సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1554వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • ఆపదల నుండి గట్టెక్కించిన బాబా

సాయిభక్తులకు నా వందనాలు. నా పేరు ధనలక్ష్మి. నేను ఒక సాయి భక్తురాలిని. నేను ప్రతి గురువారం సచ్చరిత్రలోని రెండు అధ్యయాలు చదువుతాను. నా ప్రతి అడుగు చేయిపట్టి నడిపిస్తున్న నా సాయితండ్రికి ఏ విధంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలో అనుకొనే నాకు ఈ బ్లాగు దొరకడం నిజంగా నేను చేసుకున్న పుణ్యం అనుకుంటున్నాను. మన సాయితండ్రీ మనల్ని ఎలా కాపాడుతున్నారో అన్నదానికి ఈ బ్లాగ్ సజీవ నిదర్శనం. ఇక నా అనుభవాల విషయానికి వస్తే.. 


నెల జీతం తప్ప వేరే ఏ ఆదాయమూ లేని నేను కొంచం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాను. అందువల్ల నేను ప్రతిరోజూ బాబాను, "బాబా! ఈ ఆర్థిక ఇబ్బందులనుండి బయటపడే మార్గం చూపించు తండ్రీ" అని ప్రార్థిస్తూ ఉంటాను. 2023, మే నెలలో నేను కట్టవలసిన చిట్టీలకు నా దగ్గరున్న డబ్బు సరిపోక చిట్టీలవాళ్లను ఇరవయ్యో తారీఖు వరకు గడువు అడిగాను. గడువు అయితే అడిగాను కానీ ఆ డబ్బు ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితిలో, "బాబా! నీవే దిక్కు తండ్రీ" అని అనుకున్నాను. ఆయన ఎలాంటి అద్భుతం జరిపారో చదవండి. 2023, మే 18, గురువారంనాడు నేను సాయి జీవితచరిత్ర ఏకాదశ పారాయణ మొదలుపెట్టి 11అధ్యాయాలు చదివాను. నైట్ డ్యూటీ అయినందున మధ్యాహ్నం భోజనం చేసి పడుకున్నాను. తరువాత మా అమ్మాయి కాలేజీ నుండి వచ్చి నా ఫోన్ చూస్తూ, "అమ్మా! నీ అకౌంటులో బ్యాలన్స్ ఎంత వుంది?" అని అడిగింది. నేను, "చాలా తక్కువ వుంది. ఈ నెల చిట్టీలు కూడా కట్టలేదు" అని చెప్పాను. వెంటనే తను, "ఓ పిచ్చి మమ్మీ! నీ అకౌంటులో 75వేల రూపాయల బ్యాలన్స్ వుంది" అని అంది. నేను ఆశ్చర్యపోతూ బ్యాలన్స్ చూస్తే, నిజంగానే నా అకౌంటులో 68వేల రూపాయలు జమైనట్లు వుంది. మీరు నమ్ముతారో, లేదోగాని నేను అస్సలు నమ్మలేకపోయాను. ఆ డబ్బులు ఎక్కడినుండి వచ్చాయో అని స్టేట్మెంట్ చూసాను కానీ నాకు ఏమీ అర్థం కాలేదు. 'ఏదైనా ఫ్రాడ్ జరిగిందా? లేదంటే ఎవరైనా పొరపాటున నా అకౌంటులో జమ చేసారా?' అని అనుకున్నాను కానీ, స్టేట్మెంట్‌లో ఢిల్లీ, SBI నుండి జమ అయినట్లు వుంది. అదే ఆలోచిస్తూ రాత్రి డ్యూటీకి బయలుదేరాను. దారిలో నాకు ఇన్కమ్ టాక్స్ చేసిన అబ్బాయి ఫోన్ చేసి, "మేడమ్, మీ అకౌంటులోకి రిఫండ్ అమౌంట్ వచ్చిందా?" అని అడిగాడు. నాకు ఒక్క క్షణం ఏమీ అర్థం కానప్పటికీ, "వచ్చింద"ని ఆ అబ్బాయితో చెప్పాను. అతను, "మేడమ్, మీకు ఆలస్యంగా వచ్చింది" అన్నాడు. నా 30 సంవత్సరాల సర్వీసులో టాక్స్ రిఫండ్ రావటం ఇదే మొట్టమొదటిసారి. నేను ఆనందం పట్టలేక విషయం నా సహోద్యోగులతో, మా అక్కతో, మా అమ్మాయితో వెంటనే పంచుకున్నాను. చూసారా! మన బాబా అద్భుతలీల.


2023, మే 15న నాకు కొంచం బ్యాంకు పని ఉండి బ్యాంకుకి వెళ్ళాను. తరువాత చూస్తే, నేను బ్యాంకుకు తీసుకొని వెళ్లిన ఇంపార్టెంట్ పేపర్స్ కనిపించలేదు. నేను మాములుగా ఇంపార్టెంట్ డాక్యూమెంట్లు పెట్టే ఫైల్స్, అలమరాలు అన్నీ వెతికినా ప్రయోజనం లేకపోయింది. అప్పుడు బాబాని తలచుకొని, "బాబా! ఆ పేపర్స్ దొరికితే, మీ అనుగ్రహాన్ని బ్లాగు ద్వారా తోటి సాయి భక్తులతో పంచుకుంటాను" అని అనుకొని మళ్ళీ వెతికాను. బాబా దయవలన ఒక్క పది నిమిషాల్లో ఆ పేపర్స్ కనిపించాయి. ఆ క్షణాన నా ఆనందానికి అంతులేదు.


నేను నా ఆర్థిక ఇబ్బందులు తీరడానికి లోన్ పెట్టాను. 'ఆ లోన్ వచ్చేస్తుంది, నా సమస్య పరిష్కారమవుతుంద'ని ధీమాగా వున్న సమయంలో బ్యాంకువాళ్లు ఫోన్ చేసి, "మీకు లోన్ రాదు" అని అన్నారు. నేను కారణం అడిగితే, "మీరు 2020లో హోసింగ్ లోన్ పెట్టి ఇల్లు తీసుకున్నారు. అందుకే రాదు" అని చెప్పారు. అది విన్న నా బాధ వర్ణనాతీతం. ఏడవని రోజు లేదు. చివరికి, "బాబా! నీవే దిక్కు తండ్రీ" అని అనుకొని వేరే బ్యాంకువాళ్ళను సంప్రదించాను. వాళ్ళు ప్రయత్నిస్తామన్నారు. నేను, "బాబా! నాకు లోన్ శాంక్షన్ అయితే మీ అనుగ్రహాన్ని బ్లాగు ద్వారా తోటి సాయి భక్తులతో పంచుకుంటాను తండ్రీ" అని అనుకున్నాను. 2023, మే 27 సాయంత్రం బ్యాంకువాళ్ళు ఫోన్ చేసి, "మేడమ్, మీకు లోన్ శాంక్షన్ అయ్యింద"ని చెప్పారు. నా బాబా నన్ను ఎలా ఆపదల నుండి గట్టేక్కించారో చూసారా! మన బాబా ఎప్పుడూ తన బిడ్డలను వెన్నంటే ఉండి కాపాడతారని చెప్పడానికి నా అనుభవాలే సాక్ష్యాలు. మరెన్నో సాక్ష్యలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. "అన్నిటికి ధన్యవాదాలు బాబా".


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!


9 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. ఓం సాయిరాం.. అందరికిసాయి బాబా ఆశీసులు ఉంటాయి

    ReplyDelete
  3. Sai ram,
    Sai ram,
    Sai ram
    Sai ram
    Sai ram

    ReplyDelete
  4. ఓం సాయిరామ్

    ReplyDelete
  5. hey, i dont know what to say about your dream, but just believe in sai baba, check answers by sai baba satcharitha
    https://saibabaspeaks.com

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo