సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1561వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాయిమాత ఎల్లవేళలా మనతో ఉంటారు
2. సమస్య చిన్నదైనా, పెద్దదైనా బాబా తోడుగా ఉంటే ఏ సమస్యా మనల్ని ఏమీ చేయలేదు

సాయిమాత ఎల్లవేళలా మనతో ఉంటారు


నా పేరు బాలాజీ. ఇటీవల నేను శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం చదివాను. ఆ పారాయణ పూర్తైనరోజు నా మనసులో, "నేను శిరిడీ చాలాసార్లు సందర్శించాను. బాబా దత్తావతారమైనందున నేను పిఠాపురం, గాణ్గాపురం వంటి దత్తక్షేత్రాలను కూడా సందర్శించాలి" అని ఒక ఆలోచన వచ్చింది. సమీపంలో మా వివాహ వార్షికోత్సవం ఉన్నందున ఆ సందర్భంగా ఏదో ఒక దత్తక్షేత్రం సందర్శించాలని అనుకున్నాను. కానీ వేసవికాలం కావడం వలన ఆయా ప్రదేశాలు చాలా వేడిగా ఉంటాయి, వాటిని సందర్శించడం కష్టమని నాకు అనిపించింది. అంతటితో నేను ఆ ఆలోచన గురించి పూర్తిగా మర్చిపోయాను. తర్వాత మా వివాహ వార్షికోత్సవం వచ్చింది. ఆ రోజున మేము హొరనాడు అన్నపూర్ణేశ్వరి మరియు శృంగేరి శారద ఆలయాల దర్శనానికి వెళ్ళాము. తిరుగు ప్రయాణంలో మేము చిక్‌మంగుళూరు మీదుగా వస్తూ దారిలో బాబా బుడాన్‌గిరి దత్తపీఠానికి వెళ్ళాము. దత్తపీఠం చేరుకున్న వెంటనే దత్తక్షేత్రాన్ని దర్శించాలన్న నా మది కోరిక నాకు గుర్తొచ్చింది. అప్పటివరకు నాకు ఆ విషయం అస్సలు గుర్తులేదు. నేను మరచిపోయినప్పటికీ నా సాయిబాబా/మాత నా కోరికను నెరవేర్చారని చాలా సంతోషించాను. ఆ విధంగా మేము సాయిమాత అపారమైన అనుగ్రహాన్ని పొందాము. ఆయన ఎల్లప్పుడూ మమ్మల్ని సంరక్షిస్తున్నారు.


2023, జూన్ 13న మా అబ్బాయి తన ఆఫీసుకి వెళ్ళడానికి ఎప్పటిలాగే మెట్రో స్టేషన్‌కి వెళ్ళాడు. అక్కడ తన బ్యాగును స్కానింగ్ మెషీన్ వద్ద పెట్టి, తను సెక్యూరిటీ చెకప్‌కి వెళ్ళాడు. తర్వాత బ్యాగు కోసం స్కానింగ్ మెషీన్ వద్దకొస్తే అక్కడ తన బ్యాగు లేదు. వేరే ఎవరిదో బ్యాగు అక్కడ ఉంది. రద్దీ సమయం కావడం వలన ఎవరో హడావిడిలో తన బ్యాగు అనుకొని పొరపాటున మా అబ్బాయి బ్యాగు తీసుకొని వెళ్ళిపోయారు. మా అబ్బాయి వెంటనే మెట్రో అధికారులకు ఫిర్యాదు చేసి ఆ వ్యక్తి తన బ్యాగు కోసం వెనక్కి వచ్చి, తన బ్యాగు తనకిస్తాడన్న ఆశతో అక్కడే వేచి చూడసాగాడు. ఆ బ్యాగులో మా అబ్బాయి ఆఫీసు ల్యాప్‌టాప్, ఐప్యాడ్, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు వంటి చాలా విలువైన వస్తువులున్నాయి. మా అబ్బాయి నాకు ఫోన్ చేసి విషయం చెప్పే సమయానికి నేను నా రోజువారీ పూజకు కూర్చుంటున్నాను. నేను సాయిని, "సహాయం చేయండి బాబా" అని ప్రార్థించాను. పూజ పూర్తయ్యేలోపు మా అబ్బాయి నాకు ఫోన్ చేసి, "నా బ్యాగు తీసుకెళ్లిన వ్యక్తి దాదాపు 15 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశాక బ్యాగులు మారిపోయినట్టు గుర్తించి, బ్యాగులో ఉన్న నా విజిటింగ్ కార్డు చూసి నాకు ఫోన్ చేశాడు" అని చెప్పాడు. అలా సాయి అనుగ్రహంతో మా అబ్బాయి చేతికి తన బ్యాగు తిరిగి వచ్చింది. మనల్ని కాపాడుతూ మన శ్రేయస్సు చూసుకోవడానికి సాయిమాత ఎల్లవేళలా మనతో ఉంటారని గుర్తుచేయడానికి ప్రతిరోజూ ఇలాంటి ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. నేను ఎక్కువ సమయం తీసుకోకుండా సాయిమాత అనుగ్రహాన్ని సాటి సాయిభక్తులతో పంచుకొని ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయాలనుకొని వెంటనే అనుభవాన్ని బ్లాగుకు పంపాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

 

ఓం శ్రీ సమర్థ సద్గురు సచ్చిదానంద సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


సమస్య చిన్నదైనా, పెద్దదైనా బాబా తోడుగా ఉంటే ఏ సమస్యా మనల్ని ఏమీ చేయలేదు


సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు రమ్య. బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని మొదటిసారి నేను ఈ బ్లాగులో పంచుకుంటున్నాను. 2023, జూన్ మూడవ వారంలో నా మర్మావయవాలలో చాలా నొప్పి ఉండేది. కూర్చున్నా, బాత్రూమ్‌కి వెళ్లినా మంటగా అనిపించేది. ఆ ప్రదేశంలో చిన్న చిన్న పొక్కులు కూడా వచ్చాయి. మందులు వాడినా ఫలితం కనపడలేదు. ఏదైనా సమస్యేమోనని నాకు చాలా భయమేసి మనసులోనే, "బాబా! నా బాధ తగ్గితే మీ అనుగ్రహాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకున్నాను. తర్వాత మందులు వాడుతూనే నీళ్లలో ఊదీ వేసుకొని త్రాగాను. అంతే! మూడురోజుల్లో నాకు ఆ సమస్యనుండి ఉపశమనం లభించింది. ఇప్పుడు నొప్పి లేదు. అంతా ఆ బాబా దయ. సమస్య చిన్నదైనా, పెద్దదైనా బాబా తోడుగా ఉంటే ఏ సమస్యా మనల్ని ఏమీ చేయలేదు. "ధన్యవాదాలు బాబా. నా జీవితంలోని ఒక గడ్డుసమస్య నుండి నన్ను బయటపడేయండి. అదే జరిగితే ఆ అనుగహాన్ని కూడా తోటి భక్తులతో సంతోషంగా పంచుకుంటాను తండ్రీ. అందరూ బాగుండాలి, అందులో మేమూ ఉండేలా ఆశీర్వదించు సాయిదేవా".



5 comments:

  1. Om sairam ma ayana nannu ardham cheskoni nakosam thirigi vacheyyali sai naku na barthatho kalisi brathike adrustanni prasaddinchu sa

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. Om Sai Sri Sai Jai Sai

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo