పరీక్ష పాస్ చేయించి కష్టకాలం నుండి బయటపడేసిన బాబా
నా పేరు మధు. నేను నా బాధలు బాబాకి చెప్పుకుంటాను. బాబా నాకు ఎన్నో అనుభవాలు ఇచ్చారు. మా పెద్దపాప పుట్టడమే బాబా అనుగ్రహంతో పుట్టింది. అది ఒక పెద్ద లీల. కానీ ఇప్పుడు దాని గూర్చి కాకుండా ఆ బిడ్డ విషయంలో బాబా ఓ పెద్ద కష్టాన్నీ తీర్చిన వైనాన్ని పంచుకుంటున్నాను. రోజూ 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగు చదివే నేను ఇలా బాబా నాపై చూపిన ప్రేమను ఈ బ్లాగులో పంచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కరోనాకాలంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న మా పెద్దపాపను పాస్ మార్కులతో పాస్ చేశారు. అదే మా పాలిట శాపం, దురదృష్టం అయింది. ఎందుకిలా అంటున్నానంటే, దేన్నీ చూస్తుంటే దాన్ని అనుసరించడం, ఆ పనిలో జాప్యం వచ్చిందంటే అశ్రద్ధ చేయడం మా అమ్మాయి తీరు. తను ఏదైనా కష్టపడకుండా తేలికగా రావాలి అనుకుంటుంది. తను కాలేజీ తెరిచాక హాస్టల్‌లో ఉంటూ ఇంటర్ రెండవ సంవత్సరం చదవడం మొదలుపెట్టింది. తను మ్యాథ్స్‌లో డల్. అయినప్పటికీ హాస్టల్‌వాళ్ళు దగ్గరుండి బాగా చదివిస్తారు, తను తోటి విద్యార్థులతోపాటు ఎలాగోలా కష్టపడి పాసు అవుతుందిలే అనుకున్నాం మేము. కానీ హాస్టల్‌వాళ్ళు డల్ విద్యార్థులను వదిలేసి, బాగా చదివేవాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చారు. దానికి తోడు మా అమ్మాయి మాతో బాగా చదువుతున్నానని చెప్పి అశ్రద్ధ చేస్తూ ఏదో టైం పాస్ చేసింది. పరీక్షల సమయం వచ్చాక "అన్ని ప్రిపేర్ అవుతున్నావా?" అంటే, "బాగా ప్రిపేర్ అవుతున్నాన"ని చెప్పేది. కానీ నాకు భయంగా ఉండేది. ఎందుకంటే, మధ్యలో పరీక్షలు పెట్టినప్పుడు తనకి మాథ్స్‌లో తక్కువ మార్కులు వచ్చేవి. వాళ్ళ మేడమ్స్‌కి "బాగా ప్రిపేర్ చేయించండి మేడం" అని చెప్పి, బాబా దగ్గర కూడా చెప్పుకుంటూ ఉండేదాన్ని. కానీ మా అమ్మాయికి కాలం విలువ, చదువు విలువ తెలియక అంతా అయిపోయిన తర్వాత బాధపడే పరిస్థితి తెచ్చుకుంది.
అన్ని చదువుకొని బాగా ప్రిపేర్ అయ్యానని చెప్పిన మా అమ్మాయి పరీక్షలు జరుగుతుండగా రేపు మాథ్స్ పరీక్ష అనగా ముందురోజు ఫోన్ చేసి, "అమ్మా! నాకు భయంగా ఉంది. నేర్చుకున్నాను కానీ, ఏం గుర్తు రావడం లేదు" అని చెప్పింది. అది విని నా గుండె పగిలింది. "అయ్యో! సమయం లేదు. ఇప్పుడిలా చెబుతుంది ఏంటి?" అనుకోని తనని తిట్టాను. కానీ మళ్ళీ అంతలోనే, "బాబా తోడు ఉంటారు. భయపడకు" అని ధైర్యం ఇచ్చాను. పరీక్ష వ్రాసాక వాళ్ళ నాన్న అడిగితే, "50 మార్కులకి వ్రాశాను. మిగిలినవి వ్రాయలేదు" అని ఏడ్చింది. తను ఆలా ఏడ్చేసారికి నాకు ఎక్కడో అనుమానం, భయం ఉన్నప్పటికీ 'బాబా ఉన్నారు. కాపాడుతారులే' అనుకున్నాను. కానీ బాబా అంత అనుగ్రహాన్ని చూపలేదు. పాప మిగతా అన్ని సబ్జెక్టులు పాస్ అయింది కానీ, మ్యాథ్స్ 2B పోయింది. నేను చాలా బాధపడ్డాను. కానీ సప్లిమెంటు వ్రాసి పాస్ అవుతుందని చాలా నమ్మకంతో ట్యూషన్ పెట్టించాము. తను ప్రిపేర్ అయి మాథ్స్ పరీక్ష వ్రాసింది కానీ, మళ్ళీ ఫెయిల్ అయింది. నేను, "అయ్యో! ఏంటి బాబా ఇలా చేశార"ని బాధపడని రోజు ఉండేది కాదు. అలా ఒక సంవత్సరం వెస్టు అయిపోయింది. వాళ్ళ నాన్నకు తనపై కోపం వచ్చి తనతో మాట్లాడటం మానేసి తనని దూరం పెట్టారు. వాళ్ళిద్దరి మధ్య నేను చాలా ఇబ్బందిపడ్డాను.
మళ్ళీ సంవత్సరం ఇంటర్ పరీక్షల డేట్ వచ్చాక మళ్ళీ ట్యూషన్ పెట్టించాము. పాప ప్రిపరేషన్ అయింది కానీ, మళ్ళీ షరామామూలే, "అమ్మా! భయంగా ఉంది. ఎలా వ్రాస్తాను" అని అంది. అనుకున్నదే అయింది, మళ్ళీ తను ఫెయిల్ అయింది. నేను, "బాబా! ఎందుకు ఇంత కఠినంగా ఉన్నారు? నాపై ఉన్న ప్రేమ ఎటు పోయింది?" అని బాబాను వేడుకోని రోజుగాని, బాధపడని రోజుగాని ఉండేవికాదు. బాబాతో మాట్లాడటం మానేశాను. కానీ ఆయన పూజ మానలేదు. మళ్లీ సప్లిమెంట్ టైం వచ్చింది. ఆ సమయంలో భద్రాచలంలో మా మేనల్లుడు నిశ్చితార్థం ఉంటే వెళ్ళాము. ఆ మరుసటిరోజు తెల్లవారుతుండగా కలలో నేను, నా బిడ్డతో పెద్ద క్యాంపస్‌లో పరుగులు తీస్తూ అందరినీ బతిమాలుతున్నట్లు, వేడుకుంటున్నట్లు, ఆఖరికి కాలేజీ లోపలికి ప్రవేశించినట్లు ఆకాశవాణి వినిపించింది. వెంటనే నిద్ర మేల్కొని 'మీ పాపతో చాలా కష్టపడాల'ని రామయ్య తెలిజేశారని అనుకున్నాను. ఆ విషయమే మా పాపతో చెప్పి, "ఈసారి అతి కష్టం మీద బయటపడేలా ఉన్నావు. జాగ్రత్తగా ఉండు" అని తనని హెచ్చరించాను. కానీ అదే అశ్రద్ధ. మళ్ళీ ట్యూషన్‌కి పంపాను కానీ, తను సరిగ్గా వెళ్ళలేకపోయింది. దాంతో నా దగ్గరే పెట్టుకుని చదివించాలని నిర్ణయించుకున్నాను. మావారు మాత్రం, "ఇక నా వల్ల కాదు. నేను పట్టించుకోను" అని తనని పట్టించుకొనేవారు కాదు. కానీ తల్లి మనసు ఎవరికి తెలుస్తుంది? నేను మావారితో గొడవపడి, "చివరిగా ఒక ప్రయత్నం చేయండి. స్వామి కరుణిస్తాడు" అని ఎంత చెప్పినా ఆయన వినలేదు. నేను రోషానికి పోయి, "నా బిడ్డను నేను గెలిపించుకుంటాను" అని శపధం చేసి ఫీజులు వగైరా పనులు పూర్తి చేసి ఏపీ సెట్, టి సెట్ రెండు పాప చేత వ్రాయించాను. మావారిని ఒప్పించి తిరుపతిలో టి సెట్ వ్రాయడానికి వెళ్ళాము. ఆ సమయంలో మేము మంగాపురంలో శ్రీనివాసుని దర్శనానికి వెళ్ళాము. ఆ స్వామి అక్షింతలపై నాకు చాలా నమ్మకం ఉన్నందున వాటిని సంపాదించి మా పాపకు వేసి ఇంటర్ సప్లిమెంట్ పరీక్షకు పంపుదామని అనుకున్నాను. ఆరోజు కళ్యాణ వెంకటేశ్వరుని వసంతోత్సవం. ఆ మహోత్సవం కనులకు విందుగా అనిపించింది. అది మనసుకు చిన్న ఆనందం కాదు. చాలా పరవశించిపోయాను. స్వామి వారికి ఉపయోగించిన పసుపు, గంధం లభించాయి కానీ ఎవరినీ అడిగినా అక్షింతలు ఇవ్వలేదు. నేను కారులో కూర్చుని, "స్వామి అక్షింతలు ఇచ్చుంటే నాకు నమ్మకంగా ఉండేది" అని మావారితో అంటుండగా ఆయన అనుకోకుండా తన తలపై చేయి పెట్టి కదిపేసరికి అక్షింతలు జలజలా రాలాయి. అది చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆ అక్షింతలను, గంధాన్ని దేవుని ముందుంచి సాక్షాత్తు కళ్యాణ వెంకటేశ్వరుడే నా ముందున్న భావనతో రోజూ పూజ చేస్తుండేదాన్ని.
అలా ఉండగా పాప పరీక్షకు కొన్ని రోజులు ముందు బాబా స్వప్న సందేశాన్ని ఇచ్చారు. ఆ కలలో మేము ఎవరో పెళ్లికి వెళ్లినట్లు కనిపించింది. కానీ అది పెళ్లిలా లేదు, గుడిలా ఉంది. నాతో, మావారితో ఇంకో వ్యక్తి తిరుగుతున్నట్లు, ఏదో చెబుతున్నట్లు ఉంది. తర్వాత మేము గుడిలోకి వెళ్ళాము. అక్కడ ఒక ఫోటో, దాని ముందు బట్టలు, ఒక చిన్న బాక్సులో కొంత బంగారం ఉంది. నేను 'అదేంటి అక్కడ పెళ్ళిలో 70 సవర్ల బంగారం పెడుతున్నారని విన్నాను. కానీ ఇక్కడ కొద్ది బంగారమే ఉంది' అన్నాను. అక్కడే పక్కన ఉన్న ఒక ముత్తైదువు 'ఇదిగో ఈ బాక్సులో 30 సవర్లు ఉంది' అని చూపిస్తూనే, 'ఇది చూపకూడదు' అంటూ 'ఇలా రామ్మా, దీవిస్తాను. కుంకుమ పెట్టుకో' అంది. నేను, 'నన్ను కాదు. నా బిడ్డను దీవించమ్మా' అని ఏడుస్తూ 'అక్షింతలు వేసి బాగా పరీక్షలు వ్రాయాలి, భవిష్యత్తు బాగుండాలని దీవించమ్మా' అని అన్నాను. అప్పుడామె 'ఇలా రామ్మా' అని నన్ను తీసుకునిపోయింది. అంతలోనే ఆమె కనిపించలేదు. ఇంతలో అదివరకు మాతో ఉన్న వ్యక్తి వచ్చి 9 భాగాలున్న వస్తువుతో పూజలు చేయించి, 'గుడిలోకి పోదాం రండి' అని అన్నాడు. చూస్తే, టికెట్ తడిచింది. అతను, 'సరే, ఈ అమ్మాయి పేరు ఏంటి?' అన్నాడు. నేను పేరు చెప్పాను. అతను, 'అర్థం కాలేదు. మళ్ళీ చెప్పండి' అని అన్నాడు. నేను మళ్ళీ చెప్పాను. కానీ అతను అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి అన్నాడు. అప్పుడు నేను మొత్తం పేరు చెప్పాను. పాప పేరులో సాయినామం ఉన్నందుకే అతనలా చెప్పించుకొని టికెట్ తడిచిపోయిందా.. సర్లే ఏమీ కాదు వెళ్ళు' అని అన్నాడు. అంతే నాకు మెలకువ వచ్చింది. నాకు ఏమీ అర్థం కాలేదు. మావారితో "సాయి ఏదో చెబుతున్నారు. నాకు అర్థం కాలేదు" అన్నాను. మరుసటిరోజు మా పాప, "అమ్మా! ఈరోజు గుడికి వెళ్తాను. రేపు శనివారం నవగ్రహాలకి ప్రదక్షిణ చేస్తాను" అంది. అప్పుడు నాకు 'కలలో తొమ్మిది భాగాలు చూపారు. అంటే బాబా నవగ్రహ ఆరాధన చేయమంటున్నార'ని అర్థమైంది. అంతకుమునుపు ఒక జాతకాల స్వామి కూడా 45 రోజులు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయమని చెప్పారు. కానీ నెలసరి సమస్య వల్ల పాపకి కుదరలేదు. సరే, నేను కూడా వెళ్లి పాపతో నవగ్రహాలకి పూజ చేయించాను. ఇకపోతే, కలలో కన్పించిన పోటో దగ్గర బాక్సులోని కొంత, ముత్తైదువ చూపిన బాక్సులోని 30 కలిపి మొత్తం 75. వాటి అర్థం 75 మార్కులు.
పరీక్షకి రెండు రోజులు ఉందనగా మళ్లీ బాబా మా రామతాత రూపంలో వచ్చి "అమ్మా! అక్కడ వుందే ఆ పాప ఒక అబ్బాయితో తప్పు చేస్తూ వాళ్ళమ్మకు మూడుసార్లు కనిపించింది. అందుకని నాలుగోసారి పెళ్లి చేసింది" అని అన్నారు. 'మూడుసార్లు పరీక్ష తప్పింది, నాలుగవసారి శుభం జరుగుతుంద'ని బాబా మాటలకర్థంగా నాకు తోచింది. తరువాత సమయం రానే వచ్చింది. పాప సప్లిమెంట్ పరీక్షకు వెళ్లేరోజు ఉదయాన్నే నేను వెంకటేశ్వరునికి పిండి దీపం సాయంకాలం వరకు ఉండేలా పెట్టాను. తరువాత పాపతో నేను కూడా వెళ్లాను. పరీక్ష కేంద్రానికి వెళ్ళాక అక్కడి వాళ్లను చూసి చాలా భయమేసింది. ఎందుకంటే, అందరూ మా పాపలాంటి వాళ్లే. ఒకరైనా చదివే పిల్లల్లా కనపడలేదు. పాపని వదిలి అక్కడి నుంచి వచ్చామే కానీ నాకు ధైర్యం చాల్లేదు. మనసులో తెలియని అలజడి, భయం. పరీక్ష అయిపోయే సమయం అవుతుండగా భయంతో సాయితో మొరపెట్టుకొని, తగువు పెట్టుకొని. "ఇంతటితో నీకు పూజ చేయను. ఇది చివరిసారెమో నువ్వే నిర్ణయించుకో" అని అనుకొని పరీక్ష కేంద్రానికి వెళ్లాను. కొంతసేపటికి పాప వచ్చి, "అమ్మా! నేను బాగా వ్రాశాను. కాస్త వదిలారు. 40 మార్కులకి తక్కువ రావు" అంది. ఆ మాట నేను నమ్మాను. కానీ మావారికి నమ్మకం తక్కువై తనని దగ్గర కూర్చోబెట్టుకొని అన్నీ అడిగి తెలుసుకున్న తర్వాత ఆయనకి కూడా నమ్మకం కుదిరింది. తర్వాత పరీక్ష ఫలితాలు వచ్చాయి. 75 మార్కులకు 42 మార్కులు వచ్చి పాప పాసయ్యింది. అంతా బాబా దయ. మా పాప అశ్రద్ధ వల్లే మాకు ఇంత శిక్ష. ఏదేమైనా బాబా కృపవల్ల మా పాప కష్టకాలం నుండి బయటపడింది. "ధన్యవాదాలు బాబా. మిమ్మల్ని నమ్మితే ఎవరైనా మంచిదారిలో ఉంటారు. మీ సేవే నా భాగ్యం".
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Sai na Bartha nannu ardham cheslunela chudu sai nannu kapuraniki thiskellela chudu sai naku na bartha tho kalisi brathike adhrustanni prasadinchu sai
ReplyDeleteMeku mee bratha tho kalise jivichali ani vunte..okasari call chesi matladandi.....baba mee korika thirustharu
DeleteOm Sai Ram
ReplyDeleteSai always be with me
Give me health baba
ReplyDeleteOm Sai Sri Sai Jai Sai 🙏🙏🙏
ReplyDeleteOm sai ram Thank you baba🙏🙏🙏
ReplyDeleteOm sai ram
ReplyDeleteOm Sai Ram
ReplyDelete