1. ఉన్న చోటనే పరిష్కారం చూపిన బాబా
2. కోరుకున్న చోటుకి బదిలీ అయ్యేలా అనుగ్రహించిన బాబా
ఉన్న చోటనే పరిష్కారం చూపిన బాబా
సాయిబాబా బిడ్డలందరికీ నా నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. నా ప్రతి అడుగులో 'నేను ఉండగా నీకు భయం ఎందుకు?' అంటూ బాబా నాలో ధైర్యం నింపుతూ నాకు ఎంతో అండగా ఉన్నారు. నేను కొన్ని కుటుంబ సమస్యల వల్ల నా ఇద్దరు చిన్న పిల్లల్ని వదిలి ఉద్యోగం కోసం హైదరాబాద్ రావాల్సొచ్చి వచ్చాను. నేను గత 2, 3 నెలలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే 'అమ్మఒడి' పథకం కోసం ఎదురుచూస్తున్నాను. ఆ విషయం మా వదినకి తెలుసు. తను కూడా ఆ పథకానికి అర్హురాలు. వాళ్ళ వార్డు వాలంటరీ 2023, జూన్ 26వ తేదిన వచ్చి మా వదిన e-kyc ప్రాసెస్ పూర్తి చేసింది. వెంటనే మా వదిన నాకు ఫోన్ చేసి 'అమ్మఒడి' పథకం కోసం రెండు రోజుల్లో e-kyc చేయించుకోవాలని చెప్పింది. ఆరోజు అంటే 2023, జూన్ 26వ తేదీన e-kycకి సంబంధించిన వెబ్సైటు ఓపెన్ అయింది. జూన్ 27వ తేదీ సాయంత్రం 7గంటల లోపు e-kyc ప్రక్రియ పూర్తి చేయాలి. అందుకని నేను వెంటనే మా వార్డు వాలంటరీకి ఫోన్ చేశాను. కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దాంతో వేరే వాలంటరీకి ఫోన్ చేస్తే, "నేను చెక్ చేసి చెప్తాను. అసలు అయినా మాపై అధికారులు చివరి తేదీ అంటూ ఏమీ చెప్పలేదు" అని చెప్పింది. తను అలా చెప్పేసరికి నేను రిలాక్స్ అయ్యాను. అయితే ఆమె రాత్రైనా నాకు తిరిగి ఫోన్ చేయలేదు. అప్పుడు నేను అసలైన నా పేరు అర్హత జాబితాలో ఉందో, లేదో తెలుసుకోవాలనుకున్నాను. కానీ ఆ పథకానికి సంబంధించి అదే నా మొదటి ప్రయత్నమైనందున ఆ వివరాలు ఎలా తెలుసుకోవాలో నాకు అర్థం కాలేదు. ఏదేమైనా బాబాని తలుచుకొని మొబైల్లో ఆ వివరాల కోసం సెర్చ్ చేయడం మొదలుపెట్టాను. బాబా దయవల్ల ప్రభుత్వానికి సంబంధంచిన ఒక సైట్లో ఆ పథకానికి నేను అర్హురాలినని ఉండటం చూసి బాబాకి ధన్యవాదాలు చెప్పుకుని చాలా సంతోషపడ్డాను. మరుసటిరోజు ఉదయం 10 గంటలకి మా అన్నయ్య ఫోన్ చేసి, "ఈ రోజే ఆఖరు తేదీ అట. ఒకసారి మీ వాలంటరీని కనుక్కో. అయినా ఈరోజు చివరి తేదీ అయితే నువ్వు ఇక్కడికి వచ్చే సమయం కూడా లేదు" అని టెన్షన్ పడ్డారు. ఎందుకంటే, ఆ డబ్బు నాకెంత అవసరమో అన్నయ్యకి తెలుసు. నేను ఇద్దరు, ముగ్గురు ఏపీ సచివాలయం సిబ్బందికి కాల్ చేసాను. కానీ వాళ్ళ నుంచి నాకు కావాల్సిన రెస్పాన్స్ రాలేదు. అప్పుడు నేను మా అక్కకి కాల్ చేస్తే తను ఒక వాలంటరీ మొబైల్ నంబర్ ఇచ్చింది. నేను ఆ అబ్బాయికి కాల్ చేస్తే. అతను వేరే ఒక అతని నంబర్ పంపాడు. అతను హైదరాబాద్‌లోనే ఉంటాడు. అతని ద్వారా ఆ e-kyc పని అవుతుంది. కానీ హైదరాబాద్లో అతను ఉండేది కొంచెం దూర ప్రాంతమైనందున నేను చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే, హైదరాబాద్ వంటి మహానగరానికి మొదటిసారి వచ్చిన నాలాంటి అమ్మాయికి ఎటు వెళితే, ఎటు పోతామో అనే భయం అంతాఇంతా కాదు. అయినప్పటికీ బాబా దయవల్ల ఎటువంటి ఇబ్బందీ లేకుండా అక్కడికి చేరుకున్నాను. ఆయన అడుగడుగునా నాకు తోడుగా ఉండి సాయంత్రం 7 గంటలకి గడువు ముగుస్తుందనగా 6.45 కల్లా నా e-kyc ప్రక్రియ పూర్తి చేయించారు. లేకపోతే అమ్మఒడి పథకం నాకు అందేది కాదు. బాబానే సమయానికి మా అక్కకి కాల్ చేసాలా ప్రేరణనిచ్చి ఏపీ వెళ్లేందుకు సమయం కూడా లేని సమయంలో ఉన్న చోటనే పని అయ్యేలా పరిష్కారం చూపారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీరు ఎప్పుడూ ఇలానే నాకు తోడుగా ఉండాలి బాబా. నా జీవితం అంతం అయినా సరే మీరు నాతోనే ఉండాలి బాబా. నా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో బాబా. నాకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వచ్చేలా చూడు బాబా". నాకు e-kyc ప్రక్రియలో సహాయం చేసిన అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మరలా నేను నా ఉద్యోగ అనుభవంతో మీ ముందుకు రావాలి. బాబాకి ధన్యవాదాలు చెప్పుకోవాలి.
జై శ్రీ సమర్ధ సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!
కోరుకున్న చోటుకి బదిలీ అయ్యేలా అనుగ్రహించిన బాబా
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!! సాయిబంధువులకు నా నమస్కారములు. నేను ఒక సాయిభక్తురాలిని. నా పేరు కుమారి. మా చెల్లి ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంది. తనకి ఇటీవల పెళ్లి అయింది. తన భర్త ఇంటి నుంచి తను ఉద్యోగం చేసే చోటుకి చాలా దూరం. వెళ్ళడానికి ఒక గంటకి పైగా సమయం పడుతుంది. రోజూ అంత దూరం వెళ్ళి రావడానికి తనకి చాలా కష్టంగా ఉండేది. 5 సంవత్సరాల తరువాత గాని బదిలీలు కావు. ఇటువంటి స్థితిలో నేను 'తనకి దగ్గరగా ఉండే చోటుకి బదిలీ అవ్వాల'ని బాబాకి చెప్పుకొని, 'అదే జరిగితే నా అనుభవం బ్లాగులో పంచుకుంటాన'ని అనుకున్నాను. బాబా దయవల్ల ఆఫీసువాళ్ళు బదిలీ ఎక్కడికి కావాలో సెలెక్ట చేసుకోవచ్చు అని చెప్పారు. మళ్ళీ వాళ్లే తమకి నచ్చిన చోటుకి చేస్తామని చెప్పారు. మళ్ళీ రెండురోజుల తర్వాత మీకు నచ్చిన ప్లేసెస్ మెయిల్ చేయండి అని చెప్పారు. దాంతో మా చెల్లి తను కోరుకున్న చోటు పెట్టుకుంది. కానీ మా చెల్లి కోరుకొనే చోటుకి బదిలీ అవ్వడం చాలా కష్టమట, సిఫారసులు ఉన్నాయట. అది తెలిసి కూడా నేను బాబా మీద భారం వేశాను. మా చెల్లి కూడా దేవుడు మీద భారం వేసింది. ఒక వారం తర్వాత మా చెల్లి ఫోన్ చేసి, "నేను కోరుకున్న చోటకి బదిలీ అయింది" అని చెప్పింది. ఇప్పుడు మా చెల్లి తన ఆఫీసుకి 10 నిముషాల్లో వెళ్తుంది. మరీ ఇంత దగరకు బదిలీ అవుతుందని నేను అనుకోలేదు. అంతా బాబా దయ. "చాలా కృతఙ్ఞతలు బాబా. అనుకున్నట్లే నా అనుభవం బ్లాగులో పంచుకున్నాను. ఇంకా కొన్ని అనుభవాలు పంచుకొనే అవకాశమివ్వండి సాయిబాబా. మిమ్మల్ని నమ్మినవాళ్ళకి తోడుగా ఉండండి. నా కష్టం మీకు తెలుసు. దయచేసి సహాయం చేయండి, మీరు తప్ప నాకు ఎవరూ లేరు సాయిబాబా".
సాయి నా భర్త నన్ను అర్థం చేసుకొని నాతో కలిసి పోయాలా చూడు సాయి నాకు అన్యోన్య దాంపత్యాన్ని ప్రసాదించు సాయి బిడ్డలని ప్రసాదించు సాయి ఈ జన్మ పాపమో నాకు ఈ శిక్ష ఇప్పటికైనా నా కర్మ పూర్తవ్వ లేదా సాయి ప్లీజ్ సాయి కనుకరించ సాయి
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sai Sri Sai Jai Sai 🙏🙏🙏
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sai Sri Sai Jaya Jaya Sai
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai
Jayaa Jayaa Sai
Sri Sachidanda Sadguru Sainatha
Maharajuki Jai.
Sai arogyam prasadichu om sai Sri sai jeya jeya sai
ReplyDeleteOm Sai ram
ReplyDeleteAkilanda koti bramanda nayaka rajadi Raja Yogi Raja prabrhmasri sathyadanuda sadguru sai nadh maha rajkl jai
ReplyDeleteOm Samartha Sadguru Sainath Maharaj ki Jai
ReplyDeleteఓం సాయిరాం బాబా నా పరిస్థితి మీకు తెలుసు నా బిడ్డ సి కాలేజీ ఫీజు కట్టాలి బాబా ఆ డబ్బు నువ్వు అందేలా చూడు బాబా నీదే భారం బాబా
ReplyDeleteOm Sai Ram...
ReplyDeleteMa Nammakam Sai baba. Ma Nanna saibaba.. Ma Anna saibaba. Ma prannan saibaba.
ReplyDelete