1. ఎక్కువ కష్టం లేకుండా చేసిన బాబా
2. సాయిబాబా దయ నాపై ఉందన్న నమ్మకం కుదిర్చిన అనుభవం
3. బాబా దయతో ఇంటిల్లిపాదికి కోవిడ్ నెగిటివ్
ఎక్కువ కష్టం లేకుండా చేసిన బాబా
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
సమస్త సాయిబంధువులకు మరియు బ్లాగు నిర్వహిస్తున్న సాయికి వందనాలు. నా పేరు అనూజ. మాది నిజామాబాద్. 1996కి ముందే నాకు బాబా గురించి తెలుసు. కానీ బాబా దయవల్ల ఆ సంవత్సరం మాకు బాబు పుట్టాక నేను ఎక్కువగా బాబాను నమ్మసాగాను. బాబుకి కూడా సాయి సిద్దార్థ్ అని పేరు పెట్టుకున్నాను. ఇప్పుడు తనకి జరిగిన ఒక సంఘటన గురించి బాబాకి మొక్కుకున్న విధంగా మొదట పంచుకుంటున్నాను. నిజానికి దీనికన్నా ముందు ఒక మ్రొక్కు మ్రొక్కుకుని అది తీరేదాకా ఈ బ్లాగులో ఈ అనుభవం పంచుకోను అనుకున్నాను. కానీ మొదటి మ్రొక్కు విషయంలో నాకు బాబా అనుగ్రహం లభించలేదు. ఇంతలో ఇప్పుడు పంచుకోబోయే సంఘటన జరగడంతో ముందు ఈ అనుభవాన్ని పంచుకుంటానని బాబాకి మ్రొక్కుకున్నాను. ఇక అసలు విషయానికి వస్తే..
2021, అక్టోబర్ 6న బాస్కెట్ బాల్ ఆడుతున్నప్పుడు అనుకోకుండా మా బాబు ముక్కుకి ఫ్రాక్చర్ అయ్యి చాలా రక్తం పోయింది. బాబు ఇంటికొచ్చి తన ముక్కుకి ఇలా జరిగిందనగానే నాకు చాలా భయమేసి వెంటనే, "బాబా! బాబుకి పెద్ద సమస్య కాకుండా, ఆపరేషన్ అవసరం లేకుండా ఉంటే నవగురువార వ్రతం చేస్తానని, 'సాయి మాహారాజ్ సన్నిది' బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. తరువాత డాక్టరుకి చూపిస్తే, "ఫ్రాక్చర్ అయ్యింది, అయితే మెయిన్ బోన్‍కి కాకుండా సైడ్ బోన్‍కి అయ్యింది. రెండునెలల్లో తగ్గిపోతుంది. ఆపరేషన్ అవసరం లేదు. ఒకవేళ మీకు ముక్కు వంకర అనిపిస్తే, అప్పుడు చేసుకోవచ్చు" అని అన్నారు. అప్పుడు నేను, "అటువంటి సమస్యలేమీ లేకుండా చేయమ"ని బాబాను వేడుకున్నాను. ఇప్పుడు మా బాబు ఏ ఇబ్బంది లేకుండా క్షేమంగా ఉన్నాడు. అంతా బాబా దయవల్లే. ఆయన ఎక్కువ కష్టం లేకుండా బాధను తీసేసారు. ముక్కు కొద్దిగా వంకర ఉన్నప్పటికీ చెప్తేనే తెలిసేంత స్వల్పంగా ఉంది. అందుకే ఆపరేషన్ చేయించలేదు. ఆ నిర్ణయం తీసుకోవడానికి ఒక వారం పట్టింది. అందుకే వారం ఆలస్యంగా ఈ అనుభవాన్ని పంచుకున్నాను. "దయచేసి క్షమించండి బాబా": మా బాబుకి సాయి అండదండలు ఎప్పటికీ ఇలాగే ఉంటాయని నమ్ముతాను. ఎందుకంటే బాబా అనుగ్రహంతోనే బాబు మాకు పుట్టాడు. ఆ అనుభవాన్ని మరోసారి పంచుకుంటాను. "బాబా! ఇదే మొదటిసారి కావడం వల్ల ఏదైనా తప్పుగా వ్రాసి ఉంటే క్షమించండి. మా అందరిపైన మీ చల్లని చూపు, ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు బాబా. శతకోటి వందనాలు బాబా".
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteJaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness. Jaisairam
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om sai ram❤❤❤
ReplyDeleteOm sai ram today is Satya Sai Baba's Happy birthday to Swami. In Hyderabad in Shiva the celebrations of Baba is very nice�� om sai ram❤❤❤
ReplyDeleteనా అనారోగ్యం నిర్మూలన చేసి ఆరోగ్యం ప్రసాదించిన షిరిడీ సాయిబాబా ధన్యవాదములు
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATHAYA NAMAH..OM SAI RAM
ReplyDeleteBaba na pi daya chupinchu
ReplyDeleteOm sai ram baba ma arogya samasyalani teerchu thandri sainatha
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete