సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 952వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా పక్కా ప్లానింగ్
2. కష్ట సమయంలో బాబా చూపిన దయ
3. కుటుంబ క్షేమాన్ని చూస్తున్న బాబా

బాబా పక్కా ప్లానింగ్


ముందుగా సాటి సాయిబంధువులకు మరియు బ్లాగు నిర్వాహకులకు నా నమస్కారాలు. నా పేరు సాహిత్య. నేను గత కొన్ని రోజులుగా 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులోని భక్తుల అనుభవాలు చదువుతున్నాను. ఒకరోజు ఒక భక్తురాలు 'సంకల్ప పారాయణ' గురించి తన అనుభవంలో పంచుకున్నారు. అది చదివినప్పటి నుండి మా నాన్నగారి పేరు మీద 'సంకల్ప పారాయణ' జరిపించాలనుకున్నాను. మా నాన్నగారు టీచరుగా పనిచేసి పదవి విరమణ చేసారు. ఆయన ఉద్యోగంలో ఉన్నప్పుడు పేదవారికి ఉచితంగా చదువు చెప్పి, ఉద్యోగాలిప్పించి ఎంతోమందికి సహాయం చేసారు. ఎవరిదన్నా ఫంక్షన్ ఉందంటే, తక్షణం అక్కడికి వెళ్లి పనుల్లో వాళ్ళకి సహాయం అందించేవారు. అలాంటి మంచి మనసున్న నాన్న ప్రస్తుతం ఆరోగ్య సమస్యలతో, అప్పుల బాధలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. అయిన వాళ్ళకి వాళ్ళ మీద నమ్మకంతో ష్యూరిటీ ఉండి డబ్బు ఇప్పించారు. తరువాత వాళ్ళు చేసిన మోసం వల్ల చెయ్యని అప్పులకి నాన్న వడ్డీలు కడుతూ కష్టపడుతున్నారు. అందుకే నాన్న పేరు మీద సంకల్ప పారాయణ చేయించాలనుకుని తెలిసిన చాలామంది సాయి భక్తులను సంకల్ప పారాయణ గురించి అడిగాను. అందరూ, "మాకు తెలియదు" అన్నారు. తర్వాత ఒకరోజు ఒక సాయి గుర్తొచ్చి అతన్ని అడిగాను. మొదట అతను కూడా నాకు తెలియదు అన్నారు. కానీ అదేరోజు సాయంత్రం అతను, 'సాయంత్రం ఒక భక్తురాలి అనుభవం చదివాను. అందులో ఆమె, మరి కొంతమంది భక్తులు కలిసి ప్రతి మంగళ, శుక్రవారాల్లో 'సంకల్ప పారాయణ' చేస్తున్నామని వ్రాశారు' అని నాకు మెసేజ్ చేసారు. నిజానికి ఆ అనుభవం అతని వద్దకి ఆ ముందురోజే వచ్చిందట. కానీ అతను చదవలేదు. మరుసటిరోజు నేను అతన్ని అడగటం, ఆ సాయంత్రం అతను ఆ అనుభవం చదవడం జరిగిందట. అంటే నేను అతన్ని అడగటానికి ముందే ఆ భక్తురాలి అనుభవం అతని వద్దకి చేర్చి నాకు కావాల్సిన సమాచారం అతని చేత ఇప్పించారు. చూసారా! బాబా పక్కా ప్లానింగ్. ఇకపోతే అతను నా గురించి ఆ భక్తురాలిని అడిగితే, ఆమె పారాయణ చేస్తామని చెప్పి నాన్న వివరాలు అడిగారు. నేను ఆ వివరాలు ఇచ్చాక, "ఒకసారి బాబా అనుమతి తీసుకుని సంకల్ప పారాయణ చేద్దాం. అలా చేయడం వలన ఫలితం వెంటనే కనిపిస్తుంది" అని చెప్పారు. అలాగే ఆమె బాబాను అడిగి, వారి అనుమతి తీసుకుని తరువాత వచ్చిన శుక్రవారంనాడు మా నాన్నగారి పేరు మీద సంకల్ప పారాయణ చేసారు. ఇదంతా బాబా దయ.


"చాలా చాలా ధన్యవాదాలు బాబా. నాన్న పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయారు బాబా. అమ్మానాన్న కష్టాన్ని నేను చూడలేకపోతున్నాను. అలాగని వాళ్ళకి ఏ సహాయం చేయలేక చాలా చాలా బాధగా ఉంటుంది. ఇంకా ఎన్నాళ్లు ఈ భాధను వాళ్ళు భరించాలి బాబా. మాకు సహనం నశిస్తుంది. కానీ మీ మీద నమ్మకంతో ఓపికగా ఉంటున్నాము. మీ మీదే ఆశలు పెట్టుకున్నాము. దయచేసి అప్పుల బాధలు తీర్చండి. వాళ్ళు ఏ జన్మలోనో చేసుకున్న కర్మ అయుండొచ్చుగాని, ఆ కర్మను మీరు పది జన్మలకు బదలాయించండి బాబా. కన్నీళ్లతో గుండె బరువెక్కి అడుగుతున్నాను, 'త్వరగా ఏదైనా అద్భుతం చేసి ఆర్థిక బాధలు తొలగేలా చేయండి బాబా. తనది కాని అప్పులకు వడ్డీ కడుతున్న వాళ్లకు మీరే న్యాయం చేయండి బాబా ప్లీజ్. నాన్నకోసం నేను 'సప్తాహ పారాయణ' కూడా చేశాను. ఇక మీదే భారం. ఆర్ధిక పరిస్థితి మెరుగయ్యేలా ఆశీర్వదిస్తారని భావిస్తున్నాను. ఏదైనా తప్పుగా వ్రాసుంటే క్షమించండి బాబా".


చివరిగా నాదొక చిన్న మనవి: 'దయచేసి ఎవరూ ఎవరినీ నమ్మి ష్యూరిటీ సంతకాలు పెట్టకండి. వెనక ఆస్తులు ఉంటేనే సాహసించండి, లేకపోతే కష్టపడి సంపాదించినదంతా  లోకులకు పెట్టాల్సి వస్తుంది. అది మన స్వయంకృతాపరాధమే అవుతుంది'.


ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథాయ నమః.


కష్ట సమయంలో బాబా చూపిన దయ

ఓం శ్రీ సాయినాథాయ నమః! సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. బాబా భక్తులు తమ అనుభవాలను పంచుకునేందుకు ఎంతో ఉపయుక్తంగా ఈ బ్లాగును నిర్వహిస్తున్న వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. నేను ప్రతిరోజు ఈ బ్లాగులోని భక్తుల అనుభవాలను చదువుతుంటాను. నాపేరు సృజన. మేము చెన్నైలో నివాసముంటున్నాము. ఇటీవల 2021, సెప్టెంబర్ నెల చివరి వారంలో 'ఆరోగ్యం కుదుటపడితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన'ని బాబాకు వాగ్దానం చేశాను. ఆ అనుభవాన్నే నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను.

నేను 34 వారాల గర్భవతిగా ఉన్నప్పుడు కొన్ని కారణాల వల్ల నాకు సిజేరియన్ చేశారు. పుట్టిన పాపకు శ్వాస అందకపోవడంతో వేరొక హాస్పిటల్‌కి తీసుకువెళ్లారు. సిజేరియన్ కారణంగా నేను మూడు రోజులపాటు పాపకి దూరంగా ఉండాల్సి వచ్చింది. మూడు రోజుల తరువాత పాపను చూడటానికి వెళ్దామనుకుంటే, నాకు Hamerroids వచ్చాయి. దానివల్ల కూర్చోటానికి, చూడటానికి, పడుకోవటానికి నాకు నరకంలా ఉండేది. జన్మనిచ్చిన బిడ్డ దగ్గరకి వెళ్ళలేక చాలా చిత్రహింస అనుభవించాను. డాక్టర్ దగ్గరకి వెళ్తే, "ఒక వారంలో తగ్గకపోతే సర్జరీ చేయాల"ని చెప్పారు. వారం క్రితమే సిజేరియన్ అయింది, మళ్ళీ సర్జరీ అనేసరికి నేను మానసికంగా చాలా ఒత్తిడికి గురయ్యాను. "దయచూపమ"ని బాబాని వేడుకున్నాను. బాబా దయవల్ల అందరూ, "హోమియో మెడిసిన్ వాడమ"ని సలహా ఇచ్చారు. ఆ మందులు వాడిన రెండు రోజులకి నొప్పి తగ్గడం ప్రారంభించింది. దాంతో పాప ఉండే హాస్పటల్‌కు వెళ్లి, నా బిడ్డను చూడగలిగాను. అంతా బాబా దయ. చాలా కష్టమైన పరిస్థితిలో బాబానే మాకు మార్గం చూపి రక్షించారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

కుటుంబ క్షేమాన్ని చూస్తున్న బాబా

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై! ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. నాపేరు లక్ష్మి. ముప్పై సంవత్సరాలుగా మా కుటుంబం అంతా సాయి భక్తులం. సాయే మాకు గురువు, దైవం అన్నీ. ఏ కష్టమొచ్చినా ప్రార్థించినంతనే బాబా మమ్మల్ని ఆ కష్టం నుంచి బయటపడేస్తారు. ఒకసారి ఒక ఫకీరు రూపంలో దర్శనమిచ్చారు సాయినాథుడు. ఒకసారి మా వారికి ఆపరేషన్ జరిగే సమయంలో, "అంతా సవ్యంగా జరిగితే, "సాయిమహారాజ్ సన్నిధి" బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మొక్కుకోగానే అంతా మంచిగా జరిగి మావారు ఆరోగ్యంగా ఉన్నారు. కొన్నిరోజుల క్రితం మా అల్లుడుగారి ఆరోగ్యం బాగాలేకపోతే కరోనా ఏమోనని అందరం కంగారుపడ్డాము. కానీ బాబా దయవలన స్కానింగ్‌లో నెగెటివ్ అని వచ్చింది. కరోనా వ్యాక్సిన్ సమయంలో కూడా జ్వరం రాకుండా చూసి అందరినీ ఆరోగ్యంగా ఉండేలా ఆశీర్వదించారు బాబా. ఈ కరోనా సమయంలో కూడా మా కుటుంబం క్షేమంగా ఉందంటే అంతా బాబా దయ. నేను ఒక సమస్య పరిష్కారం కోసం బాబాని ప్రార్థిస్తున్నాను. బాబా కృపతో ఆ సమస్య పరిష్కారమైతే ఆ అనుభవం ఈ బ్లాగులో పంచుకుంటాను.  "ధన్యవాదాలు బాబా. కరోనా నుండి దేశ ప్రజలందరినీ మీరే కాపాడాలి బాబా".

సర్వేజనా సుఖినోభవంతు.
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


7 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  2. Om Sairam
    Sai Always be with me

    ReplyDelete
  3. Jaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness. Jaisairam

    ReplyDelete
  4. OM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH..Om Sai Ram

    ReplyDelete
  5. Om sai ram today is Nagula chaviti you are in snakes also. 1st kartika somavaramu. You are incarnate Lord Shiva. I preformed poojas in morning and evenings also. Please bless my family with health and wealth. Om sai ram ❤❤❤

    ReplyDelete
  6. Om sai ram baba ma arogya samasyalani teerchu thandri sainatha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo