ఈ భాగంలో అనుభవాలు:
1. అడిగినంతనే అద్దెకు ఇల్లు ఇప్పించిన బాబా
2. నమ్ముకున్నవారి అవసరాలన్నీ సాయినాథుడు చూసుకుంటారు
3. టెస్టును విజయవంతం చేసిన బాబా
అడిగినంతనే అద్దెకు ఇల్లు ఇప్పించిన బాబా
నా పేరు యశోద. నేను సాయిభక్తురాలిని. మొదటిసారిగా నేను బాబా నాకు ఇటీవల ప్రసాదించిన ఆనందాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను. మేము ఇదివరకు ఉన్న ఇంటి యజమాని కొంతకాలంగా ఆ ఇంటిని ఖాళీ చేయమని సతాయిస్తూ ఉండేవారు. అయితే నేను హాస్పిటల్లో ఉద్యోగం చేస్తున్నందువల్ల ఇల్లు వెతుక్కోవడానికి నాకు సమయం ఉండేది కాదు. అదీగాక, ఆ ప్రాంతంలో ఇల్లు ఉంటేనే హాస్పిటల్‌కి వెళ్లి రావడానికి నాకు అనుకూలంగా ఉంటుంది. అందువల్ల కొన్ని రోజులు అలాగే గడిపేశాను. మా ఇంటికి ఎదురుగా ఒక భవనం ఉంది. అందులో ఉన్న అన్ని పోర్షన్స్‌లో అద్దెకి ఉంటున్నారు. ఒక్క ఇల్లు కూడా ఖాళీగా లేదు. ఆ భవనం యొక్క ఓనర్స్ వేరేచోట ఉంటారు. అందువల్ల ఓనర్స్‌తో ఎటువంటి ఇబ్బందీ ఉండదు. అటువంటి ఇల్లు అయితే మాకు అనువుగా ఉంటుందనిపించి ఒకరోజు నేను, "బాబా! ఆ భవనంలో ఒక ఇల్లు ఖాళీ చేసి మాకు ఇప్పించండి. అలా జరిగితే నేను సచ్చరిత్ర పారాయణ చేస్తాను" అని అనుకున్నాను. బాబా కృప చూడండి! సరిగ్గా నేను బాబాను ప్రార్థించిన వారం రోజుల్లో ఆ భవనంలో ఒక ఇల్లు ఖాళీ అవనుందని నాకు తెలిసింది. అదికూడా ఆ భవనంలోని ఏ ఇల్లు అయితే ప్రత్యేకించి బాగుంటుందని నేను నా మనసులో అనుకున్నానో అదే ఇల్లు. నిజానికి నేను ఆ ఇల్లే కావాలని బాబాకి చెప్పుకోలేదు. కానీ, బాబా సర్వాంతర్యామి కాబట్టి ఆయనకి నా మనసు తెలుసు. నేను నోరు తెరచి అడగకపోయినా అదే ఇల్లు ఖాళీ చేయించి మాకు ఇప్పించారు. బాబా కృపకు చాలా చాలా సంతోషించి 2021, అక్టోబరు 2న మేము ఆ ఇంటిలోకి మారాము. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయి కూడా సంతోషిస్తారని తనతో ఈ ఆనందాన్ని పంచుకుని, మీ అందరికోసం ఈ అనుభవాన్ని బ్లాగులో ప్రచురించమని చెప్పాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఎప్పుడూ ఇలాగే మీ కృప నాపై, నా కుటుంబంపై, ఇంకా మీ భక్తులందరిపై ఉండేలా అనుగ్రహించండి బాబా. ఇంకా నేను ఎదుర్కొంటున్న ఒక అతి ముఖ్యమైన సమస్యను కూడా త్వరలోనే పరిష్కరించి నాకు న్యాయం చేయండి బాబా".
నమ్ముకున్నవారి అవసరాలన్నీ సాయినాథుడు చూసుకుంటారు
సాయిని నమ్ముకున్నవారిలో నేను ఒకదాన్ని. ముందుగా బాబా పాదపద్మములకు నా హృదయపూర్వక ప్రణామాలు. ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదాలు. రెండు, మూడు నెలలుగా సాయిభక్తుల అనుభవాలు చదువుతున్న నేను మొదటిసారి నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటున్నాను. మా అమ్మాయివాళ్ళు ఇల్లు కొనుక్కోవాలని మూడు సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నారు. కానీ కుదిరేదికాదు. అగ్రిమెంట్ వరకూ వచ్చి ఏదో ఒక సమస్య వలన ఆగిపోయేది. అందువలన మా అమ్మాయి చాలా బాధపడుతుండేది. ఈమధ్య వాళ్ళు ఒక ఇల్లు(అపార్టుమెంట్) చూశారు. అది కూడా కుదిరినట్లే కుదిరి చివరిలో ఏదో కొంచెం సమస్య వచ్చింది. అప్పుడు నేను, "బాబా! ఈ ఇల్లు ఏ సమస్య లేకుండా కుదిరితే, ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని మొదటిసారి బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవలన ఆ ఇల్లు అగ్రిమెంట్ అయింది. కానీ నా అనుభవాన్ని ఎలా పంపాలో నాకు తెలియక, "నాకు ఏదో ఒక దారి చూపండి" అని బాబానే అడిగాను. బాబా ఎంతో కృపతో తాము ప్రసాదించిన అమూల్యమైన అనుభవాలు పంచుకోవడానికి ఉపయోగపడే కొన్ని సూచనలను చూపించారు. దాంతో నా అనుభవాన్ని టెలిగ్రామ్ ద్వారా ఈ బ్లాగ్ నిర్వహించేవారికి పంపాను. తప్పులుంటే క్షమించండి. "ధన్యవాదాలు బాబా. నాకు ఒక కోరిక ఉంది బాబా. మీ దయతో అది నెరవేరితే ఆ అనుభవాన్ని మరియు ఇంటి రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ఆ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను. చివరిగా, మీ దయ అందరిమీదా ఉండాలని కోరుకుంటున్నాను బాబా".
టెస్టును విజయవంతం చేసిన బాబా
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
సాయిబంధువులందరికీ నమస్కారాలు. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయిబంధువులకు ఆ సాయినాథుని కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని సాయిని ప్రార్థిస్తున్నాను. నేను ఇంతకుముందు రెండు అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇది మూడవది. మా అల్లుడు యు.ఎస్.ఏ.లో ఒక కార్ల కంపెనీలో పనిచేస్తున్నారు. వాళ్ళ కంపెనీ కార్లని యు.ఎస్ గవర్నమెంట్ తీసుకుంటుంది. యు.ఎస్.ఏ.లో క్రొత్త కారు డిజైన్ జరిగినప్పుడు ఆ కారు ప్రమాదానికి గురైతే సంభవించే లోటుపాట్ల గురించి క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇటీవల మా అల్లుడు పనిచేసే కంపెనీ కారుని మొదటిసారి టెస్ట్ చేసినప్పుడు ఫెయిల్ అయింది. దాంతో మా అల్లుడు చాలా టెన్షన్ పడ్డారు. 2021, సెప్టెంబరు 30, గురువారంనాడు మరోసారి టెస్ట్ జరిగినప్పుడు నేను, "టెస్ట్ విజయవంతం కావాల"ని బాబాను ప్రార్థించాను. బాబా దయవలన టెస్ట్ విజయవంతం అయింది. తరువాత అక్టోబరు 8న ఇంటర్నల్ టెస్ట్ జరిగింది. అప్పుడు కూడా నేను, "బాబా! ఇంటర్నల్ టెస్ట్ కూడా విజయవంతమయ్యేలా చూడు తండ్రీ" అని వేడుకున్నాను. సాయికృప వల్ల ఆ టెస్ట్ కూడా విజయవంతమైంది. సాయి మీద పూర్తి విశ్వాసముంచితే, ఆయనే అన్నీ చూసుకుంటారు. "ధన్యవాదాలు బాబా".
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteOm sai ram today sai leelas are very beautiful. Om sai ram please give health to me om sai ram❤❤❤
ReplyDeleteJaisairam bless amma for her eye operation recovery and bless me for gaining wealth and health. Jaisairam
ReplyDeleteOm sai ram baba ma arogya samasyalani teerchu thandri sainatha
ReplyDelete🕉 sai Ram
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete