సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1557వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శ్రీసాయి కృపాకటాక్షవీక్షణాలు
2. ఒంటరిగా ఉంటున్న అమ్మకు తోడునిచ్చిన బాబా

శ్రీసాయి కృపాకటాక్షవీక్షణాలు


సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీపద్మజ. మాది ఏలూరు జిల్లా. నేను సాయిభక్తురాలిని. నేను రోజూ పొద్దున్నే ఈ బ్లాగు ఓపెన్ చేసి, 'సాయి వచనం' చూసి నా దినచర్యను ప్రారంభిస్తాను. నాకు బాబాతో 26 సంవత్సరాలుగా పరిచయం. ఆయన నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశారు. చాలా కష్టాల నుండి బయటపడేశారు. ఈమధ్య మా పెద్దపాప లాప్టాప్ పగిలిపోతే రిపేర్ చేయడానికి 13,000 రూపాయలు ఖర్చు అవుతుందని అన్నారు. నేను ఒక వారంరోజులపాటు రోజూ, "తక్కువ ఖర్చుతో రిపేరు అయ్యేలా దయచూపండి బాబా"  అని బాబాను విసిగించేశాను. అప్పుడొకరోజు మా పాప ఫోన్ చేసి, "4,500 రూపాయలతో రిపేర్ అవుతుంద"ని చెప్పింది. అలా బాబా తక్కువ డబ్బులతో లాప్టాప్ రిపేరయ్యేలా చేశారు.


మా చిన్నపాపకి చదువు మీద శ్రద్ధ తక్కువ. తను ఈ సంవత్సరం పదవతరగతి పరీక్షలు వ్రాసింది. నేను, "బాబా! పాప పాస్ అయితే చాలు. మీ అనుగ్రహాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా సాయిభక్తులతో పంచుకుంటాను" అని అనుకున్నాను. తర్వాత వెలువడిన ఫలితాల్లో మా పాపకి 496 మార్కులతో ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఇదంతా బాబా చేసిన అద్భుతం.


నేను నా స్నేహితురాలికి కొంత డబ్బు అప్పుగా ఇచ్చాను. తను వడ్డీ ఇచ్చేది, కానీ తనకు రావాల్సిన డబ్బులు రాకుండా ఆగిపోయినందువల్ల నా అసలు డబ్బులు నాకు తిరిగి ఇవ్వలేకపోయింది. అందువల్ల నేను, "బాబా! తనకు రావాల్సిన డబ్బులు వచ్చేలా చేసి నా డబ్బులు నాకు ఇచ్చేలా అనుగ్రహించండి" అని రోజూ బాబాని వేడుకుంటుండేదాన్ని. బాబా దయతో ఈమధ్య తను నాకు కొంత డబ్బు ఇచ్చింది. "ధన్యవాదాలు బాబా. మీ కృపాకటాక్షవీక్షణాలు నాపై ఎప్పుడూ ఇలానే వర్షించండి. మిగతా డబ్బులు కూడా ఇచ్చేలా చేయండి. అలాగే తనకి రావాల్సిన డబ్బులు కూడా వచ్చేలా చేయండి. ఇంకా నా భర్త మా అత్తగారి పొలం విషయంలో రావలసిన డబ్బుల కోసం తిరుగుతున్నారు. ఏ అడ్డంకులు లేకుండా ఆ డబ్బు వచ్చేలా చేయండి. మీ అనుగ్రహాన్ని తోటి భక్తులతో పంచుకుంటాను. ఏమైనా మర్చిపోయివుంటే క్షమించండి బాబా". 


ఒంటరిగా ఉంటున్న అమ్మకు తోడునిచ్చిన బాబా


నా పేరు భవాని. ఐదు నెలల క్రితం మా నాన్నగారు చనిపోయారు. ఆయనకు నేను, మా అక్క ఇద్దరమూ ఆడపిల్లలం. నాన్న చనిపోయాక మా అమ్మ మా ఇళ్లకు రావడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే, మా ఇళ్లకు వస్తే మా అత్తింటివాళ్లతో ఏవైనా సమస్యలు వస్తాయని ఆమె భయం. అయినా మా అక్క అమ్మని తీసుకుని వెళ్తానని అంది. కాకపోతే ఒక సంవత్సరం తర్వాత వస్తానంది. అందువల్ల ప్రస్తుతం అమ్మ ఒక్కతే ఇంటిలో ఉంటుంది. ఆ పక్కింట్లో ఉన్న బ్యాచిలర్స్ అమ్మకి చాలా సహాయం చేస్తుంటారు. అయితే ఈమధ్యకాలంలో వాళ్ళు అద్దె ఎక్కువవుతుందని ఇల్లు ఖాళీ చేద్దామనుకున్నారు. దాంతో వాళ్ళు ఖాళీచేశాక మంచివాళ్ళు వస్తారో, రారో అని నాకు భయమేసి, "బాబా! మహిమ చూపించండి" అని వేడుకున్నాను. ఆరోజు రాత్రి నాకు ఒక కల వచ్చింది. కలలో కూడా నేను నిద్రపోతున్నాను. అమ్మ ఎవరితోనో మాట్లాడుతోంది. నేను అది మా నాన్న అనుకుని లేచి చూస్తే పక్కింటి బ్యాచిలర్ అబ్బాయి శివ అమ్మకి సహాయం చేస్తున్నాడు. అంతటితో కల ముగిసింది. ఉదయం నేను నిద్రలేచి బ్రష్ చేసుకుంటూ రాత్రి కలలో బాబా నాకు మా నాన్న వచ్చిన భావం కల్పించి శివని చూపించారు అనుకున్నాను. తర్వాత రెండు నిమిషాల్లో శివ ఫ్రెండ్ వచ్చి, "మేము ఇల్లు ఖాళీ చేయడం లేదు. అద్దె తగ్గించారు. ఇక్కడే ఉంటాం అక్కా" అని అన్నాడు. బాబా శివవాళ్ళని మా అమ్మకి తోడుగా ఇచ్చారని నాకనిపించింది. ఇది నా జీవితంలో బాబా చూపించిన మహిమ. "ధన్యవాదాలు బాబా".


జై బోలో శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై !!!


5 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. ఓం సాయిరామ్

    ReplyDelete
  3. Om sri sai ram namaha....

    ReplyDelete
  4. Om sai Sri sai jaya Jaya jeya sai

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo