సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 950వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఆపదలందు రక్షకుడు శ్రీ సాయినాథుడు
2. బాబా ప్రసాదించిన అద్భుత దర్శనం - అమోఘమైన ఊదీ మహిమ
3. నాన్నపై సాయి అనుగ్రహం

ఆపదలందు రక్షకుడు శ్రీ సాయినాథుడు


ముందుగా మన బ్రహ్మాండనాయకుడు సాయినాథునికి నా నమస్కారాలు. నా పేరు మహేష్. మాది సిద్దిపేట జిల్లా. ఈమధ్య నేను మా స్నేహితులతో కలిసి వ్యాక్సిన్ వేసుకున్నాను. తరువాత జ్వరం వస్తుందేమోనని భయపడి, "బాబా! నాకు ఏ జ్వరం రాకుండా ఆరోగ్యంగా ఉంటే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని మొక్కుకున్నాను. బాబా దయవలన నాకు జ్వరం రాలేదు. తరువాత సెప్టెంబర్ 30న మా అక్క కూడా వ్యాక్సిన్ వేసుకుంది. తనకి చాలా జ్వరం వచ్చిందని ఆరోజు సాయంత్రం మా బావ ఫోన్ చేసి చెప్పారు. అప్పుడు నేను, "అక్కకి జ్వరం తగ్గితే, బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. కాసేపయ్యాక నేను ఫోన్ చేస్తే, "కొంచం తగ్గింది" అని అక్క చెప్పింది. "ధన్యవాదాలు బాబా. అక్కకి పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదించండి సాయిదేవా".


ఒకరోజు రాత్రి హఠాత్తుగా నాకు తట్టుకోలేనంత విపరీతమైన తలనొప్పి మొదలయ్యింది. అప్పుడు నేను బాధతో, "బాబా! ఈ తలనొప్పి తగ్గి, నాకు నిద్రపడితే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. బాబా కరుణతో వెంటనే తలనొప్పి తగ్గి, నాకు నిద్రపట్టింది. ఇలాగే ఇంకో రోజు రాత్రి కూడా విపరీతంగా తలనొప్పి వచ్చింది. అప్పుడు కూడా నేను బాబాను వేడుకోగానే నెమ్మదిగా తలనొప్పి తగ్గుముఖం పట్టింది. "నాకు తరచూ వచ్చే ఈ తలనొప్పి నుండి విముక్తుని ప్రసాదించండి బాబా".


ఒకసారి నాకు డబ్బులు అవసరమై హైదరాబాదులో ఉన్న అక్క వాళ్ళ దగ్గరకి వెళ్లి ఒక ఐదురోజులు పని చేసుకుందామని అనుకున్నాను. తీరా అక్కడికి వెళ్లేసరికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దాంతో పనికి వెళ్ళటం కుదరలేదు. అప్పుడు నేను, "బాబా! నా ఆరోగ్యం మంచిగా ఉండి, పని మంచిగా జరిగి, నాకు కావలసిన డబ్బులు వస్తే నేను నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. బాబా దయతో నేను కోరుకున్నట్లు నాకు అంతా మంచే జరిగింది. బాబా నాపై చూపుతున్న అనుగ్రహాన్ని చూస్తుంటే బాబా ఎల్లప్పుడూ నాతోనే ఉన్నట్లనిపిస్తుంది. నేను పిలవగానే, బాబా నన్ను, మా కుటుంబాన్ని రక్షిస్తున్నారు. ఆపదలందు రక్షకుడు మన శ్రీసాయినాథుడు. "ధన్యవాదాలు బాబా. ఏవైనా తప్పులు ఉంటే క్షమించండి బాబా".


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి.


బాబా ప్రసాదించిన అద్భుత దర్శనం - అమోఘమైన ఊదీ మహిమ


సాయినాథునికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వహకులకు ధన్యవాదాలు. నా పేరు మురళీమోహన్. నేను సాయిబాబాను చాలాకాలంగా కొలుస్తున్నాను. నేను బాబా దయవల్ల 1999లో మొదటిసారి శ్రీసాయి సచ్చరిత్ర పారాయణ చేశాను. అందులోని చావడి ఉత్సవానికి సంబంధించిన సన్నివేశాలు నాకు చాలా బాగా నచ్చాయి, నా మనసును ఎంతగానో హత్తుకున్నాయి. అందువల్ల ఆ ఉత్సవాన్ని చూడాలని నాకనిపించింది. ఆ రోజు రాత్రి కలలో ఐదుగురు వ్యక్తులు బాబాని పల్లకిలో ఊరేగిస్తునట్లు దర్శనమైంది. నేను మేల్కొన్న తరువాత 'కలే కదా!' అని అనుకున్నాను. మూడునెలల తరువాత అదే సంవత్సరం నేను మొదటిసారి శిరిడీ వెళ్లి బాబాని దర్శించాను. బాబా దర్శనంతో నా ఆనందానికి అవధుల్లేవు. శిరిడీలో నేనున్న మూడురోజుల్లో నాకు చాలా అనుభవాలు జరిగాయి. చివరి రోజు తిరుగు ప్రయాణమయ్యే ముందు బాబా దర్శనం చేసుకుని నా గదికి వెళ్లాను. అంతే, మూడు నెలలకు ముందు కలలో నేను చూసిన అదే పల్లకి, అదే మనుషులు బాబాని ఊరేగిస్తూ కనిపించారు. పది నిమిషాలపాటు నా ఆనందానికి అవధుల్లేవు. అంతలో హఠాత్తుగా ఎవ్వరూ లేరు. నాకేమీ అర్థం కాలేదు. అక్కడున్న అందరినీ, "పల్లకి ఉత్సవం చూసారా?" అని అడిగాను. వాళ్ళు లేదన్నారు. అందుకు నేను ఆశ్చర్యపోతూ, "అదేంటి, ఇప్పుడే కదా, మీ అందరి ముందుగా ఈ గది నుంచి పల్లకి వెళ్ళింది" అని అన్నాను. వాళ్ళు, "లేదు మాకేమీ కనిపించలేదు" అన్నారు. నాకంతా అయోమయంగా అనిపించి కొన్ని క్షణాలు అలాగే ఉండిపోయాను. ఇప్పటికీ నేను అదంతా నమ్మలేకపోతున్నాను. కానీ ఏదేమైనా కలలో కనిపించిన పల్లకి ఉత్సవాన్ని మెలకువలో నా కన్నులకు ప్రత్యక్షంగా చూపించారు బాబా. నిజంగా అది ఓ అద్భుత దర్శనం. అదేకాక కోపర్గావ్ నుండి కాలినడకన నేను తెచ్చిన గోదావరి నది జలాలతో తమ సమాధికి అభిషేకం చేయించుకున్నారు బాబా. ఇది నా మొదటి అనుభవం.


ఇప్పుడు అదే సంవత్సరం బాబా ప్రసాదించిన అమోఘమైన ఊదీ మహిమను చెప్తాను. అప్పటికి ఎన్నో సంవత్సరాలుగా నా తలలో బఠాణిగింజ పరిమాణంలో రబ్బరు వంటి ఒక కురుపు ఉండేది. హెయిర్ కట్ కోసం ఎప్పుడు సెలూన్ కి వెళ్ళినా పొరపాటున ఆ కురుపు కట్ అయి బ్లీడింగ్ అవుతుండేది. ఆ కురుపు కారణంగా నేను చాలా బాధను అనుభవించాను. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేకపోయింది. ఖచ్చితంగా చెప్పాలంటే దానికి సరియైన మందు లేదని డాక్టరు చెప్పారు. దాంతో నేను హోమియో మందులు కూడా వాడాను. అయినా ఆ కురుపు తగ్గలేదు. ఇక చసేది లేక చివరిసారిగా శిరిడీలో సాయిబాబా సమాధికి ఊదీని తాకించి, "బాబా! ఈ ఊదీని నా తలపై ఉన్న కురుపుకి రాస్తాను. మీలో మహిమ ఉంటే, ఆ కురుపు తగ్గిపోవాలి" అని అనుకుని కురుపుపై ఊదీ పెట్టాను. అదే రోజు సాయంత్రం నేను హైదరాబాద్ కి తిరుగు ప్రయాణమయ్యాను. మరుసటిరోజు ఉదయం నేను నా తలలో చెయ్యిపెట్టి ఆశ్చర్యపోయాను. అన్ని సంవత్సరాలుగా ఉన్న కురుపు పూర్తిగా తగ్గిపోయింది. ఆ భాగంలో నొప్పి మాత్రం ఉంది. ఇక నా ఆనందానికి అవధుల్లేవు. "బాబా! నేను తెలిసీతెలియక కొన్ని తప్పులు చేశాను. నన్ను క్షమించండి. ఎల్లపుడూ మీ నామస్మరణ చేసేలా అనుగ్రహించండి. నేను ఇంతవరకూ జీవితంలో స్థిరపడలేదు బాబా. తొందరగా మంచి ఉద్యోగాన్నిచ్చి నేను అనుభవిస్తున్న మానసిక క్షోభ నుండి విముక్తి ప్రసాదించండి బాబా".


సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


నాన్నపై సాయి అనుగ్రహం


సాయిభక్తులందరికీ మరియు 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వాహకులకు నమస్కారం. నా పేరు రాజు. నేను సాయి భక్తుడిని. నేను శ్వాసించే శ్వాస, వేసే ప్రతి అడుగు సాయి వలనే జరుగుతున్నాయని బలంగా నమ్ముతాను. పది నెలల క్రితం మా నాన్నగారికి కరోనా వచ్చి ఐదు రోజులు హాస్పిటల్లో ఉన్నారు. బాబా దయవల్ల నాన్న తొందరగానే కోలుకున్నారు. 90 రోజుల తరువాత అమ్మ, నాన్నలిద్దరూ మొదటి డోస్ వ్యాక్సిన్ వేసుకున్నారు. తరువాత కొన్నిరోజులకి నాన్నకి జ్వరం వచ్చి కొద్ది రోజులు బాధపడ్డారు. అప్పుడు నేను మనసులో,  "నాన్నకు ఏ కష్టమూ లేకుండా తొందరగా జ్వరం తగ్గేలా అనుగ్రహించు తండ్రీ" అని బాబాను కోరుకున్నాను. నేను కోరుకున్నట్లే బాబా నాన్నకి జ్వరం తగ్గించారు. "చాలా చాలా థాంక్స్ బాబా. ఈ అనుభవాన్ని చాలా ఆలస్యంగా పంచుకుంటున్నందుకు నన్ను క్షమించండి బాబా". మళ్ళీ ఇంకొక అనుభవంతో కలుస్తాను.



5 comments:

  1. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai

    ReplyDelete
  3. OM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH..Om Sai Ram

    ReplyDelete
  4. Om sai ram 2nd sai leela in dream and real sai showed chavadi ustavaniki is very nice miracle to that devotee. He is very lucky to have darshan of baba sai. I like that leela with water water sai lights diyas. This miracle is very nice. I want to see sai in dream. But no darshan in dream. That is my fate.

    ReplyDelete
  5. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤🤗🌸😃🌼😀🌺🥰🌹💕

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo