సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1566వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాఫీగా తిరుపతి ప్రయాణం జరిగేలా చూసిన సాయి
2. లాకర్ తాళం దొరికేలా అనుగ్రహించిన బాబా

సాఫీగా తిరుపతి ప్రయాణం జరిగేలా చూసిన సాయి


సాయి బంధువులకు నమస్కారం. నా పేరు ఆశా దీప్తి, నేను చిన్ననాటి నుండి సాయి బిడ్డను. నా చిన్న వయసులో మా ఇంటి దగ్గర ఒక చిన్న బాబా గుడి ఉండేది. నాకు ఏ చిన్న బాధ కలిగినా, భయం వేసినా బాబాకి చెప్పుకోవడం ఆయన మీద భారం వేసి ధైర్యం తెచ్చుకోవడం అప్పటినుండే నేను అలవాటు చేసుకున్నాను. నేను ఇటీవల నాకు కలిగిన కొన్ని అనుభవాలను ఈరోజు మీతో పంచుకుంటాను. ఈ సంవత్సరం(2023) మా బాబు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో నేను 'వాడికి తగ్గితే తిరుమలలో శ్రీవారికి తలనీలాలు ఇప్పిస్తాన'ని మొక్కుకున్నాను. తర్వాత వాడి ఆరోగ్యం కుదుటపడింది. అందువల్ల వేసవి సెలవుల్లో తిరుమల వెళ్లదలచి మే నెలలో దర్శనం టికెట్లకోసం ప్రయత్నిస్తే జూన్ 6వ తారీకుకి దొరికాయి. కానీ అది నా నెలసరి సమయం కావడం వల్ల ప్రయాణం ఎలా జరుగుతుందో అని నేను చాలా ఆందోళనపడ్డాను. చివరికి బాబా మీద భారమేసి ట్రైన్ టికెట్లు బుక్ చేసుకున్నాము. జూన్ 2న బయలుదేరుతామనగా ముందురోజు రాత్రి మా బాబుకి తీవ్రమైన జ్వరం వచ్చింది. ప్రయాణానికి ముందు ఇలా జరిగిందేమిటని నేను ఎంతగానో మదనపడ్డాను. మందులు వేసినా అర్ధరాత్రి రెండు గంటల వరకు జ్వరం అదుపులోకి రాలేదు. అప్పుడు సాయి మీద భారమేసి మళ్లీ మందులిచ్చి, వాటితోపాటు ఊదీ నీళ్లు పట్టించి, బాబు నుదుటికి, మెడకి ఊదీ రాశాను. బాబా దయవల్ల వెంటనే బాబు ఒళ్ళు చల్లబడింది(మరో రెండు రోజులకి పూర్తిగా నయమైంది). నేను సాయిని, "మా తిరుపతి ప్రయాణం ఏ ఆటంకం లేకుండా సాగితే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని ప్రార్థించాను. ఆ సాయినాథుని దయవల్ల మా ప్రయాణం చాలా బాగా సాగింది. తిరుపతి వెళ్ళాక అనూహ్యంగా మాకు లక్కీ డిప్‌లో శ్రీవారి కల్యాణం టికెట్ తగలడంతో శ్రీవారి కల్యాణం చూసాం. ఇంకా ఒకేరోజు రెండుసార్లు దర్శనం చేసుకున్నాం. ఎంతో రద్దీగా ఉండే వేసవి సెలవుల్లో ఒకేరోజు రెండుసార్లు దర్శనం, కళ్యాణం అంటే మాకు పెద్ద వింతలా అనిపించింది. అంతా ఆ సాయినాథుని కృపవల్లనే జరిగింది. చుట్టుపక్కల క్షేత్రాలన్నీ దర్శించి మొక్కులు తీర్చుకొని క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాం. బాబా దయవల్ల నెలసరి గండం కూడా గడిచింది. కానీ నెలసరి ఆలస్యం అవ్వడం కోసం నేను వేసుకున్న కొన్ని మందుల వల్ల ఈసారి చాలా ఎక్కువ రోజులు నేను ఇబ్బంది పడాల్సి వచ్చింది. తొమ్మిది రోజులు గడిచినా నా సమస్య తీరకపోవడంతో బాబాని, "మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. నేను ఈ శనివారం ఇంట్లో దీపం పెట్టుకోవాలి" అని వేడుకున్నాను. అనుకున్నదే తడవుగా సాయి నా కష్టాన్ని తీర్చారు. శనివారం అనగా 2023, జూన్ 17వ తేదీన నేను ప్రశాంతంగా ఇంట్లో పూజ చేసుకున్నాను. ఇలా వచ్చిన ప్రతి కష్టం నుండి సాయి నన్ను ఎప్పుడూ గట్టెక్కిస్తూనే ఉన్నారు.


నేను ఆఫీసులో పని ఒత్తిడి బాగా పెరిగినందున సమయానికి డెవలప్మెంట్ వర్క్ పూర్తి కాదేమోనని చాలా టెన్షన్ పడ్డాను. అంతలో ఊహించని చాలా ఇష్యూస్ కూడా వచ్చాయి. దాంతో నేను సమయం సరిపోదని ఆందోళనపడి, "బాబా! గడువు సమయానికల్లా ఫీచర్ డెవలప్మెంట్ కంప్లీట్ అయి, మంచి క్వాలిటీ కోడ్ ఇష్యూస్ లేకుండా ఇవ్వగలగాలి" అని బాబాను ప్రార్థించి భారం ఆయన మీద వేసాను. తర్వాత పని కాస్త ఆలస్యమవుతున్నా ఓపికగా వేచి చూస్తూ నా ప్రయత్నం నేను చేశాను. బాబా కరుణించారు. మొత్తం ఇష్యూస్ అన్ని సాల్వ్ చేసి, సమయానికల్లా ఫీచర్ డెవలప్మెంట్ పూర్తి చేసేలా అనుగ్రహించారు. "థాంక్యూ బాబా. మీరు ఎప్పుడూ ఇలాగే నాకు, నా కుటుంబానికి తోడునీడగా ఉండి మమ్మల్ని నడిపించాలి". నా అనుభవాలను ఎంతో ఓపికగా చదివిన సాయిబంధువులందరికీ నా కృతజ్ఞతలు.


శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!


లాకర్ తాళం దొరికేలా అనుగ్రహించిన బాబా


సాయిభక్తులందరికీ నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. ఈ బ్లాగు నా వరకు రావటం, ఇది ఒకటి ఉందని తెలియడం సాయిబాబా దయవల్లే జరిగింది. అయితే ఇప్పటివరకు ఎందుకు తెలియలేదని నేను చాలా బాధపడుతున్నాను. అదే సమయంలో ఇప్పటికైనా తెలిసినందుకు నాకు చాలా సంతోషంగా అంది. ఇది బ్లాగు కాదు, ఆధునిక సాయి సచ్చరిత్ర(నేటి సాయిబాబా లీలలు). దీన్ని బ్లాగు అని పిలవడం నాకు నచ్చట్లేదు, ఈ కాలం సచ్చరిత్ర అని పిలవాలనిపిస్తుంది. ఎందుకంటే, ఇందులో ఉన్నవన్నీ బాబా లీలలు, మా నాన్నగారు చేస్తున్న లీలలు. ఇక నా అనుభవం విషయానికి వస్తే, నేను ఒక లాకర్ తాళం ఎక్కడో పెట్టి మార్చిపోయాను. అయినా 'ఆ.. సరేలే, వెతుకుదాం లే. కంగారు ఏముంది?" అని చాలా నిర్లక్ష్యం చేసాను. నెలరోజులైనా ఆ తాళాలు ఎక్కడో పెట్టానో గుర్తు రాలేదు. అప్పుడొకరోజు(2023, జూన్ 25) ఎందుకో నా మనసుకి, 'ఎంతకీ గుర్తుకు రావట్లేదు. సాయిబాబాని అడుగుదాం' అనిపించి, "తండ్రీ సాయిబాబా! లాకర్ తాళం ఎక్కడ పెట్టానో, అది దొరికితే మీ అనుగ్రహాన్ని బ్లాగు ద్వారా తోటి సాయిభక్తులతో పంచుకుంటాను" అని అనుకున్నాను. లా అనుకుని నిమషం కూడా కాలేదు. ఆ తాళం ఎక్కడ పెట్టానో గుర్తొచ్చింది. కానీ ఆ చోట చూస్తే, తాళం లేదు. దాంతో, 'అదేంటి బాబా గుర్తు చేసారు అనుకున్నాను. కానీ అక్కడ లేదు ఏంటి?' అని అనుకున్నాను. తర్వాత ఎందుకైనా మంచిదని స్టేషనరీ, పెన్నులు పెట్టే పర్సులో చూడాలనిపించి చూస్తే, ఒక తాళం కనిపించింది. చెక్ చేస్తే, అదే ఆ తాళం. సాయిబాబా అంటే మా నాన్న చేసిన లీలలు అద్భుతం. మీ అందరికీ ఇది చిన్న విషయం అనిపించచ్చు. నాకు మాత్రం అద్భుతం అనిపిస్తుంది. "ధన్యవాదాలు బాబా. మీ దయతో తాళం దొరికింది. అనుకున్న ప్రకారం తోటి సాయిభక్తులతో మీ అనుగ్రహం పంచుకున్నాను. మనసుకి ప్రశాంతంగా వుంది. ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం వల్ల  నన్ను మీ భక్తురాలిగా ఎంచుకున్నారు. బిడ్డలు కష్టంలో వుంటే మీరు చూడలేరు కదా నాన్నగారూ!".


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!


14 comments:

  1. Om sairam sai na bartha nakosam vachesela chudu baba sai

    ReplyDelete
  2. Baba maa vari arogyam bagunday lay chudadndiii baba

    ReplyDelete
  3. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  4. Jai Jai saikapadusaiTandri

    ReplyDelete
  5. Om sri Sai Ram baba maa maamaa garu Call chesi money isthanu uvriki Randi ani cheppelaa chuudu baba

    ReplyDelete
  6. sadguru sainadh maharaj ki jai

    ReplyDelete
  7. 🙏🙏🙏OM SRISAIRAM SARANAM🙏🙏🙏

    ReplyDelete
  8. ఓం సాయిరాం మా మీద ఎలాప్పుడు మీ దయ ఉండాలి బాబా 🙏🙏🙏

    ReplyDelete
  9. Om Sai Ram
    Sai always be with me

    ReplyDelete
  10. ఓం సాయిరాం మా కుటుంబాన్ని మీరే కాపడలి ఓం సాయిరాం

    ReplyDelete
  11. Baba ma variki arogyam bagundali thandri, ayanaku elanti operation lekunda set cheyi ayyela chudu thandri . Om sai ram🌺🙏🙏

    ReplyDelete
  12. Sairam thandri na biddaku garbam nilichela chudu thandri. Jai sai ram 🌺🌸🌹🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo