1. బాబాకి సంపూర్ణ శరణాగతి - ఊదీపై నమ్మకం2. బాబాకి చెప్పుకుంటే చక్కగా చూసుకుంటారు
బాబాకి సంపూర్ణ శరణాగతి - ఊదీపై నమ్మకం
'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగు అనుచరులందరికీ నమస్తే. నా పేరు మణి. 2017లో బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. 2017లో ఒకరోజు మధ్యాహ్నం నిద్రపోతున్న మా పెద్దమ్మాయికి ఉన్నట్టుండి హఠాత్తుగా శ్వాస తీసుకోవడంలో సమస్య వచ్చింది. అంకురా హాస్పిటల్‌కి తీసుకుని వెళితే, వెంటనే పాపని ఐసియులో పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చి, "అంతా ఓకే" అన్నారు. కానీ పాపకి హఠాత్తుగా ఎందుకలా జరిగిందో ఎవరూ చెప్పలేకపోయారు. పాపని డిశ్చార్జ్ చేశాక నేను తనని తీసుకుని మా ఫ్యామిలీ ENT డాక్టరు దగ్గరకి వెళ్ళాను. డాక్టరు పాపకి సిటి స్కాన్ చేసి, "అడెనాయిడ్స్ శ్వాస నాళాలను బాగా మూసివేశాయి. అందుకే శ్వాస సమస్య వచ్చి ఉండొచ్చు. ఆపరేషన్ చేసి అడెనాయిడ్స్ తీసేయాలి" అని చెప్పారు. (అడెనాయిడ్స్ ముక్కు లోపల వెనక భాగంలో ఉంటాయి. సిటీ స్కాన్‌లో గాని కనపడవు. అవి పెరిగాయని మాములుగా ఎవరూ గుర్తించలేరు. శ్వాస సమస్య వచ్చి ENT డాక్టరుని సంప్రదిస్తేనే వాటి వలన వచ్చిన సమస్య తెలుస్తుంది).
ఇకపోతే ఆ సమయంలో పాప వయస్సు ఎనిమిదేళ్లు మాత్రమే. అంత చిన్న వయసులో సర్జరీ ఎందుకని మేము సెకండ్, థర్డ్ అభిప్రాయాలకోసం వెళ్ళాము. అయితే వాళ్ళు కూడా సర్జరీ తప్పనిసరి అని, లేకుంటే ఏ ఏ సమస్యలొస్తాయో చెప్పడంతో మా కుటుంబ సభ్యులందరమూ బాగా అలోచించి దేవుడి మీద భారం వేసి ఆపరేషన్ చేయించడానికి నిర్ణయించుకున్నాము. అప్పటికే మా పాప మాట తేడా వచ్చి ముక్కుతో మాట్లాడుతున్నట్లు అమ్మ అనడానికి బదులు అబ్బా అని, బామ్మ అనడానికి బాబా అంటుండేది. మేము ఒక స్టార్ హాస్పిటల్లో పాపకి సర్జరీ చేయించాము. సర్జరీ చేసిన డాక్టరు బయటకి వచ్చి, "సర్జరీ విజయవంతమైంది, కొన్నిరోజులు మందులు వాడాల"ని కొన్ని యాంటిబయోటిక్స్ ఇచ్చారు. మా పాపతోపాటు అదే వయస్సున్న మరికొంతమంది పిల్లలకి కూడా అదే సమయంలో సర్జరీ జరిగింది. వాళ్లంతా మంచం మీద పడుకుని నొప్పికి ఏడుస్తున్నారు. మా పాప కూడా ఏడుస్తూ, "చెల్లికి కూడా అడెనాయిడ్స్ ఉంటాయి కదా! తనకి ఇలా కాకుండా చూడు అమ్మా" అని నాతో అంది. మేము డాక్టరుని, "అందరి ముక్కు నుండి రక్తం ఎందుకు వస్తుంది" అని అడిగితే, "కొంచెం రక్తం వస్తుంది. కానీ ఏం భయంలేదు, తగ్గిపోతుంది" అని అన్నారు.
మరుసటిరోజు పాపని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపేశారు. ఇంటికి వచ్చాక పాపకి విపరీతంగా దగ్గు వచ్చి, చిన్న ఇడ్లీ ముక్క కూడా తినలేకపోయింది. మందులు వేయాలంటే తనకి ఏదో ఒకటి తినిపించాలి. ఆ స్థితిలో మాకు ఏం చేయాలో తోచలేదు. సర్జరీ జరిగిన పిల్ల దగ్గు వలన 24 గంటలపాటు తిండిలేక బాగా నీరసించిపోయింది. పైగా దగ్గువలన ముక్కు నుండి రక్తం కూడా కారుతుండటంతో మేము పాపని తీసుకుని సర్జరీ చేసిన డాక్టరు దగ్గరకి వెళ్ళాము. డాక్టరు, "తగ్గిపోతుంద"ని చెప్పి మందులు మార్చి ఇచ్చారు. కానీ ఆ మందులకు కూడా పాపకి నయం కాకపోగా రెండు నెలలపాటు నిరంతరాయంగా పాప దగ్గుతోనే ఉండేది. ఇడ్లీ, నీళ్లు ఏది ఇచ్చిన లోపలికి పోక పాప నోట్లో నుండి కింద పడిపోతుండేవి. తన అవస్థ చూసి ఇంట్లో అందరమూ తిండిలేక బెంగతో బరువు తగ్గిపోయాము. మళ్ళీ ముక్కు నుండి రక్తం కారడంతో మరోసారి పాపని తీసుకుని హాస్పిటల్‌కి వెళితే వాళ్ళు, "ముక్కు శుభ్రపరుస్తున్నారా?" అని అడిగారు. ఈ విషయం వాళ్ళు ఆపరేషన్ తరువాత డిశ్చార్జ్ చేసినప్పుడే చెప్పారు. మేము వాళ్లతో, "మీరు చెప్పినట్లే సెలైన్ వాటర్‌తో పాప ముక్కు శుభ్రపరుస్తున్నాము. అంతా బాగానే ఉంది కానీ, రెండు నెలలుగా దగ్గు తగ్గడంలేదు. దానివలన పాప ఆహారం తీసుకోలేకపోతుంది" అని చెప్పాము. వాళ్ళు మరో నెలరోజులకు యాంటీబయోటిక్స్ ఇచ్చారు. ఆ మందులు పడక కడుపు ఉబ్బిపోయి పాప మంచం మీద పక్కకి కూడా తిరిగలేకపోయేది. తన బాధని చూడలేక సర్జరీ సక్రమంగా జరిగిందో, లేదో తేల్చుకోవాలని హాస్పిటల్‌కి వెళ్తే డాక్టరు, "నా సర్జరీ 100% కరెక్ట్. పెన్ డ్రైవ్‌లో ఉంది, కావాలంటే ఎవరికైనా చూపించుకోండి. కానీ పాపకి 3 నెలలుగా దగ్గు ఎందుకు వస్తుందో తెలియడం లేదు" అన్నారు. సరేనని వేరే డాక్టరుకి చూపించాము. అయినా పాపకి దగ్గు తగ్గలేదు. పైగా జ్వరం, తలనొప్పి మరియు మందుల వల్ల గ్యాస్ సమస్యలతో పాప చాలా బాధపడుతుండేది. ఇలా ఉండగా పాప తనకి సరిగా కనపడటం లేదంటే పాపని ల్యాబ్‌కి తీసుకుని వెళ్ళాము. అక్కడ పాప పెద్ద అక్షరాలను కూడా చదవలేకపోతుంటే నాకు బాధేసి, "ఏంటి బాబా మాకు ఈ కష్టాలు?" అని అనుకున్నాను. అంతలో ల్యాబ్‌లో వాళ్ళు పాప చేత రిలాక్సింగ్ వ్యాయామాలు చేయించాక తను చిన్నచిన్న అక్షరాలు కూడా చదవగలిగింది. అప్పుడు వాళ్ళు, "సమస్యేమీ లేదు. పాపకి ఉన్న శ్వాస సమస్య, ఇంకా మూడు నెలల నుండి ఉన్న దగ్గువల్ల నరాలన్నీ అలసిపోయాయి. అంతే, ఇంకేమీ లేదు" అని చెప్పారు.
అక్కడినుండి ఇంటికి వచ్చాక నేను ఇక బాబాయే మాకు సర్వమని వారినే ఆశ్రయించాను. ఆయన మీద పూర్తి నమ్మకముంచి, "బాబా! ఇక నీ ఇష్టం. మూడు నెలలుగా పాపకి విపరీతమైన దగ్గు వల్ల తనకి, ఇంట్లోవాళ్ళకి నిద్రాహారాలు లేవు. రోజూ వంట చేయడం, పారేయడమే. ఇక మీ మీదే ఆధారపడి నీ ఊదీనే ఔషధంలా తలచి నీళ్లలో కలిపి పాపకి ఇస్తాము. దగ్గు తగ్గేలా చేయండి బాబా" అని బాబాను వేడుకున్నాను. మందులు వాడటం మానేసి కేవలం ఊదీ నీళ్ళే పాప చేత త్రాగిస్తూ ఉంటే దగ్గు పూర్తిగా తగ్గిపోయింది. ఇంకా ఆపరేషన్ తరువాత వచ్చే అన్ని సమస్యల నుండి పాప బయటపడింది. నిరంతరాయంగా వస్తున్న దగ్గువల్ల మూడు, నాలుగు నెలలు చదువులేని పాప మరుసటి సంవత్సరం నుండి ఎప్పటిలా స్కూలుకి వెళ్లడం మొదలుపెట్టింది. అదే సమయంలో మా ఐదేళ్ల చిన్నపాపకి కంటికి అద్దాలు వచ్చాయి. ఇలా 2017, జనవరి నుండి మే వరకు పిల్లల విషయంలో మేము చాలా సమస్యలు ఎదుర్కున్నాము. కానీ వాటి అన్నిటికి ఖచ్చితమైన ఔషధం బాబాకి సంపూర్ణ శరణాగతి, ఊదీపై నమ్మకం. అంతే వాటితోనే సమస్యలనుండి మేము బయటపడ్డాము. ఆ కష్టకాలంలో నేను ఎవరి రూపంలోనైనా బాబా మాకు సహాయం చేస్తారనే విశ్వాసంతో గేటు శబ్దమైతే, వచ్చిన వాళ్ళు బాబానే అనుకునేదాన్ని. బాబా, ఆయన ఊదీ మా కుటుంబాన్ని సమస్యల నుండి కాపాడి ఆయన మాకు ప్రసాదించిన అందమైన అనుభవమిది. దీన్ని ఎలా పంచుకోవాలని ఎదురుచూస్తున్న సమయంలో ఈ 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నా కంటపడేలా చేసి బాబానే నాకు మార్గం చూపించారు. కాబట్టే మీ అందరితో ఇలా నా అనుభవాన్ని పంచుకోగలిగాను. "ఈ అవకాశమిచ్చినందుకు ధన్యవాదాలు బాబా. మీ కృప ఎప్పుడూ ఇలాగే మా కుటుంబంపై, మీ భక్తులందరిపై ఉండాలని వేడుకుంటున్నాను".
సర్వేజనా సుఖినోభవంతు!
బాబాకి చెప్పుకుంటే చక్కగా చూసుకుంటారు
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకునికి పాదాభివందనాలు. నేను ఒక సాయి భక్తురాలిని. ఇటీవల ఒక పని నిమిత్తం మేము పెద్దమొత్తంలో డబ్బు మా ఊరు పంపాల్సి వచ్చి ట్రైన్లో వేరే వాళ్ళు వెళ్తుంటే, వాళ్ళ ద్వారా ఆ డబ్బు పంపించాలని అనుకున్నాము. నేను డబ్బులు ఉన్న బ్యాగులో బాబా ఊదీ, అమ్మవారి కుంకుమ వేసి, "బాబా మీదే బాధ్యత. మీరే ఈ డబ్బును సురక్షితంగా అక్కడికి చేర్చాలి" అని బాబాతో చెప్పుకున్నాను. తరువాత ఆ బ్యాగు వాళ్ళకిచ్చి పంపించాను. మనం బాబా మీద భారంవేసి ఏదైనా పనిని ఆయనకి అప్పగిస్తే, దగ్గరుండి అయన చూసుకుంటారు. బాబా క్షేమంగా ఆ డబ్బు అక్కడికి చేర్చారు. నేను పంచుకున్న అనుభవం చిన్నదే అయినా ఆ సమయంలో నాకు చాలా పెద్దదిగా అనిపించింది. అలాగే నేను, నా ఫ్రెండ్స్ కొంతమంది కలిసి ఈమధ్య ఒక యాత్రకి వెళ్ళొచ్చాము. వెళ్లేముందు నేను, "బాబా! మేము అక్కడంతా బాగా చూసి రావాలి. ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే" అని చెప్పుకున్నాను. ఆయన దయవలన మేము అన్ని ప్రదేశాలు బాగా చూసుకుని తిరిగి వచ్చాము. ఇప్పుడు అందరమూ బాగున్నాము. అయితే రోజురోజుకి నేను బాబాని ఎక్కువ ఇబ్బంది పెడుతున్నానని అనుకున్నానుగాని మనకు పెద్దదిక్కు బాబానే కదా!
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai Always be with me
Om sai ram baba that little girl suffered to much baba. You and your udi saved her. That is sai power. ❤❤❤
ReplyDeleteOm sai ram baba ma arogya samasyalani teerchu thandri sainatha
ReplyDelete