1. భక్తుల సమస్యలు పరిష్కరించకుండా బాబా విడిచిపెట్టారు2. ఇంటి రిజిస్ట్రేషన్ విషయంగా వచ్చిన చిన్నచిన్న సమస్యలను తొలగించిన బాబా
భక్తుల సమస్యలు పరిష్కరించకుండా బాబా విడిచిపెట్టారు
ఓం శ్రీసాయినాథాయ నమః!!! నేను ఒక సాయి భక్తుడిని. మా 10 నెలల బాబుకి అప్పుడప్పుడు చిన్నచిన్న కురుపులు వస్తుండటంతో డాక్టరుకి చూపిస్తే, "అది మాములే" అని చెప్పి ఒక ఆయింట్మెంట్, డ్రాప్స్ ఇచ్చారు. అయితే ఈమధ్య ఒక పెద్ద కురుపు బాబుకి వెనక వైపు వచ్చింది. మేము మాములే అనుకున్నాం కానీ, రెండోరోజుకి అది మరికాస్త పెద్దదై తామరలా మార్పు చెందింది. బహుశా దురద వల్ల బాబు ఆ రాత్రి అస్సలు నిద్రపోలేదు. రాత్రంతా మెలికలు తిరుగుతూ చాలా ఇబ్బందిపడ్డాడు. మనకు ఏ సమస్య వచ్చినా ముందుగా గుర్తు వచ్చేది బాబానే కదా! అందుచేత నేను బాబాని స్మరించి కొద్దిగా ఊదీ తీసుకుని 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని స్మరిస్తూ నెమ్మదిగా బాబుకి సమస్య ఉన్న చోట పూసాను. బాబా దయవల్ల ఇబ్బంది కాస్త తగ్గడం మొదలైంది. తరువాత డాక్టరు అంతకుముందు ఇచ్చిన ఆయింట్మెంట్ కూడా వ్రాసాను. అంతటితో బాధ తగ్గుముఖం పట్టి బాబు చక్కగా నిద్రపోయాడు. అంతా సాయినాథుని దయ.
నేను రైల్వే డిపార్టుమెంటులో పని చేస్తున్నాను. ఒకసారి గూడ్స్ ట్రైన్ ఆక్సిడెంట్ అయితే మేము ఆ పని మీద ఆ ప్రాంతానికి వెళ్ళాం. మేము సాయంత్రం 6గంటలకి అక్కడికి వెళ్తే, రాత్రి 2గంటలకి పని పూర్తైంది. కానీ అక్కడినుండి తిరిగి రావడానికి మాకు అనుమతి లభించలేదు. దాంతో అక్కడ ఏవి దొరికితే అవే తినాల్సి వచ్చింది. ఆ రాత్రి 3 గంటలకి ఆకలికి ఆగలేక 3 గుడ్లు తిన్నాం. ఉదయం పోహ, మధ్యాహ్నం మంచి ఎండలో నాన్-వెజ్, మామిడిపళ్ళు తిన్నాం. బాబా దయవల్ల ఆ రాత్రికి ఇంటికి చేరుకున్నాం. నేను స్నానం చేసి కాస్త భోజనం చేశాను. కానీ కడుపునొప్పి వస్తూ, ఆగుతూ నన్ను చాలా ఇబ్బందిపెట్టింది. అస్సలు తట్టుకోలేకపోయాను. అప్పుడు బాబాని స్మరించి, "బాబా! ఈ కడుపునొప్పి తగ్గేలా చూడండి" అని చెప్పుకొని కాస్త ఊదీ నుదుటన పెట్టుకొని, మరికాస్త నోట్లో వేసుకున్నాను. తర్వాత షాపుకి వెళ్లి రెండు టాబ్లెట్లు తెచ్చి వేసుకొని, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని స్మరించి నిద్రపోయాను. బాబా దయవల్ల కడుపునొప్పి మరి ఇబ్బందిపెట్టలేదు. "ధన్యవాదాలు బాబా. మిమ్మల్ని నిన్ను నమ్ముకున్న భక్తుల సమస్యలు పరిష్కరించకుండా ఎప్పుడూ విడిచిపెట్టావు సాయినాథా. 'బాబా' అని తలుచుకోగానే నేనున్నానని భక్తుల సమస్యలు తీరుస్తున్నావు తండ్రీ. నా భార్య, బిడ్డని సదా సంరక్షిస్తూ ఉండు తండ్రీ. ఇలానే మీ కృప మీ భక్తులందరిపై ఉండేలా చూడు తండ్రీ".
ఇంటి రిజిస్ట్రేషన్ విషయంగా వచ్చిన చిన్నచిన్న సమస్యలను తొలగించిన బాబా
సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు సునీత. నాకు తల్లి, తండ్రి, దైవం, గురువు, మార్గదర్శకుడు అన్నీ బాబానే. ఆయన నా ప్రతి పనిలో నాకు తోడుగా ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్నారు. సాయి మార్గంలో నడవడం అలవాటు అయ్యాక ఏవైనా ఆటంకాలు వచ్చినప్పుడు ఆ ఆటంకాల ద్వారా బాబా నాకు ఇంకా ఏదైనా మంచి దారి చూపిస్తున్నారా అనే ఆలోచనను ఇస్తున్నారు. ఇక విషయానికి వస్తే.. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడానికి సంతోషిస్తున్నాను. మేము ఈమధ్య ఒక ఇల్లు కొన్నాము. ఆ ఇంటి రిజిస్ట్రేషన్ విషయంగా చిన్నచిన్న ఆటంకాలు ఏర్పడితే నేను బాబాకి చెప్పుకున్నాను. తర్వాత మేము ఎల్ఐసి లోన్ తీసుకున్నాము. ఆ లోన్ ప్రాసెస్ ఏంటంటే, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అమ్మకందారుని ఖాతాలో డబ్బులు వేస్తారు. మా రిజిస్ట్రేషన్ మంగళవారంనాడు పూర్తైంది. కానీ కొన్ని టెక్నికల్ సమస్యల కారణంగా డబ్బులు వాళ్ల ఖాతాలో పడలేదు. దాంతో మాకు చాలా టెన్షన్ అయింది. నేను, "బాబా! మొత్తం గట్టెక్కించేశావు. కానీ ఇప్పుడు ఈ విధంగా జరుగుతుంది. మాకు నువ్వే దిక్కు తండ్రీ" అని బాబాకి మొరపెట్టుకున్నాను. అయితే బుధవారం అంతా కూడా టెక్నికల్ సమస్యే అని ఎల్ఐసివాళ్ళు చెప్పారు. ఆ రెండు రోజులు అటు వాళ్లకి, ఇటు మాకు టెన్షన్‌గా నడిచింది. గురువారంనాడు నేను బాబాకి పూజ చేసి, అష్టోత్తర శతనామావళి, సాయి చాలీసా చదివాను. బాబా దయతో వాళ్ళ అకౌంటుకి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయని ఫోన్ వచ్చింది. నేను వెంటనే బాబాకు ధన్యవాదాలు తెలుపుకున్నాను. అదేరోజు నేను గుడికి వెళితే అక్కడ, "నేను గమ్యం చేర్చేవరకు ఎవరినీ మధ్యలో వదిలిపెట్టను" అన్న సాయి సూక్తి వ్రాసి ఉంది. అది చూసి ఆ సందేశాన్ని బాబా నాకే ఇచ్చారనిపించింది. తర్వాత 2023, జూలై 7న మా అమ్మాయికి USA వెళ్ళడానికి వీసా ఇంటర్వ్యూ జరిగింది. నేను తనకి వీసా రావాలని అందరి దేవుళ్ళతోపాటు బాబాని కూడా వేడుకున్నాను. బాబా మాపై దయ చూపారు. మా అమ్మాయికి వీసా వచ్చింది. "ధన్యవాదాలు బాబా. అమ్మాయి అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చు తండ్రీ. అలాగే తనకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి బాబా. మీ దయ మా అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటున్నాను తండ్రీ".
ఓం సాయిరామ్
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSai always be with me
ఓం సాయి రామ్ నాకు ఎడమ కంటి దగ్గర నేరం సమస్య వలన.యెవరితో మాటలతో వున్న పుడు నా ఎడమ కన్ను కొట్టుకుంటుంది.సాయి చాలా యిబ్బంది పెడుతున్నాను.ఆపరేషన్ చేయాలి చాలా అపాయక ఆపరేషన్.నా వయసు70సం లు.. బాబా ఆడదాన్ని కాపాడండి.పురుషులు అపార్థం చేసుకుంటారు.నా కాకన్ను బాగు చేయి సాయి తండ్రి.ఈ ఆనందం నుండి కాపాడు సాయి
ReplyDeleteఈ ఆపద నుండి కాపాడు సాయి.నీకు జీవితం అంతా రుణం పడి వుంటాను.ఓం సాయి రామ్
ReplyDeleteOm Sai Sri Sai Jai Sai 🙏🙏🙏
ReplyDeleteOm sri sriram
ReplyDeleteOm Sai ram
ReplyDeleteOm sai Sri sai jeya jeya sai
ReplyDeleteOm sri sairam
ReplyDeleteOm sri sariram
Om sri sairam
ఓం సాయి రామ్ సర్వావస్త లో వేళ నా భర్త, పిల్లలు,మనవల వెంట ఉండు కాపాడు తండ్రీ.ఇది నా కోరిక తీర్చు సాయి
ReplyDelete