- వారణాశి - నేపాల్ యాత్రలోని బాబా అనుగ్రహం
ఆత్మీయ సాయి బంధువులారా! నా పేరు సూర్యనారాయణమూర్తి. నేను ఇప్పుడు 2023, ఏప్రిల్ నెలలోని నా వారణాసి - నేపాల్ యాత్రలో బాబా కురిపించిన అమృతధారలను మీతో పంచుకొంటున్నాను. ముందుగా కొంచం ఆలస్యమైనందుకు బాబాని మున్నించమని కోరుకుంటున్నాను.
2023, ఏప్రిల్ 9వ తేదీన హైదరాబాదు నుంచి కొందరు, ఇతర ప్రదేశాల నుంచి మరికొందరు కలిసి మొత్తం సుమారు 160 మంది యాత్రికులం వారణాశి - నేపాల్ యాత్రకి బయలుదేరి ఏప్రిల్ 10వ తేదీ, సోమవారం మధ్యాహ్నం సుమారు 2 గంటలకు వారణాశి చేరుకున్నాము. అందరం స్నానాదికాలు ముగించుకొని సాయంత్రం 4 గంటలకి విశ్వనాథుని దర్శనానికి వెళ్ళాము. ఆరోజు విపరీతమైన రద్దీ ఉండటం వలన నేను, "బాబా! మీరు సాక్షాత్తు ఈశ్వరులే. దయతో మీ దర్శనాన్ని మాకు అనుగ్రహించండి" అని బాబాను ప్రార్థించి వరుసలో నిల్చున్నాను. యాత్రికులు చాలామంది ఉన్నందున దర్శనానికి ఇబ్బంది అవుతుందనుకున్నప్పటికీ రెండు గంటలలోపే మాకు విశ్వేశ్వరుని దర్శనమైంది. ఇది కేవలం బాబా అనుగ్రహం వల్లే సాధ్యమైంది.
మరునాడు ఏప్రిల్ 11, రాత్రి 11.30కి తోటి యాత్రికులతో కలిసి నేపాల్ యాత్రకు బయలుదేరాము. మరుసటిరోజు ఉదయం 8 గంటలకు నేపాల్ బోర్టర్ దాటి లుంబిని చేరుకున్నాము. అక్కడ మాకు ఒక హోటల్లో బస ఏర్పాటు చేశారు. మేము అక్కడికి వెళ్ళాక మాకు తెలియకుండానే హోటల్ సిబ్బంది మా సామానంతా హోటల్లోకి తరలించారు. చూస్తే, నా సూటుకేసు ఒకటి కనిపించలేదు. ఎంత వెతికినా దొరక్కపోయేసరికి, "బాబా! దయ చూపు తండ్రీ" అని బాబాతో చెప్పుకొని విషయం హోటల్ సిబ్బందికి చెప్పాను. బాబా కృపతో ఒక హోటల్ బాయ్, "దాన్ని ముందుగా తెచ్చి వేరే చోట పెట్టాను" అని చెప్పి అక్కడికి తీసుకెళ్లి నా సూటుకేసు నాకిచ్చాడు. అలా బాబా దయతో నా సూటుకేసు దొరికేలా చేసారు. లేకుంటే చాలా ఇబ్బందిపడేవాళ్ళము. అదేరోజు మేము లుంబినీలో బుద్ధునికి సంబంధించిన చారిత్రిక ప్రదేశాలన్నీ చూసాము. ఆ క్రమంలో ఒకచోట బుద్ధుడు బాబాలా అనిపించారు. అది బాబా అనుగ్రహం.
తరువాత మేము అక్కడినుండి బయలుదేరి ఖాట్మండు వెళ్ళాము. ఆరోజు(ఏప్రిల్ 14) నేపాల్‌లో ఉగాది పండగ. అందువల్ల పశుపతినాథ్ దర్శనానికి వెళితే చాలా రష్ ఉంది. అయినప్పటికీ బాబాను ప్రార్థిస్తే మాకు చక్కటి దర్శనం అయింది. తర్వాత అక్కడి అమ్మవారి దర్శనం చేసుకొని తిరిగి వద్దామంటే మేము బస చేసిన హోటలుకు దారి తెలియలేదు. టాక్సీలు కూడా రావటం లేదు. మరోవైపు నాకు చాలా ఆకలిగా ఉంది. అట్టి సమయంలో ఒక టాక్సీ డ్రైవర్ మా బాధ అర్థం చేసుకొని హోటల్ వద్ద దింపాడు. అతను నాకు బాబాలానే అనిపించాడు. ఆ రూపంలో ఆయన సహాయం చేయకపోతే మేము చాలా ఇబ్బందిపడేవాళ్ళము.
తరువాత మేము పోక్రా మీదగా ముక్తినాథ్ యాత్రకు బయలుదేరాము. మధ్య దారిలో 'మనోకామన' అమ్మవారి గుడి ఉంది. ఆ గుడి చాలా ఎత్తైన పర్వతాల నడుమ ఉంటుంది. అక్కడికి 'రోప్ వే'లో వెళ్ళాలి. 21 నిముషాల సమయం పడుతుంది. మేము బాబాను 'తోడుగా ఉండమ'ని ప్రార్థించి రోప్ వే ఎక్కాము. గుడి దగ్గరకు చేరుకున్నాక చూస్తే అక్కడ కూడా చాలా యాత్రికులు అమ్మ దర్శనం కోసం వేచి ఉన్నారు. బాబా దయవలన మాకు సాయంత్రం 6 గంటలకు దర్శనమైంది. చీకటి పడ్డాక 'రోప్ వే' ఎక్కి కిందకి వచ్చేవరకు బాబాను స్మరించుకున్నాము. ఆ తండ్రి దయతో మేము క్షేమంగా కిందకి చేరుకున్నాము.
తరువాత ఏప్రిల్ 16న మేము మా ముక్తినాథ్ యాత్ర కొనసాగించాము. అది చాలా కష్టమైన యాత్ర. సరైన రోడ్డు లేదు. కొండల మధ్య గుండా, నది ప్రక్కగా భయంకరమైన ప్రయాణం. మేమంతా బాబాను 'తోడుగా ఉండమ'ని కోరుకుంటూ ప్రయాణం సాగించగా ముక్తినాథ్ చేరుకోవటానికి 8 గంటల సమయం పట్టింది. అక్కడ జీరో డిగ్రీల టెంపరేచర్ ఉండి చాలా చలిగా ఉంది. అయినప్పటికీ అక్కడ స్నానాదులు చేసుకొని ముక్తినాథ్ దర్శనం చేసుకొన్నాము. మాకు ఎలాంటి ఇబ్బందీ కలగలేదు. ఏప్రిల్ 17న మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి రాత్రి 9 గంటలకు పోక్రా చేరాము. అది చాలా కష్టమైన యాత్ర. బాబానే మా చేయి పట్టుకొని ఆ ప్రయాణాన్ని పూర్తి చేయించారని నా నమ్మకం.
తరువాత మేము ఇండియాకి వచ్చి అయోధ్య, నైమిశారణ్యం వెళ్లి మరుసటి వారం హైదరాబాద్ వచ్చాము. ఇక్కడికి వచ్చాక మాకు తెలిసింది ఏమిటంటే, మా తర్వాత ముక్తినాథ్ యాత్రకి వెళ్ళినవారు చాలా ఇబ్బందులు పడ్డారని, కొండ చరియలు విరిగిపడటం, మంచు గడ్డలు కట్టడం వల్ల దర్శనం అవ్వక తిరిగి వచ్చారని. సాయిపై భారం వేసినందువల్ల ఆయన మా యాత్రను మాత్రం చాలా సులభంగా పూర్తి చేయించి తిరిగి తీసుకొచ్చారు.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!!
శ్రీ సాయి తండ్రి ఆశీస్సులతో మేము గురు పూర్ణిమ కి షిరిడీ వచ్చాము.ఆ బాబా కృప వలన దర్శనం చేసుకుంటున్నాము. సాయి బాబా మీ ఆశీస్సులతో మా కుటుంబం చల్లగా ఉండాలనీ వేడుకుంటున్నాను.ఓం శ్రీ సాయి రామ్.
ReplyDeleteఅంత సాయి మాయం ,అంత సాయి నామమే, ఓం సాయిరాం
Deleteనేను చాలా ఆనందంగా వున్నాను.ఆ సాయి తండ్రి ఆశీస్సులు పొందినందుకు
ReplyDeleteఅంత సాయి మయం, ఓం సాయిరాం
Deleteధన్యవాదాలు సాయి తండ్రి . నీ కు శాతం సహస్ర నమస్కారాలు.శత సహస్ర వందనాలు నీ పాదాలకు.ఓం సాయి నాన్న
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSai always be with me
Om Sai ram
ReplyDeleteOm Sai Ram 🙏🙏🙏🙏🙏🙏🙏
ReplyDelete