1. కష్టమొచ్చినా ప్రతిసారీ సహాయం చేస్తున్న బాబా
2. టెన్సన్స్ తొలగించి పరీక్షలు మంచిగా వ్రాసేలా అనుగ్రహించిన బాబా
కష్టమొచ్చినా ప్రతిసారీ సహాయం చేస్తున్న బాబా
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!!
సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు ఉషశ్రీ. నేను నా చిన్నప్పటి నుండి సాయినాథుని భక్తురాలిని. నా జీవితంలో బాబా చాలాసార్లు సహాయం చేసారు. కొన్ని అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. విదేశాలలో ఉద్యోగం రావాలంటే ఇంగ్లీష్ భాషకి సంబంధించి ఒక పరీక్షలో తప్పనిసరిగా స్కోర్ 7 రావాలి. అయితే నాకు మొదటి ప్రయత్నంలో ఆ స్కోర్ రాలేదు. అప్పుడు నేను సాయిబాబాకి మ్రొక్కుకొని నిష్టగా సచ్చరిత్ర ఒక వారం పారాయణం చేశాను. బాబా నన్ను అనుగ్రహించి రెండో ప్రయత్నంలో నాకు కావాల్సిన స్కోర్ వచ్చేలా చేసారు. తరువాత నేను వేరే దేశంలో ఉన్నప్పుడు మా చెల్లి నాకు ఫోన్ చేసి, "నా మెడ దగ్గర వాపు వచ్చింది, నొప్పి కూడా ఉంది. చాలారోజుల నుండి తగ్గట్లేదు. నాకు భయంగా ఉంది" అని చెప్పింది. అది విని నాకు కూడా భయమేసి నేను చాలా టెన్షన్ పడినందువల్ల ఆకస్మికంగా భయాందోలనలకు గురి అవుతుండేదాన్ని. ఆ స్థితిలో నేను బాబాని, "చెల్లికి తొందరగా తగ్గిపోవాలి" అని ప్రార్ధించి సాయి సచ్చరిత్ర మరోసారి పారాయణ చేశాను. పారాయణ మొదలుపెట్టిన రెండోరోజు మా చెల్లి ఫోన్ చేసి, "ఇన్నిరోజులుగా తగ్గని వాపు ఇప్పుడు టాబ్లెట్స్‌తో తగ్గిపోయింది" అని చెప్పింది. సాయి బాబా మహిమ అటువంటిది.
నాకు ఐర్లాండ్‌లో ఉద్యోగం వచ్చాక నా భర్త వీసా ఇష్యూస్ వల్ల రెండుసార్లు రిజెక్ట్ అయ్యింది. ప్రతిరోజూ బాబాని ప్రార్థిస్తున్నా మావారికి వీసా రాలేదు. అలా రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ రెండు సంవత్సరాలు ఒంటరిగా నేను చాలా ఇబ్బందిపడ్డాను. అయినా నేను వదలకుండా ప్రతి నెలా సచ్చరిత్ర పారాయణ చేస్తూ ఉండేదాన్ని. కొంచం ఆలస్యమైనా చివరికి బాబా అనుగ్రహించి మావారికి వీసా వచ్చేలా చేసారు. ఇలా ఒకసారి కాదు, కష్టం వచ్చిన ప్రతిసారీ బాబా నాకు సహాయం చేస్తూనే ఉన్నారు. నేను గర్భవతిని అవ్వాలని చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించలేదు. చివరికి బాబాకి మొక్కుకున్నాక ఆయన దయవలన నాకు పాప పుట్టింది. తనకి సాయిబాబా పేరు వచ్చేలా 'అద్వైత సాయి' అని నామకరణం చేసాము. ఈమధ్య మా పాపకి తరచూ జలుబు చేస్తూ వుంది. తనకి ఆ సమస్య తగ్గితే నా జీవితంలో నేను పొందిన సాయి అనుగ్రహాలను బ్లాగులో పంచుకుంటానని బాబాకి మొక్కుకున్నాను. "బాబా! నా బిడ్డకి జలుబు తొందరగా తగ్గేలా అనుగ్రహించండి".
సాయిమహరాజ్ కి జై!!!
టెన్సన్స్ తొలగించి పరీక్షలు మంచిగా వ్రాసేలా అనుగ్రహించిన బాబా
సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు అపర్ణ. మేము ఎప్పుడు, ఏ పని చేసినా ప్రతి దానిలో మన సాయినాథుని కృపాకటాక్షాలు ఉండాలని అనుకుంటాం. ఈ మధ్య మా అబ్బాయికి పరీక్షలు జరిగాయి. తను పరీక్షలకు హాజరు అయ్యేముందు గుడికి వెళ్ళి సాయి ఆశీస్సులు తీసుకుని వెళ్ళాడు. మొదటిరోజు పరీక్ష అయిపోయాక రెండోరోజు బాబు చాలా ఒత్తిడికి గురై బాగా భయపడ్డాడు. తన పరిస్థితి చూసి నాకు చాలా బాధ కలిగింది. వెంటనే సాయినాథుని తలచుకొని "బాబా! బాబు టెన్షన్ తొలగించి పరీక్ష మంచిగా వ్రాసేలా చేయండి. ఈ సమస్య తీరితే మీ అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని దణ్ణం పెట్టుకున్నాను. తర్వాత రోజు పరీక్షకి వెళ్ళిన బాబు చాలా సంతోషంగా తిరిగి వచ్చి, 'అన్ని తనకి వచ్చిన ప్రశ్నలే వచ్చాయని, ఏ టాపిక్స్ అయితే ఒత్తిడి మూలంగా గుర్తుపెట్టుకోలేకపోయానో అవి పరీక్షలో అస్సలు రాలేదని' చెప్పాడు. చివరి పరీక్ష అప్పుడు కూడా బాబు భయపడ్డాడు. కానీ, బాబా దయవల్ల ఆ పరీక్ష కూడా బాగా వ్రాశాడు. బాబా దయవల్ల 2023, జులై 5న వచ్చిన ఫలితాల్లో బాబు మంచి పర్సంటేజ్‌తో పాసయ్యాడు. మిత్రులారా! శ్రీసాయినాథుడు మనల్ని ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడతారు. అందుకు మా జీవితాలే నిదర్శనం. నేను, నా బిడ్డ ప్రతిదీ సాయినాథుని ఆజ్ఞ లేదా ఆశీర్వాదంగా భావిస్తాం. నా కుటుంబ సుఖసంతోషాలన్నీ మన బాబా ప్రసాదమే. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఎల్లప్పుడూ ఇదే విధంగా మా అబ్బాయిని ఆశీర్వదించండి. తను ఏకాగ్రతతో శ్రద్ధగా చదువుకునేటట్లు చూడండి". చివరిగా ఒక మాట, ఈ బ్లాగు మూలంగా మనలో సాయిపట్ల భక్తి, విశ్వాసాలు మరింత బలపడుతున్నాయి.
ఓం సాయిరక్షక శరణం దేవా!!!
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
OmsaikapaduTandri
ReplyDeleteOm sri Sai Ram
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDelete