సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1567వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • బాబా ఆదరణ

బాబా ఆదరణ


సాయి బంధువులందరికీ నా నమస్కారం. నా పేరు మహాలక్ష్మి. నేను బాబాకు భక్తురాలినైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. బాబా నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశారు. నేను మొదటినుండి బాబా భక్తురాలిని కాదు. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు బాబా నా జీవితంలోకి వచ్చారు. నాకు చదవడం, ఉద్యోగం చేయడం అంటే చాలా ఇష్టం. అలాంటిది డిగ్రీలో ఉండగానే నాకు ఒక పెళ్లి సంబంధం వచ్చింది. అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టంలేని నేను బాబా గుడికి వెళ్లి బాబాతో నా బాధ చెప్పుకున్నాను. అద్భుతం! నేను గుడి నుండి ఇంటికి వచ్చేసరికి మా అమ్మ, "ఆ సంబంధం వాళ్లకి వద్దు అని చెప్తాను. నీకు పెళ్లి చేయను" అని చెప్పింది. నేను ఆశ్చర్యపోతూనే, "ఎందుకని?" అని అమ్మని అడిగాను. అప్పుడు అమ్మ, "నువ్వు చదువుకో. నీకు మంచి ఉద్యోగం రావాలి" అని చెప్పింది. అది విన్న నా ఆనందానికి హద్దులు లేవు. మరుసటిరోజే నేను కోచింగ్ సెంటర్‌కి వెళ్ళాను. కానీ నాలుగేళ్లయినా నాకు ఉద్యోగం రాలేదు. నేను సాధించలేకపోయాను. ఇక మాది మధ్యతరగతి కుటుంబం అయినందున కరోనా తర్వాత ఇంట్లోనే ఉండసాగాను. ఆ సమయంలో నన్ను అందరూ ఏదో ఒక మాట అని బాధ పెడుతుండేవారు. 'నీకు పెళ్లి కాలేదు. ఉద్యోగం రాలేదు' అని ఎగతాళి చేస్తుండేవారు. నేను బాబాని ప్రార్థించి నా బాధ ఆయనతో చెప్పుకున్నాను. తర్వాత ఒకరోజు కలలో బాబా నాకు ఒక అబ్బాయి ముఖం చూపించారు. ఆ అద్భుతం నేను ఇప్పటికీ, ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే, ఆ కల వచ్చిన ఆరు నెలల తర్వాత నాకు అదే అబ్బాయితో పెళ్లయింది. పెళ్లయ్యాక నేను, నా భర్త శిరిడీ వెళ్ళాము. అలా శిరిడీ వెళ్లాలని ఎప్పటినుండో ఉన్న నా కోరికను బాబా తీర్చారు. శిరిడీ నుండి వచ్చిన ఒక వారం తర్వాత నా ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయింది. కానీ నాకు అది ఇష్టం లేదు. నాకు ఉద్యోగం చేయాలని ఉండేది. అయినా బాబా మీద భారం వేసాను. సాయి ఆన్సర్స్‌లో చూస్తే, 'నీకు పాప పుడుతుంది, తెల్లగా ఉంటుంది. నీకు మొదటి సంతానం పాపే, బాబు పుడితే నీకు కష్టాలు వస్తాయి' అని సాయి సమాధానం వచ్చింది. 


నేను కడుపుతో ఉన్నప్పుడు ఇంట్లో ఖాళీగా ఉండలేక ఒకరోజు గూగుల్‌లో సాయి భక్తుల అనుభవాల గురించి వెతికాను. అప్పుడు సాయిలీలాస్ డాట్ కం అని ఒక సైటు కనిపించింది. ఆ సైటులో ప్రతి గురువారం సాయిచరిత్ర పుస్తకంలో లీలలకు సంబంధించి క్విజ్ నిర్వహిస్తారు. అందులో గెలిచిన వారికి సాయి సచ్చరిత్ర, ఆరతి పుస్తకాలు, బాబా ఫొటోలు, విగ్రహాలు మొదలైనవి పోస్టులో పంపుతారు. నాకు డెలివరీ అయ్యేలోపు నేను ఈ క్విజ్‌లో గెలవాలి, నాకొచ్చే గిఫ్ట్ చూడాలి అని అనుకున్నాను. కానీ నేను సాయి చరిత్ర మూడుసార్లే చదివాను. ప్రెగ్నెన్సీ సమయంలో రోజు ఒక అధ్యాయం, అదికూడా నా ఆరోగ్యం బాగున్నపుడే చదువుతుండేదాన్ని. మరి నేను ఎలా క్విజ్‌లో గెలుస్తాను, నాకెలా గిఫ్ట్ వస్తుంది అని అనుకున్నాను. అయినప్పటికీ నా ప్రయత్నం నేను చేశాను. నాలుగైదు వారాలపాటు ప్రతి గురువారం క్విజ్‌లో పాల్గొన్నాను. నాకు ఎనిమిదో నెల నడుస్తున్నప్పుడు 'మీరు క్విజ్లో విన్ అయ్యార'ని ఒక మెసేజ్ వచ్చింది. అది చూసి నేను విన్ అయ్యానా అని ఆశ్చర్యపోయాను. తర్వాత కొన్ని రోజులు గడిచాయి, నా డెలివరీ డేట్ దగ్గర పడింది. అప్పుడొకరోజు నేను ఇంకా ఆ గిఫ్ట్ చూడలేదు అనుకున్నాను. మూడు రోజుల తర్వాత నా వాట్సాప్కి ఒక ఫోటో పెట్టి 'ఈ గిఫ్ట్ పోస్టులో వస్తుంది. తీసుకోండి' అని మెసేజ్ వచ్చింది. అది ఒక బాబా ఫోటో. ఆ ఫొటోలో బాబా నాకు ఇష్టమైన స్కై బ్లూ కలర్ డ్రెస్లో ఉన్నారు. అది చూసి నాకు చాలా ఆనందం కలిగింది. నా మనసుకి ఏది ఇష్టమో అదే బాబా చేశారు. ఇలాంటి చిన్న చిన్న కోరికలు బాబా తీరుస్తున్నారు. బాబాను చూసిన మరుసటిరోజు 2023, మార్చ్ 16న నాకు సిజేరియన్ జరిగి ముందుగా బాబా చెప్పినట్లు పాప పుట్టింది. బాబా హారతి సమయంలో పాప పుడితే బాగుండని నేను ఆశపడినట్లే సరిగ్గా మధ్యాహ్న ఆరతి జరిగే సమయంలో సుమారు 12:20 నిమిషాలకి మా పాప పుట్టింది. ఇంకో విషయం ఏమిటంటే, నా ప్రెగ్నెన్సీ సమయంలో నాకు రక్తం(7 యూనిట్లు) చాలా తక్కువగా ఉందని డాక్టర్స్ చెప్పారు. అందుకని ఎంత తిన్నా రక్తం శాతం పెరగలేదు. కానీ బాబా నాతోనే ఉన్నారు. ఆయన దయతో డెలివరీ సమయంలో రక్తం 10 యూనిట్లు ఉండటం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. సిజేరియన్ జరిగాక నాకు విరోచనాల సమస్య బాగా ఎక్కువగా ఉంటే, "బాబా! ఈ సమస్య తగ్గితే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని అనుకున్నాను. బాబా దయతో ఆ సమస్య నుండి నన్ను బయటపడేసారు.


చివరిగా మరో చిన్న అనుభవం. ఒకసారి నా భర్త బంగారం లాకెట్ కనిపించలేదు. ఎంత వెతికినా దొరకలేదు. అప్పుడు బాబాని ప్రార్థిస్తే, ఆ లాకెట్ నాకు దొరికింది. ఇలా ఎన్నెన్నో  చిన్న చిన్న అనుభవాలు నా జీవితంలో జరిగాయి. "శతకోటి వందనాలు బాబా".


10 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Om Sai Ram, May I know the website you looked for Sai Answers

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. ఓం సాయిరామ్

    ReplyDelete
  5. Om Sai Sri Sai Jai Sai 🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo