1. సాయినాథుని దయతో ఏ కోరికైనా తీరును
2. గడువు ఇప్పించిన బాబా
3. 'నేనున్నాన'ని నిరూపిస్తున్న బాబా
సాయినాథుని దయతో ఏ కోరికైనా తీరును
నా పేరు చంద్రకళ. ముందుగా సాయిభక్తులందరికీ, ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయిబంధువులకు నా నమస్కారాలు. ఈ బ్లాగులోని సాయిలీలలు చదువుతుంటే మనసుకు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇంతకుమునుపు నేను ఒక అనుభవాన్ని మీ అందరితో పంచుకున్నాను. అందులో, నాకు రెండు కోరికలు ఉన్నాయనీ, అవి తీరితే ఈ బ్లాగులో పంచుకుంటాననీ రాశాను. బాబా దయవలన దానిలో ఒక కోరిక నెరవేరింది. దానినే నేనిప్పుడు మీ అందరితో పంచుకుంటున్నాను. బి.టెక్ చదువుతున్నప్పుడు కాలేజీ క్యాంపస్ సెలెక్షన్స్‌లో మా అబ్బాయికి ఒక మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగంలో చేరిన కొన్నాళ్ల తరువాత నుండి మేము మా బాబుతో, "జీతం ఎక్కువగా పెరగటం లేదు. వేరే కంపెనీలోకి మారమ"ని చెప్తుంటే తను, "రెండు సంవత్సరాల అనుభవం వచ్చిన తర్వాత కంపెనీ మారితే బాగుంటుంది" అని చెబుతూ వచ్చాడు. 2021, మే నెలకి రెండు సంవత్సరాలు పూర్తవడంతో జూలైలో ఆ ఉద్యోగానికి రిజైన్ చేసి జాబ్ సెర్చ్ మొదలుపెట్టాడు. మొదట రెండు, మూడు కంపెనీలలో ఇంటర్వ్యూలు అయినప్పటికీ అందులో మా బాబు సెలెక్ట్ కాలేదు. దాంతో తను టెన్షన్ పడుతుంటే నేను బాబాను, "మంచి ప్యాకేజీ(జీతం)తో ఉద్యోగం ప్రసాదించమ"ని కోరుకుని గురువారం పూజ చేశాను. బాబా దయవలన రెండు వారాలలో బాబు మూడు కంపెనీలకు సెలెక్ట్ అయ్యాడు. వాటిలో ఒక కంపెనీ నుంచి నేను బాబాని ఏదైతే కావాలని అడిగానో అదే ప్యాకేజీ ఇస్తామని ఆఫర్ లెటర్ వచ్చింది. అది పాత కంపెనీలో బాబుకి వచ్చిన ప్యాకేజీకి మూడింతలు. నేను అంత వస్తుందనుకోలేదు. అంతా బాబా దయ. నాకు చాలా సంతోషంగా అనిపించింది. మనం బాబాని హృదయపూర్వకంగా అర్థిస్తే, అది ఎంతటిదైనా ఆ తండ్రి తప్పకుండా ఇస్తారు.
సెప్టెంబర చివరివారంలో బాబు కొత్త కంపెనీ ఉద్యోగం జాయిన్ అవ్వాల్సి ఉండగా ఆలోగా మేము శ్రీశైలం వెళ్లి రావాలని అనుకున్నాను. అయితే మా ఇంట్లో అత్తమామలు ఉన్నారు. వాళ్ళని ఒక రెండురోజులు చూసుకోవడానికి రమ్మని మా ఆడబిడ్డతో చెప్తే, తను వస్తానని చెప్పింది. మేము ఆగస్టు 29న శ్రీశైలం వెళ్ళడానికి నిర్ణయించుకుని తనని 28వ తేదీన రమ్మని చెప్పాము. అయితే ఆగష్టు 25న ఆమె కడుపునొప్పి అని హాస్పిటల్లో జాయిన్ అయింది. డాక్టరు, "కిడ్నీలో రాళ్లు ఉన్నాయి మూడురోజులు టాబ్లెట్లు వాడి చూసి, ఆపరేషన్ చేయాలి" అన్నారు. మూడు రోజుల తర్వాత మా ఆడబిడ్డకు నొప్పి లేకపోవడంతో టాబ్లెట్లతో స్టోన్స్ వెళ్ళిపోయి ఉంటాయనుకుని ఆగష్టు 28న తను మా ఊరు వచ్చింది. మేము అంతా బాగానే ఉందని ఆగస్టు 29 ఉదయం వెళ్లడానికి వెహికిల్ మాట్లాడుకుని, అంత సిద్ధం చేసుకున్నాము. కానీ హఠాత్తుగా 28వ తేదీ సాయంత్రం 7:30కి మా ఆడబిడ్డ కడుపునొప్పిగా ఉందని చాలా బాధపడసాగింది. వెంటనే మేము తనని హాస్పిటల్‍కి తీసుకునిపోతే, "డాక్టరు వెళ్లిపోయారు" అని చెప్పి టాబ్లెట్లు ఇచ్చి పంపారు. మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే, బాబు కొత్త కంపెనీలో చేరాక అంత తొందరగా సెలవు పెట్టకూడదు. అందువలన నేను, "బాబా! ఎటువంటి సమస్యలు లేకుండా ఆ స్వామి దర్శనం చేసుకుని, తిరిగి వచ్చేటట్లు చేయండి. ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాని వేడుకున్నాను. తరువాత రాత్రి 9 గంటల సమయంలో మా పెద్ద ఆడపడుచుకు ఫోన్ చేసి, పరిస్థితి ఇది అని, "రెండు రోజులు మీ అమ్మానాన్నలని చూసుకోవాలి" అని చెప్పాము. తను వెంటనే తన కొడుకుతో చెప్పి రాత్రి 12.30కి మా ఇంటికి చేరుకుంది. అనుకున్నట్లే మేము మరునాడు ఉదయం బయలుదేరి శ్రీశైలం వెళ్ళాము. స్వామి దర్శనం, కళ్యాణం ఎటువంటి సమస్యలు లేకుండా చాలా బాగా జరిగాయి. అక్కడ ఊరిలో మా ఆడపడుచుని చూసిన డాక్టరు, "వాటర్‌తో స్టోన్స్ వెళ్లిపోయాయి. ఆపరేషన్ అవసరం లేదు" అని చెప్పారు. నాకు చాలా సంతోషం వేసింది. ఇదంతా సాయి దయ. ఆ సద్గురు సాయినాథుని దయతో ఎటువంటి కష్టాలైనా తీరుతాయి. "ధన్యవాదాలు బాబా. ఎన్నో రోజుల నుంచి మిమ్మల్ని ఒక కోరిక కోరుతున్నాను తండ్రీ. తొందరగా దాన్ని అనుగ్రహించండి బాబా".
ఓం శ్రీ సాయినాథాయ నమః.
గడువు ఇప్పించిన బాబా
సాయిబాబా! ముందుగా సాయిబంధువులకు మరియు 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారాలు. ఇదివరకు నా భర్త కొన్ని అనుభవాలను ఈ బ్లాగులో పంచుకున్నారు. నేను ఇప్పుడు నా అనుభవాన్ని పంచుకుంటున్నాను. నా పేరు నాగజ్యోతి. మేము కొన్ని సంవత్సరాల నుండి తీవ్రమైన ఆర్థిక సమస్యలతో ఇబ్బందిపడుతున్నాము. మేము ఒకామెకు డబ్బులు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటికే కొన్ని వాయిదాలు వేశాము. చివరికి ఆమె, "నా డబ్బులు నాకు కావాలి. ఇవ్వకుంటే స్టేషన్‍కి వెళ్లి కేసు పెడతాన"ని ఇబ్బందిపెట్టసాగింది. అప్పుడు నేను, "బాబా! మరికొన్ని రోజులు గడువు ఇప్పించండి" అని బాబాను ప్రార్థించి, 'గడువు లభిస్తే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన'ని అనుకున్నాను. బాబా దయవలన ఆమె రెండు నెలల గడువు ఇచ్చింది. "ధన్యవాదాలు బాబా. రెండు నెలలలో ఆ సమస్యను పరిష్కరించండి బాబా. మీరు మా కుటుంబాన్ని అనుక్షణం రక్షిస్తున్నారు. కానీ ఆర్థికసమస్యలు మమ్మల్ని చాలా ఇబ్బందిపెడుతున్నాయి సాయీ. వాటినుండి మమ్మల్ని రక్షించు తండ్రీ".
సాయిబాబా సాయిబాబా సాయిబాబా.
'నేనున్నాన'ని నిరూపిస్తున్న బాబా
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteOm sai ram every day we are learning many things with this blog. Thank you very much. Om sai ram ❤❤❤
ReplyDeleteJaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness. Jaisairam
ReplyDeleteOm sai ram baba ma arogya samasyalani teerchu thandri sainatha
ReplyDeleteBaba pleaseeee save me baba ee badha ni barinchalekuna baba
ReplyDeleteసాయిరాం బాబా నీవే దిక్కని నమ్మితిమి.. నీవే తప్పా మాకెవరీ భువిలో.. మీ కరుణా కటాక్ష వీక్షణాలు మాపై ఎల్లపుడూ ప్రసాదిస్తున్నందుకు హృదయ పూర్వక కృతజ్ఞతలు సాయిరాం బాబా..
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete