1. డాక్టర్లు చేతులెత్తేసాక బాబా చూపిన కరుణ
2. బాబాకి చెప్పుకున్నాక దొరికిన తాళాలు
డాక్టర్లు చేతులెత్తేసాక బాబా చూపిన కరుణ
నా పేరు యశోద. మాది అనంతపురం. ముందుగా సాయి బంధువులకు నా నమస్కారాలు. నేను ఇప్పుడు పంచుకోబోయే అనుభవం దాదాపు 14 సంవత్సరాల క్రితం జరిగింది. ఈ అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఇన్నాళ్ళకు బాబా అనుగ్రహించారు. బాబాకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ విషయాన్ని వివరిస్తున్నాను. నాకు ఒక అక్క, ఒక తమ్ముడు. తమ్ముడు 2005వ సంవత్సరంలో గుండెపోటుతో మరణించాడు. తనకి ఒక పాప(లక్ష్మి), బాబు(ఈశ్వర్) ఉన్నారు. తమ్ముడికి తన కూతురు అంటే చాలా ప్రేమ. తను చనిపోయినప్పటి నుండి ఆ పాప ఆరోగ్యం బాగా దెబ్బతింది. 2009వ సంవత్సరం మే నెలలో తనకి మూర్చ వచ్చింది. వాళ్ళప్పుడు ప్రొద్దుటూరులో ఉండేవాళ్లు. అక్కడి డాక్టర్లు చూసి, "పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. వెంటనే పాపని కర్నూలు హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళండి" అని చెప్పారు. దాంతో వాళ్లు పాపని కర్నూలు తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడ డాక్టర్లు, "పాప పరిస్థితి చేయి దాటిపోయింది. తను బ్రతకడం కష్టం. మీ వాళ్ళందరికీ తెలియజేయండి" అని చెప్పేసారు. వాళ్ళు మా అందరికీ విషయం తెలిపారు. మేము వెళ్లి పాపని చూసి రావాలనుకుంటే మూడునెలల గర్భిణీ అయినా మా అమ్మాయి కూడా వస్తానంది. కాదనలేక బాబాపై భారమేసి తనని కూడా తీసుకొని కర్నూల్ వెళ్ళాము. ఆస్పత్రిలో ఆ పాపని చూడగానే నాకు ఏడుపొచ్చింది. తనని ఐసీయూలో ఉంచి తన కాళ్ళుచేతులు మంచానికి కట్టేసి ఉన్నారు. హాస్పిటల్ స్టాఫ్‌ను రిక్వెస్ట్ చేసి ఐసియులోకి వెళ్ళాక నేను పాప నుదుటన బాబా ఊదీ పెట్టి, తన తలదిండు కింద బాబా ఫోటో ఉంచి, "నేను బాబాను నమ్మినది నిజమైతే మేము కర్నూలు వదిలి వెళ్లేలోగా అమ్మాయి కళ్ళు తెరవాల"ని ఏడుస్తూ బాబాను వేడుకున్నాను. అందరూ వచ్చి పాపను చూసి వెళుతున్నారు. మేము కూడా రాత్రి 10 గంటలకు కర్నూలు నుండి అనంతపురం వెళ్ళడానికి బయలుదేరాము. అప్పుడు బాబా చేసిన లీల చూడండి. ఆయన ఎంత దయ చూపించారో వ్రాస్తుంటే నా కళ్ళల్లో నీళ్లు నిండిపోతున్నాయి. మేము కర్నూలు కూడా దాటలేదు. మా తమ్ముడు భార్య ఫోన్ చేసి, "అక్కా! పాప కళ్ళు తెరిచి అమ్మ అని పిలిచింది" అని చెప్పింది. అది విని నాకు ఎంత ఆనందం కలిగి ఉంటుందో మీరే ఊహించండి. మేము వెంటనే కారు వెనక్కి తిప్పి హాస్పిటల్‌కి వెళ్ళాము. పాప కళ్ళు తెరిచి చూస్తుంది. అయితే వాళ్ళ అమ్మను తప్ప ఎవరినీ గుర్తించలేదు. వెళ్లిపోయిన బంధువులు కూడా వెనక్కి తిరిగి హాస్పిటల్‌కి వచ్చారు. డాక్టర్లు ఎంత ఆశ్చర్యపోయారంటే, "నిజంగా ఇది మిరాకిల్. మెడికల్ హిస్టరీలోనే ఇలాంటి అద్భుతం జరగలేద"ని అన్నారు. వారం రోజులలో పాప ఆరోగ్యం బాగై వాళ్ళు ప్రొద్దుటూరు వెళ్లిపోయారు. మా తమ్ముడి భార్య, "ఇదంతా బాబా చూపిన దయ" అని చాలా సంతోషించింది. ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్ళై ఇద్దరు బాబులున్నారు. హైదరాబాద్‌లో విప్రో కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. ఎంతని వర్ణించను మన సాయినాథుని అవ్యాజమైన ప్రేమ, కరుణలు. ఈ విషయం మీ అందరితో పంచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సాయినాథుని ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
బాబాకి చెప్పుకున్నాక దొరికిన తాళాలు
సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు గౌతమి. బాబా నాకు ప్రసాదించిన ఒక చిన్న అనుభవం మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. తద్వారా సాయి మనకి చిన్న చిన్న విషయాలలో కూడా ఎంతగా తోడు ఉంటారో అర్ధమవుతుంది. నాకు ఒక బండి ఉంది. దానికి రెండు తాళాలు ఉండగా కొన్నిరోజుల క్రితం ఒక తాళం కనిపించకుండా పోయింది. ఎంత వెతికినా చాలారోజుల వరకు దొరకలేదు. ఇంకా వెతకడం మానేసి రెండో తాళంతో గడిపేసాను. ఒక రోజు అది కూడా పోయింది. అప్పడు నాకు ఏం చేయాలో అర్ధం కాలేదు. బాబాకి మనసారా దణ్ణం పెట్టుకొని, "బాబా! తాళం దొరికితే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. ఆశ్చర్యంగా మరుసటిరోజు రెండు తాళాలూ దొరికాయి. ఇది చిన్న విషయమే కానీ బాబా పిలిచిన వెంటనే పలుకుతారనడానికి ఇది ఒక నిదర్శనం. "ధన్యవాదాలు బాబా".
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sree sainadhaya namaha
Deleteఓం సాయిరామ్
ReplyDeleteOm sri sainathayya namah
ReplyDeleteOm Sai ram
ReplyDeleteBaba arogyam prasadinchu om sai Sri sai jeya jeya sai
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteOm sai sri sai jaya jaya sai
ReplyDelete🍀🍀🍀Om Sai Ram 🌳🌳🌳
ReplyDeleteOm Sai Sri Sai Jai Sai Ram
ReplyDeleteOm sai ram
ReplyDelete