- అంతా బాబా దయ
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసాయినాథ్ మహారాజ్ కీ జై!!!
సాయి బంధువులకు నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. ఒకరోజు నేను పని మీద బయటకు వెళ్తూ దారిలో బాబా గుడికి వెళ్లి దర్శనం చేసుకుని వెళ్లాను. తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు అటుఇటు చూసుకొని వాహనాలేవీ రావడం లేదని అనిపించినప్పుడే రోడ్డు దాటబోయాను. కానీ అంతలో ఎక్కడినుంచి వచ్చిందో అతివేగంగా ఒక మోటార్ సైకిల్ నన్ను క్రాస్ చేసింది. క్షణకాలంపాటు నాకు అస్సలు ఏం తెలియలేదు. ఆ షాక్ నుండి తేరుకొని చూస్తే, ఆ మోటార్ సైకిల్ అతను కొద్ది దూరంలో ఆగి చూసుకుంటున్నాడు. బాబా దయవల్ల రెప్పపాటు కాలంలో ప్రమాదం నుంచి నేను తప్పించుకున్నాను, అతనికి కూడా ఏమీ కాలేదు. కేవలం నా కుడి చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగుకి తగిలినట్లుగా అనిపించింది. ఆరోజు నాకు నొప్పి ఏమీ లేదు కానీ, మరుసటిరోజు నుంచి కుడిభుజంలో కొద్దిగా నొప్పి మొదలైంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నాకు రెండు చేతుల భుజాలకు సమస్య(wear&tear, అరుగుదల) ఉంది. ఐదు సంవత్సరాల క్రిందట రెండు భుజాలకు ఫ్రోజెన్ షోల్డర్ సమస్య వచ్చి చేతులు పైకి, పక్కకు కదలని పరిస్థితి ఏర్పడింది. బాబా దయవలన ఆ సమస్య నుండి కోలుకున్నాను. ఇప్పుడు ఆ మోటార్ సైకిల్ సంఘటనలో చేతికి బలంగా దెబ్బ తగిలిందేమో అని భయమేసి ఆర్తిగా బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల పక్క రోజుకి నొప్పి తగ్గింది. సుమారు పది రోజులు తర్వాత అదే చేతికి మరలా దెబ్బ తగిలి విపరీతమైన నొప్పితో వంట పని కూడా చేయలేకపోయాను. మరల బాబాను ఆర్తిగా వేడుకుని, "నొప్పి తగితే, బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాను" అని అనుకోని ఊదీ రాసుకోసాగాను. బాబా దయతో నొప్పి కొంచెం తగ్గింది. "ధన్యవాదాలు బాబా. నొప్పి పూర్తిగా తగ్గేలా అనుగ్రహించండి బాబా".
ఒకసారి నేను, మావారు, మా అమ్మాయి 12 రోజుల విహారయాత్రకని విదేశాలకు వెళ్ళాము. వెళ్లేముందు నేను శ్రీసాయిలీలామృతం సప్తాహ పారాయణం చేసి, ప్రయాణానికి ముందురోజు బాబా గుడికి వెళ్లి, "బాబా! మాతో కూడా ఉండి యాత్ర బాగా జరిగేలా దీవించండి" అని వేడుకున్నాను. కానీ అక్కడ ఫ్లైట్ దిగిన వెంటనే కొన్ని ప్రతికూల ఆలోచనలు మొదలై నాకు కొంచెం భయంగా అనిపించింది. మనసులోనే బాబాని తలుచుకొని, "బాబా! మీరు నాతో ఉన్నారని అభయాన్ని ఇవ్వండి. ఫోటో రూపంలో కనిపించి మెసేజ్ ఇవ్వండి" అని వేడుకున్నాను. తర్వాత 'సాయి మహారాజ్ బ్లెస్సింగ్స్' గ్రూపులో అనుభవాలు చదువుతుంటే ఒక భక్తురాలు తన అనుభవాలను బాబా ఫోటోలతో సహా పంచుకున్నారు. అవి చూసి నాకు చాలా ధైర్యం వచ్చింది. తర్వాత యాత్రలో ఉన్నప్పుడు నాకు, మా వారికి విపరీతమైన జలుబు చేసి, మావారికి కొద్దిగా జ్వరం కూడా వచ్చింది. అయితే బాబా ఊదీతో ఒకరోజులోనే అవి తగ్గిపోయి నార్మల్ అయ్యాము. సరిగా అదే సమయంలో మా అమ్మాయి ఒక ముఖ్యమైన ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి వచ్చింది. అప్పుడు నేను, "బాబా! అమ్మాయి ఆరోగ్యంగా ఉండి, ఇంటర్నెట్ కనెక్టివిటీ బాగుండి ఇంటర్వ్యూ బాగా చేస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయవల్ల అమ్మాయి ఇంటర్వ్యూ చాలా బాగా చేసింది. తిరుగు ప్రయాణంలో అసాధారణ పరిస్థితుల వల్ల దాదాపు 40 నిమిషాలపాటు ఫ్లైట్ కుదుపులు వచ్చాయి. ఆ సమయంలో నేను బాబా నామస్మరణ చేసుకుంటూ కూర్చున్నాను. బాబా అనుగ్రహం వల్ల ఎటువంటి కష్టనష్టాలు లేకుండా యాత్ర ముగించుకొని క్షేమంగా ఇల్లు చేరాము.
మరోసారి మావారికి ఛాతిలో నొప్పిగా అనిపించింది. డాక్టర్ దగ్గరకి వెళ్ళమంటే పని ఒత్తిడి వల్ల అని చెప్పి ఊరుకున్నారు. నేను అప్పుడు నాకు దిక్కు, మొక్కు, సర్వస్వము అయిన నా సాయితండ్రిని శరణవేడాను. గుడికి వెళ్లి, "భయంగా ఉంది బాబా. మీరే దిక్కు, నొప్పి తగ్గిపోయేలా చూడండి" అని దణ్ణం పెట్టుకున్నాను. తరువాత ఆరోజు బ్లాగులో అనుభవాలు చదువుతుంటే, "భయపడకు. ఈ మసీదు తల్లిని ఆశ్రయిస్తే ఎటువంటి కష్టమైనా తీరవలసిందే" అని సాయి వచనం వచ్చింది. మరుసటిరోజు ఉదయం నిద్రలేస్తూనే 'సాయి మహారాజ్ బ్లెస్సింగ్స్' గ్రూపులో అనుభవాలు చూస్తే ఒక భక్తురాలు 'తనకి ఛాతిలో నొప్పి వచ్చిందని, బాబా ఊదీ నీళ్లు తాగితే నొప్పి తగ్గిపోయింద'ని పంచుకున్నారు. అప్పటినుంచి మావారికి కూడా నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. తర్వాత డాక్టర్ దగ్గరకి వెళ్తే, 'యాసిడ్ రిఫ్లెక్' వల్ల వచ్చిన నొప్పి అని చెప్పారు. అంతా బాబా దయ. "ధన్యవాదాలు బాబా. నా భర్తకి పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది బాబా. అది తట్టుకునే శక్తిని ప్రసాదించు తండ్రీ. సర్వకాల సర్వావస్థలందు నా భర్త, బిడ్డల వెన్నంట ఉండి కాపాడు తండ్రీ. మీ భక్తులందరినీ చల్లగా చూడు తండ్రీ".
అంత సాయి మాయం, ఓం సాయిరాం
ReplyDeleteOm sairam
DeleteOm sai ram
DeleteOm sai sri sai jaya jaya Sai
DeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
ఈ రోజు సాయి లీలలు చాలా బాగా వున్నాయి.చాలా బాగా రాసారు.ఓం సాయి రామ్
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sri Sainthaya namah
ReplyDeleteOm Sai Sri Sai Jai Sai 🙏🙏🙏
ReplyDeleteOm Srisairam
ReplyDeleteOm Srisairam
Om Srisairam
ఓం సాయిరామ్
ReplyDeleteOm Sai ram
ReplyDeleteOm sri sainth maharaj ki jey
ReplyDelete