవాలను చాలాసార్లు మీతో పంచుకునే అదృష్టాన్ని కల్పించిన బాబా మరోసారి నా అనుభవాన్ని పంచుకునే అవకాశమిచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. 'బాబా' అని తలుచుకున్నంతనే ఎన్నో ఆరోగ్య సమస్యల నుండి కాపాడారు బాబా. ఈ మధ్యకాలంలో నాకు బాగా తలనొప్పి, మెడనొప్పి ఉండేవి. తల మధ్యభాగంలో నొప్పి ఉన్నందున తలలో నరాల ప్రాబ్లమ్ ఏమైనా ఉందేమోనని చాలా భయపడి నేను డాక్టరుని సంప్రదించాను. మనసులో మాత్రం, "బాబా! నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు. ఇది మామూలు తలనొప్పే అయుండాలి. డాక్టరు సాధారణ తలనొప్పే అని చెప్పాలి. ఇంకా తొందరలోనే తలనొప్పి, మెడనొప్పి పూర్తిగా తగ్గిపోవాలి స్వామి" అని బాబాను ప్రార్థించాను. బాబా కరుణ చూపించారు. నేను కోరుకున్నట్లే డాక్టరు అది మాములు తలనొప్పి అని చెప్పారు. తరువాత నేను "ఈ తలనొప్పి, మెడనొప్పి పూర్తిగా తగ్గిపోతే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను స్వామి" అని బాబాతో చెప్పుకుని ఊదీ తలకు, మెడకు ధరించడం మొదలుపెట్టాను. బాబా దయవలన ఇప్పుడు తలనొప్పి, మెడనొప్పి పూర్తిగా తగ్గిపోయాయి. "ధన్యవాదాలు బాబా. ఎప్పటికీ మీకు ఋణపడి ఉంటాను. నాకు తల్లి, తండ్రి, దైవం, అన్నీ మీరే".


ఊదీతో మంట, బొబ్బలు లేకుండా అనుగ్రహించిన బాబా

సాయి భక్తులకోసం ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నమస్కారం. నాపేరు విజయలక్ష్మి. నేను ఇంతకుముందు రెండు అనుభవాలు ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవాన్ని పంచుకుంటున్నాను. 2021, అక్టోబర్ 9 మధ్యాహ్నం నేను వంట చేస్తుండగా చిన్న పొరపాటు వల్ల కాగుతున్న నూనె నా ఎడమ చేయి మీద పడింది. మరుక్షణం చేయి మండసాగింది. వెంటనే నేను బాబా ఊదీ తీసుకుని మండుతున్న ప్రాంతంలో రాసి, "బాబా! మంట తగ్గిపోయి బొబ్బలు రాకుండా ఉంటే నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మొక్కుకున్నాను. బాబా దయవల్ల కాసేపటికి మంట తగ్గిపోయింది. నూనె పడిన చోట కాస్త నల్లగా కమిలినట్లు అయ్యిందిగానీ బొబ్బలు రాలేదు. అసలు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కాగుతున్న నూనె పడి బొబ్బలు రాకుండా ఉన్నది ఇప్పుడే. ఇది కేవలం బాబా దయ. 'పిలిస్తే పలుకుతాన'ని బాబా చెప్పిన మాటలు ఎప్పుడూ వృధా పోవు. "బాబా! మీకు శతకోటి వందనాలు తండ్రీ".

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!!!


8 comments:

  1. Jaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness. Jaisairam

    ReplyDelete
  2. Om sai ram you are Shiva also. Today I went to baba's temple. To give deepa danam to pujari. In that temple Satyanarayana vartamu. Samuhika
    i vratamu is there. I don't know about it. I feel pain not to do vrata. Om sai ram❤❤❤

    ReplyDelete
  3. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai

    ReplyDelete
  4. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATHAYA NAMAH..OM SAI RAM

    ReplyDelete
  5. Om sai ram baba ma arogya samasyalani teerchu thandri sainatha

    ReplyDelete
  6. Baba nennu namukuna varini nuve chusukovali thandri nannu ee bada nundi rakshinchu thandri sainatha

    ReplyDelete
  7. Deeshitu dairy is very nice�� we are knowing new stories about baba. Om sai ram❤❤❤

    ReplyDelete
  8. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo