1. బాబాతో చెప్పుకుంటే, సమస్యల నుండి బయటపడేస్తారు
2. బాబా మనతోనే ఉన్నారు - మన బాగోగులన్నీ చూసుకుంటారు
3. మనోవాంఛను నెరవేర్చిన బాబా
బాబాతో చెప్పుకుంటే, సమస్యల నుండి బయటపడేస్తారు
అందరికీ నమస్తే. నా పేరు చైతన్య. ముందుగా సాయినాథునికి శతకోటి వందనాలు. కరోనా కాలంలో మా అపార్ట్‌మెంటులోని ఒక కుటుంబానికి కరోనా సోకింది. అది తెలియక మా బాబు రోజూ వాళ్ళ ఇంటికి వెళ్లి ఆడుకునేవాడు. వాళ్ళ బాబు కూడా మా ఇంటికి వచ్చి ఫోన్లో గేమ్స్ ఆడుతుండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు వాళ్ల కుటుంబంలో సభ్యులందరికీ కరోనా నిర్ధారణ అయిందని మాకు తెలిసింది. దాంతో నేను, మా బాబు చాలా భయపడ్డాము. కానీ, "బాబా ఉన్నారు, మనకు ఏమీ కాద"ని నేను మా బాబుతో చెప్పాను. అదే సమయంలో యు.ఎస్.ఏ నుండి మా అత్తయ్య, మామయ్యలు వస్తున్నారు. వాళ్ళు అసలే పెద్దవాళ్ళు. నేను, మా బాబు, "అత్తయ్య, మామయ్యలకు మరియు మాకు ఏమీ కాకుండా ఆరోగ్యంగా ఉండేలా చేయమ"ని బాబాతో చెప్పుకున్నాము. బాబా దయవల్ల అత్తయ్య, మామయ్యలు క్షేమంగా ఇండియా చేరుకోవడమే కాకుండా అందరమూ ఆరోగ్యంగా ఉన్నాము. అత్తయ్య, మామయ్యలకు కొంచెం జలుబు, దగ్గు ఉన్నాయి. అయితే అవి స్థలమార్పిడి, వాతావరణం మార్పుల వల్ల వచ్చినవే కానీ, మరోటి కాదు. బాబాని నమ్ముకుంటే, సర్వకాల సర్వావస్థలందు ఆయన మన వెంట నీడలా ఉండి మనల్ని కాపాడుతారు. మన క్షేమం గురించి మనకంటే ఎక్కువ బాబాకే తెలుసు. "ఇలాగే మా కుటుంబాన్ని ఎల్లవేళలా కాపాడుతూ ఉండండి సాయినాథా!".
మా అత్తయ్యవాళ్ళు వాళ్ళ ఊరిలో ఒక ఇల్లు కట్టించారు. వాళ్ళు యు.ఎస్.ఏ నుండి వచ్చాక 2021, అక్టోబరు 14, గురువారంనాడు గృహప్రవేశం అనుకున్నాము. కానీ అత్తయ్య, మామయ్యలకు జలుబు, దగ్గు ఉండటంతో ఏం చేయాలో అర్థం కాలేదు. అందువలన, 'కార్యక్రమం ఆరోజే చేసుకోవాలా లేక మరో తేదీకి మార్చుకోవాలా' అనే విషయంగా చీటీలు వేసి బాబా అభిప్రాయాన్ని అడిగాము. 'ఆరోజే చేసుకోమ'ని వచ్చింది. దాంతో బాబా నిర్ణయం ప్రకారం గురువారమే గృహప్రవేశం చేసుకున్నాము. బాబా ఆశీస్సులతో ఏ ఆటంకం లేకుండా కార్యక్రమం బాగా జరిగింది. ఆరోజు బాబాకి పూజచేసుకుని చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుని, "బాబా! మీ ఆశీస్సులు ఎల్లవేళలా ఇలాగే మాపై ఉండాల"ని వేడుకున్నాను.
గృహప్రవేశమయ్యాక ఏకాదశి, శనివారంనాడు మేము సత్యనారాయణస్వామివ్రతం చేసుకుందామనుకున్నాము. కానీ అది నా నెలసరి సమయమైనందున, "నెలసరి వలన వ్రతానికి ఆటంకం రాకుండా చూడమ"ని బాబాతో చెప్పుకున్నాను. ఆయన ఎంతో దయతో నాకు నెలసరి రాకుండా చేసి వ్రతానికి ఆటంకం లేకుండా ఆశీర్వదించారు. మన సమస్య ఏదైనా బాబాతో చెప్పుకుంటే, ఆయన మనల్ని ఆ సమస్య నుండి బయటపడేస్తారు. "బాబా! మీ కరుణాకటాక్షాలతో కరోనాను తరిమేసి అందరినీ కాపాడండి. మేము మీ దర్శనం కోసం శిరిడీ రావాలనుకుంటున్నాం తండ్రీ, మాకు మీ అనుమతినివ్వండి. మీ దృష్టి మా పిల్లలపై ఎల్లప్పుడూ ఉంచి వాళ్ళకి సద్బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదించండి. ఎల్లప్పుడూ మేమందరం నీ నామస్మరణ చేసేలా అనుగ్రహించండి సాయినాథా!".
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
బాబా మనతోనే ఉన్నారు - మన బాగోగులన్నీ చూసుకుంటారు
నా పేరు శైలజ. నేను బాబా భక్తురాలిని. బాబా మనతోనే ఉంటూ మనల్ని కాపాడుతూ ఉంటారు. మనం మనస్ఫూర్తిగా ఏది కోరినా అది తప్పకుండా చేస్తారు. ఆయన నా మీద చూపిన దయను మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. ఈమధ్య మా నాన్నగారి ఆరోగ్యం అస్సలు బాగుండేది కాదు. నాన్న ఆరోగ్యం కోసం నేను బాబాను ఎంతగానో వేడుకున్నాను. ఆయన అనుగ్రహం వల్ల నాకొక ప్రేరణ కలిగి మా అమ్మవాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఆంజనేయస్వామి గుడికి వెళ్లి అక్కడ మ్రొక్కుకుని ఆంజనేయస్వామి సింధూరం తీసుకొచ్చి నాన్నకి పెట్టాను. ఆ క్షణంనుంచే నాన్న కోలుకుని ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. "ధన్యవాదాలు బాబా. మమ్మల్ని ఎప్పుడూ ఇలాగే కాపాడుతూ ఉండు తండ్రీ. నువ్వే నాకు దిక్కు నాయనా".
నేను 2021, దసరాకి కొన్నిరోజులు ముందు, "బాబా! దసరా వస్తోంది. మీరు ఏ రూపంలో వస్తారో నాకు తెలీదుకానీ, తప్పకుండా మా ఇంటికి రండి. ప్లీజ్ బాబా!" అని బాబాను వేడుకున్నాను. బాబా నా కోరిక తీర్చారు. సరిగ్గా దసరా ముందురోజు శిరిడీ నుండి ఊదీ, ప్రసాదాల రూపంలో బాబా వచ్చారు. ఇది బాబా లీలకాక మరేంటి? బాబా నాపై చూపిన దయకి నా ఒళ్ళంతా పులకరించిపోగా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాను. బాబా మనతోనే ఉన్నారు, మన బాగోగులన్నీ చూసుకుంటారు. "బాబా! మా పెద్దమ్మాయిని పెళ్లికి ఒప్పించి ఈ ప్లవనామ సంవత్సరంలోనే తన పెళ్లి అయ్యేలా అనుగ్రహించండి. మీకు శతకోటి వందనాలు తండ్రీ!"
మనోవాంఛను నెరవేర్చిన బాబా
నేనొక సాయిభక్తురాలిని. ముందుగా, సాయిబంధువులందరికీ నమస్కారం. సాయి నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. 2021, దసరాకి నేను అమ్మవారి పూజ చేయాలని అనుకున్నాను. నాతోపాటు మా అమ్మాయితో కూడా చేయించాలని అనుకున్నాను. బాబాను అనుమతి అడిగితే, వెంటనే వారి అంగీకారం లభించింది. అంతేకాక, నేను నవరాత్రులలో జ్యోతి ప్రజ్వలన కూడా చేయాలని అనుకున్నాను. బాబా దయవలన అనుకున్నట్లే నవరాత్రులలో జ్యోతి వెలిగించి శ్రద్ధాభక్తులతో అమ్మవారిని ఆరాధించి పూజ పూర్తిచేశాము. మేము పూజ చేస్తున్న సమయంలో వరుసగా రెండు రోజులు పెద్ద బల్లి ఒకటి ఇంట్లో తిరుగుతుండేది. రెండవరోజు రాత్రి నేను పడుకునేటప్పుడు, "బాబా! ఆ బల్లి రేపు బయటికి వెళ్లిపోయేలా చూడు తండ్రీ" అని బాబాతో చెప్పుకున్నాను. మరుసటిరోజు నుండి ఆ బల్లి కనిపించలేదు. ఇది చదివినవాళ్లకు చాలా చిన్న విషయంలా అనిపించవచ్చు. కానీ, నాకు బల్లిని చూస్తే చాలా అలర్జీ. నా అనుభవాన్ని చదివిన సాయిబంధువులందరికీ ధన్యవాదాలు. "బాబా! మీ కృపాకటాక్షాలు మాపై, మీ భక్తులందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. థాంక్యూ బాబా".
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
సద్గురు సాంబశివ మహరాజ్ కీ జై!!!
ఓం సా౦ుు బాబా ఈ నెల చాలా పవిత్ర మైన ది. మీరు ఆ పరమ శివుడు. రోజు అతడు అబీషేకం చేసిన తరువాత ఆ దినమున అష్టకం చదువు తాను. ఈ నెల నాకు చాల ఇష్టము. ఓం నమః శివాయ❤❤❤
ReplyDeleteAfter abhishekam i do astakam. It is difficult to type in Telugu.
ReplyDeleteJaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness. Jaisairam
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATHAYA NAMAH..OM SAI RAM
ReplyDeleteOm Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤🤗🌺😃🌼😀🌸🥰🌹💕
ReplyDeleteసాయిరాం బాబా దేవా.. థాంక్యూ తండ్రి మన ఉషశ్రీ కి జి నారాయణమ్మ కళాశాలలో సీటు ఇచ్చినందుకు వర ప్రసాదం అందించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు సాయిబాబా
ReplyDeleteBaba ma arogya samasyalani teerchu thandri sainatha om sai ram
ReplyDeleteBaba na samasya ni tondarga teerchu thandri
ReplyDeleteBaba naku bayanga vundhi tondarga cure cheyi thandri
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete