సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1564వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఎటువంటి సమస్యనైనా అద్భుతంగా పరిష్కరించే బాబా
2. మందులు తీసుకోకున్నా బాబా అనుగ్రహంతో తగ్గిన షుగర్

ఎటువంటి సమస్యనైనా అద్భుతంగా పరిష్కరించే బాబా


నా పేరు బదరీనాథ్. నాకు రోజూ తెల్లవారుజామునే నిద్రలేవటం అలవాటు. అలా 2023, మే నెలలో ఒకరోజు ఉదయం 4:30 ప్రాంతంలో నిద్రలేచి భూమాతకు నమస్కరిద్దామని ప్రయత్నిస్తే నా ఎడమచేతి వేళ్ళు వంకర తిరిగిపోసాగాయి, ఒకటే నొప్పి. (క్యాషియర్‌గా పని చేసే నాకు క్యాష్ లెక్క పెట్టడానికి ఆ చేయి అవసరం చాలా ఉంది). ఎంతగా ప్రయత్నించినా నొప్పి వల్ల పైకి లేవలేకపోయాను. వెంటనే బాబాని మనసులో ప్రార్థించాను. బాబా దయతో కాసేపాటికి లేవగలిగాను. వెంటనే బాబా ఊదీ తీసుకొని అన్ని వేళ్ళకు మరియు మోచేతి నుండి కిందవరకు లేపనంగా పట్టించుకున్నాను. నొప్పి చాలావరకు తగ్గిపోయింది. అయినా డాక్టర్ దగ్గరకి వెళ్లి చూపించుకుంటే, బలం లేదని విటమిన్ టాబ్లెట్లు, కాల్షియం టాబ్లెట్లు వ్రాశారు. అవి వాడుతూ రోజూ ఊదీ రాసుకుంటూ, "మరలా ఆ సమస్య రాకుండా చూడమ"ని బాబాని వేడుకున్నాను. బాబా దయవల్ల ఆ సమస్య ఇప్పటివరకూ మళ్ళీ రాలేదు. సాయినాథునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.


నేను క్యాషియర్‌గా పని చేస్తున్నానని చెప్పాను కదా! నా చేతికి రోజూ 5 నుండి 10 లక్షల వరకు డబ్బులు వస్తాయి. రోజూ క్యాష్ మేనేజర్ కంప్యూటరులో తయారుచేసిన డేషీటు ప్రకారం నేను డబ్బు అతనికి అప్పగిస్తాను. సాధారణంగా నేను ఇచ్చే డబ్బుకు, డేషీటుకు తేడా రాదు, సరిపోతూ ఉంటుంది. అయితే ఒకరోజు పెద్ద మొత్తంలో డబ్బు తక్కువ వచ్చింది. ఎంత ఆలోచించినా తక్కువెందుకు వచ్చిందో తేలలేదు. సరేనని, ఆరోజుకి డేషీటులో డబ్బు తక్కువ వచ్చినట్లు వ్రాసి మా ప్రొప్రయిటర్‌కి డబ్బులు అప్పగించాము. కానీ తక్కువ వచ్చిన డబ్బులు ఎంతైనా నేను పెట్టుకోవాలి. అందువల్ల నాకు ఆ రాత్రి నిద్రపట్టక, "బాబా! డబ్బు తక్కువెందుకు వచ్చిందో గుర్తు చేయండి" అని బాబాని వేడుకున్నాను. కానీ ఎంత ప్రయత్నించినా నాకు ఏమీ గుర్తు రాలేదు. అయితే బాబా ఆ సమస్యకు సమాధానం మా మేనేజర్ ద్వారా చెప్పించారు. మూడవరోజు మా మేనేజర్ స్వయంగా నా వద్దకొచ్చి 'ఫలానా అమౌంట్ నాకు అందింది, మీకు చేరలేదు. అందుకే ఆరోజు డబ్బులు తక్కువ వచ్చాయి' అని చెప్పారు. అది విని నేను 'హమ్మయ్య.. అంతా బాబా దయ' అని మనసులోనే బాబాకు ధన్యవాదాలు తెలుపుకున్నాను. బాబా అతనిచేత ఆ విషయం చెప్పించకపోతే ఆ నష్టాన్ని నేనే భరించవలసి వచ్చేది.


ఇప్పుడు చెప్పబోయే అనుభవం నాది కాదు, వేరొకరిది. కానీ మహా అద్భుతమైన అనుభవం. వారు నాతో చెబితే, బాబా మీ అందరితో పంచుకునే భాగ్యాన్ని నాకిచ్చారు. పూర్వపు పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం పట్నానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రముఖ సాయిబాబా దివ్యక్షేత్రం సీసలి. ఎప్పటినుండో అక్కడి బాబాని దర్శించుకోవాలన్న నా కోరిక ఈ మధ్యనే తీరింది. నేను బాబాను దర్శించుకుని నా మొక్కు తీర్చుకొని అక్కడి పూజారితో మాట్లాడుతూ చాలాసేపు బాబా సన్నిధానంలో గడిపాను. ఆ పూజారి నన్ను, "ఎక్కడినుండి వచ్చారు? ఏం చేస్తుంటారు? బాబాతో మీ అనుబంధం ఏమిటి" అంటూ ప్రశ్నిస్తూనే ఆయన తన అనుభవం చెప్పారు. అతనిది వేరే వూరు. బాబా సేవార్థం సీసలి వచ్చి అక్కడ నివాసముంటున్నారు. ఒకసారి స్వగ్రామంలో వయసుపైబడిన అతని తల్లి అనారోగ్యం పాలైంది. ఆమెకు ఇంకా సంతానం ఉన్నప్పటికీ ఈ కొడుకుపై ఉన్న ప్రేమతో ఇతన్నే కలవరిస్తుందట. అప్పుడు బాబా చేసిన అద్భుతం చూడండి. పూజారి సీసలిలో బాబా సేవలో ఉండగా బాబా అతని రూపంలో అక్కడ అతని తల్లి దగ్గరకి వెళ్లి ఆమె కోరిక తీర్చి తృప్తిపరిచారు. ఈ విషయం తెలిసిన పూజారి మైండ్ బ్లాక్ అయిపోయిందట. ఎంతటి అదృష్టం ఆ తల్లిది, పూజారిది? నాది కూడా. ఎందుకంటే, వాళ్లకు ప్రసాదించిన అద్భుతమైన బాబా లీలను మీతో ఇలా పంచుకొనే అవకాశం నాకొచ్చింది. "సాయినాథ్ మహారాజ్ కీ జై! నా తప్పులు ఏవైనా ఉంటే క్షమించు తండ్రీ".


మందులు తీసుకోకున్నా బాబా అనుగ్రహంతో తగ్గిన షుగర్


నేను నా చిన్ననాటినుంచి సాయి భక్తురాలిని. మా కుటుంబ పెద్ద సాయినాథుడే అని నేను గుడ్డిగా నమ్ముతాను. అది నిజమని నిరూపించేలా ఆయన చాలా చేసారు. ఇటీవల కాలంలో ఆయన ప్రసాదించిన ఒక అనుభవాన్ని ఇప్పుడు చెప్తాను. ఒకసారి మా అమ్మ ఆరోగ్యం అంతగా బాగాలేకపోతే డాక్టరు దగ్గరకి వెళ్ళాము. ఆయన చాలా టెస్టులు చేశారు. అప్పుడు మా అమ్మకి షుగర్ 400 ఉందని వచ్చింది. దాంతో డాక్టరు షుగర్ 400 ఉంటే చాలా ప్రమాదమని, ఇంకా ఇవేవో చెప్పారు. అవి విని నేను భయంతో వణికిపోయాను. ఎందుకంటే, ఆ సమయంలో నా ఆర్థిక పరిస్థితి దిగజారిపోయి ఉంది. కనీసం మా అమ్మకి మందులు కూడా అందించలేను. అలాంటి స్థితిలో నేను ఎప్పటిలాగే, "బాబా! మీరే దిక్కు" అని ఊదీ నీళ్లలో కలిపి అమ్మకి ఇస్తూ, ఆమె ఆహార అలవాట్లలో ఒక వారం మార్చు చేశాను. పదిహేను రోజుల తర్వాత టెస్టులు చేయిస్తే బాబా దయవల్ల అమ్మ షుగరు 200లకి వచ్చింది. "మందులు తీసుకుకోకుండా కేవలం ఆహారంతో ఇంత మార్పా!" అని డాక్టర్ షాకయ్యారు. ఇలాంటివి నా జీవితంలో వేలల్లో అనుభవాలున్నాయి. నేను చెప్పేది ఒక్కటే, 'బాబాను నమ్మండి. ఆయన పాదాలు పట్టుకోండి. జరగదనుకున్నది కూడా జరుగుతుంది'. "ధన్యవాదాలు బాబా".


11 comments:

  1. Sai thandri na kastalakam inka yenni nallu sai

    ReplyDelete
  2. ఓం సాయిరామ్

    ReplyDelete
  3. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  4. అద్భుతం సాయి ఆ పూజారి రూపంలో అమ్మ కి కనిపించడం మహా అద్భుతం.తనువు పులకరిస్తుంది.ఆ సాయి ప్రభువుని నిమ్మతే జీవితం ధన్యం అవుతుంది.ఓం సాయి రామ్

    ReplyDelete
  5. Om Sai Ram
    Sai always be with me

    ReplyDelete
  6. Sai naa health issue
    Chudu tandri
    Chaala chaala chirakuga und ibaba

    ReplyDelete
  7. Om Sai Sri Sai Jai Sai 🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo