1. 'సాయీ' అంటే 'ఓయీ' అని పలికే దైవం బాబా2. ఏ కష్టమొచ్చినా తీర్చే బాబా
3. ఎల్లప్పుడూ దయచూపే బాబా
'సాయీ' అంటే 'ఓయీ' అని పలికే దైవం బాబా
ప్రియమైన సాయిబంధువులకు నమస్కారం. భక్తులను బాబాకు అత్యంత చేరువ చేస్తున్న ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్సుమాంజలి. నా పేరు అనురాధ. ప్రతిరోజూ ఉదయాన్నే బాబాతో భక్తులకు ఉండే అనుభవాలు చదవడానికి నా మనసు ఎంతో ఆరాటపడుతుంది. కరుణాసముద్రుడైన సాయి నాకు కూడా ఎన్నో అనుభవాలను ప్రసాదించారు. అన్ని అనుభవాలలో నాకు అత్యంత ప్రియమైన, 'బాబా నాకు ప్రసాదించిన ఆధ్యాత్మిక స్థితి' అనే అనుభవాన్ని గతంలో నేను ఈ బ్లాగ్ ద్వారా మీ అందరితో పంచుకున్నాను. కర్మానుసారం నా జీవితంలో జరిగిన ఒక దుర్ఘటన నుండి మా కుటుంబాన్ని భక్తవత్సలుడు, ఆపద్బాంధవుడైన బాబా ఏ విధంగా రక్షించారో ఇప్పుడు పంచుకుంటాను. అది బాబాకు తన బిడ్డలపై ఉండే అవ్యాజమైన ప్రేమకు నిదర్శనం.
నాకు 15 సంవత్సరాల వయసులో మా మేనమామ ద్వారా బాబాపై నాకు భక్తి ఏర్పడింది. డిగ్రీ పూర్తిచేసిన తర్వాత ఒక సమస్య కారణంగా నేను ఎంతో మానసిక వేదనను అనుభవించాను. ఆ సమయంలో నేను బాబాకు మానసికంగా చాలా దగ్గరయ్యాను. కానీ, నా వివాహం నాస్తికుల కుటుంబంలోని వ్యక్తితో జరిగినందువల్ల వివాహానంతరం ఇంట్లో బాబాను పూజించే అవకాశం లేకుండా పోయింది. వివాహమైన నాలుగు సంవత్సరాల తరువాత మా ఇంట్లో ఒక దొంగతనం జరిగింది. అర్థరాత్రి సుమారు రెండు గంటల సమయంలో మాస్కు ధరించి, చేతిలో పెద్ద కత్తి పట్టుకుని ఉన్న ఒక దొంగ మేము నిద్రిస్తున్న గదిలోకి ప్రవేశించి నా భర్తను విపరీతంగా గాయపరిచాడు. ఆ శబ్దానికి నేను, రెండు సంవత్సరాల మా బాబు మేలుకున్నాము. ఆ దొంగను, విపరీతంగా రక్తం కారుతున్న నా భర్తను చూసిన నాకు 'మా జీవితాలు రేపటి సూర్యోదయాన్ని చూడవ'ని భయమేసింది. ఆ దొంగ లక్షల రూపాయల నగదు మరియు నగలు ఇవ్వమని బెదిరించాడు. నేను భయపడుతూ నా నగలు, కొంత డబ్బు అతనికి ఇచ్చాను. ఆ దొంగ అంతటితో సరిపెట్టక లాకర్ పగలగొట్టి మరికొంత డబ్బు తీసుకున్నాడు. ఇంకా తృప్తిచెందక గది అంతా వెతుకుతూనే ఉన్నాడు. అయితే ఆ దొంగ ఎక్కువసేపు గదిలోనే ఉంటే ధారాపాతంగా కారుతున్న రక్తం వలన నా భర్తకు ఏమవుతుందోనన్న భయంతో నేను నా మనసులో 'సాయి నామస్మరణం' చేయడం మొదలుపెట్టాను. నామస్మరణ ప్రారంభించిన ఐదు నిమిషాల తర్వాత అప్పటివరకు కర్కశంగా ప్రవర్తించిన ఆ దొంగ, "నీ భర్తకు ఏమీ కాదు. ప్రాణభయం లేదు, కుట్లు మాత్రమే పడతాయి" అని చెప్పి మంచినీళ్ళు త్రాగి వెళ్లిపోయాడు. వెంటనే నేను అంబులెన్స్‌కి కాల్ చేసి, అది రాగానే నా భర్తను తీసుకుని వెళ్ళి హాస్పిటల్‍లో చేర్పించాను. నా భర్తను పరిశీలించిన డాక్టర్, "వెంట్రుకవాసిలో ప్రమాదం తప్పింది. బ్రెయిన్‍కు వెళ్ళే నరం పూర్తిగా కట్ అవలేదు. అది కట్ అయివుంటే ప్రాణానికి ప్రమాదం అయ్యేద"ని చెప్పారు. తర్వాత నా భర్తకి సర్జరీ జరిగి బాబా దయవల్ల కుట్లతో బయటపడ్డారు. కానీ, నా మనసుకు ఆ సమయంలో ఆపద్బాంధవుడైన సాయినాథుడే నా భర్తను ప్రాణాపాయం నుంచి రక్షించారని తట్టలేదు. ఈ సంఘటన జరిగిన కొన్నిరోజుల తర్వాత బాబా ఒక ముస్లిం ఫకీరు రూపంలో నాకు స్వప్నదర్శనమిచ్చారు. ఆ కలలో ఎవరో ఒక వ్యక్తి నా మంగళసూత్రాన్ని లాక్కుంటుంటే, నేను బాబా నామస్మరణ చేస్తున్నాను. అప్పుడు ఆ ఫకీరు(బాబా) ఆ వ్యక్తిని ప్రక్కకు లాగిపడేశారు. అప్పుడు నాకు 'కొన్నిరోజుల క్రిందట నా భర్త ప్రాణాలు కాపాడి నాకు జీవితాన్ని, సౌభాగ్యాన్ని ప్రసాదించింది ఎవరో కాదు, ఆ దేవాదిదేవుడైన సాయినాథుడేన'ని అర్థమైంది. "ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోగలను బాబా, సదా నిన్ను స్మరించడం తప్ప". ఇంకా బాబా నాకు అలౌకికమైన అనుభవాలను ప్రసాదించారు. ముందు ముందు వాటిని మీతో పంచుకుంటాను.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!!!
ఏ కష్టమొచ్చినా తీర్చే బాబా
నేనొక సాయిభక్తురాలిని. ముందుగా, సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా కృతజ్ఞతలు. ఒకరోజు మా నాన్నగారు మా పొలానికి కలుపుమందు స్ప్రే చేశారు. మరుక్షణం మబ్బులు కమ్ముకుని వర్షం ప్రారంభమైంది. పెస్టిసైడ్ స్ప్రే చేసిన తరువాత అది పనిచేయడానికి కనీసం మూడు గంటల సమయం పడుతుంది. ఆలోగా వర్షం పడితే పెస్టిసైడ్ దాని ప్రభావాన్ని కోల్పోతుంది. అందువల్ల నేను, "బాబా! చాలా ఖర్చుపెట్టి పొలమంతటికీ స్ప్రే చేశాము. ఒక మూడు గంటల వరకు వర్షం పడకుండా చూడు తండ్రీ. అలా జరిగితే, నా అనుభవాన్ని తోటి సాయిభక్తులతో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. ఆశ్చర్యంగా అప్పటివరకు పడుతున్న చిన్నచిన్న చినుకులు ఆగిపోయాయి. ఆ రోజంతా వర్షం మళ్ళీ పడలేదు. ఇదంతా బాబా దయవలనే. "థాంక్యూ సో మచ్ బాబా. మమ్మల్ని ఎల్లవేళలా కాపాడు తండ్రీ".
నాది ప్రతి చిన్న విషయానికీ భయపడే స్వభావం. ఇటీవల ఒకరోజు రాత్రి నేను, "బాబా! నేను ప్రతి విషయానికీ భయపడుతూ నాకు తెలియకుండానే తీవ్రమైన మానసిక వేదనకు గురవుతున్నాను. నా భయాన్ని తొలగించు తండ్రీ. నేను కోరుకున్నట్లు మీరు చేసినట్లైతే నా అనుభవాన్ని ఉదయనికల్లా 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని సాయిని ప్రార్థించాను. నేను ఎప్పటినుంచో అనుభవిస్తున్న భయాన్ని సాయి ఒక్క రాత్రిలో తీసేశారు. "థాంక్యూ సో మచ్ బాబా. మమ్మల్ని ఎల్లవేళలా రక్షిస్తూ ఉండు తండ్రీ".
ఎల్లప్పుడూ దయచూపే బాబా
సాయిబంధువులందరికీ మరియు 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారాలు. నా పేరు పద్మజ. బాబా ఎల్లప్పుడూ అందరిపట్ల దయతో ఉంటారు. బాబా మాకు ప్రసాదించిన అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. 2019, నవంబరులో మేము మా ఇంటి నిర్మాణం మొదలుపెట్టగా 2020, జులైలో పూర్తయింది. బాబా కృపవల్ల ఆ సమయంలో మాకు ఏ కష్టం లేక అన్నీ సవ్యంగా జరిగాయి. జులైలో పదిమందితో గృహప్రవేశం చేసుకుని, అక్టోబరులో క్రొత్త ఇంటిలో దిగాము. ఇంట్లో జరిగే ప్రతివిషయంలోనూ బాబా నాకు తోడుగా ఉంటారు. ఏవో చిన్నచిన్న సమస్యలు వచ్చినా బాబాను ప్రార్థిస్తే, ఆయన వాటిని పరిష్కరించి అంతా సవ్యంగా నడిపిస్తున్నారు. 2021, ఏప్రిల్‍లో మావారికి, ఆయన ద్వారా నాకు కరోనా వచ్చింది. 15 రోజులు మేము చాలా బాధపడ్డాము. ఆ సమయంలో కంపెనీవాళ్ళే మాకు ఆహారం సరఫరా చేశారు. మా అబ్బాయి దగ్గరుండి మాకు సహాయం చేయగా మేము కరోనా నుండి కోలుకుని బయటపడ్డాము. ఇప్పుడు ఆరోగ్యపరంగా మేము బాగున్నాము. అంతా బాబా దయవల్లే. "ఎవరైతే ఎల్లప్పుడూ నన్ను తలుస్తారో, నన్నే రక్షకుడిగా భావిస్తారో వారిని రక్షించటానికి నేను నిరంతరం శ్రమిస్తాను, నా శిరస్సునైనా ఇస్తాను" అని బాబా అంటారు. అలాగే మమ్మల్ని రక్షించారు. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఈ అనుభవాన్ని పంచుకోవడంలో ఆలస్యమైనందుకు నన్ను క్షమించండి. మీ అనుగ్రహం ఎల్లప్పుడూ మా అందరిపై ఉండాలి బాబా".
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteOm sai ram 1st sai leela is very great. Sai saved that couple in midnight. That is sai's power. I neel down before you baba. To take your blessings ❤❤❤��
ReplyDeleteOm sai ram baba ma arogya samasyalani teerchu thandri sainatha
ReplyDelete🕉 sai Ram
ReplyDeleteOM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH..Om Sai Ram
ReplyDelete