సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 945వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాయి మహిమలు
2. పిలిచిన పలికే దైవం, దయామయుడు బాబా

సాయి మహిమలు


ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి. ముందుగా సాయిబంధువులందరికీ, ఈ బ్లాగు నిర్వాహకులకు నా నమస్కారాలు. నాపేరు శేఖర్. నేను ఏడు సంవత్సరాల నుండి  బాబాకు భక్తుడిని. బాబా నాకు ప్రసాదించిన  కొన్ని అనుభవాలు ఇంతకుముందు మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని బాబా మహిమలను మీతో పంచుకుంటున్నాను. మా అమ్మగారికి హై షివరింగ్ సమస్య ఉంది. గుంటూరులోని హాస్పిటల్లో చూపిస్తే, "ఆ సమస్య CIDP అనే దీర్ఘకాలిక వ్యాధి అని, లక్షల్లో ఒకరిద్దరికి వస్తుంద"ని చెప్పారు. ఆ వ్యాధి కారణంగా మందులు వాడుతున్నా అమ్మ నడవలేకపోతున్నారు. ఎప్పుడూ ఎవరో ఒకరు పక్కనుండి సహాయం అందించాలి. ఈ సమస్యని నయం చేయమని నేను సాయిబాబాను ప్రార్థిస్తున్నాను. ఇకపోతే 2021, సెప్టెంబర్ 13న సచివాలయంలో పని ఉండి నేను మా అమ్మగారిని తీసుకుని వెళ్ళాను. నరాల బలహీనత ఉన్నందువల్ల అమ్మ ఫింగర్స్ స్కాన్ చేస్తుంటే మిషన్ తీసుకోలేదు. దాంతో వాళ్ళు ఆధార్ అప్డేషన్ సెంటరులో చేయించుకోమన్నారు. కానీ అమ్మ సరిగా నడవలేరు. అందువల్ల నాకు ఏం చేయాలో అర్థంకాక బాబా మీద భారం వేసి, నాన్నకి చెప్పి వాళ్ళిద్దరిని ఆధార్ అప్డేషన్ సెంటరుకి పంపించాను. బాబా దయవల్ల ఎలాంటి సమస్యలు లేకుండా ఫింగర్స్ స్కాన్ అయ్యాయి.


2021, సెప్టెంబర్ 21న ఒకటే వర్షం పడుతుంటే నేను, "వర్షం తగ్గేలా చూడమ"ని బాబాని ప్రార్ధించాను. కాసేపట్లో వర్షం తగ్గిపోయింది. నేను కెసిపి సిమెంట్స్ వారి కిడ్స్ స్కూలులో కంప్యూటర్ టీచరుగా పనిచేస్తున్నాను. ఇదివరకు కరోనా తీవ్రంగా ఉన్నందువలన స్కూల్స్ లేవు. ఆరు, ఏడు నెలల తర్వాత మా స్కూలు ప్రిన్సిపాల్ నాకు ఫోన్ చేసి నన్ను స్కూలుకి రమ్మని చెప్పారు. అలాగే వ్యాక్సిన్ వేయించుకున్న రిపోర్టు తెమ్మన్నారు. బాబా చేసిన చమత్కారం చూడండి. ప్రిన్సిపాల్ కాల్ చేయడానికి సరిగ్గా కొన్ని నిమిషాల ముందే నర్సు ఫోన్ చేసి రెండో డోసు కో-వ్యాక్సిన్ వేయించుకోడానికి రమ్మని చెప్పింది. కానీ ఆ రోజు నాకు వేరే పని ఉండటం వల్ల వ్యాక్సిన్ వేయించుకోడానికి వెళ్లలేక, ముందే వ్యాక్సిన్ వేయించుకుని ఉంటే బాగుండేదని కాసేపు బాధపడ్డాను. కానీ బాబా దయవలన రెండో డోస్ వ్యాక్సిన్ వేసుకోకపోయినా ఏ ఇబ్బందీ లేకుండా నేను స్కూల్లో జాయిన్ అయ్యాను. అయితే అన్నిరోజులు స్కూలు లేనందున నేను కంప్యూటర్ ల్యాబ్‍లో ఉపయోగించే పాస్వర్డ్ మర్చిపోయాను. నాతో పనిచేసే ఇద్దరికీ ఫోన్ చేసి అడిగినా ప్రయోజనం లేకపోయింది. అప్పుడు నేను బాబాను ప్రార్థించి, ఆయన నామాన్ని స్మరిస్తూ ఉండగా కాసేపట్లో బాబా కృపవల్ల నాకు పాస్వర్డ్ గుర్తుకు వచ్చి సమస్య పరిష్కారమైంది. తరువాత వారానికి వ్యాక్సిన్ వేయించుకున్నాను. బాబా కృప వలన ఏ సమస్యా రాలేదు.


నేను మా స్కూల్ ప్రిన్సిపాల్ కి మరియు ముగ్గురు టీచర్లకి 'శ్రీసాయి సచ్చరిత్ర' పుస్తకాలు ఇద్దామనుకున్నాను. కానీ ఏ రోజు ఇస్తే బాగుంటుందో అని నెట్లో వెతుకుతుంటే, '1838, సెప్టెంబర్ 27' అన్న తేదీ కనిపించింది. ఆశ్చర్యంగా అదేరోజున అంటే సెప్టెంబర్ 27న సాయి సచ్చరిత్ర పుస్తకాలు కొరియర్ ద్వారా నాకు అందాయి. దాంతో అదేరోజు పుస్తకాలు పంపిణీ చేయాలన్నది బాబా సంకల్పంగా తలచి ఆ పుస్తకాలను నేను ఇవ్వదలచిన వాళ్ళకి ఇచ్చాను. తరువాత నేను 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు తెరిస్తే, "గురువు యొక్క గ్రంథాన్ని పఠిస్తే భక్తులు పవిత్రులౌతారు. గ్రంథాన్ని పారాయణ చేస్తే శుభం కలుగుతుంది. పరమేశ్వరుడు ప్రసన్నుడౌతాడు. భవబంధనాలు విడిపోతాయి" అన్న సాయి వచనం దర్శనమివ్వడంతో నేను ఆశ్చర్యపోయాను.


గత కొన్నిరోజులుగా నేను నా తల్లిదండ్రుల గురించి బాగా ఆందోళన చెందుతూ, 'వాళ్ళు ఈ జన్మ తరువాత స్వర్గానికి వెళ్తారా? లేక నరకానికా? లేదా మోక్షం వరిస్తుందా?' అని చాలా ఆలోచిస్తున్నాను. నరకం తలుపుకు రాగానే నాకు మా నాన్న గుర్తుకు వచ్చేవారు. ఎందుకంటే, 'నాన్న ఎక్కువగా దేవుడిని పూజించరు. నా చిన్నతనంలో ఆయనకి దేవుడిపట్ల ఉన్న నమ్మకం ఇప్పుడు లేదు'. అందువలన నాన్న గురించే ఎక్కువగా ఆలోచించేవాడిని. ఆయనకి నరకం ప్రాప్తిస్తుందా అని అప్పుడప్పుడు నాకు చాలా భయం వేసేది. అవే ఆలోచనలతో నేను 2021, అక్టోబర్ 6, ఉదయం ఇంటర్నెట్లో పితృకర్మ గురించి సెర్చ్ చేస్తుంటే, కింద ఇవ్వబడ్డ బాబా మెసేజ్ వచ్చింది.

తెలుగు అనువాదం: 'బిడ్డా! నేను ఉండగా భయమెందుకు? నేను నీకు మాటిస్తున్నాను, 'నేను నీ కుటుంబమంతటిని జాగ్రత్తగా చూసుకుంటాను. వాళ్ళు నన్ను పూజిస్తారా, లేదా అన్నది విషయం కాదు'. నువ్వు నా భక్తుడివి. నీ కుటుంబమంతా నా భాద్యత'.


అదేరోజు మధ్యాహ్నం ఈ బ్లాగులో కింది సాయి వచనం కనిపించింది. 

పై రెండూ మెసేజ్లను చూడగానే నాకు చాలా చాలా సంతోషం కలిగింది.


ఇలా బాబా మనం ఉన్న పరిస్థితికి తగ్గట్టు 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా సందేశాలు ఇస్తున్నారు. నేను ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు శ్రీసాయిబాబాను అడుగుతాను. ఆయన 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా సాయి వచనాల రూపంలో నాకు సమాధానం ఇస్తున్నారు. బాబా మన కళ్ళముందే ఉన్నారనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంది? సాయిబాబా అనంతుడు. ఆయన సర్వవ్యాపి, బాహ్యాంతరాలలో నిండి ఉన్నారు. "ధన్యవాదాలు బాబా. ఎల్లప్పుడూ మమ్మల్ని రక్షించండి తండ్రీ. నా జీవితమంతా సదా మీ సేవలో, స్మరణలో ఉండాలని కోరుకుంటున్నాను బాబా". చివరిగా అందరూ 'శ్రీసాయి సచ్చరిత్ర' పారాయణ చేసి బాబా అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా సాయిబాబాను ప్రార్థిస్తున్నాను. ఇంకా ఈ అవకాశమిచ్చిన సాయిబాబాకి, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వాహకులకు చాలా ధన్యవాదాలు.


పిలిచిన పలికే దైవం, దయామయుడు బాబా


సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు అంజలి. నేనిప్పుడు ఈమధ్య బాబా నాపై చూపిన ప్రేమను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 2021, సెప్టెంబర్ రెండో వారంలో నా కుడికాలి మడం బాగా వాచింది. ఎందుకలా వాపు వచ్చిందో నాకు అర్థం కాలేదు కానీ, బాబాని వేడుకుని రెండు రోజులు వాకింగ్ చేశాను. బాబా దయవల్ల వాపు పూర్తిగా తగ్గిపోయింది. తరువాత ఒకసారి వారం రోజులపాటు కుడివైపు పన్ను నొప్పి, దాంతోపాటు తలనొప్పి కూడా బాగా ఉండేది. చివరికి ఒకరోజు నేను, "బాబా! నా ఈ బాధను మీరే ఎలాగైనా తగ్గించాలి" అని బాబాను ప్రార్థించి, ఊదీ పెట్టుకున్నాను. ఆ రాత్రి కాస్త ఉపశమనంగా అనిపించింది. కానీ మరుసటిరోజు ఉదయం తింటుంటే బాగా నొప్పిగా అనిపించింది. ఎందుకు అంత నొప్పి వస్తుందో అప్పటివరకూ అర్థం కానిది, అప్పడు అర్థమైంది. అసలు విషయమేమంటే, ఆ పన్ను అదివరకు సగం విరిగిపోయింది. మిగిలిన సగభాగం కొంచెంగా కదులుతుండటం వలన బాగా నొప్పి వస్తుంది. అది గ్రహించాక వెంటనే నేను డెంటిస్ట్ దగ్గరకు వెళదామని అనుకున్నాను. అయితే ఆదివారం డాక్టరు లేనందున మరుసటిరోజు రమ్మన్నారు. ఇక చేసేదిలేక బాబాకి దణ్ణం పెట్టుకుని, "ఎలాగైనా ఈ బాధ నుండి నన్ను కాపాడు తండ్రీ" అని వేడుకున్నాను. ఇంకా కదులుతున్న ఆ పన్నును బాబాని తలుచుకుంటూ నేనే నా చేత్తో పీకేసాను. బలవంతంగా లాగినందువల్ల రక్తం చాలా పోతుందేమోనని భయపడ్డాను. కానీ బాబా దయవల్ల కొంచెం రక్తం మాత్రమే పోయింది. ఇక అప్పటినుండి నొప్పి లేదు. అంతా బాబా దయ. పిలిచిన వెంటనే పలికే దైవం, దయామయుడు నా తండ్రి.


మన బ్లాగులోని అనుభవమాలికలో వేరే భక్తులు పంచుకున్న లిఫ్ట్ కి సంబంధించిన ఒక అనుభవం చూశాక నాకు కూడా జరిగిన అటువంటి అనుభవం గుర్తుకువచ్చి మీతో పంచుకుంటున్నాను. మేము ఈమధ్య  బాబా అనుమతితో గుంటూరులో ఒక ఫ్లాట్ తీసుకున్నాము(దానికి సంబంధించిన పూర్తి అనుభవం కొద్దిరోజుల్లో పంచుకుంటాను). రెండోసారి ఆ ఫ్లాట్ చూడటానికి వెళ్ళినప్పుడు 5వ అంతస్థులో ఉన్న ఆ ఫ్లాట్ చూసి తిరిగి లిఫ్ట్ లో వస్తుంటే, లిఫ్ట్ మధ్యలో ఆగిపోయింది. ఏ ఫ్లోర్ లో ఉన్నామో అర్థం కాలేదు. లిఫ్ట్ తలుపులు క్లోజ్డ్ గా ఉన్నందున నాకు చాలా భయమేసింది. తలుపులు తెరవడానికి ప్రయత్నిస్తున్నా తలుపు తెరుచుకోలేదు. ఇంకా నేను బాబాని తలుచుకుని, "ఏ ప్రమాదమూ జరగకుండా నువ్వే ఎలాగైనా కాపాడాలి బాబా" అని వేడుకున్నాను. అలా బాబాని వేడుకున్న కొంతసేపటికి లిఫ్ట్ తలుపు తెరుచుకుంది. బాబా దయవల్ల ఏటువంటి ఇబ్బందీ లేకుండా అందరమూ బయటపడ్డాము. పిలిస్తే పలికే దైవం నా తండ్రి. "ధన్యవాదాలు బాబా. ఈ అనుభవం పంచుకోవడం ఆలస్యమైంది నన్ను క్షమించు బాబా".


2021, అక్టోబర్ 1, శుక్రవారం నాడు నేను ట్రేడింగ్ బిజినెస్స్ లో పెట్టిన డబ్బులు నష్టపోతానేమో అనిపించి నాకు చాలా బాధేసి బాబాను, "డబ్బులు నష్టపోకుండా కాపాడమ"ని వేడుకున్నాను. బాబా దయతో నా డబ్బులు పోకుండా కాపాడారు. "వేలవేల కృతజ్ఞతలు బాబా. మీ దయ నా మీద, నా కుటుంబం మీద, అందరి మీద ఎప్పుడూ ఇలాగే ఉండేలా చూడండి బాబా. ఇంకో ముఖ్యమైన పని జరగవలసి ఉంది బాబా. అదేంటో మీకు తెలుసు. అది జరిగిన తరువాత ఆ అనుభవాన్ని కూడా తోటి భక్తులతో పంచుకోవాలని ఆశపడుతున్నాను బాబా".


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!



8 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  2. Jaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness. Jai sairam

    ReplyDelete
  3. Om sai ram i felt happy after reading sai leelas. I liked all experiences. My head is reling (tala tirangadamu). Please slove this problem, ❤❤❤����

    ReplyDelete
  4. OM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH..Om Sai Ram

    ReplyDelete
  5. Om sai ram baba ma arogya samasyalani teerchu thandri sainatha

    ReplyDelete
  6. Om sai ram baba amma arogyam bagundali thandri sainatha

    ReplyDelete
  7. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤🥰🌸😃🌹😀🌺🤗🌼

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo