1. శ్రీసాయి అనుగ్రహం
2. బాబా దయతో చేకూరుతున్న ఆరోగ్యం
శ్రీసాయి అనుగ్రహం
సాయిబంధువులకు నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. నాకిప్పుడు 45 సంవత్సరాలు. నేను నా చిన్నతనంలో ఎప్పటినుంచి బాబాను ప్రార్థించడం మొదలుపెట్టానో స్పష్టంగా గుర్తులేదుగాని, నాకు దాదాపు 11 సంవత్సరాల వయస్సున్నప్పుడు నా కంటే ఒక సంవత్సరం చిన్న అయిన నా జూనియర్ ఒక అమ్మాయి బయట ఆడుకుంటున్నప్పుడు తన చేతికి ఫొటోలతో ఉన్న పిల్లల బాబా పుస్తకం దొరికింది. నేను ఆ పుస్తకం మొత్తం చదివాను. ఆ తర్వాత ఒకరోజు మా నాన్న నాకోసం ఒక లక్ష్మీదేవి వెండి ఉంగరం తీసుకుందామని నన్ను ఒక నగల దుకాణానికి తీసుకెళ్లారు. కానీ నేను సాయిబాబా ఉంగరం కొనమని నాన్నని అడిగాను. ఆ సమయంలో నేను బాబా ఉంగరం అడగడానికి కారణమేమిటో నాకు తెలియదు కానీ, ఇప్పుడు ఈ వయస్సులో బాబా నన్ను ఆ విధంగా తమ వైపుకు ఆకర్షించారని నేను బలంగా నమ్ముతున్నాను.
ఆ తరువాత నేను నా చదువులో బిజీ అయిపోయాను. నేను ఎంసెట్ వ్రాసినప్పుడు మా అత్తలలో ఒకరికి ఒక మంచి వృత్తి విద్య కళాశాలలో నాకు సీటు వచ్చినట్టు కల వచ్చింది. దాంతో మా అమ్మ, అత్త నేను ఖచ్చితంగా ఒక మంచి కాలేజీలో చేరతానని నమ్మారు. వాళ్ళ నమ్మకమే నిజమైంది. నిజాయితీగా చెప్పాలంటే నేను మాత్రం ఆ కల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. నేను నా చదువులలో నిమగ్నమైపోయి పూర్తిగా బాబాని నిర్లక్ష్యం చేశానని చెప్పవచ్చు. కానీ ఇప్పుడు ఈ వయసులో ఆలోచిస్తుంటే నా చిన్ననాటినుంచి బాబా నన్ను చూసుకుంటున్నారని అనిపిస్తుంది.
నా ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఉద్యోగ ప్రయత్నాలు చేశాను కానీ, నాకు ఉద్యోగం రాలేదు. దాంతో నేను చాలా కృంగిపోయాను. ఆ సమయంలో నేను 'దేవుళ్ళు' సినిమా చూసాను. ఆ సినిమా తిరిగి నన్ను బాబాకి చేరువ చేసింది. బాబా దయతో రెండు, మూడు నెలలలో నాకు ఒక ఉద్యోగం వచ్చింది. అయితే, నేను ఆ ఉద్యోగం కేవలం ఆరు నెలలే చేశాను.
నాకు పెళ్ళైయ్యాక మొదటిసారి నేను గర్భవతిగా ఉన్నప్పుడు తొలి నెలల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఆ సమయంలో నేను నా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందేమో అని భయపడ్డాను. అయితే బాబా చమత్కారాన్ని చూడండి! ఆయన నన్ను వదలి పెట్టలేదు. "అంతా బాగుంటుంద"ని స్పష్టమైన సూచనలిచ్చారు. ఆయన చెప్పినట్లే నేను ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చాను. రెండోసారి గర్భవతిగా ఉన్నప్పుడు నేను మానసికకంగా కృంగిపోయి చాలా ఇబ్బందిపడ్డాను. అప్పుడు కూడా బాబా కృపవల్ల నేను ఆ క్లిష్ట పరిష్టితి నుండి బయటపడ్డాను. ఇంకా ఆర్థికంగా నష్టపోయి కష్టంలో ఉన్నప్పుడు నాకు, నా కుటుంబానికి చాలా సహాయం చేసి మాకు రక్షణనిచ్చారు బాబా.
నేను, మా చెల్లి అమెరికాలో ఉంటున్నాము. బాబా దయతో నాకు అమెరికన్ సిటిజెన్షిప్ వచ్చింది. ప్రస్తుతం నేను వృద్ధాప్యంలో నా తల్లిదండ్రులకి చేతకానప్పుడు వాళ్ళ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం గురించి వాళ్ళ ఇద్దరు కూతుళ్లలో ఒకదానిగా ఆలోచిస్తున్నాను. కానీ పెద్ద కూతురుగా నేను ఆ బాధ్యతను ఎలా నెరవేర్చగలనని ఎప్పుడూ భయపడుతూ సదా బాబాని, "దయచేసి నాతో ఉండి నా బాధ్యతను నెరవేర్చేలా చూడండి" అని వేడుకుంటున్నాను. 2023, జూలై 3, గురుపూర్ణిమనాడు నేను బాబా గుడికి వెళ్ళేముందు "బాబా! మీ మూర్తి మీద నుండి పువ్వు జారేలా చేసి నేను నా బాధ్యతను విజయవంతంగా పూర్తి చేస్తానన్న సంకేతాన్ని ఇవ్వండి" అని బాబాను ప్రార్థించి గుడికి వెళ్ళాను. నేను బాబాకి ఎదురుగా ఉండగా ఒక స్త్రీ బాబా మూర్తిని తాకడానికి ప్రయత్నించింది. ఆ క్రమంలో బాబా మూర్తి మీద నుండి ఒక పువ్వు కిందకి జారిపడింది. ఆ విధంగా బాబా నన్ను ఆశీర్వదించడంతో 'బాబా చూసుకుంటార'నే విశ్వాసం కలిగి ఆ పువ్వు ఇంటికి తెచ్చుకున్నాను. నేను బాబాను తమ వెండి లాకెట్‌ను నాకు ప్రసాదించమని అడిగాను. బాబా దాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ వ్రాస్తుంటే నేను బాబా శ్రద్ధ వహించాల్సిన పిచ్చుకనని, భగవంతుడు ఆయనకి అప్పగించిన పైసానని అనిపిస్తుంది. బాబా ఎల్లపుడూ తమ భక్తులను గమనిస్తూ ఎప్పుడూ వాళ్ళతో ఉంటారు. నేను బాబా చెప్పేది పాటించాలి, ఆయన నన్ను సన్మార్గంలో నడిపిస్తారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
సాయినాథార్పణమస్తు!!!
బాబా దయతో చేకూరుతున్న ఆరోగ్యం
నా పేరు ధనలక్ష్మి. రెండు సంవత్సరాల నుండి నా చేయి, కాలు ఒక వైపు లాగుతూ ఉన్నాయి. ఆసుపత్రికి వెళ్లినా నయం కాలేదు. మేము ఒక సిమెంటు ఫ్యాక్టరీలో ఉండేవాళ్ళం. అక్కడ బాబాని బాగా కొలిచేవారు. నాకు బాబా అంటే అంతగా నమ్మకం ఉండేది కాదు. కానీ ఒకరోజు బాబా మెసేజ్ చదువుతున్నప్పుడు నాకు తెలియకుండానే బాబా మీద నమ్మకం, ఇష్టం కలిగి "నా రోగం నయం చేయమ"ని బాబాని అడిగి, 'శిరిడీ వస్తాన'ని అనుకున్నాను. బాబా దయవల్ల ఇప్పుడు నా రోగం 85% తగ్గింది. 2023, జూలైలో శిరిడీ వెళ్తున్నాను. బాబా దయవల్ల నేను ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.
Om sri Sai Ram
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
ఓం సాయిరామ్
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sri Sai ram
ReplyDeleteఓం శ్రీ సాయి రామ్ ఓం శ్రీ సాయి రామ్
ReplyDeleteSAI ram
ReplyDeleteఓం సాయిరాం
ReplyDelete